UATelugu0h 40m
అడవి మధ్యలోని ఓ ఇంట్లో సారా జోసేఫ్ అనే ముసలావిడి ఒంటరిగా జీవిస్తుంటుంది. గోడలపై పిచ్చిరాతలు రాసుకుంటూ ఉంటుంది. అయితే చనిపోయే ముందు ఓ పోలీసు, లాయర్‌కు ఒక లెటర్ ఇస్తుంది. అది చూసిన వారిద్దరు షాకవుతారు. ఇంతకీ ఆ లెటర్‌లో ఏముంది? అందులో సారా ఏం రాసింది? అడవిలో జరిగిన వరుస హత్యలకు కారణం ఎవరు? ఆ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
నీనా గుప్తా
రెహమాన్
సంజు శివరామ్
జాయ్ మాథ్యూ
ఆదిల్ ఇబ్రహీం
అశ్విన్ కుమార్
వివియా శాంత్
ఇర్షాద్ అలీ
శ్రీకాంత్ మురళి
రాధా గోమతి
రాధికా రాధాకృష్ణన్
సిబ్బంది
నజీమ్ కోయాదర్శకుడు
షాజీ నడేసన్నిర్మాత
కథనాలు
New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
లవ్‌రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా నగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వీక్షణం
రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్‌లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
రివైండ్
సాయి రోనక్ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు మనసుకు హత్తుకునే లవ్‌స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
‘ఖడ్గం’ రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
1000 బేబీస్
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ '1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు.
కలి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 'కలి' (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
TitleCategoryLanguagePlatformRelease DateThe Linkan LawyerMovieEnglishNetflixOct 17Fabulous Lives vs Bollywood Wives S3SeriesEnglishNetflixOct 19The Pradeeps Of PittsburghSeriesEnglishAmazonOct 17Citadel Honey BunnySeriesTelugu/HindiAmazonNov 7Kali MovieTeluguETV WinOct 17Reeta SanyalMovieHindiHotstarOct 14NemesisMovieEnglish/DutchHotstarOct 161000 BabiesSeriesTelugu/MalayalamHotstarOct 18RivalsMovieEnglishHotstarOct 18Crime Reels MovieTeluguAhaOct 13Janaka Aithe GanakaMovieMovieAhaNov 5Maa Nanna Super HeroMovieMovieZee 5Nov 8
అక్టోబర్ 14 , 2024
HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్ చేయగల సామర్థ్యం తారక్ సొంతం. అందుకే తారక్ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) ముందు వరకూ టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story)
అసలు పేరు
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు 'తారక్ రామ్' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్ పేరు మార్చారు.
ఎనిమిదేళ్ల వయసులోనే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్ ఓ సినిమాలో నటించాడు. తారక్ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story)
100కి పైగా ప్రదర్శనలు
తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఆ విషయంలో ఎప్పటికీ లోటే!
కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్ తెలిపాడు.
ఫోర్బ్స్ జాబితా
జాతీయ స్థాయిలో తారక్ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్.. ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు.
ఆ దేశంలో యమా క్రేజ్!
టాలీవుడ్ హీరోల క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.
ఎన్టీఆర్ మంచి గాయకుడు
ఎన్టీఆర్ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్ ఈజ్ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.
హోస్ట్‌గానూ సూపర్ సక్సెస్
ప్రముఖ టెలివిజన్ షోలకు తారక్ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.
తారక్ ఫేవరేట్ నెంబర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్. తన కారు నెంబర్ ప్లేట్ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్
ఫేవరేట్ సాంగ్ & సినిమా
తారక్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్ ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.
రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్ కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు.
రీరిలీజ్ రికార్డు
గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.
మే 20 , 2024
1000Cr క్లబ్: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !
సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం.
దంగల్
అమీర్ ఖాన్ లీడ్ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్. ఫొగాట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది.
బాహుబలి 2
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి.
కేజీఎఫ్ 2
“అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్ మైన్స్ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం.
RRR
భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.
పఠాన్
ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్ హిట్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది.
భజరంగీ భాయ్‌జాన్
సల్మాన్ ఖాన్ డిఫరెంట్ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.
ఏప్రిల్ 28 , 2023
Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 11 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో 'కల్కి' మేనియా కొనసాగుతోంది. అక్కడి ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.
