• TFIDB EN
  • పులి మేకWeb Series8 Episodes
    UATelugu
    హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. వీరి హత్యల వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఆ నేరస్థున్ని పట్టుకునేందుకు IPS అధికారి కిరణ్ ప్రభ నియమించబడుతుంది. మరి ఆమె ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకుందా? హంతకుడు పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    లావణ్య త్రిపాఠి
    కిరణ్ ప్రభ IPS
    సుమన్
    కమీషనర్ అనురాగ్ నారాయణ్
    స్పందన పల్లిశ్వేత
    నోయెల్ సీన్
    రియాజ్
    ఆది సాయికుమార్
    డా.ప్రభాకర్ శర్మ
    గోపరాజు రమణదివాకర్ శర్మ
    రాజా చెంబోలుకరుణాకర్ శర్మ
    సిరి హనుమంతుపల్లవి
    శ్రీనివాస్పాండురంగారావు
    సిబ్బంది
    కె. చక్రవర్తి రెడ్డిదర్శకుడు
    శ్రావ్య కోననిర్మాత
    కోన వెంకట్
    నిర్మాత
    ప్రవీణ్ లక్కరాజుసంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ప్రేమ కావాలి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన  ఆది సాయి కుమార్.. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. లవ్లీ, బ్లాక్, పులిమేక వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. ఆది సాయికుమార్ ముద్దు పేరు? ఆది ఆది సాయికుమార్ ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు ఆది సాయి కుమార్ తొలి సినిమా? ప్రేమకావాలి ఆది సాయికుమార్ ఎక్కడ పుట్టాడు? ఆముదాలవలస, ఏపీ ఆది సాయికుమార్ పుట్టిన తేదీ ఎప్పుడు? డిసెంబర్ 29, 1989 ఆది సాయికుమార్ బార్య పేరు? అరుణ ఆది సాయికుమార్ పెళ్లి ఎప్పుడు జరిగింది? 2014 ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరోయిన్? కాజల్ అగర్వాల్ ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరో? సాయికుమార్, మెగాస్టార్ చిరంజీవి ఆది సాయికుమార్ తొలి హిట్ సినిమా? ప్రేమ కావాలి తొలి హిట్ అందించింది. ఆ తర్వాత లవ్లీ, బ్లాక్, పులి మేక వంటి చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఆది సాయికుమార్ ఇష్టమైన కలర్? వైట్ కలర్ ఆది సాయికుమార్ ఇష్టమైన సినిమా? పోలీస్ స్టోరీ, గ్యాంగ్ లీడర్ ఆది సాయికుమార్ తల్లి పేరు? సురేఖ ఆది సాయి కుమార్ ఏం చదివాడు? BSC  ఆది సాయికుమార్ అభిరుచులు? ఆది సాయికుమార్‌కు క్రికెట్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు అండర్19 రంజీ ట్రోఫికి సెలెక్ట్ అయ్యాడు.  ఆది సాయికుమార్‌కు నచ్చిన ప్రదేశం? అమెరికా ఆది సాయికుమార్ ఎన్ని సినిమాల్లో  నటించాడు?  2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు.  ఆది సాయికుమార్‌కు ఇష్టమైన ఆహారం? మంసాహారం ఏదైనా ఆది సాయికుమార్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?  దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఆది సాయికుమార్‌కు ఎంత మంది పిల్లలు? ఒక పాప, పేరు అయానా(Ayaana) https://www.youtube.com/watch?v=ex3TOcgOmqI
    మార్చి 21 , 2024
     Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
     Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
    ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్‌ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం. అక్కినేని అఖిల్‌: అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్‌(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్‌, హలో, మిస్టర్‌ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద  విఫలం  అయ్యాయి.  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హిట్ కొట్టిన అఖిల్..  ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానున్న ఏజెంట్‌ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్‌ ఆధారపడి ఉంది. అల్లు శిరీష్‌: చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్‌ కుమారుడు శిరీష్‌ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్‌ మరింత డల్ అయ్యింది.  అల్లరి నరేష్‌: దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్‌ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్‌’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్‌.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన నరేష్‌.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్. సుశాంత్‌: అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్‌ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో సుశాంత్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్‌ చిత్రాల్లో నటించారు.  ఆది పినిశెట్టి: దిగ్గజ డైరెక్టర్‌ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్‌ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌ చేస్తున్నాడు.  ఆది: నటుడు సాయికుమార్‌ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్‌ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్‌ ద్వారా ఆకట్టుకున్నాడు.  రాజా గౌతం: హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.  అరుణ్‌ దాసరి: టాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్‌ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్‌ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా  ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్‌ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్‌ హీరో కెరీర్‌ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 
    ఏప్రిల్ 03 , 2023
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను  కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన  తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.  మార్చి 29న తెలుగులోకి..! శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.  కలెక్షన్స్‌లో టాప్‌- 5 ఇవే 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్‌), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్‌) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.  ఈ సినిమా కథేంటి? 2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’  చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 19 , 2024
    <strong>Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!</strong>
    Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!
