UATelugu
ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. అరుణ్ కుమార్ తన ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌కు షిప్ట్ అవుతాడు. తన లేడీ బాస్‌తో సమస్యలు ఎదుర్కొంటూనే.. అసిస్టెంట్ మెనేజర్‌గా ప్రమోషన్ సంపాదిస్తాడు. ఈక్రమంలో అతనికి ఓ ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. దీంట్లో అతనికి ఓ ఛాలెంజ్ ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో అరుణ్ కుమార్ గెలిచాడా? లేదా? అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ ...read more
How was the movie?
తారాగణం
హర్షిత్ రెడ్డి
తేజస్వి మదివాడ
జై ప్రవీణ్
శ్రావ్య మృదలా
అనన్య శర్మ
వాసు ఇంటూరి
సిబ్బంది
జోనాథన్ ఎడ్వర్డ్స్దర్శకుడు
బి.సాయి కుమార్నిర్మాత
తన్వీ దేశాయ్నిర్మాత
కథనాలు
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా చూపించిన ఈ సిరీస్, రెండో సీజన్‌లో తన ఉద్యోగ జీవితంలో పైకి ఎలా ఎదిగాడు, పలు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆకర్షణీయంగా చూపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరు౦ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
సిరీస్ విశేషాలు
ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతీ ఎపిసోడ్ దాదాపు 25-30 నిమిషాల నిడివి కలిగి ఉంది. మొత్తం రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్‌ను చాలా సులభంగా వీక్షించవచ్చు. ఎపిసోడ్ల మధ్య ఎక్కడా బోర్ అనిపించకుండా స్టోరీ సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 4వ ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్‌గా సాగి, కొన్ని సందర్భాల్లో నాటకీయత ఎక్కువై అసలు కథకు అంతరాయం కలిగిస్తుంది. అయితే, 5వ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కుటుంబంతో కలసి చూడటం కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కపుల్స్ మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు.
నటీనటులు
తేజస్వి మదివాడ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ పాత్ర పోషించారు. ట్రైలర్‌లో బికినీ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె తన గ్లామర్ పాత్రతో అందరినీ ఆకర్షించింది. తేజస్వి గతంలో ఈ విధమైన పాత్ర చేయకపోయినా, ఈసారి తన రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించారు. అరుణ్ కుమార్ పాత్రలో నటించిన పవన్ సిద్ధు పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా తేజస్వితో ఉన్న సన్నివేశాల్లో సీన్లను బాగా మెప్పించాడు. అనన్య శర్మ తన క్యారెక్టర్‌కు అనుగుణంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆమె అరుణ్ కుమార్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించారు.
దర్శకత్వం
దర్శకుడు ఆదిత్య కేవీ మొదటి సీజన్‌లో అమెచ్యూర్ నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదురుకెళ్లే అరుణ్ కథను చక్కగా చూపించారు. రెండో సీజన్‌లో అతను ఉద్యోగంలో ఎదగడం, కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే, 4వ ఎపిసోడ్‌లో ఎక్కువగా కేవలం సంభాషణలే ఉండడంతో కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా ఈ సిరీస్ ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ రిచ్ లుక్‌ను కలిగి ఉండి, అజయ్ అరసాడా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరింత మెరుగ్గా ఆవిష్కరించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది.
చివరగా:
వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ సరైన ఎంపిక. పూర్తి వినోదాన్ని అందిస్తుంది.
రేటింగ్:
3/5
నవంబర్ 02 , 2024
Abhinav Gomatam: కామెడీ స్టార్ అభినవ్ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్ నటుల్లో ‘అభినవ్ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన అభినవ్.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అతడు లీడ్ రోల్ చేసిన ‘సేవ్ ద టైగర్స్ 1 & 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభినవ్ గోమఠం ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్
అభినవ్ గోమఠం ఎప్పుడు పుట్టాడు?
జనవరి 1, 1986
అభినవ్ గోమఠం ఎత్తు ఎంత?
5 ఫీట్ 10 ఇంచెస్ (178 సెం.మీ)
అభినవ్ గోమఠం రాశి ఏది?
సింహా రాశి
అభినవ్ గోమఠం స్కూలింగ్ ఎక్కడ జరిగింది?
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అభినవ్.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు.
అభినవ్ గోమఠం విద్యార్హత ఏంటి?
హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బీటెక్ చేశాడు.
అభినవ్ గోమఠానికి పెళ్లి జరిగిందా?