11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 11 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/VyjayanthiFilms/status/1810220707357565060
నార్త్ అమెరికాలో రికార్డు
కల్కి సినిమాకు నార్త్ అమెరికాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అక్కడి సినీ లవర్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మెుదటి 9 రోజుల్లోనే ఈ చిత్రం 14.82 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.123.76 కోట్లకు సమానమని పేర్కొన్నాయి. ఈ వీకెండ్‌కు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగినట్లు చెబుతున్నారు.
https://twitter.com/PrathyangiraUS/status/1809472342265065863
రూ.1000 కోట్లకు అడుగు దూరంలో!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇంకో రూ.100 కోట్లు సాధిస్తే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. తద్వారా రిలీజ్‌కు ముందు పెట్టుకున్న టార్గెట్‌ను అందుకుంటుంది. బుధవారం నాటికి రూ.1000 కోట్ల మార్క్‌ను కల్కి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకూ ఏ కొత్త సినిమా లేకపోవడం కల్కికి కలిసిరానుంది. కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
https://twitter.com/i/status/1808841062838063340
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/Kalki2898AD/status/1806617136690839769
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 08 , 2024
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
15 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927
ఏకైకా సౌత్ హీరోగా ప్రభాస్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్, పఠాన్ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.
త్వరలో టాప్-3లోకి ‘కల్కి’
తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, జవాన్ సినిమాలకు షాక్ తప్పేలా లేదు.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది.
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 13 , 2024
Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.800 కోట్ల క్లబ్‌లో
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయ్యే సరికి తొలి నాలుగు రోజుల్లో (Pushpa 2 Box Office Collections) ఈ చిత్రం రూ. వరల్డ్ వైడ్‌గా రూ.829 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అత్యంత వేగంగా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రం తొలి రోజు రూ. 282.91 కోట్లు, రెండో రోజు రూ.134.63 కోట్లు, మూడో రోజు రూ.159.25 కోట్లు, నాల్గో రోజు రూ.204.52 కోట్లు తన ఖాతాలో వేసుకుందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. థియేటర్లలో పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాయి.
https://twitter.com/PushpaMovie/status/1866057903498829889
హిందీలో రికార్డుల పరంపర
బాలీవుడ్ ప్రేక్షకులు 'పుష్ప 2' (Pushpa 2 day 5 Box Office Collections) చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్‌లో తొలి రోజు నుంచి కాసుల వర్షం కుపిరిస్తున్నారు. అక్కడ ఫస్ట్ డే రోజున రూ.72 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి 'పుష్ప 2' ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నాల్గో రోజైన ఆదివారం (డిసెంబర్ 8) ఏకంగా రూ.86 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి అక్కడ ఒక రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా హిందీలో వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను 'పుష్ప 2' తన ఖాతాలో వేసుకుంది. తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్ల నెట్ వసూళ్లను పుష్ప 2 రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అంటూ స్పష్టం చేశారు.
https://twitter.com/PushpaMovie/status/1866041047488528542
https://twitter.com/PushpaMovie/status/1866022278150160679
రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి?
‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్ (Pushpa 2 Box Office Collections)లో చేరేందుకు రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీకెండ్ అయిపోయిన నేపథ్యంలో ఒక వేళ కలెక్షన్స్ తగ్గినా ఎల్లుండి మాత్రం కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫాస్టెస్ట్ థౌజండ్ క్రోర్స్ (Fastest Rs.1000 Movie) సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక సారి ఆ ఫీట్ సాధించాక ‘పుష్ప 2’ టార్గెట్ రూ.1500 కోట్ల మైలురాయిపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేశాడు. జగపతిబాబు, సునీల్, రావు రమేష్, అనసూయ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా రానుంది.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 09 , 2024
Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచనలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని సైతం ‘పుష్ప 2’ అందుకుంది. తద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
అత్యంత వేగంగా..
‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేవలం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేరక్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంత వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదేనని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం ఇంత తక్కువ సమయంలో రూ.1000 కోట్లు రాబట్టలేదని పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా పుష్ప 2 సాగుతోంది. అయితే భారతీయ సినీ చరిత్రలో ‘పుష్ప 2’తో పాటు మరో 7 చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
https://twitter.com/PushpaMovie/status/1866731687578833350
దంగల్ (Dangal)
అమీర్ ఖాన్ (Amir Khan) లీడ్ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘దంగల్’. ఫొగాట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్ తేవాలనుకునే తండ్రి తన కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో దంగల్ రూపొందింది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా వరల్డ్‌వైడ్‌గా రూ. 2000 కోట్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది.