    "పుష్ప 2"&nbsp; సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ పుష్ప పార్ట్ 1లో "పుష్పరాజ్" పాత్రలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. "తగ్గేదే లే" అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, "పుష్ప 2"లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "పుష్ప-2" పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు. రష్మిక మందన్న క్రేజ్ మొదటి భాగంలో "శ్రీవల్లి" పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. "పుష్ప" సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్‌ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.&nbsp; ఫుల్ జోష్‌లో అభిమానులు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.&nbsp; నాన్‌ థియేట్రికల్‌ రికార్డు పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్. పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్ ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.&nbsp; ఓ&nbsp; సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు. "జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్." ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్‌ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.&nbsp; అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం." అనే డైలాగ్&nbsp; సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. . “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” &nbsp;అనే ఈ&nbsp; డైలాగ్&nbsp; అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
    అక్టోబర్ 26 , 2024
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్‌ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్‌ పెళ్లి చేసుకున్నాడు.&nbsp; 2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్‌ మోహన్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్‌ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ కంట్లో పడ్డ దేవ్‌ మోహన్‌ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.&nbsp; ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది? దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్‌ ఫిల్మ్‌ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా. ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్‌ గురించి మీకు అవగాహన ఉందా? దేవ్‌: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్‌ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్‌ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు. ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్‌ ? దేవ్‌: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్‌ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్‌ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.&nbsp; ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు? దేవ్‌: డైలాగ్స్‌ను డైరెక్టర్‌ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్‌ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు&nbsp; ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.&nbsp; పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..              https://youtu.be/TrcHf9vOscM అవార్డులు దాసోహం... అరంగేట్రం సినిమాలతోనే దేవ్‌ మోహన్‌ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్‌ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌లో బెస్ట్‌ డెబ్యూట్‌ మేల్‌ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.&nbsp; దేవ్‌ మోహన్‌, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్‌ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది. &nbsp; ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక.&nbsp; ఓ తెలుపు రంగు డ్రెస్‌లో దానిపై అదే కలర్ జాకెట్‌ వేసుకొని ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ పెట్టి సూపర్‌హాట్‌గా కనిపించింది. పులి చారలుండే బెల్ట్‌ను కూడా పెట్టింది సుందరి.&nbsp; ఏదో సరాదాగా యూట్యూబ్‌లో వీడియో తీసింది నిహారిక. చదువులో ఒత్తిడి నుంచి బయటపడేందుకు 2016లో పుట్టినరోజు వేడుకల్లో ఎలా ఉంటారని తీసి పోస్ట్ చేసింది.&nbsp; వరుసగా అలాంటి కంటెంట్‌ పెడుతూ ఫేమస్ అయ్యింది. తర్వాత ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ ప్రారంభం కావటంతో వాటిపై ఫోకస్‌ పెట్టింది.&nbsp; ఇన్‌స్టా చాలా హిట్‌ రీల్స్‌ చేసింది నిహారిక. వన్‌ వే స్ట్రీట్‌ అనే రీల్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; సామాజిక మాధ్యమాల్లో త్వరగా పేరు సంపాదించుకుంది ఈ యూట్యూబర్‌. కేవలం 2 నెలల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు 3.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కంటెంట్‌తోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్‌ లుక్స్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు.&nbsp; తెలుగు స్టార్స్‌తోనే ప్రమోషనల్‌ రీల్స్ చేసింది నిహారిక NM. సర్కారు వారి పాట , మేజర్‌ కోసం మహేశ్‌బాబు, లైగర్‌ విజయ్ దేవరకొండ, కేజీఎఫ్‌ 2 యశ్‌తో చేసిన రీల్స్‌ చాలా ఫేమస్.&nbsp; నిహారిక ఫ్యాషన్ ఫ్రీక్‌. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా డ్రెస్సింగ్‌ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.&nbsp; బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి లాస్‌ ఏంజెల్స్‌లో MBA చేసింది. కాస్త బ్రేక్‌ తీసుకోవటానికి వీడియోలు చేయడం ప్రారంభించింది.&nbsp; కామెడీలో నిహారిక టైమింగ్ వేరే లెవల్. హాలీవుడ్‌ నటులు జిమ్ క్యారీ, రోవన్‌ అట్కిన్సన్, బ్రహ్మనందం, వడివేలు, వెన్నెల కిషోర్ స్ఫూర్తి అని చెప్పింది.
    ఏప్రిల్ 27 , 2023
    <strong>Kanguva: రాజమౌళిని అనుసరించి దెబ్బతిన్న 'కంగువా'.. ఆ సినిమాలు కూడా ఇంతే!</strong>
    Kanguva: రాజమౌళిని అనుసరించి దెబ్బతిన్న 'కంగువా'.. ఆ సినిమాలు కూడా ఇంతే!
