• TFIDB EN
  • పోచర్‌Web Series8 Episodes
    UATelugu
    కేరళ అడవుల్లో దంతాల కోసం 18 ఏనుగులను వేటగాళ్లు చంపేస్తారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌ మాలతో కలిసి నీల్‌ బెనర్జీ ఆధ్వర్యంలో ఓ టీమ్‌ వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. అడవిలో ఏనుగులను ఎవరు చంపుతున్నారు? దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది? ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తోంది ఎవరు? చివరికీ అతడ్ని ఎలా పట్టుకున్నారు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నిమిషా సజయన్
    మాల
    రోషన్ మాథ్యూ
    అలాన్
    దిబ్యేందు భట్టాచార్య
    నీల్
    కని కృతి
    రంజితా మీనన్
    పార్వతి టి.
    సిబ్బంది
    రిచీ మెహతాదర్శకుడు
    అలియా భట్
    నిర్మాత
    కథనాలు
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’పై అధికారిక అప్‌డేట్స్‌.. రెండు సాంగ్స్‌ రెడీ.. రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్‌!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’పై అధికారిక అప్‌డేట్స్‌.. రెండు సాంగ్స్‌ రెడీ.. రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్‌!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై చాలా గాసిప్స్‌ ఉన్నప్పటికీ అఫిషియల్‌గా ఏ ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్పిరిట్‌ నిర్మాత.. మూవీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.&nbsp; ‘2026 మిడిల్‌లో రిలీజ్‌’ సందీప్ రెడ్డి గత చిత్రం 'యానిమల్‌'ను నిర్మించిన బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ‘స్పిరిట్‌’ను సైతం ప్రొడ్యూస్‌ చేయనున్నారు. తాజాగా బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ తన అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌ 'స్పిరిట్‌' గురించి తొలిసారి స్పందించారు. ప్రభాస్‌ 'స్పిరిట్‌' చిత్రాన్ని డిసెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలోనే ముహోర్తం షాట్ ఉంటుందని చెప్పారు. 2026 మిడిల్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం స్టోరీ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే స్పిరిట్‌ సాంగ్స్‌ గురించి కూడా ఆయన వర్క్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాను రెండు సాంగ్స్‌ విన్నానని, అవి బాగున్నాయని వివరించారు. కాగా, యానిమల్‌కు సంగీతం అందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్పిరిట్‌కు సైతం మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఇటీవల హర్షవర్దన్‌ కంపోజ్‌ చేసిన సాంగ్‌ను సందీప్‌ రెడ్డి వింటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.&nbsp; https://twitter.com/Fukkard/status/1856301078016303591 View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar) రాజా సాబ్‌పై ప్రశంసలు.. ప్రభాస్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్‌' (The Raja Saab) సినిమాపై కూడా నిర్మాత భూషణ్‌ కుమార్‌ మాట్లాడారు. తాను రాజా సాబ్‌ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్‌ చూశానని, విజువల్స్‌ అద్భుతంగా వచ్చాయని ప్రశంసించారు. హాలీవుడ్‌ సినిమా 'హ్యారీ పోటర్‌'ను తలపించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని ఆకాశానికెత్తారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది రాజా సాబ్‌ చిత్రంలో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ప్రభాస్‌ ఓల్డ్‌ లుక్‌కు సంబంధించి ఇటీవల ఓ పోస్టర్‌ సైతం రిలీజైంది. ఇందులో ప్రభాస్‌ డెవిల్‌ అట్మాస్పియర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఏప్రిల్‌ 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.&nbsp; తొలుత పోలీసు.. తర్వాత! సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది. దాని ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్‌ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్‌’కు మించిన వైలెన్స్‌, ఫైట్‌ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్‌’లో చూస్తారని అంటున్నారు. దీంతో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.&nbsp; భారీ బడ్జెట్‌తో.. స్పిరిట్‌ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది. బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌.
    నవంబర్ 13 , 2024
    <strong>Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!</strong>
    Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!