బాహుబలి 2 (Bahubali 2)
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’ (Bahubali). ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు రాబట్టింది.
RRR
రామ్‌చరణ్ (Ramcharan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. ఇందులో రామ్ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. రూ. 550 కోట్లతో ఈ తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1,390 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
కేజీఎఫ్ 2 (KGF 2)
కన్నడ నటుడు యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ (KGF: Chapter 1) చిత్రం ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ దానికి మించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.100 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.1250 కోట్లు కొల్లగొట్టింది.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్ నటించారు. దీనికి సీక్వెల్ కూడా రూపొందనుంది.
జవాన్ (Jawan)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ చిత్రం గతేడాది విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,148 కోట్లు రాబట్టింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేసింది. విజయ్ సేతుపతి విలన్‌గా అలరించాడు.
పఠాన్ (Pathan)
గతేడాది షారుక్ నటించిన మరో చిత్రం కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో నిలిచింది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1,050 కోట్లు వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేసింది. షారుక్ ఖాన్ గెస్ట్ రోల్‌లో అలరించాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు.
డిసెంబర్ 11 , 2024
Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ పీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. అయితే టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సినీ లవర్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.1000 - రూ.3000 వరకూ విక్రయిస్తుండటంపై బన్నీ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావించిన తమను టికెట్ ధరల పెంపు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రగడ నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. సుబ్బారావు ఇడ్లీ స్టోరీ చెప్పి నెట్టింట మరో చర్చకు కారణయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాన్స్ జేబులకు చిల్లులు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం రా.9:30కి స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రీమియర్స్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌లో రూ.1,239 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో బ్లాక్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో టికెట్ ధరలు ఉంటే సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావిస్తే తమ జేబుకి చిల్లులు పడటం ఖాయమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులే తమ బలం అని పదే పదే చెప్పే హీరోలు.. ప్రీమియర్స్ పేరుతో ఇలా దోచుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.
https://twitter.com/icon_uday_09/status/1862842546986058178
https://twitter.com/HemanthSriram14/status/1862891462121152785
‘రేట్లు తగ్గాకే చూడండి’
'పుష్ప 2' టికెట్ ధరలను నియంత్రించాలని నెటిజన్లు కోరుతుండటంతో పాటు ఈ విషయమై పలువురు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోలుస్తూ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. ఆ ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కస్టమర్‌కు ఆ ఇడ్లీలు వర్త్ అనిపించకపోతే హోటల్‌కు వెళ్లడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ కోసం కాదు. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.
https://twitter.com/RGVzoomin/status/1864188826387873892
ఆర్జీవీకి నెటిజన్ల కౌంటర్
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చెప్పిన సుబ్బారావు ఇడ్లీ స్టోరీకి నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 7 స్టార్ హోటల్స్‌లో 10 మంది ఇడ్లీలు తింటే బయట హోటల్‌లో 50వేల మంది తింటారని గుర్తుచేస్తున్నారు. డే 1 రూ.1200 ఉన్న టికెట్‌ను మరుసటి రోజుకు రూ.500, ఆ తర్వాత రూ.200కి మార్చడం అంటే 'పుష్ప 2' విలువ అంత నీచంగా పడిపోయిందని అర్థమా? అని నిలదీస్తున్నారు. ‘మెుదటి రోజు 7 స్టార్ ఇడ్లీలు ఎవరు కొనట్లేదు భయ్యా!’ అంటూ ఖాళీ సీట్లు ఉన్న థియేటర్లను పోస్టు చేస్తున్నారు. గతంలో పవన్ సినిమా టికెట్ ధరను జగన్ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రూ.10 ధరతో తొలి భాగం చూపించి రూ.1000 కడితేనే రెండో సగం చూడాలని కండీషన్ పెడితే అది దోపిడి కాదా? అని మండిపడుతున్నారు. హోటల్‌లో ఇడ్లీ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామని, అలాగే ‘పుష్ప 2’ని ఓటీటీలోకి వచ్చాక చూస్తామని స్పష్టం చేస్తున్నారు.
https://twitter.com/Raja__JSP/status/1864210260183142807
https://twitter.com/shravan_salaar/status/1864190328200179911
డిసెంబర్ 04 , 2024
SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
Image Credit: X
ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారించారు.