    దేశం గర్వంచతగ్గ డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి అగ్రస్థానంలో ఉంటాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఆయన తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకొని సినిమాలు తీయడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటివరకు జక్కన్న నుంచి వచ్చిన 12 చిత్రాలు దేనికదే ఎంతో ప్రత్యేకతను సాధించాయి. ఆడియన్స్‌ దృష్టిలో ఎవర్‌గ్రీన్‌ సినిమాలుగా నిలిచాయి. అయితే రాజమౌళి తరహాలో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రాజమౌళి చిత్రాలను పోలిన కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. రీసెంట్‌గా కంగువా సైతం రాజమౌళి చిత్రాల ప్యాట్రన్‌లోనే వచ్చి ఆడియన్స్‌ను నిరాశపరిచింది. అందుకు కారణాలు ఏంటి? కంగువా తరహాలో జక్కన్నను అనుసరించి దెబ్బతిన్న చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘బాహుబలి’తో పోల్చి తప్పు చేశారా? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ చిత్రం నవంబర్‌ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాజమౌళిని ఆహ్వానించడం, టాలీవుడ్‌కు బాహుబలి ఎలాగో కోలివుడ్‌కు 'కంగువా' అంటూ ప్రచారాలు హోరెత్తించడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కంగువా రిలీజ్ తర్వాత పరిస్థితులు తలకిందులైనట్లు తెలుస్తోంది. బాహుబలితో పోల్చే విధంగా సినిమాలో స్టఫ్‌ లేదని చూసినవారు చెబుతున్నారు. కథ చెప్పడంలో దర్శకుడు శివ పూర్తి తడబడ్డాడని అంటున్నారు. భావోద్వేగాలను రగిలించడంలో రాజమౌళి దిట్ట. కానీ కంగువాకు వచ్చే సరికి ఎమోషన్స్‌ ఏమాత్రం పండలేదని అంటున్నారు. సినిమాలోని పాత్రలతో ఆడియన్స్ ప్రయాణం చేయలేకపోయామని చెబుతున్నారు. ఒక్క సూర్య నటన కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు.&nbsp; ఆ చిత్రాలు కూడా అంతే! ‘కంగువా’ తరహాలో గతంలో పలు చిత్రాలు జక్కన్నను అనుసరించి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. జూ.ఎన్టీఆర్‌ - మేహర్ రమేష్‌ కాంబోలో వచ్చిన 'శక్తి' (2011) కూడా ‘మగధీర’ తరహాలో మెప్పించాలని వచ్చి బోల్తా పడింది. ‘మగధీర’ లాగే ‘శక్తి’ కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలీయా భట్‌ నటించిన 'బ్రహ్మాస్త్ర' భారీ బడ్టెట్‌తో వచ్చి మెప్పించలేకపోయింది. జక్కన్న తరహాలో మంచి విజువల్‌ వండర్‌గా ఈ మూవీ ఉంటుందని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. సాలిడ్‌ కంటెంట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే కోలివుడ్‌లో వచ్చిన 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రం కూడా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. తొలి భాగం బాగున్నా సెకండాఫ్‌ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. RRR తరహాలో బ్రిటిష్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షంషేరా’ సైతం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళంలో వచ్చిన ‘పులి’, మలయాళంలో వచ్చిన ‘మరక్కర్‌’ జక్కన్న మూవీ తరహాలో పెద్ద బజ్‌ క్రియేట్‌ చేసినప్పటికీ సక్సెస్‌ మాత్రం కాలేకపోయాయి.&nbsp; జక్కన్న సక్సెస్ మంత్ర ఇదే! రాజమౌళి సినిమా అనగానే చాలా మంది గొప్ప తారాగణం, భారీ బడ్జెట్‌, అద్భుతమైన గ్రాఫిక్స్‌, ఎవర్‌గ్రీన్‌ స్టోరీ అని అనుకుంటారు. అవన్నీ ఉండబట్టే రాజమౌళి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారని భావిస్తుంటారు. కానీ రాజమౌళి సక్సెస్‌ వాటిలో లేదు. అవి సక్సెస్‌కు దోహదం చేసే కీలక అంశాలు మాత్రమే. జక్కన్న సక్సెస్‌ ఫార్మూలా మరోటి ఉంది. అదే ఎమోషనల్‌ డ్రామా. చాలా సినిమాల్లో మిస్‌ అయ్యేది, జక్కన్న మాత్రమే క్యారీ చేసేది ఇదే. తన సినిమాల్లో ఎమోషన్స్‌కు రాజమౌళి పెద్ద పీట వేస్తారు. సినిమా సక్సెస్‌కు అది ఎంతో కీలకమని నమ్ముతారు. ప్రేక్షకుడు, తన సినిమాలోని పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ను రాజమౌళి క్రియేట్ చేస్తుంటారు. తద్వారా ఆడియన్స్‌ను తన మూవీ లీనం చేస్తారు. అందుకే జక్కన్న సినిమా చూసి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. తిరిగి మళ్లీ మళ్లీ చూసేలా ప్రోత్సహిస్తాయి. అసలు జక్కన్న ఏం తీశాడురా అన్న భావనను ఆడియన్స్‌లో కలుగుచేస్తాయి. అందుకే చాలా మంది దర్శకులు దీనిని అందిపుచ్చుకోలేక విఫలమవుతున్నారు.&nbsp; జక్కన్న బిజీ బిజీ.. RRR తర్వాత రాజమౌళి (S.S. Rajamouli), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)ల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా SSMB 29 ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండటంతో మంచి లోకేషన్స్‌ కోసం సౌతాఫ్రికాలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌‌ (Naomi Scott)ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసే వారణాసి సెట్‌లో ఫినిష్‌ చేసి ఆ తర్వాత సెకండ్‌ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.&nbsp;
    నవంబర్ 14 , 2024
    New Trend In Tollywood: లాఠీలు పడుతున్న స్టార్ హీరోయిన్స్.. దానికోసమేనా?