    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్‌ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అదే రోజున విజయ్‌ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో పవన్‌ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్‌ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ఫస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం! పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)&nbsp; కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఆ చిత్రాల్లోనూ కదలిక! హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ పవన్‌ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్‌ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్‌ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్‌ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్‌ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్‌ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్‌ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;&nbsp; పవన్‌ vs విజయ్‌ దేవరకొండ! హరి హర వీరమల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్‌' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్‌ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.&nbsp;
    సెప్టెంబర్ 23 , 2024
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.&nbsp; పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు. కర్తవ్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది. ధర్మ యోగి హీరోయిన్‌ త్రిషను విలన్‌ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం. శివగామి బాహుబలిలో ప్రభాస్‌ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. అత్తారింటికీ దారేది పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్‌ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఓసేయ్ రాములమ్మ ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్‌ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; చంద్రముఖి చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
    మార్చి 07 , 2023
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    ]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
    మార్చి 07 , 2023
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!&nbsp;
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!&nbsp;
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి&nbsp; పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.&nbsp; 3. తమ్ముడు&nbsp; 1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.&nbsp; 4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో&nbsp; అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 9. వకీల్‌సాబ్‌&nbsp; వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి&nbsp; లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం.&nbsp;
    జూలై 31 , 2023
    Nayanthara: నయనతార టాప్‌-10 పవర్‌ ఫుల్‌ రోల్స్‌.. ఆమె నటనకు సెల్యూట్‌ చేయాల్సిందే!
    Nayanthara: నయనతార టాప్‌-10 పవర్‌ ఫుల్‌ రోల్స్‌.. ఆమె నటనకు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    సెప్టెంబర్ 08 , 2023
    బర్త్‌డే స్పెషల్: రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ పంచ్‌ డైలాగ్స్‌
    బర్త్‌డే స్పెషల్: రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ పంచ్‌ డైలాగ్స్‌
    ]Angry is the cause of all miseries one should know how to control it otherwise life will become miserable&nbsp;- నరసింహా
    ఫిబ్రవరి 13 , 2023
    WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
    WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
    తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.&nbsp; పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం. సీతారామం &nbsp;సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు. కర్తవ్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది. ధర్మ యోగి హీరోయిన్‌ త్రిషను విలన్‌ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం. శివగామి బాహుబలిలో ప్రభాస్‌ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. అత్తారింటికీ దారేది పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్‌ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఓసేయ్ రాములమ్మ ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్‌ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; చంద్రముఖి చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
    మార్చి 07 , 2024
    RAHUL SIPLIGUNJ: ధూల్‌పేట్‌ గల్లీ నుంచి ఆస్కార్ వేదికపై లైవ్ పర్‌ఫార్మెన్స్‌ దాకా..!
    RAHUL SIPLIGUNJ: ధూల్‌పేట్‌ గల్లీ నుంచి ఆస్కార్ వేదికపై లైవ్ పర్‌ఫార్మెన్స్‌ దాకా..!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 13 , 2023
    <strong>Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?</strong>
    Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?
    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్‌ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ స్టైలిష్‌, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్‌కమింగ్‌ హీరో మేకోవర్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య సినిమాతో ఎంట్రీ? నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న 'అఖండ' (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్‌ రోల్‌ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్‌ రాశారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్‌ షూట్‌ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.&nbsp; హనుమాన్‌ దర్శకుడితో! మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్‌’ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్‌ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్‌ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్‌ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్‌ వర్మకు మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఆ రిలేషన్‌తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. హ్యాండ్సమ్‌ లుక్‌లో.. నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లోకి మారిపోయాడు. హీరో కటౌట్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్‌తో మోక్షజ్ఞ మెస్మరైజ్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్‌ హీరో మెటీరియల్‌ అని తన న్యూ లుక్‌ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్‌ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్‌ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/AKKINENI_9999/status/1808086164647153776 29 ఏళ్లకు తెరంగేట్రం! తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్‌ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్‌గా మోక్షజ్ఞ లుక్‌ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
    జూలై 09 , 2024
    <strong>Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?</strong>
    Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
    నటులు: మహేష్‌ బాబు, సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు) దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ లక్ట్సాన్‌ ఎడిటింగ్‌: జోయ్‌ మెక్‌మిలన్‌ సంగీతం: డేవ్‌ మెట్జర్‌, నికోలక్‌ బ్రిటెల్‌, లిన్‌ మాన్యుల్‌ మిరాండ నిర్మాతలు: అడెలె రొమన్‌స్కీ, మార్క్‌ కారియాక్‌ నిర్మాణ సంస్థ: డిస్నీ విడుదల: డిసెంబర్‌ 20, 2024&nbsp; హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పాడు. అలాగే సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్‌ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్‌ డబ్బింగ్‌ ఆకట్టుకుందా? యానిమేషన్‌ వర్స్క్‌ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. ‌దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్‌ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.  డబ్బింగ్‌ ఎలా ఉందంటే ముఫాసా: ది లయన్‌ కింగ్‌ (Mufasa: The Lion King Review) లైవ్‌ యానిమేషన్‌ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్‌ డబ్బింగ్‌ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్‌లో మహేష్‌ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్‌తో మెస్మరైజ్‌ చేశాడు. సెటైర్లు, పంచ్‌లు, గంభీరమైన డైలాగ్స్‌తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ బాగా సెట్‌ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్‌లో మంచి వేరియేషన్స్‌ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్‌తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039 డైరెక్షన్ ఎలా ఉందంటే 2019లో వచ్చిన 'ది లయన్‌ కింగ్‌' చిత్రానికి ప్రీక్వెల్‌గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్‌ స్కార్‌ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్‌, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్‌లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అయితే రొటీన్‌ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్‌గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్‌ ఆడియన్స్‌ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్‌ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టాప్‌ నాచ్‌ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ మహేష్‌బాబు డబ్బింగ్‌గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    డిసెంబర్ 20 , 2024
    <strong>Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!</strong>
    Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!
