UATelugu30-40 minutes
పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) ప్రెసిడెంట్. ఊర్లో ఆయన మాటే శాసనం. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. శివయ్య చేసిన కుట్రతో దర్శి మరదలిని పెళ్లి చేసుకుంటాడు. ఓ కేసులో జైలుకు కూడా వెళ్తాడు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై పుష్ప ఎలాంటి పోరాటం చేసింది? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్ ఎలా ఉందంటే?
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ ‘బహిష్కరణ’. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇంద...read more
How was the movie?
తారాగణం
అంజలి
పుష్పరవీంద్ర విజయ్
శివాయశ్రీతేజ్
దర్శిఅనన్య నాగళ్ల
లక్ష్మిషణ్ముఖ్సూరి
మహబూబ్ బాషాచిట్టి
చైతన్య సాగిరాజు
గోపిసిబ్బంది
ముఖేష్ ప్రజాపతిదర్శకుడు
ప్రశాంతి మలిశెట్టినిర్మాత
కథనాలు
Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, శ్రీతేజ్, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు
దర్శకత్వం : ముఖేష్ ప్రజాపతి
సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్. కుమార్
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటింగ్ : రవితేజ గిరిజల
నిర్మాత : ప్రశాంత్ మలిశెట్టి
ఓటీటీ వేదిక : జీ 5
విడుదల తేదీ : 19-07-2024
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్ స్టోరీ. ‘
ఎవరెలా చేశారంటే
వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్‌తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్ చూపించింది. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్‌గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ సెటిల్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తన డైలాగ్స్, లుక్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్ చేసి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను రూపొందించారు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అణిచివేయబడ్డారన్నది రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారు. డ్రామా, ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మలుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్టైన్ చేస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ప్రసన్న ఎస్. కుమార్ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ రెంజ్లో ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అంజలి నటనపిరియాడికల్ రివేంజ్ డ్రామానేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ట్విస్టులు లేకపోవడంకొన్ని బోరింగ్ సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 19 , 2024
Tollywood New Directors: టాలీవుడ్లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024
Latest OTT releases Telugu: ఈ వీకెండ్లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ.
ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ
మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy)
అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్ ఘోష్).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.
బూమర్ అంకుల్ (Boomer Uncle)
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్'. ఇందులో ఓవియా, రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'నేసమ్ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.
హాట్‌స్పాట్ (Hotspot)
గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
నాగేంద్రన్స్ హనీమూన్ (Nagendran's Honeymoons)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
బహిష్కరణ (Bahishkarana)
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.
https://twitter.com/i/status/1802226071795896339
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్ అకెంటెంట్ త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
జూలై 18 , 2024
#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ నుంచి ‘వేట్టయన్’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’
రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/thenaani29/status/1843888854568431666
https://twitter.com/Kadirodu/status/1843694483508211884
https://twitter.com/kannayyaX/status/1843899836732743696
https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639
ఆ సినిమాలు కూడా అంతే!
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు భాష వద్దా!
గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అక్టోబర్ 09 , 2024
Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్ పోస్టు!
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే?
‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‌లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
బాయ్‌కాట్ చేయాలని డిమాండ్
భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని ఓ నెటిజన్ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్ కానేకాదని మరో విధమైన క్రష్ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం 'అమరన్'ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు.
https://twitter.com/Bhav1212B/status/1850791387672801479
https://twitter.com/cinematicfreak0/status/1850791153928745098
https://twitter.com/devx_18k/status/1850791086458831193
https://twitter.com/Chhuparustam91/status/1850790246012653618
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/MissDD114/status/1850829733895737441
సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు
ఇదిలా ఉంటే అమరన్ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.
https://twitter.com/Sai_Pallavi92/status/1850571262755582363
కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
అక్టోబర్ 28 , 2024