కాలేదు
అభినవ్ గోమఠం తండ్రి ఏం చేసేవారు?
అభినవ్ తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగి.
అభినవ్ గోమఠం కెరీర్ ప్రారంభంలో ఏం చేశాడు?
నటనపై ఆసక్తితో ఉడాన్ థియేటర్, అహరం థియేటర్ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అభినవ్ గోమఠం చేసిన తొలి షార్ట్ ఫిల్మ్ ఏది?
ఆర్టిఫిషియల్ (2012)
అభినవ్ గోమఠం చేసిన మొదటి చిత్రం ఏది?
మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya)
అభినవ్ గోమఠంను పాపులర్ చేసిన చిత్రం?
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi)
అభినవ్ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి?
‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’..
అభినవ్ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు?
‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’
అభినవ్ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి?
టాలీవుడ్ నటి కల్పిక.. అభినవ్ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్ కొట్టిపారేశారు.
అభినవ్ గోమఠం నెట్ వర్త్ ఎంత?
ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా)
అభినవ్ గోమఠం ఫేవరేట్ హీరో ఎవరు?
షారుక్ ఖాన్
అభినవ్ గోమఠం ఫేవరేట్ డైరెక్టర్ ఎవరు?
మణిరత్నం
అభినవ్ గోమఠం బెస్ట్ డైలాగ్ ఏది?
ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్ సీన్.. అభినవ్‌ను చాలా పాపులర్ చేసింది. నలుగురు ఫ్రెండ్స్ (విష్వక్, కౌషిక్ (అభినవ్), ఉప్పు, కార్తిక్) బార్‌లో సిట్టింగ్ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్ వేసే డైలాగ్స్ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అభినవ్ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్.. ఆ వాంట్ టూ సే సమ్‌థింగ్ రా.
విష్వక్: వీడొకడు..
అభినవ్ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్ మోస్ట్ 4 ఇయర్స్. ఐ యామ్ వెరీ హ్యాపీ. తాగుదాం.
ఉప్పు : రేయ్.. త్రీ డేస్ బ్యాక్ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం.
అభినవ్ : అది వేరురా..
కార్తిక్: లాస్ట్ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం
అభినవ్ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు.
విష్వక్ : టూ డేస్ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్ చేసి..
అభినవ్ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్.
విష్వక్ : పళ్లు రాలతాయ్.. అర్థమవుతుందా
ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్ వేసుకున్నాడు చూశావా?
అభినవ్ : లవ్ అయ్యిందా రా? (కార్తిక్ తో)
కార్తిక్ : లవ్ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి.
నలుగురు ఫ్రెండ్స్: డెవలప్.. డెవలప్.. డెవలప్.. డెవలప్..
https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s
అభినవ్ గోమఠంను ఫేమస్ చేసిన సింగిల్ లైన్ డైలాగ్స్?
‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్’
‘ఏం రా వేడి చేసిందా’
అభినవ్ గోమఠం బెస్ట్ యాక్టింగ్ సీన్?
ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్ పాత్రను పరిచయం చేసే సీన్ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్ పర్‌ఫార్మెన్స్ ఓ సారి మీరు చూసేయండి.
https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF
అభినవ్ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు?
అభినవ్ గోమఠం వైరల్ వీడియో ఏది?
దావత్ అనే షోలో అభినవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్ వర్క్స్ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి.
https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అభినవ్ గోమఠం రీసెంట్ ఫొటోలు?
ఏప్రిల్ 26 , 2024
OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
క
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్ - సుదీప్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
లక్కీ భాస్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar). మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
సింగమ్ అగైన్
భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్ చిత్రం ‘సింగమ్ అగైన్’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్ దేవ్‌గన్ నటించాడు. నవంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్‌సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అమరన్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్' (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
బఘీర
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం 'బఘీర' (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు
తంగలాన్
తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
అర్థమైందా అరుణ్‌కుమార్ 2
హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ 'అర్ధమయ్యిందా..? అరుణ్ కుమార్'. సీజన్ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో పవన్ సిద్దు మెయిన్ లీడ్‌గా నటించాడు.
