ATelugu
పురబ్ కోహ్లికి చెందిన అపార్ట్‌మెంట్‌లోకి ఫరాహ్ (నేహాశర్మ) అద్దెకు వెళ్తుంది. అప్పటి నుంచి ఆ అపార్ట్‌మెంట్‌లోని పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అక్కడ నివసించే కుటుంబాల్లో ఊహించని ఘటనలు జరుగుతాయి. ఒకరంటే ఒకరికి పడకుండా పోతుంది. చంపుకునే వరకూ వెళ్తారు. అసలు నేహాశర్మ అక్కడికి ఎందుకు వెళ్లింది? అపార్ట్‌మెంట్‌లో ఏం చేసింది? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్SonyLivఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
నేహా శర్మ
షరీబ్ హష్మీ
శృతి సేథ్
పురబ్ కోహ్లీ
చందన్ రాయ్ సన్యాల్
అమృతా ఖాన్విల్కర్
చాహత్ విగ్
ఫైసల్ రషీద్
జారా ఖాన్
కెన్నెత్ దేశాయ్
కె.సి. శంకర్
సిబ్బంది
విశాల్ ఫ్యూరియాదర్శకుడు
సమీర్ గోగటేనిర్మాత
సమీర్ నాయర్నిర్మాత
దీపక్ సెగల్నిర్మాత
కథనాలు
HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?
హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్.
భాగల్‌పూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
బాలీవుడ్ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది.
భాగల్‌పుర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది.
నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.
నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.
డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.
సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్, సల్సా, మరెంగ్యూ, జివ్, జాజ్ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.
లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్ డ్యాన్స్ స్టూడియోస్' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.
నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్ చెబుతారు.
నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట.
హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్ కాగా, మరొకరు మధుబాల.
నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్.
నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్.
నాని నటించిన రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్ కాలేదు.
హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్ జంటగా నటించిన 'బ్యాడ్ న్యూస్' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్ అనే పాత్రలో కనువిందు చేసింది.
రీసెంట్‌గా '36 డేస్' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది.
నవంబర్ 21 , 2024
Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
[toc]
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్‌చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
అక్టోబర్ 22 , 2024
Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్.. టికెట్ల పెంపుపై కమిటీ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు.. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు.
తొక్కిసలాట వీడియో ప్రసారం..
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నుంచి 36 మంది సీఎంతో (Tollywood Industry Meeting) సమావేశమయ్యారు. దిల్‌రాజుతో పాటు అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సీ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం తదితరులు భేటికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.
https://twitter.com/NTVJustIn/status/1872173132062286004
సెలబ్రిటీల ప్రతిపాదనలు
సీఎంతో భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పలు ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది తమ కోరికని సినీ నటుడు నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని దర్శకుడు రాఘవేంద్రరావు సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన సీనియర్ నటుడు మురళి మోహన్.. అది తమనెంతో బాధించిందన్నారు. 'ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది' అంటూ చెప్పుకొచ్చారు. ‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా చేయాలనేది మా కల’ అని నిర్మాత దగ్గుబాటి సురేష్ సీఎంతో అన్నారు.
ఆ విషయంలో సీఎం తగ్గేదేలే..
సినీ పెద్దల అభిప్రాయాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి (Tollywood Industry Meeting).. ప్రభుత్వ వైఖరి ఎంటో స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. పెట్టులబడుల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం. అంతేకాదు బెనిఫిట్ షోలు కూడా ఉండవు. దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలకు మేం కట్టుబడి ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు.
భేటిపై దిల్ రాజు వివరణ..
సీఎం రేవంత్‌రెడ్డితో సెలబ్రిటీల సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. ఈ భేటి ముగిసిన అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు భేటిలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య గ్యాప్ ఉందనేది కేవలం అపోహ మాత్రమేనని దిల్‌రాజు స్పష్టం చేశారు. 'తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిలిం హబ్‌గా మార్చడానికి కృషి చేస్తాం. తెలంగాణ సామాజిక కార్యక్రామల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి సహకారం ఉండాలని ప్రభుత్వం కోరింది. డ్రగ్స్, గంజాయి లాంటి ఆవగాహన కార్యక్రమాల్లో ఇకనుంచి నటీనటులు పాల్గోంటారు. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విషయం. ఆ రెండింటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఘటనల వలన ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది అది నిజం కాదు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం’ అంటూ దిల్‌రాజు వివరించారు.
https://twitter.com/ManobalaV/status/1872198044768469412
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..
