UATelugu
మల్లికాజాన్ (మనీషా కొయిరాల).. హీరామండిలో వేశ్యగృహాన్నినడుపుతూ ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటుంది. అయితే ఆమెను దెబ్బకొట్టి ఆ ప్రాంతంపై పట్టు సాధించాలని ఫరీదన్ (సోనాక్షి సిన్హా) ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పోరులో ఎవరు విజయం సాధించారు? మల్లికాజాన్ కూతుర్లు అదితి రావ్ హైదరి, షార్మిన్ సేగల్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Tamil )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
మనీషా కొయిరాలా
సోనాక్షి సిన్హా
అదితి రావ్ హైదరీ
రిచా చద్దా
సంజీదా షేక్
షర్మిన్ సెగల్
ఫరీదా జలాల్
తహా షా బదుస్షా
ఫర్దీన్ ఖాన్
అధ్యాయన్ సుమన్
శేఖర్ సుమన్
జాసన్ షా
సిబ్బంది
సంజయ్ లీలా బన్సాలీ
దర్శకుడుమితాక్షర కుమార్
దర్శకుడుసంజయ్ లీలా బన్సాలీ
నిర్మాతమొయిన్ బేగ్రచయిత
సుదీప్ ఛటర్జీ
సినిమాటోగ్రాఫర్మహేష్ లిమాయే
సినిమాటోగ్రాఫర్కథనాలు
Sanjeeda Sheikh: ‘హీరామండి’ బ్యూటీ సంజీదా షేక్ గురించి ఈ విషయాలు తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ సంజీదా షేక్.. ‘హీరామండీ’ సిరీస్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
‘హీరామండి’లో వహీదా పాత్రలో కనిపించినా ఈ అమ్మడు.. నెగిటివ్ రోల్‌లో అలరించింది.
ముఖంపై గాటుతో ఆమె చేసిన పర్‌ఫార్మెన్స్ చూసి అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
సంజీదా షేక్.. 20 డిసెంబర్, 1984లో కువైట్‌లో జన్మించింది.
సినిమాల్లోకి రాకముందు పలు హిందీ సీరియళ్లలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ముఖ్యంగా 'క్యా హోగా నిమ్మో కా' అనే సీరియల్‌తో సంజీదాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది.
ఓ వైపు సీరియళ్లు, మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.
2003లో వచ్చిన 'భాగ్‌బన్'.. హిందీలో ఆమె చేసిన తొలి చిత్రం.
ఆ తర్వాత తమిళంలో పొన్నియన్ సెల్వన్ (2005), కన్నడలో 'శుభం' (2005) సినిమాలు చేసింది.
‘పంఖ్’, ‘అష్కే’, ‘నవాబ్‌జీదే’, ‘తైష్’, ‘కాలి ఖుషీ’, ‘మెయిన్ తే బాపు’ చిత్రాలతో అలరించింది.
ఈ ఏడాది హిందీలో వచ్చిన ‘ఫైటర్’ సినిమాలోనూ సంజీదా ఓ కీలక పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో 'కున్ ఫయా కున్' అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది.
సినిమా, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ సంజీదా కనిపించింది.
‘బస్ ఏక్ బార్’, ‘అజ్నాబీ’, ‘రుకా హూన్’, ‘సయాన్’, ‘చహా హై తుజుకో’ వంటి ఆల్బమ్స్ చేసింది.
సంజీదా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమెకు 2012లో వివాహం జరిగింది.
బాలీవుడ్ నటుడు అమీర్ అలీని పెళ్లి చేసుకుంది. సరోగసి విధానంలో బిడ్డను కూడా కన్నది.
అనివార్య కారణాల వల్ల భర్తతో సంజీదా 2020లో విడిపోయింది.
2021లో వీరికి విడాకులు మంజూరు కాగా, కూతురు ఐరా అలీ సంజీదా వద్దే ఉంటోంది.
కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడినట్లు సంజీదా ఓ ఇంటర్యూలో తెలిపింది.
ఆడిషన్స్ సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుమార్తె ఐరాతో ఈ అమ్మడు గడుపుతుంటుంది.
కుమార్తె ఐరాతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సంజీదా తరచూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.
View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)
ప్రస్తుతం సంజీదా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.8 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
మే 21 , 2024
Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సేగల్ తదితరులు
దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
సంగీతం : సంజయ్ లీలా భన్సాలీ, బెనెడిక్ట్ టేలర్, నరేన్ చందవర్కర్
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్ మహాపాత్రా, రగుల్ ధరుమాన్
ఎడిటర్ : సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ : నెట్ ఫ్లిక్స్
విడుదల తేదీ : 1 మే, 2024
గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్ 'హీరామండి ; ది డైమండ్ బజార్' (Heeramandi: The Diamond Bazaar). బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తోనే ఆయన తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్ (Sanjeeda Sheikh)లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సిరీస్ అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి?