TitleCategoryLanguagePlatformRelease DateTime Cut MovieEnglishNetflixOct 30Murder MindfullyMovieEnglishNetflixOct 31The Diplomat Season 2 SeriesEnglishNetflixOct 31Love Mocktail Season 2SeriesTeluguETV WinOct 31Wizards Beyond Waverly PlaceSeriesEnglishHotstarOct 30Lubber PandhuMovieTelugu DubHotstarOct 31Koshkinda KandamMovieTelugu DubNetflixNov 1Joker: Folie à DeuxMovieEnglishAmazon Oct 29AnjamaiMovieTamilAha Oct 31Somebody Somewhere S3SeriesHindiAmazon Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon Nov 7Mithya: The Dark ChapterSeriesTelugu, HindiZee 5Nov 1
అక్టోబర్ 28 , 2024
EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్ కంటే ఇంకా బెటర్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
డైలాగ్
ఓ సీన్‌లో హీరోయిన్ లిల్లీ జోసేఫ్ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది
లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్
టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా?
లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్
టిల్లు : చర్చి ఫాదరా?
https://twitter.com/i/status/1774726359111307728
డైలాగ్
లిల్లీ ఫాదర్: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?
టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు
డైలాగ్
టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
https://twitter.com/i/status/1774992506087944622
డైలాగ్
ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
https://twitter.com/i/status/1773542640488784015
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
https://twitter.com/i/status/1773655054655856994
డైలాగ్
సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.
లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ
అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
టిల్లు: పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం
https://twitter.com/i/status/1772913769770803358
డైలాగ్
లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
టిల్లు: నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని
https://twitter.com/i/status/1774319933129916896
డైలాగ్
లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్ సూపర్‌గా అనిపిస్తుంది.
టిల్లు: ఫ్రెండ్స్ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్ ఏ నల్లమల్ల ఫారెస్ట్.. విత్ నల్ల చీర.. ఫిల్మ్ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్ మాల్కాజ్ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్, హార్ట్ బ్రేక్, హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ జానర్‌లో వచ్చింది.
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8
డైలాగ్: బర్త్ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో..
టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్ జోకర్ అంటారు'
https://www.youtube.com/watch?v=sARNpvr4IoE
పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ...
టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు..
అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..!
టిల్లు: అచ్చా షాప్ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ..
పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు..
పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో..
టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని.
మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం
పిన్ని: నీకోసమేరా పిచ్చోడా..
టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను.
పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..
టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..
టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో..
టిల్లు: డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు.
వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు...
టిల్లు: ఉన్నడా భాయ్ ఫ్రెండ్..
లిల్లీ: నీకెందుకు..?
టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా...
లిల్లీ: లేదంటే..
టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..
లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..
టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..
మందు గురించి మాట్లాడే టైంలో..
టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా..
కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో
టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు..
లిల్లీ: స్మైలింగ్..
టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా..
లిల్లీ: లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా?
టిల్లు: నాదా...? నా హార్ట్ చాలా వీకూ..
** రొమాంటిక్ మ్యూజిక్…**
టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా..
లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్ ఏంటో తెలిసిననాడు మాట్లాడు.
టిల్లు: నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా..
లిల్లీ: Do You Know the best part Of Kiss
టిల్లు: Kiss
లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..
పబ్‌లో టిల్లుతో లిల్లీ
లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food
'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది.
లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్
షానన్: ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..!
క్లైమాక్స్‌లో లాస్ట్ డైలాగ్
లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్?
టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది.
https://twitter.com/i/status/1773940395300544591
ఏప్రిల్ 02 , 2024
Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్? సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్!
‘యానిమల్’ చిత్రంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్ స్కిల్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో తారక్‌ను సందీప్ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
‘స్పిరిట్’లో విలన్‌గా తారక్?
ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో తారక్ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.
ఎక్కడ కలిశారంటే?
సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి వంగాను తారక్ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.
తారక్‌తో స్పెషల్ ఇంటర్యూ!
దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్, సందీప్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.
ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్!
రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024
ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు!
సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్ గురించి కూడా అతడి ఫ్యాన్స్ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్ర. అల్లుఅర్జున్ ఇల్లు ఎక్కడ?
గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను.
ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు?
గూ: 8th ఏప్రిల్ 1983
ప్ర. అల్లుఅర్జున్ ఫోన్ నెంబర్?
గూ: ... 98480 ..... అర్థమైందా?
ప్ర: అల్లుఅర్జున్, రామ్‌చరణ్ కజిన్స్ అవుతారా?
గూ: అవును.. అల్లు అర్జున్ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్. కాబట్టి అల్లుఅర్జున్ రామ్‌చరణ్ కజిన్స్ అవుతారు.
ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు?
గూ. అల్లుఅర్జున్ కేరళలో చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు.