    New Trend In Tollywood: లాఠీలు పడుతున్న స్టార్ హీరోయిన్స్.. దానికోసమేనా?
    ]‘పులిమేక’ సిరీస్‌లో తొలిసారి పోలీసు అధికారిణిగా లావణ్య నటించింది. ఇందులో ఆమె నటనపై ప్రశంసలు వచ్చాయి.లావణ్య త్రిపాఠి
    జూలై 09 , 2024
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలు ఇవే !
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !
    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం. దంగల్ అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్‌ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది. బాహుబలి 2 తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్‌&nbsp; టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి.&nbsp; కేజీఎఫ్‌ 2 “అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్‌ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్‌ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్‌ మైన్స్‌ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం.&nbsp; RRR భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్‌ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది. పఠాన్‌ ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్‌ హిట్‌ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్‌. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది. భజరంగీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్‌. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్‌ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్‌ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.
    ఏప్రిల్ 28 , 2023
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.&nbsp; 2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.&nbsp; https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.&nbsp; 4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.&nbsp; 5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.&nbsp; 6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.&nbsp; 7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.&nbsp; 8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.&nbsp; 9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.&nbsp; 10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు.&nbsp;
    మే 09 , 2023
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్‌ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్‌ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్‌ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు. ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయని వాటిలో 90% ఫెయిలవుతున్నట్లు ఆర్జీవీ చెప్పాడు. చిత్ర నిర్మాతలు ఎంచుకున్న కథ, తారాగణం, సృజనాత్మక అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోని 90% నిర్మాతలకు ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియదని ఈ లెక్కలు రుజువు చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా తీయగల టాలెంట్ ఉన్న ఆడియన్స్‌కు మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కలిసి కట్టుగా నిర్మూలిద్దామంటూ వారికి పిలుపునిచ్చాడు. ఇండస్ట్రీలోని స్టార్ల వారసులని కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా కృషి చేద్దామని ఆర్జీవీ అన్నాడు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. అవి మీ సమయాన్ని, డబ్బుని వృథా చేస్తాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి వాటిని కూడా నిర్మూలించేందుకు చేతులు కలపాలని సినీ అభిమానులకు పిలుపునిచ్చాడు.&nbsp; చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఆర్జీవీ డెన్‌ ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ టిక్కెట్‌ కొనుగోలు చేసే ప్రేక్షకులు మాత్రమే సినిమాను నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. లీడ్‌ యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, లిరికిస్ట్స్‌, డైలాగ్‌ రైటర్స్‌ను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర టెక్నికల్‌ సిబ్బందిని పరిశ్రమలోని నిపుణుల నుండి ఎంపిక చేసిన దర్శకుడు సెలక్ట్‌ చేస్తారని స్పష్టం చేశాడు.&nbsp; అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందామని ఔత్సాహికులకు ఆర్జీవీ పిలుపునిచ్చాడు. వారందర్ని ఆర్జీవీ డెన్‌కి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. మరి మీలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.comకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్‌ని తెలుసుకోవాలని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సూచించారు.&nbsp; ఔత్సాహికులు ఏ విధంగా అప్లై చేయాలి? వచ్చిన ఆప్లికేషన్ల నుంచి నటీనటులను ఫైనల్‌ చేసే విధానాన్ని కూడా ఆర్జీవీ తన వెబ్‌సైట్‌లో వివరంగా పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.&nbsp; పేరు&nbsp;వయసుఎత్తు (అడుగులలో)చర్మ రంగుకంటి రంగుసింగిల్ బస్ట్ సైజ్‌ ఫొటోసింగిల్‌ ఫుల్‌ ఫిగర్ ఫొటో హీరో, హీరోయిన్ ఎంపిక ప్రక్రియ ఆసక్తిగల వారు 15 రోజుల్లో పై వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 30 మందిని ఆర్జీవీ డెన్‌ సిబ్బంది లుక్స్‌ను బట్టి షార్ట్ లిస్ట్‌ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన 30 మంది వివరాలను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వారిలో ఎవర్ని ఎంచుకోవాలో పబ్లిక్‌&nbsp; పోల్‌ నిర్వహిస్తారు. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్‌ 15 యువతీ, యువకులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని ఏదైన డైలాగ్‌ ఇచ్చి 30 సెకన్ల ఆడిషన్స్ వీడియో పంపాలని ఆర్జీవ్‌ డెన్‌ టీమ్‌ కోరుతుంది. మళ్లీ ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్టు చేసి మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ దఫా ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఏడుగురు యువతీ, యువకులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి నటనకు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్స్ పెట్టి వారిలో బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చిన వారిని తిరిగి పోల్‌లోకి తీసుకొస్తారు. అందులో టాప్‌లో నిలిచిన యువతీ యువకులను ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వారిని RGVDEN తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్‌గా అవకాశం ఇస్తారు. మిగతా విభాాగాలు.. ఇదే విధంగా డైరెక్టర్స్‌, రైటర్స్‌, మ్యూజిక్ కంపోజర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌, లిరికిస్ట్స్‌ వారి విభాగాలకు తగ్గట్లు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.&nbsp; https://rgvden.com/
    ఏప్రిల్ 06 , 2024
    Disha Patani: బోల్డ్‌&nbsp; వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!
    Disha Patani: బోల్డ్‌&nbsp; వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!
    హాట్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోమారు తన గ్లామర్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌ పాపులర్ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ బామ బోల్డ్‌ శారీ లుక్‌లో తళుక్కుమంది. ఎద, నడుము అందాలను చూపిస్తూ పలుచటి శారీలో రెచ్చిపోయింది. పార్టీకి వచ్చిన వారందర్నీ తన ఒంపుసొంపులతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ఇదిలా ఉంటే దిశా లేటెస్ట్ బాలీవుడ్‌ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్‌ 15, 2023న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్‌ డేట్‌ను రీషెడ్యూల్‌ చేయడంపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన #DishaPatani హ్యాష్‌టాగ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; ‘యోధ’ సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్‌ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. మరోవైపు దిశా పటాని పెట్టే బోల్డ్‌ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్‌ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతుంటారు.&nbsp; https://twitter.com/fitbabesbytes/status/1721358334786416642?s=20 లోఫర్‌ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; లోఫర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్‌ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.&nbsp; దిశా నటించిన ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2),&nbsp; బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.&nbsp; భాగీ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అయితే టైగర్, దిశా రిలేషన్‌ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్‌ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.&nbsp;
    నవంబర్ 07 , 2023
    Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!
    Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!
    హాట్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోసారి గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది. తన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షెర్ చేసి రచ్చ చేసింది.&nbsp;&nbsp; గ్రీన్ కలర్ చీరలో అందాలు ఆరబోస్తూ బోల్డ్ లుక్‌లో అదరగొట్టింది. సొగసైన ఎద, నడుము అందాలను హోయలొలికించింది. కైఫెక్కించే లుక్స్‌తో మత్తెక్కిస్తోంది. నాజుకైన నడుము ఒంపులను చూసి కుర్రకారు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దిశా పటానీ.. ఎద ఎత్తుల పచ్చి పరువాలను ఇంపుగా వడ్డిస్తూ కైఫెకిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే... పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. లోఫర్ సినిమాలో చూసిన ఈ పరువాల పసందును చూసిన తర్వాత.. బాలీవుడ్ స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఎవరు అనోకోని ఉండరు. సోషల్ మీడియాలో కుర్రకారు పల్స్ తెలిసిన దిశా పటానీ... హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పటికప్పుడూ రెచ్చగొడుతుంటుంది. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఈ ముద్దుగుమ్మకు 60 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.&nbsp; అంతేకాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడూ చాటింగ్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి దిశాకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెరిగి పోయింది. ఇక బాలీవుడ్‌లో దిశా పటానీ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే.. ఎం.ఎస్‌.ధోని.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ, భాగీ 2, భాగీ 3 'మలంగ్‌' వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. &nbsp;అయితే గతేడాది ఈమె యాక్ట్ చేసిన 'ఏక్ విలన్ .. రిటర్న్' చిత్రం మాత్రం ప్లాప్ అయింది. మరోవైపు దిశా పటానీ లేటెస్ట్ బాలీవుడ్‌ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్‌ 15, 2023న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; ఇప్పటికే మూడుసార్లు 'యోధ' విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్‌ డేట్‌ను రీషెడ్యూల్‌ చేయడంపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 'యోధ' సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్‌ కావాల్సి ఉంది. &nbsp;అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న 'కంగువాలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.&nbsp;
    నవంబర్ 12 , 2023