    జూ.ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్‌ అడిగిన ప్రశ్నలకు తారక్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఫన్నీ చిట్‌చాట్‌.. యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీమ్‌ చిట్‌ చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో సందీప్‌ రెడ్డి వంగాతో పాటు తారక్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.&nbsp; https://twitter.com/i/status/1834829086482698288 'దేవర' ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు? దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మహేష్‌ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్‌ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 'దేవర'పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; హైదరాబాద్‌లో ఈవెంట్‌ ‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు&nbsp; సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్‌ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. సందీప్‌ మూవీలో తారక్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.&nbsp; థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్‌ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)? ఓజీ సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ డేట్ అప్‌డేట్‌ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్‌ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్‌ గ్రూప్స్‌ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్‌ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్‌ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్‌ గ్లింప్స్‌తోనే డైరెక్టర్‌ సుజీత్‌ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్‌ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.&nbsp; సుజీత్‌ ‘డీపీ’ వైరల్‌ ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్‌ కల్యాణ్‌) కాగా, మరొకరు డైరెక్టర్‌ సుజీత్‌. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్‌’ (Sujeeth) అని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వైరల్‌ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్‌ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ సరిపోతుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్‌.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.&nbsp; ఓజీపై శ్రియారెడ్డి హైప్‌ సలార్‌ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్‌ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్‌ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్‌ లైఫ్‌ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara&nbsp;Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్‌ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్‌ వస్తూనే ఉంది. దీంతో పవన్‌ - క్రిష్‌ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో&nbsp; శ్రీరామ నవమి (ఏప్రిల్‌ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్‌ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో! పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్‌ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్‌ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.&nbsp;&nbsp; ఆందోళనలకు చెక్‌! పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్‌ క్రిష్‌.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్‌ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
    ఏప్రిల్ 17 , 2024
    HBD Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నిధి అగర్వాల్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన టీమ్‌!
    HBD Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నిధి అగర్వాల్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన టీమ్‌!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్టు 17) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో స్టన్నింగ్‌ లుక్స్‌తో నిధి అదరగొట్టింది. మహారాణి గెటప్‌లో ఒంటిపై ఆభరణాలతో ఆమె మరింత అందంగా కనిపించింది. అసలే షూటింగ్ జరగట్లేదన్న ఆందోళనలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిధి పోస్టర్‌ సంతోషాన్ని కలిగిస్తోంది.&nbsp; https://twitter.com/FilmyNagri/status/1824752513574134185 ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాజాసాబ్‌' చిత్రంలోనూ నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌లో నిధి బర్త్‌ డే వేడుకలను నిర్వహించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/rajasaabmovie/status/1824688858853937198 నిధి హైదరాబాద్‌లోనే జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం బెంగళూరు. బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే జీసినిమా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది. నాగ చైతన్య హీరోగా చేసిన 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో చిత్ర పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.&nbsp; ఆ తర్వాత చైతూ సోదరుడు అక్కినేని అఖిల్‌ పక్కన ఈ అమ్మడికి అవకాశం దక్కింది. 'మిస్టర్‌ మజ్ను'లో వారిద్దరు కలిసి చేశారు. అది కూడా ఫెయిల్ అయింది.&nbsp; అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో నిధి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. దీనితో నిధికి టాలీవుడ్ లోనూ చుక్కెదురయింది.&nbsp; అవకాశాలు సన్నగిల్లాయి అనుకుంటున్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నిధికి అవకాశం దక్కింది. ఆ మూవీ హిట్‌ కావడంతో నిధికి వరుస ఆఫర్లు వచ్చాయి.&nbsp; పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో నిధి హీరోయిన్‌గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ ఈ సినిమాకు షెడ్యూల్స్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.&nbsp; ఓ వైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. 'ఈశ్వరన్‌', 'కలగ తలైవన్‌' చిత్రాలతో తమిళ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ నిధి చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp; గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నిధిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాను 29.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    <strong>Pawan Kalyan: హిందీ షోలో పవన్‌పై రూ.1.60 లక్షల ప్రశ్న.. నార్త్‌లోనూ క్రేజ్ మాముల్గా లేదుగా!&nbsp;</strong>