ప్ర: అల్లుఅర్జున్ బాలీవుడ్ సినిమాలు ఎందుకు తీయట్లేదు?
గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు.
ప్ర: నార్త్ ఇండియాలో అల్లుఅర్జున్ ఎందుకు ఫేమస్?
గూ: నార్త్ ప్రజలు అతని డ్యాన్స్, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు
ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్ నెంబర్?
గూ. 666
ప్ర: అల్లుఅర్జున్ హిందీలో మాట్లాడగలడా?
గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.
ఇటీవల ‘4 ఇడియట్స్ రియాక్ట్’ అనే యూట్యూబ్ ఛానెల్ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.
ప్ర: మీరు బ్రాహ్మణులా?
బన్నీ: నో (నవ్వుతూ)
ప్ర: మీరు చిరంజీవికి బంధువా?
బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని
ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు?
బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు
ప్ర. మీ ఫేవరేట్ రంగు?
బన్నీ: బ్లాక్
ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు?
బన్నీ: షూటింగ్ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా.
అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్ వీడియోలో చూడండి.
https://youtu.be/yoRVoy8hqmI
ఏప్రిల్ 07 , 2023
Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.
అరవింద సమేత వీరరాఘవ
హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.
https://www.youtube.com/watch?v=qmqQHtla20w
S/O సత్యమూర్తి
ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’ (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది.
https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ
అజ్ఞాతవాసి
ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు.
https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc
జులాయి
తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.
https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U
ఖలేజా
మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.
https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE
ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.
https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
జూన్ 12 , 2023
Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక (Niharika) స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై తొలిసారి పెదవి విప్పారు. దీనిపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా ఘాటుగా స్పందించడంతో వీరి విడాకుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నిహారిక ఏమన్నది? దానికి ఆమె మాజీ భర్త వేసిన కౌంటర్ ఏంటి? నిహారిక విడాకులపై నెటిజన్లు ఏమనుకుంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
https://twitter.com/celebstelugu/status/1294548027156254721
ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: నిహారిక
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిహారిక విడాకులపై తన మనసులోని భావాలను పంచుకుంది. 'పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అడుగులు వేశా. కానీ అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ఆన్‌లైన్ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడి ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం సెల్ఫ్‌కేర్ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నా’ అని నిహారిక చెప్పారు.
https://twitter.com/i/status/1751030907237016033
నాణానికి ఒక వైపే చూస్తే ఎలా: చైతన్య
నిహారిక వ్యాఖ్యలపై (#NiharikaDivorce) ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) రియాక్ట్ అయ్యారు. హోస్ట్ పోస్టు చేసిన వీడియో కామెంట్ సెక్షన్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుంది. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా? అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా?’ అని ఘాటుగా బదులిచ్చారు.
నెటిజన్స్ ఏమంటున్నారంటే?
నిహారిక - చైతన్య విడాకుల అంశంపై నెటిజన్లు (#NiharikaDivorce) తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిహారికకు అండగా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లాగే తమ సపోర్టు కూడా నిహారికకే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారికను బాధ్యురాలిగా చేస్తూ నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ‘పెళ్లిళ్లు ఆపై వెంటనే విడాకులు’ అనే శాపం ఉందని పోస్టులు చేస్తున్నారు. విడాకుల విషయంలో తప్పు ముమ్మాటికీ నిహారికదేనని ఏకపక్షంగా తీర్పు ఇచ్చేస్తున్నారు. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోటాపోటీగా కామెంట్లు పెడుతుండటంతో నిహారిక విడాకుల (#NiharikaDivorce) అంశం మరోమారు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
జనవరి 27 , 2024
Spirit Movie: ‘స్పిరిట్’ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్!
‘యానిమల్’ (Animal) చిత్రంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్ స్కిల్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో సందీప్ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ ‘యానిమల్’తో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా స్పిరిట్ నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారీ బడ్జెట్‌తో..
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది.
రెమ్యూనరేషన్లకే రూ.600 కోట్లు!
‘స్పిరిట్’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఎందుకంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. అదే విధంగా బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్ (Anil Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపుర్ (Kareena Kapoor) ఇందులో స్పెషల్ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మేకింగ్ కోసం రూ.300 కోట్లు, గ్రాఫిక్స్ కోసం రూ.120-150 కోట్లు, ప్రమోషన్స్‌కు మరో రూ.50-80 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
మమ్ముట్టీ స్పెషల్ రోల్!