టాలీవుడ్‌లో సమస్యలు (Tollywood Industry Meeting), ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పరిశోధించనుంది. అలాగే అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై కూడా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
డిసెంబర్ 26 , 2024
Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.
తొలి కలెక్షన్స్ ఎంతంటే?
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు ప్రదర్శించింది. యూఎస్ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు.
రవితేజ టాప్-10 కలెక్షన్స్! (Ravi Teja Top 10 Highest Grossing Movies)
‘ఈగల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
ధమాకా (Dhamaka)
రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వరకూ జరిగింది.
బడ్జెట్: 35 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు
క్రాక్ (Krack)
ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు
తీర్పు: బ్లాక్ బస్టర్
రాజా ది గ్రేట్ (Raja the Great)
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్ కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr
వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు
తీర్పు: హిట్
బలుపు (BALUPU)
రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)
రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.
బడ్జెట్: 55 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు
పవర్ (Power)
రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్ గణాంకాలను నమోదు చేసింది.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు
తీర్పు: సగటు కంటే ఎక్కువ
బెంగాల్ టైగర్ (Bengal Tiger)
ఈ సినిమా బడ్జెట్ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr
వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు
విక్రమార్కుడు (Vikramarkudu)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.
బడ్జెట్: 11 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు
కిక్ (Kick)
రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అంతకే జరగడం గమనార్హం.
బడ్జెట్: 14 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు
కిక్ (KICK 2)
అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్ బిజినెస్ రూ.36 కోట్లు. కిక్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
బడ్జెట్: 30Cr
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 43cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr
ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
ఫిబ్రవరి 10 , 2024
5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. 2019లో ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇందులో నాని నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రిపీటెడ్ మోడ్‌లో ఈ సినిమాను చాలా ఏమోషనల్ అయ్యారు. నేటితో (ఏప్రిల్ 19) ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ సక్సెస్‌కు కారణమైన అంశాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం.
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే
జెర్సీ సినిమా ఘన విజయం సాధించడానికి మూలకారణం ‘కథ’. చాలా యునిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాకు తండ్రి కొడుకుల ఎమోషనల్ టచ్ జోడించడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్క్రీన్‌ప్లే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అర్జున్ జర్నీని హృదయానికి హత్తుకునేలా ఆయన చూపించారు. కథలో ఫ్యామిలీ, త్యాగం, ఏమోషనల్, స్పోర్ట్స్‌ను మిళితం చేసి చక్కటి విజయాన్ని అందుకున్నారు.
ప్రధాన తారాగణం నటన
కథ ఎంత బాగున్నా దానికి తగ్గ తారాగణం లేకపోతే ఆశించిన ఫలితం రాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. పాత్రలకు తగ్గట్లు నటీనటులను ఎంచుకొని ఆయన మంచి ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా అర్జున్ పాత్రకు నాని ఎంచుకోవడం ద్వారానే ఆయన సంగం విజయం సాధించాడని చెప్పవచ్చు. తెరపై చూస్తున్నంత సేపు అర్జున్ పాత్ర తప్ప నాని ఎక్కడా కనిపించలేదు. హీరో భార్య సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ కూడా అద్భుత నటన కనబరిచింది. నాని, శ్రద్ధా కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అర్జున్ కోచ్‌గా నటించిన సత్యరాజ్ కూడా సినిమాపై మంచి ప్రభావం చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు.
సంగీతం - సినిమాటోగ్రఫీ
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాను హైలెట్‌గా నిలిపింది. చాలా కాలం తర్వాత మంచి పాటలు విన్నామన్న ఫీలింగ్ అప్పట్లో ప్రేక్షకులకు కలిగించింది. ఇక నేపథ్య సంగీతం కూడా సినిమాకు చాలా బాగా కుదిరింది. ఆడియన్స్ ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్ అయ్యేందుకు BGM ఉపయోగపడింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలకు అనిరుధ్ ఇచ్చిన BGM.. ఆ సీన్స్ తాలుకూ డెప్త్‌ను తెలియజేసింది. మరోవైపు సినిమాటోగ్రఫీ కూడా జెర్సీ చిత్రానికి ప్లస్‌గా మారింది. సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్.. చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నటీనటుల ముఖాల్లోని భావోద్వేగాలను ఆయన చాలా బాగా క్యాప్చర్ చేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్‌లను అతడు చాలా రియలస్టిక్‌గా చూపించాడు.