    Pawan Kalyan: హిందీ షోలో పవన్‌పై రూ.1.60 లక్షల ప్రశ్న.. నార్త్‌లోనూ క్రేజ్ మాముల్గా లేదుగా!&nbsp;
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) టాలీవుడ్‌తో పాటు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకొని సత్తా చాటారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌ సాధించారు. దీంతో పవన్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత హిందీ టెలివిజన్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ ప్రశ్న వేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రశ్న ఎంటంటే? ప్రస్తుతం కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్‌ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్‌ పోల్‌’ ఆప్షన్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని చెప్పారు. దీంతో వారు పవన్‌ పేరు చెప్పి లాక్‌ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్‌ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. https://twitter.com/i/status/1834848187862986820 పవన్‌ లైనప్‌ పవన్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు భారీ చిత్రాలు సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలను పవన్‌ ఫినిష్‌ చేయాల్సి ఉంది. ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్‌ నుంచి డైరెక్టర్‌ క్రిష్‌ ఇప్పటికే తప్పుకోవడంతో ఆ బాధ్యతలను జయకృష్ణ చేపట్టారు. హరీష్‌ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌’ సింగ్‌ రావాల్సి ఉంది. అలాగే యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌తో 'ఓజీ' చిత్రాన్ని పవన్‌ పట్టాలెక్కించారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన గ్లింప్స్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ ఇప్పటికీ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా 'ఓజీ' కోసం పవన్‌ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో తొలిసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ కనిపించబోతున్నాడు. రాజకీయాల్లో బిజీ బిజీ ఏపీ ఎన్నికలకు మూడు నెలల ముందే పవన్‌ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ చురుగ్గా షూటింగ్‌ జరుపుకున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఏపీ ఎన్నికల్లో పవన్‌ నేతృత్వంలోని జనసేన అద్భుత విజయాన్ని సాధించడం, అతడు కూటమిగా ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంతా చకచకా జరిగిపోయింది. అయితే తాను సినిమాల్లో నటిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. కానీ, తన తొలి ప్రాధాన్యత ప్రజాసేవకే అని, వీలైనప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు షూటింగ్‍లు చేసి పెండింగ్‍లో ఉన్న చిత్రాలు పూర్తి చేస్తానని పవన్ చెప్పారు. దీంతో వాయిదా పడ్డ సినిమాలు తిరిగి పట్టాలెక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.&nbsp; పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తిరిగి మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హరివీర మల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 20 రోజుల పాటు షూటింగ్‌లోనే ఉండనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!</strong>
    OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్‌ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థమన్ ఏమన్నారంటే? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; https://twitter.com/MusicThaman/status/1842245316252209456 పాన్‌ ఇండియా స్థాయిలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్‌ సైతం ఓజీ హైప్‌ క్రియేట్‌ చేసింది.&nbsp; https://twitter.com/tollymasti/status/1822184749072294337 అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్‌! సంగీత దర్శకుడు థమన్‌ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రానికి కూడా థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్‌ డేట్‌ను సైతం కన్ఫార్మ్‌ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్‌ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ మరింత ఇష్టుడిగా మారిపోయారు.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ ప్రస్తుతం పవన్‌ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?
    పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్‌ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్‌ కల్యాణ్‌ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్‌ ఇప్పుడు చూద్దాం.&nbsp; అకీరానందన్‌ 2004 ఏప్రిల్‌ 8న పవన్‌ - రేణు దేశాయ్‌ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్‌ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.&nbsp; అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్‌, రానా, వరుణ్‌ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్‌ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.&nbsp; అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.&nbsp; అకీరా నందన్‌ ఫేవరేట్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాదట. యంగ్‌ హీరో అడివి శేష్‌ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్‌ గతంలో వెల్లడించింది.&nbsp; ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్‌ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్‌ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు. అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్‌ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.&nbsp; ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్‌ కల్యాణే చూసుకుంటున్నారు.&nbsp; తన తల్లికి పవన్‌ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్‌ అకీరాలో రాకుండా రేణు దేశాయ్‌ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట. అకీరానందన్‌ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్‌ వాలా లవ్‌’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.&nbsp; ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్‌ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్‌, కిక్‌ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.&nbsp;
    అక్టోబర్ 21 , 2024

    @2021 KTree