‘స్పిరిట్’ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్, చైనీస్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’ సిరీస్‌లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
అక్టోబర్ 08 , 2024
Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
విష్వక్‌సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్స్ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్ అటెంషన్ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం.
అసలేంటి ఆ సింబల్?
గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉన్న సింబల్ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్ సేన్ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్ ట్రైల్స్‌కు, అఘోర శంకర్ (విష్వక్ సేన్)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్ విద్యాధర్.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.
భూత- భవిష్యత్- వర్తమాన కాలంలో కథ సాగుతుందా?
‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్ గతంలో ఆ హ్యూమన్ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.
దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం?
అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్ డైరెక్టర్ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.
గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు
ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 06 , 2024
Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్‌కు చెందిన స్టార్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్ డైలాగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్ మ్యాన్’ ‘టెంపర్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ (Liger) దారుణంగా ఫెయిల్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) పూరికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.
‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు.
https://twitter.com/i/status/1822878179679203353
కథ చెప్పాల్సింది కదా!
డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.
మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి!
‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. 'మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1822887370594877712
ఆగస్టు 12 , 2024
Kalki 2898 AD Story: సోషల్ మీడియాలో ‘కల్కి’ ఫుల్ స్టోరీ లీక్.. ఊహకందని ట్విస్టులతో మైండ్ బ్లాక్!
ప్రస్తుతం దేశంలో ‘కల్కి’ ఫీవర్ నడుస్తోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. గురువారం (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, ఇందులో ప్రభాస్ మహా విష్ణువు అవతారమైన ‘కల్కి’ పాత్రలో కనిపిస్తారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కల్కి ఫస్ట్ ట్రైలర్ చూశాక.. ప్రభాస్ ‘కల్కి’ కాదని తెలిసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ట్విస్ట్ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కల్కి పూర్తి స్టోరీ ఇదేనంటూ ఓ కథ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
స్త్రీలపై కలి ప్రయోగాలు!
'కల్కి 2898 ఏడీ' చిత్రంలో మెుత్తం మూడు ప్రపంచాలు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఇప్పటికే ఓ స్పెషల్ వీడియా ద్వారా తెలియజేశారు. ఇందులో ఒకటి ‘కాశీ’ కాగా, మిగిలినవి ‘శంబాల’, ‘కాంప్లెక్స్’. లేటెస్ట్ బజ్ ప్రకారం.. శంబాలాలో అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఉంటారు. కాంప్లెక్స్‌లో విలన్ అయిన కలి (కమల్ హాసన్) ఉంటారు. కాశీ, శంబాలాలో ఉండే ప్రజల జీవితాలు మారాలంటే కల్కి రావాల్సిందే. అయితే కల్కి సాధారణంగా పుట్టే వరకూ ఆగలేక కలి.. తన ల్యాబ్‌లో స్త్రీలపై ప్రయోగాలు చేస్తుంటాడట. కల్కి శక్తులను తన వశం చేసుకొవాలన్నది కల్కి ప్లాన్ అన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి ఓ మహిళ (దీపిక పదుకొణె) పారిపోయి శంబాలకు వస్తుంది. కల్కి ఆమెకే పుడతాడని గ్రహించిన అశ్వత్థామ.. ఆమెకు రక్షణ కల్పిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అశ్వత్థామ vs భైరవ
మరోవైపు కాశీలో ఉండే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అందుకు యూనిట్స్ అవసరమవుతాయి. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న మహిళను పట్టుకుంటే పెద్ద మెుత్తంలో యూనిట్స్ (నగదు) అందిస్తామని కాంప్లెక్స్ ప్రతినిధులు ఆఫర్ ఇస్తారు. దీంతో మహిళను అప్పగించి ఎలాగైన మిలియన్ యూనిట్స్‌తో కాంప్లెక్స్‌లో సెటిల్ అవ్వాలని భైరవ భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు రక్షణగా ఉన్న అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. భైరవ యుద్ధం చేసే క్రమంలో అతడి సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమై అతడు ఆశ్చర్యపోతాడని వైరల్ అవుతున్న స్టోరీని బట్టి తెలుస్తోంది.
కల్కిగా ప్రభాస్!