Image Credit: X
రెండేళ్ల పాటు షూటింగ్
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్‌లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
https://twitter.com/AbhiM2608/status/1866455157590184410
ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.
Image Credit: X
ఎక్స్‌లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్
SSMB29 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్‌కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Image Credit: X
ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, "ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది" అని అన్నారు.
తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Image Credit: X
అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ 10 , 2024
SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మూడు భాగలుగా..
మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఒకసారి సినిమా ప్రారంభమైతే అది రూ.1500 కోట్లకు కూడా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికన్ యాక్టర్ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) రాజమౌళి సినిమాలో నటిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే జెన్నాతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
https://twitter.com/arjuntn369/status/1645598037446918144
View this post on Instagram A post shared by Greg Williams (@gregwilliamsphotography)
https://twitter.com/Theme43259475/status/1645457459971076097
హలీవుడ్ యాక్టర్లు
మూడు పార్టులుగా తెరకెక్కబోయే రాజమౌళి సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం పనిచేస్తారని సమాచారం. SSMB 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న8 ఏళ్లలో ఈ పార్టులు రిలీజ్ అవుతాయని చర్చించుకుంటున్నారు. మూడు పార్టులకు 8 ఏళ్లు అంటే మహేష్ ఏం చేస్తారోనని ఇప్పటినుంచే ఆయన అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అప్పటివరకు మరో సినిమాలో మహేష్‌ను చూడలేమా అంటూ దిగులు చెందుతున్నారు. అయితే రాజమౌళితో వరుసగా మూడు సినిమాలంటే మామూలు విషయం కాదని తమకు తామే ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు.
https://twitter.com/Harmindarboxoff/status/1645422058501980165?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1645422058501980165%7Ctwgr%5E409944ca03b55589956ba02ba037da35535fd255%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FHarmindarboxoff%2Fstatus%2F1645422058501980165
హీరోయిన్లు వీళ్లేనా?
SSMB29లో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి కూడా నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహేశ్ సినిమాలో మెుత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ హీరోయిన్లుగా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా థర్డ్ హీరోయిన్‌గా సారా అలీఖాన్( Sara Alikhan) పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళికి సారా పేరును బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సూచించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, చియాన్ విక్రమ్, కేరళ నటుడు పృథ్వీరాజ్ కూడా నటిస్తారని ఇటీవలే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
https://twitter.com/TLegoude/status/1645522645528776704?s=20
ప్రస్తుతం మహేష్ SSMB 28 షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూాజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ శ్రీలీల కూడా సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ లోపు ఫినిష్ చేసేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. SSMB28 షూట్ పూర్తికాగానే రాజమౌళి సినిమాపై మహేష్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
ఏప్రిల్ 13 , 2023
Fastest 500Cr Movies: జెట్ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
ఒకప్పుడు దేశంలో సూపర్ హిట్ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి-2
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.
2. ఆర్‌ఆర్‌ఆర్
బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే.
3. కేజీఎఫ్ 2
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
4. పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.
5. రోబో 2.0
రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.
6. సుల్తాన్
సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ చిత్రం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
7. దంగల్
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.
8. పీకే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.
9. టైగర్ జిందా హై
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.
10. సంజు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.
సెప్టెంబర్ 05 , 2023
Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్ చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్ పార్ట్ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.
అసలు కథ ‘పార్ట్ 2’లోనే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విలన్ సుప్రీమ్ యాష్కిన్‌గా కమల్ హాసన్ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్ సుప్రీమ్ యాష్కిన్ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్, విలన్ సుప్రీమ్ యాష్కిన్ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
కమల్ హాసన్ విశ్వరూపం
కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్ చేసుకొని సుప్రీమ్ యాష్కిన్ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్ హాసన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్ యాష్కిన్ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్ హాసన్ విశ్వరూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.
భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు?
భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్ పార్ట్‌లో రానుంది.
విజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్!
కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ పోషించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కల్కి పాత్రలో ఎవరు?
పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్ ఝలక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్ ఉంది. కలి అయిన సుప్రీమ్ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సాయం చేయవచ్చు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 08 , 2024
Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్’పై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్ ఒక్కరే ఫిక్స్ కాగా ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో సందీప్ ఉన్నారు. అయితే స్పిరిట్ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్ తాజాగా ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘కొందరు యానిమల్ నా బెస్ట్ వర్క్ అంటున్నారు. నా బెస్ట్ వర్క్ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ తీసిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలకంటే 'స్పిరిట్' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops)
విలన్‌గా కొరియన్ సూపర్ స్టార్?