తండ్రి-కొడుకుల అనుబంధం
టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘జెర్సీ’. ఈ సినిమాలోని అర్జున్ పాత్ర చాలా మంది తండ్రులకు కనెక్ట్ అవుతుంది. కుమారుడి సంతోషం కోసం ఏదైనా సాధించాలని తపన పడే ఆ పాత్ర మిడిల్‌క్లాస్ జీవితాలకు అద్దం పడుతుంది. కొడుకు పుట్టిన రోజున అడిగిన జెర్సీని కూడా బహుమతిగా కొనివ్వలేని తండ్రి.. తన బిడ్డకు హీరోలా కనిపించాలన్న సంకల్పంతో ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మెుదలు పెట్టడం ఆడియన్స్‌ను చాలా ఏమోషనల్ చేస్తుంది.
జెర్సీ డైలాగ్స్
జెర్సీ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డైలాగ్స్. ఒక్కో డైలాగ్ ప్రతీ ఒక్కరికీ జీవిత పాఠాన్ని నేర్పేలా స్పూర్తివంతంగా ఉంటాయి. ఆణిముత్యాల్లాగా కనెక్ట్ అవుతాయి. సినిమాల్లోని హైలెట్ డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం.
'ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు'_ అర్జున్
'నీ అంత టాలెంట్ ఉన్న వాళ్లని చాలా మందిని చూశాను. కానీ.. డిస్సిప్లైన్ లేకుండా ఎదిగిన వాళ్లని ఒక్కరిని కూడా చూడలేదు'_ సత్యరాజ్ పాత్ర
కొడుకు: నాన్న నువ్వు మళ్లీ క్రికెట్ ఆడవా?
అర్జున్ : నువ్వు చెప్పు ఆడనా వద్దా?
కొడుకు: ఆడు నాన్న నువ్వు ఆడితే చాలా బాగుంటుంది.. హీరోలా అనిపిస్తావు?
‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయంది.., నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా? ఇవేమి సంబంధం లేదు.., వాడికి నేను నాన్న అంతే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సారా..'
లాస్ మూడు రోజులలో నాకు నేను దొరికాను సర్. నా 36 ఏళ్ల జీవితం కనిపించింది'
'అర్జున్ కథ, వందలో సక్సెస్ అయిన ఒకడిది కాదు, సక్సెస్ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది'
‘మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే.. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ జెర్సీ నాకు వస్తుంది’
ఏప్రిల్ 19 , 2024
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి. ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
[toc]
Jersey
అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ.
Ee Nagaraniki Emaindi
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
Chi La Sow
అర్జున్ (సుశాంత్) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies)
C/o Kancharapalem
కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
Brochevarevarura
పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies)
Ninnila Ninnila
పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Raja Raja Chora
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
Nootokka Jillala Andagadu
హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Balagam
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
Pareshan
ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
Nuvvu Naaku Nachchaav
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
Vedam
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
Keedaa Cola
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Seethamma Vakitlo Sirimalle Chettu
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
Miss Shetty Mr Polishetty
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
Pilla Zamindar
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
Josh
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
Rowdy Boys
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Middle Class Melodies
రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
ఆగస్టు 24 , 2024
#AskNani: ఫ్యాన్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
దసరా చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.
దసరా రన్‌టైమ్
#Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్ టైమ్ రివీల్ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636016970473828353
ఫుల్ బిందాస్
సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.
https://twitter.com/NameisNani/status/1636015575284748288
స్ట్రాంగ్ రిప్లై
రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636005865101877255
ఫన్నీ సమాధానం
నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.
https://twitter.com/NameisNani/status/1636006778805837824
ఎవరైనా ఒక్కటే
నేచురల్ స్టార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1636004611210502150
ఒరిజినల్ పీస్
సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.