భైరవ, అశ్వత్థామ మధ్య బీకర పోరు జరుగుతున్న సమయంలోనే కల్కిని కడుపులో మోస్తున్న దీపికకు గాయమవుతుందని లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డకు సైతం ప్రమాదం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు అశ్వత్థామతో యుద్ధం చేసే క్రమంలోనే కలి చేస్తున్న అన్యాయాల గురించి భైరవకు తెలుస్తుందట. దీంతో అతడిలో మార్పు వస్తుందట. అలా అశ్వత్థామ.. కల్కి శక్తులను భైరవకు ట్రాన్స్‌ఫర్ చేస్తారని అంటున్నారు. ఈ ప్రక్రియతో తొలి భాగం ముగుస్తుందని సమాచారం. ఇక కల్కి సెకండ్ పార్ట్‌లో.. 'కలి vs కల్కి'గా కథ మారిపోతుందని సమాచారం. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. ఈ స్టోరీనే నిజమైతే బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లాజిక్ మిస్..!
కల్కి స్టోరీ ఇదేనంటూ వైరల్ అవుతున్న కథ.. కొంచెం కన్విన్సింగ్‌గానే ఉన్నప్పటికీ ఒకటి మాత్రం లాజిక్‌కు అందడం లేదు. దీపికా పదుకొణె గర్భంలో ఉన్న కల్కి పుట్టకముందే చనిపోతాడన్నది లాజిక్‌లెస్‌గా ఉంది. కల్కి అనేది శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. అలాంటి కల్కి పాత్రను కడుపులోనే చనిపోయినట్లు చూపించడం పురాణాలను తప్పుబట్టినట్లు అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పురాణాలతో డిఫర్ అయ్యేలా కల్కి కథను రాసుకునే ఛాన్స్ లేదని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. మరి కల్కి పాత్రలో కనిపించబోయేది ఎవరు? అన్నదానిపై స్పష్టత రావాలంటే జూన్ 27 వరకూ ఆగాల్సిందే.
జూన్ 24 , 2024
Mahesh Babu: ‘మహేష్‌ను చూసి నేర్చుకోండి’.. తమిళ ఆడియన్స్ ప్రశంసలు!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. ఈ స్టార్ హీరో మంచి మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా మహేష్ గురించి తెగ పొగిడేస్తున్నారు. మహేష్ చేసిన ఓ పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ లాంటి జీరో ఇగో హీరోను ఇప్పటివరకూ చూడలేదంటూ ఆకాశానికెత్తుతున్నారు. అసలు మహేష్ బాబు ఏం చేశారు? కోలీవుడ్ ఫ్యాన్స్ ఎందుకు ఆ స్థాయిలో మెచ్చుకుంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.
‘రాయన్’పై మహేష్ రివ్యూ..!
ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా 'రాయన్' టీమ్‌ను అభినందించాడు. ధనుష్ సహా ప్రధాన తారాగణం యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. అటు మహేష్ బాబు పోస్టుపై నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) స్పందించాడు. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
https://twitter.com/urstrulyMahesh/status/1817979697126588552
‘జీరో ఈగో’ అంటూ ప్రశంసలు
కోలీవుడ్ హీరో ధనుష్ నటన, డైరెక్షన్ స్కిల్స్‌ను మహేష్ బాబు మెచ్చుకోవడంపై తమిళ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా గురించి ఒక్కరు మాట్లడలేదని కామెంట్స్ చేస్తున్నారు. 'జీరో ఈగో'తో మహేష్ చేసిన ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మంచి మనసు ఏంటో ఈ పోస్టుతో తమకు అర్థమైందని తమిళ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అటు మహేష్ - ధనుష్ కాంబోలో ఓ సినిమా పడితే రికార్డ్స్ బద్దలేనని అభిప్రాయపడుతున్నారు. అటు తమిళ నటి అపర్ణ బాలమురళి కూడా మహేష్ పోస్టుకు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త సినిమాపై రివ్యూ ఇవ్వాల్సిందే!
మహేష్ ఓ సినిమాకు రివ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆయన తనకు నచ్చిన కొత్త సినిమాల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ'పై కూడా మహేష్ ఈ విధంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటనకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిక్ విజన్‌కు హ్యాట్యాఫ్ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అలాగే 'హరోం హర', 'భజేవాయు వేగం' , ‘ప్రేమలు’ తదితర చిత్రాలపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాను ప్రశంసించారంటే ఆ మూవీలో ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ రివ్యూ ఇచ్చాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో 'SSMB29' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు మహేష్ సైతం ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్‌తో ముఖాన గడ్డంతో హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను జర్మనీలో స్టార్ చేయనున్నట్లు సమాచారం. అటు ఈ మూవీకి 'ఆజానుబాహుడు', 'మహారాజ్', 'GOLD' టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్ ఉండొచ్చని అంటున్నారు.
జూలై 30 , 2024
Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024