‘స్పిరిట్’లో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్‌తో డాంగ్ సూ (Ma Dong-seok) వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కొరియాలో అతడు చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ వేదికగా భారతీయ భాషల్లో డబ్ కూడా అవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ప్రభాస్ విలన్‌గా డాంగ్ సూ గనుక నటిస్తే స్పిరిట్ ప్రాజెక్ట్ గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్ చెప్పారు. అతడి క్యారెక్టరైజేషన్, లుక్‌తో పాటు మేనరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జూలై 17 , 2024
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్ హిట్ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్లకు పైగా మార్కెట్!
దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.
రూ.700-1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్ ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ తారక్ (NTR31), ప్రభాస్ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
రూ. 500-700 కోట్ల మార్కెట్
ఈ మార్కెట్ రేంజ్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సరైన హిట్ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్ కూడా డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.
రూ.200-500 కోట్ల మార్కెట్
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్ రూ.200 పైనే ఉండనుంది.
సెప్టెంబర్ 28 , 2024
Pushpa 2: రిలీజ్‌కు ముందే ‘RRR’ రికార్డు బద్దలు కొట్టిన ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ కళ్లుచెదిరే రీతిలో జరిగినట్లు తెలుస్తోంది.
రూ.1000 కోట్ల బిజినెస్!
'పుష్ప 2' చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించినట్లు తెలిపాయి. నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్ రూ.120 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
‘RRR’ రికార్డు బద్దలు!
తారక్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం రూ.480 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓటీటీ, మ్యూజిక్, టెలివిజన్ రైట్స్ అమ్మకాల ద్వారా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆ స్థాయిలో బిజినెస్ చేసిన తొలి చిత్రంగాను RRR నిలిచింది. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు పరిశీలిస్తే RRR రికార్డు బద్దలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రూ.100 పైనే RRR కంటే ఎక్కువ బిజినెస్ అల్లు అర్జున్ సత్తా చాటాడు. తెలుగులో ఏ స్టార్ హీరో సాధించలేని ఘనతను బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రద్దా కపూర్‌తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా స్పెషల్ సాంగ్ కోసం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.
ఫస్టాఫ్ ఎడిటింగ్ కంప్లీట్
‘పుష్ప 2’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గత కొన్ని రోజులుగా క్లైమాక్స్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ పుష్ప 2 ఫస్టాఫ్ ఎడిటింగ్ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఔట్‌పుట్ అదిరిపోయిందని, బన్నీ తన నటనతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అక్టోబర్ 22 , 2024
Pushpa 2 Record: వందేళ్ల బాలీవుడ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2!
సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ, కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా, హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నికర వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు (Pushpa 2 Hindi Collections) వసూలు చేసి, 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఈ మొత్తాన్ని కేవలం సినిమా విడుదలైన 15 రోజుల్లోనే రాబట్టడం.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) వసూలు చేయడం విశేషం. విడుదలైన మొదటి 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారతీయ సినీ చరిత్రలో ఒక అపూర్వమైన రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.1,387 కోట్లు) వసూళ్లను అధిగమించిన ‘పుష్ప 2’, ఇప్పుడు ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది.
Pushpa 2 Full HD Movie Leaked
ఈ సినిమా అభిమానులకు మరింత వినోదాన్ని అందించడానికి చిత్రబృందం కొన్ని కొత్త సన్నివేశాలను జోడించే యోచనలో ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటిలోని సీన్ల రన్‌టైమ్ దాదాపు 20 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ‘పుష్ప 2’ నిడివి సుమారు 3 గంటల 20 నిమిషాలుగా ఉండగా, కొత్త సన్నివేశాలతో మరింత ఉత్కంఠను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
‘పుష్ప 2’ సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల నుండి భారీ స్పందనను పొందడం, అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించడం తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపే సూచికగా చెప్పవచ్చు. ఇది సినీ ప్రియులకు ఆనందాన్ని పంచడమే కాక, టాలీవుడ్ ప్రతిష్ఠను గ్లోబల్ స్థాయికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 20 , 2024
NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. హృతిక్ రోషన్‌తో తలపడనున్న తారక్..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.
అధికారిక ప్రకటన
తరణ్ ఆదర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.
ముందే తెలుసా?
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్ కపూర్, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.