    <strong>RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్‌ తరహాలో రామ్‌చరణ్‌ మేకోవర్‌.. వీడియో వైరల్!&nbsp;</strong>
    RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్‌ తరహాలో రామ్‌చరణ్‌ మేకోవర్‌.. వీడియో వైరల్!&nbsp;
    రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తిచేశారు. త్వరలోనే ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కానున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రామ్‌చరణ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ 'RC16' పై ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు సంబంధించిన లేటెస్ట్ లుక్‌ వైరల్‌ అవుతోంది. అతడి మేకోవర్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; చరణ్‌ లుక్‌ వైరల్‌! ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీలో రామ్‌చరణ్‌ సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకోసం చరణ్‌ కూడా తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో చరణ్‌ ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్‌ కలర్‌ గ్లాసెస్‌తో లాంగ్‌ హెయిర్‌, థిక్‌ బియర్డ్‌తో చెర్రీ కనిపించాడు. గేమ్‌ ఛేంజర్‌ లుక్‌తో పోలిస్తే చరణ్‌ మరింత కండలు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకార కూడా ఉన్నారు. రామ్‌చరణ్‌ తాజా లుక్స్‌ చూస్తుంటే రీసెంట్‌గా మహేష్‌బాబు లుక్స్‌ గుర్తువస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/BhavanircG46421/status/1837374510724505847 మల్లయోధుడిగా చరణ్‌! ‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ఈ పిక్‌లో చరణ్‌ తన ముఖం కనిపించకుండా వెనుకవైపుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) 'తంగలాన్‌' కాస్ట్యూమ్‌ డిజైనర్‌ 'RC16'ను పిరియాడిక్‌ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించనున్నారు. ఈ చిత్రంలో సెట్స్‌, కాస్ట్యూమ్స్‌ కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే గత కొన్ని వారాలుగా హైదరాబాద్ శివారులో దర్శకుడు సెట్స్ వేయిస్తున్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్స్‌ కోసం తమిళ డిజైనర్‌ ఏగన్‌ ఏకాంబరంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. తంగలాన్‌ చిత్రానికి ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో విక్రమ్‌ సహా ముఖ్య పాత్రదారుల కాస్ట్యూమ్స్, ఔట్‌ ఫిట్‌ లుక్‌ కథకు అనుగుణంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన అయితేనే 'RC16' న్యాయం చేయగలరని దర్శకుడు బుచ్చిబాబు భావించినట్లు తెలుస్తోంది.&nbsp; సెట్స్‌పైకి రెండు చిత్రాలు! మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్‌ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీంతో సంవత్సరానికి రెండు చొప్పున చిత్రాలు పట్టాలెక్కించేందుకు చరణ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ కాకముందే డైరెక్టర్‌ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంతోషిస్తున్నారు.&nbsp; 'గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌పై తమన్‌ లీక్! రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్‌ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్‌ (Thaman) తాజా పోస్ట్‌ ఆ లోటు తీర్చినట్టైంది. ‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్‌, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి’ అని అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్‌ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/MusicThaman/status/1836412745593286741
    సెప్టెంబర్ 21 , 2024
    <strong>SSMB 29: మహేష్‌ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్‌ ఫొటోలు!</strong>
    SSMB 29: మహేష్‌ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్‌ ఫొటోలు!
    రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా అంటే అంచనాలు కచ్చితంగా పీక్స్‌లో ఉంటాయి. ఇక సినిమా కోసం మహేష్‌ అదిరిపోయేలా మేకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే.&nbsp; పలు డిఫరెంట్‌ సందర్భాల్లో అతడి లుక్‌ బయటకూ కూడా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా లాంగ్‌ హెయిర్‌, బీయర్డ్‌తో తన లుక్‌ను అమాంతం మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్‌ లుక్‌తో మహేష్ దర్శనమిచ్చాడు. ఇందుసు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలను షేక్‌ చేస్తున్నాయి.&nbsp; మతిపోగొడుతున్న మహేష్‌ లుక్‌! మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో రానున్న 'SSMB 29' (వర్కింగ్‌ టైటిల్‌) ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం తన జుట్టు, గడ్డం, బాడీ పెంచి మహేష్‌ రెడీ అవుతున్నాడు. దీంతో మహేష్‌ ఈ మధ్య ఎక్కడ కనపడినా అతడి లుక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు లుక్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో అతడు స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. క్రీమ్‌ కలర్‌ హుడీ వేసుకొని బ్లాక్‌ గాగుల్స్‌, రెడ్‌ క్యాప్‌ పెట్టుకొని లాంగ్‌ హెయిర్‌, రఫ్‌ గడ్డంతో మహేష్‌ కనిపించాడు. అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని మహేష్‌ దంపతులు కలవగా దానికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. అప్పటి లుక్‌తో పోలిస్తే ప్రస్తుత లుక్‌లో హెయిర్‌, గడ్డం ఇంకాస్త గుబురుగా పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. https://twitter.com/GulteOfficial/status/1843123055985635398 కొడుకు దగ్గరకేనా? సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుటుంబంతో కలిసి రెగ్యులర్‌గా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోమారు విదేశీ టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వైరల్‌ అవుతున్న మహేష్‌ ఎయిర్‌ పోర్టు వీడియోలో అతడితో పాటు భార్య నమ్రత, కూతురు సితారా ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్న కుమారుడు గౌతమ్‌ కోసం ఫ్యామిలీతో కలిసి మహేష్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడా దసరా హాలీడేస్‌ను మహేష్‌ ఎంజాయ్‌ చేస్తారని సమాచారం. కాగా, కుటుంబానికి మహేష్ ఇచ్చే ఇంపార్టెన్స్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘SSMB 29’ ప్రాజెక్ట్‌ మెుదలయ్యే లోపు ఉన్న సమయాన్ని అంతా మహేష్‌ తన కుటుంబానికే కేటాయిస్తుండటాన్ని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1843173118166356044 మహేష్‌ లుక్‌ అసలైంది కాదా? సూపర్ స్టార్‌ మహేష్‌ లేటెస్ట్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'SSMB29' కోసం మహేష్‌ లుక్‌ దాదాపుగా సిద్ధమైనట్లేనని కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌ బజ్‌ ప్రకారం మహేష్‌ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. ఇంకాస్త గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపిస్తారని టాక్. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్‌ అని జక్కన్నకు ఫిక్స్ అవుతారో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్‌ అని భ్రమపడిన మహేష్‌ ఫ్యాన్స్‌ నాలుక కరుచుకుంటున్నారు.&nbsp; అందుకే మహేష్‌కు స్వేచ్ఛ! తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్‌ బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్‌ జరుగుతున్న కాలం లుక్‌ రివీల్‌ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల సమయంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, తారక్‌ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్‌ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్‌ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్‌ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్‌ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్‌ బయటకి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.&nbsp; డిసెంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రస్తుతం 'SSMB 29' ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వర్క్‌ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో చిత్ర సభ్యులంతా వర్క్‌ షాప్‌లో పాల్గొంటారని టాక్‌. డిసెంబర్‌ నుంచి పక్కాగా రెగ్యులర్‌ షూటింగ్‌ మెుదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్‌ను విదేశాల్లో మెుదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. విదేశాల్లోని అడవుల్లో భారీ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను జక్కన్న ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లోబల్‌ సినిమాకు గ్రాఫిక్స్‌ వర్క్‌ కీలకం కావడంతో ముందుగా వాటికి సంబంధించిన సీన్స్‌ను ఫినిష్‌ చేయాలని రాజమౌళి నిర్ణయించారట. వాటిని పూర్తి చేసి వీఎఫ్‌ఎక్స్‌ విభాగానికి అప్పగిస్తే షూటింగ్‌తో పాటు వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా ప్యార్లర్‌గా జరుగుతాయని రాజమౌళి భావిస్తున్నట్లు తెలిసింది.
    అక్టోబర్ 07 , 2024
    <strong>Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?</strong>
    Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?
    జూ. ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్‌ చిత్రం 'దేవర' (Devara: Part 1). సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది. తొలుత మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు ప్రదర్శించింది. తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తయ్యాయి. దేవర 10 డేస్‌ కలెక్షన్స్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా ఆ ఫిగర్స్‌ చూసి అందరూ షాకవుతున్నారు. దేవరోడి ఊచకోత ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; [toc] రూ.500 కోట్లకు చేరువలో.. దేవరలో తారక్‌ జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించాడు. ఇక దేవర కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమాా 10 రోజుల్లో రూ.466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని వరల్డ్‌ వైడ్‌గా తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. బ్లాక్‌ బాస్టర్‌ కలెక్షన్స్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోందని పేర్కొన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.193.55 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కర్ణాటకలో రూ.16.40 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కేరళలో రూ.92 లక్షలు, హిందీతో పాటు రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రూ.29.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఇదే ఊపు కొనసాగితే ఈ వీకెండ్‌లోనే రూ.500 కోట్ల మార్క్‌ను దేవర అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ఫస్ట్‌డే, వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జంటగా నటించిన దేవర చిత్రం తొలి రోజు ఏకంగా రూ.రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.