ఈ సిరీస్ కథ బ్రిటీష్ పాలనలో 1930-1940ల మధ్య జరుగుతుంటుంది. పాకిస్తాన్ లాహోర్‌లోని హీరామండి ప్రాంతంలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరికొందరు కూడా మల్లికాజాన్ పీఠంపై కన్నేస్తారు. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
మల్లికాజాన్ పాత్రలో మనీషా కోయిరాలా అదరగొట్టింది. కెరీర్ బెస్ట్ నటనతో మెప్పించింది. పాత్రలోని గ్రేస్, ఆథారిటీ, కామాండింగ్‌ను తన హావాభావాలతో చూపిస్తూ ఆకట్టుకుంది. మల్లికా జాన్‌కు సవాలు విసిరే పాత్రలో సోనాక్షి సిన్హా మెరిసింది. జిబ్బోజాన్ పాత్రలో అదితిరావ్ హైదరి ఆకట్టుకుంది. హీరామండిలోని దుర్భర పరిస్థితులపై పోరాడే యువ వేశ్య పాత్రలో ఆమె మెప్పించింది. విధి నుంచి తప్పించుకోవాలనుకునే అమాయకమైన యువతి పాత్రలో షర్మిన్ సెగల్ కనిపించింది. తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ తదితరులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మరోమారు ఈ సిరీస్ ద్వారా తన మార్క్ ఏంటో చూపించాడు. సంఘర్షణ, డ్రామా చాలా స్ట్రాంగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ కథపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో వేశ్యల స్థితిగతులు, వారి మధ్య ఆదిపత్య పోరు ఎలా ఉండేదో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కథకు దేశ భక్తిని జోడించడం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వీక్షకులు బోర్‌గా ఫీలవుతారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. బెనెడిక్ట్ టేలర్, నరేన్ చందవర్కర్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాటోగ్రాఫర్ల పని తనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా చక్కటి పనితీరు కనబరిచింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారగణం నటనకథ, కథనంసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలుస్లో న్యారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
మే 01 , 2024
Pratibha Ranta: ‘లాపతా లేడీస్’ బ్యూటీ ప్రతిభా రత్న గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. దీంతో ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రత్న పేరు ఒక్కసారిగా వైరల్ అవుతోంది.
తొలి చిత్రంతోనే ఆస్కార్ బరిలో నిలిచేందుకు రెడీ అవ్వడంతో ఈమె గురించి తెలుసుకునేందుకు సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
తను నటించిన లాపతా లేడీస్ భారత్ తరపున ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రతిభా తెలిపింది.
View this post on Instagram A post shared by Pratibha Ranta (@pratibha_ranta)
‘లాపతా లేడీస్’ సెలక్ట్ కావాలని తాను ఎంతగానో కోరుకున్నానని, ఫైనల్‌గా తమ ఆశలు నిజమయ్యాయని ప్రతిభా పేర్కొంది.
ఇక 'లాపతా లేడీస్' చిత్రానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రతిభా రత్న వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్ 17, 2000లో హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో జన్మించింది.
స్కూల్లో చదువుకునే రోజుల్లోనే రంగస్థలంలో నటించింది. నటనపై ఆసక్తితో సోదరితో కలిసి సిమ్లా నుంచి ముంబయికి వచ్చేసింది.
అలా ముంబయిలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నటనలో కావాల్సిన అన్ని మెళుకువులను నేర్చుకుంది.
ఈ క్రమంలోనే నృత్యంలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పలు స్టేజీ షోలలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది.
'కురబాన్ హువా' సీరియల్ ద్వారా 2020లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. నాలుగేళ్ల పాటు టెలివిజన్‌లో అలరించింది.
'లాపతా లేడీస్' చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో జయా సింగ్/పుష్ప రాణిగా కనిపించి ఆకట్టుకుంది.
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌లోనూ ఈ అమ్మడు నటించింది. షమా అనే పాత్రలో కనిపించింది.
ఫిట్‌నెస్‌కు ప్రతిభ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఆసనాలు, స్టంట్‌లతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ప్రతిభా రత్న చురుగ్గా వ్యవహరిస్తోంది. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ప్రతిభా రత్న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె షేర్ చేసిన ప్రతీ ఫొటోను లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 26 , 2024