బిజీబిజీగా జూ.NTR
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్ పూర్తైన వెంటనే వార్-2 సినిమాపై ఎన్టీఆర్ ఫోకస్ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
అతి పెద్ద సంస్థ
వార్-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సంస్థకు భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పఠాన్ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘వార్’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్ వర్సస్ పఠాన్’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 05 , 2023
S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్ మస్క్ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్ డైరెక్టర్‌గా రికార్డు!
భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్ దేశం అలెర్ట్ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం అయిపోతాయి. రాజమౌళి రీసెంట్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంతటి కీర్తిని గడించిన రాజమౌళి తాజాగా మరో అందలం ఎక్కారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించారు.
https://twitter.com/DVVMovies/status/1646532105067966466
2023 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ ఘనత సాదించిన తొలి ఇండియన్ డైెరెక్టర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో జక్కన్నతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రచయిత సల్మాన్ రష్దీ, న్యాయ నిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ చోటు సంపాదించారు. అలాగే ప్రఖ్యాత గాయని బియాన్స్, సిరియా స్విమ్మర్స్ సారా మర్దిని, యుస్రా మర్దిని, సూపర్ మోడల్ బెల్లా హడిడ్ చోటు దక్కించుకున్నారు. ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జక్కన్న స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు.
View this post on Instagram A post shared by Bella ? (@bellahadid)
టైమ్ మేగజీన్‌లో S.S. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్ నటి అలీయా భట్ ప్రొఫైల్ రాసింది. సినిమాపై రాజమౌళికి ఉన్న విజన్‌పై ప్రశంసలు కురిపించింది. ‘ఆడియన్స్ గురించి రాజమౌళికి బాగా తెలుసు. సినిమాను ఎలా తీస్తే హిట్ కొడుతుందో ఆయనకు కొట్టిన పిండి. కథల ఎంపికలో రాజమౌళికి ఎంతో నైపుణ్యం ఉంది. భారత్‌లోని జనాభా విభిన్న సంస్కృతులు, అభిరుచులను కలిగి ఉంటారు. వారందరినీ రాజమౌళి తన సినిమాల ద్వారా ఏకం చేశారు’ అని అలియా భట్ రాసుకొచ్చింది. అటు బాలీవుడ్ నటుడు షారుక్ గురించి నటి దీపికా పదుకొనే కూడా ప్రొఫైల్ రాసింది. ప్రపంచ ప్రసిద్ధ నటుల్లో షారుక్ ఒకరిని పేర్కొంది. షారుక్.. గొప్ప మనసు, దాతృత్వం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.
https://twitter.com/TIME/status/1646737043290980354
రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్‌బాబుతో తీయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. మహేష్ సినిమాను రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని రాజమౌళి ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు అని ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయితే అది రూ.1500 కోట్లకు కూడా చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా మూడు పార్ట్స్ రిలీజ్ చేయడానికి రాజమౌళి కనీసం 8 ఏళ్లు తీసుకుంటాడని కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయితే ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Harmindarboxoff/status/1643961285615427586
ఏప్రిల్ 14 , 2023
100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలివే!!
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.
హీరో -సినిమాలు
హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్4ఎన్టీఆర్ 4చిరంజీవి 3రామ్ చరణ్ 3పవన్ కల్యాణ్3బాలకృష్ణ 2
మహేశ్ బాబు
100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు
ప్రభాస్
ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్ నుంచే రావాలి.
సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్151 కోట్లు
చిరంజీవి
ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్ క్రేజ్‌కు నిదర్శనం
సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు
అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ సినిమా కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.
సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు
రామ్ చరణ్
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.
సినిమాకలెక్షన్RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు
జూ. ఎన్టీఆర్
RRRతో రామ్ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్. తనకున్న వాక్ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.
సినిమాకలెక్షన్RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్126 కోట్లు
పవన్ కల్యాణ్
టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.
సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్ 161 కోట్లువకీల్ సాబ్138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు
బాలకృష్ణ
అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.
సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు
మరికొన్ని సినిమాలు
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి.
సినిమాహీరో కలెక్షన్F2 వెంకటేశ్-వరుణ్ తేజ్143 కోట్లుగీత గోవిందంవిజయ్ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు
పాత రోజుల్లో సినిమా హిట్ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్ జుబ్లీ, 100 డేస్ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్ అయిపోయింది. హిట్ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html
https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
ఏప్రిల్ 26 , 2023
17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y
https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
ఏప్రిల్ 28 , 2023