మార్చి 16 , 2023
అనన్య నాగళ్ల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అనన్య నాగళ్ల.. మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన "పద్మ" పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. వకీల్‌సాబ్ చిత్రంలో దివ్యా నాయక్ క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందింది. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనన్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి అనన్య నాగళ్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts Ananya nagalla) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనన్య నాగళ్ల దేనికి ఫేమస్?
అనన్య నాగళ్ల మల్లేశం చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో పాటు వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించింది.
అనన్య నాగళ్ల వయస్సు ఎంత?
1987 ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
అనన్య నాగళ్ల తొలి సినిమా?
మల్లేశం
అనన్య నాగళ్ల ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
అనన్య నాగళ్ల ఎక్కడ పుట్టింది?
సత్తుపల్లి, ఖమ్మం
అనన్య నాగళ్ల ఉండేది ఎక్కడ?
హైదరాబాద్
అనన్య నాగళ్ల ఏం చదివింది?
ఇంజనీరింగ్
అనన్య నాగళ్ల తల్లిదండ్రుల పేర్లు
విష్ణుప్రియ, వెంకటేశ్వరరావు
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరోయిన్
సావిత్రి
అనన్య నాగళ్ల ఫెవరెట్ క్రికెటర్
సచిన్ టెండూల్కర్
అనన్య నాగళ్ల అభిరుచులు?
బాక్సింగ్, యోగా
అనన్య నాగళ్లకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
అనన్య నాగళ్లకి ఇష్టమైన కలర్ ?
వైట్ అండ్ బ్లాక్
అనన్య నాగళ్ల పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.25లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత "షాది" అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు పొందింది.
అనన్య నాగళ్ల ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ananya.nagalla/?hl=en
https://www.youtube.com/watch?v=Tqjtq5lvnas
ఏప్రిల్ 13 , 2024
Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్ సేన్.. ‘గామి’ ఎలా ఉందంటే?
నటీనటులు: విష్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, రమ్య పసుపులేటి, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, మయాంక్ పరాక్, రాజీవ్ కుమార్,
దర్శకుడు: విద్యాధర్ కాగిత
సంగీతం: స్వీకర్ అగస్తీ, నరేష్ కుమారన్
సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందీగాం
నిర్మాత: కార్తిక్ శబరీష్, శ్వేత మోరవనేని
విడుదల తేదీ: 8 మార్చి, 2024
విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఇందులో విష్వక్ తొలిసారి అఘోరా గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్ ట్రీట్ చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కాగా, భారీ అంచనాల నడుమ గామి చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అఘోరా గెటప్‌లో విష్వక్ మెప్పించాడా? అందరి అంచనాలను ఈ సినిమా నిలబెట్టిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
అఘోరా శంకర్ (విష్వక్ సేన్) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడికి చాందిని చౌదరి చేసిన సాయం ఏంటి? దేవదాసిని తరిమేసిన గ్రామస్తులే తిరిగి ఆమెకోసం ఎందుకు వెతకాల్సి వచ్చింది? హ్యుమన్ ట్రైల్స్ ఎందుకు చేస్తున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరేలా చేశారంటే
ఈ సినిమాలో కొత్త విష్వక్ సేన్‌ను చూస్తారు. అఘోరా శంకర్ పాత్రలో అతడు విశ్వరూపం చూపించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. విష్వక్ నటన, డైలాగ్ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్, ఎమోషన్స్ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్ లీడ్ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్ లభించింది. హిమాలయ యాత్రలో విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు విద్యాధర్ కాగిత.. ‘గామి’ చిత్రాన్ని సరికొత్త కథతో తెరకెక్కించారు. ఇప్పటివరకూ రాని యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి.. అరంగేట్రంలోని మంచి ఇంప్రెషన్ సంపాదించాడు. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన దర్శకుడు.. శంకర్ పాత్రలో ప్రేక్షకులు త్వరగా లీనమయ్యేలా చేశారు. ఓ వైపు శంకర్ పాత్రను నడిపిస్తూనే సమాంతరంగా మరో రెండు విభిన్న స్టోరీలను తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచింది. చివర్లో ఆ మూడు కథలను లింకప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే లయన్ యాక్షన్ ఎపిసోడ్ విజువల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. అయితే సబ్‌ప్లాట్ స్టోరీలైన దేవదాసి, హ్యూమన్ ట్రైల్స్ ఎపిసోడ్‌ను సమర్థవంతంగా చూపించడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అటు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరీ సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో డైరెక్టర్ విద్యాధర్ ఇచ్చిన ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి.
టెక్నికల్‌గా
ఈ సినిమాకు సాంకేతిక విభాగం చాలా బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ విభాగం తమ పనికి 100 శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్ రెడ్డి, రాంపీల కెమెరా పనితనం మెప్పిస్తుంది. స్వీకర్ అగస్తీ, నరేష్ కుమారన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంవిష్వన్ నటనటెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
సబ్‌ప్లాట్ స్టోరీలుసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 08 , 2024
సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
సమంత ఎవరు?
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సమంత దేనికి ఫేమస్?
సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
సమంత వయస్సు ఎంత?
సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
సమంత ముద్దు పేరు?
సామ్
సమంత ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
సమంత ఎక్కడ పుట్టింది?
చెన్నై
సమంతకు వివాహం అయిందా?
2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది.
సమంత అభిరుచులు?
పాటలు పాడటం, షాపింగ్, జిమ్ చేయడం
సమంత ఇష్టమైన ఆహారం?
స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ
సమంత అభిమాన నటుడు?
ధనుష్, సూర్య, రజనీకాంత్
సమంత తొలి సినిమా?
ఏమాయ చేసావే
సమంత ఏం చదివింది?
కామర్స్‌లో డిగ్రీ చేసింది
సమంత పారితోషికం ఎంత?
సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సమంత తల్లిదండ్రుల పేర్లు?
జోసెఫ్ ప్రభు, నైనిటీ
సమంతకు అఫైర్స్ ఉన్నాయా?
సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది
సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.
సమంత ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en
సమంత సిగరేట్ తాగుతుందా?
కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది
సమంత మద్యం తాగుతుందా?
తెలియదు
సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
చిన్మయి, రానా, అక్కినేని అఖిల్
సమంతకు టాటూలు అంటే ఇష్టమా?
అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది.
సమంతకు వచ్చి వ్యాధి పేరు?
ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.
సమంత గుడి ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు.
https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
ఏప్రిల్ 27 , 2024
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.
ఆ భయం అక్కర్లేదు!
దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సాంగ్ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ మిడిల్‌లో సాధ్యం కాకపోతే ఎండ్ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1832446641393246291
దుమ్మురేపిన తారక్
‘దేవర’ నుంచి సెప్టెంబర్ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్ హైట్‌పైనా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నిటినీ తారక్ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.
https://twitter.com/DevaraMovie/status/1835018489784123480
జాతీయస్థాయిలో ట్రెండింగ్
దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
https://twitter.com/DevaraMovie/status/1835682846092226856
'పుష్ప 2'ను దాటేసిన 'దేవర'
విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
‘భారతీయుడు’ సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.
అసలేం జరిగిందంటే?
తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
తమిళ చరిత్రపై ప్రభావం
తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి. ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు.
Image credit: Wikimedia Commons
తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’
తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు.
Image credit: Wikimedia Commons
మద్రాసుపై తెలుగు వారి ప్రభావం
ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు.
Image credit: Wikimedia Commons
వందల్లో తెలుగు గ్రంధాలు
విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి.
నవంబర్ 04 , 2024
Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్’ చిత్రంతో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కారణం ఏంటంటే?
సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విక్రామ్ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.
విక్రాంత్ సినీ నేపథ్యం
సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్ (Vikrant Massey) 1987 ఏప్రిల్ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్.డి. నేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్ మచావో ధూమ్' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్ వీర్ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్' సిరీస్ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్' మూవీ విక్రాంత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్ 36' ఫిల్మ్ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్ కి గుస్తాఖియాన్' ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
కొడుకు కోసం స్పెషల్ టాటూ!
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్ నటి షీతల్ థాకూర్ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఆ హీరోయిన్‌కు బిగ్ ఫ్యాన్
విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్ దేవగన్, కె.కె. మీనన్, ఇర్ఫాన్ ఖాన్, పంకజ్ కపూర్ తన అభిమాన నటులని విక్రాంత్ చెబుతుంటాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్. అటు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999), ‘వాస్తవ్’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్ బాగా ఇష్టపడతాడు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.
విక్రాంత్ ఆస్తుల విలువ ఎంతంటే?
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్ వర్త్ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.
డిసెంబర్ 02 , 2024