రూ.83.71 కోట్లు రాబట్టి 'RRR' తర్వాత ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇక తొలి వీకెండ్‌ పూర్తయ్యే సరికి దేవరోడు కలెక్షన్ల మార్క్‌ రూ.300 కోట్లు అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే ఆ తర్వాత నుంచి వసూళ్లు క్రమేణా తగ్గుతూ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం లాభాల్లోకి తీసుకొచ్చింది. గత వారం పెద్ద చిత్రాలు రిలీజ్ కాకపోవడంతో ‘దేవర’కు ఈ వీకెండ్‌ వరకూ వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. తేలికగానే రూ.500 కోట్ల మార్క్‌ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ఆదివారం నుంచి లాభాల్లోకి.. తెలుగు రాష్ట్రాల్లో దేవర శనివారం (సెప్టెంబర్‌ 5) సెకండ్ షోస్ ముగిసే నాటికి దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఆదివారం నుంచి వస్తున్న కలెక్షన్స్‌ అన్నీ లాభాలే. దసరా సెలవులు కూడా కలిసి రావడం మరే పెద్ద సినిమాలు లేకపోవడం దేవరకు బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అటు ఓవర్సీస్‌లోనూ దేవర కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. తెలుగుతో పాటు కేరళ, కర్ణాటక, హిందీ, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో చాలా చోట్ల దేవర లాభాల్లోకి వచ్చేసిందని ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దీంతో దేవర టీమ్‌తో పాటు తారక్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన తెలుగు చిత్రాలు అయితే టాలీవుడ్‌ నుంచి వచ్చిన పలు చిత్రాలు ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు సాధించాయి? ఓవరాల్‌ కలెక్షన్స్ ఎంత? ఆయా చిత్రాల డైరెక్టర్లు ఎవరు? ఏ స్టార్‌ హీరో అందులో నటించాడు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఓవరాల్‌గా రూ.1200 కోట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.&nbsp; యానిమల్‌ (Animal) బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆరు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 917.82 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవరాల్‌గా రూ.700 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp; RRR రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' పలు రికార్డులను కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.570 కోట్లను కొల్లగొట్టి ప్రశంసలు అందుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. బాహుబలి (Bahubali) ప్రభాస్‌ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌ సత్తా ఏంటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.600-650 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టి దేశంలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.&nbsp;
    అక్టోబర్ 07 , 2024
    <strong>Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్‌.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్‌!&nbsp;</strong>
    Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్‌.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్‌!&nbsp;
    అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. డిసెంబర్‌ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తవ్వగా రెండు పాటలు, ఓ సీన్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో అనౌన్స్‌ చేసిన టైమ్‌కు పుష్ప 2 వస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప మేకింగ్‌కు సంబంధించి ఊహించని ట్విస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ బాథ్యతలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; ‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్‌! ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్‌ నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్‌ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న&nbsp; దేవిశ్రీని పెట్టుకొని థమన్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ బాధ్యతలు అప్పగించడం చర్చలు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.&nbsp; సుకుమార్‌ అసంతృప్తి! సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి ర్యాపో ఉంది. సుకుమార్‌ ఇప్పటివరకూ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీనే సంగీతం సమకూర్చారు. అంతేకాదు ఆయా చిత్రాల ఆల్బమ్స్‌ సూపర్‌ డూపర్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2’ బాధ్యతలు సైతం దేవిశ్రీకి సుకుమార్‌ అందించారు. పుష్ప 2 పాటల విషయంలో సంతృప్తి చెందిన సుకుమార్‌ నేపథ్యం సంగీతం విషయంలో మాత్రం అసంతప్తిగా ఉన్నారట. సినిమా రిలీజ్‌కు 29 రోజుల సమయంలో మిగిలి ఉండటం, దేవిశ్రీకి ఇంకా చేతినిండా పని ఉండటంతో థమన్‌ చేత బీజీఎం ఇప్పించాలని సుకుమార్‌ నిర్ణయించారట. ఇందుకోసం థమన్‌తో చర్చలు సైతం జరిపినట్లు టాక్‌ వినిపిస్తోంది. థమన్‌ కూడా కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్స్‌ను సుకుమార్‌కు వినిపించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; థమన్‌కే ఎందుకు! సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌ (S.S. Thaman)కు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందిస్తాడని పేరుంది. ఇటీవల కాలంలో థమన్‌ పాటల కన్నా బీజీఎంతోనే ఎక్కువగా అల్లాడిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘వకీల్‌సాబ్‌’, ‘భగవంత్‌ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘బ్రో’ ‘స్కంద’ వంటి చిత్రాలకు థమన్‌ ఏ స్థాయి బీజీఎం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఉండగా థమన్‌నే ఏరికోరి సుకుమార్‌ బీజీఎం&nbsp; అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు థమన్‌ ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు. ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్‌ ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో థమన్‌కు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. కాబట్టి 'పుష్ప 2'కు థమన్‌ నేపథ్య సంగీతం అందించినా అది కచ్చితంగా అదిరిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. తెరపైకి మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌! థమన్‌తో పాటు మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘కాంతార’, ‘మంగళవారం’ లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్‌ (Ajaneesh Loknath)ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సమయం లేనందున థమన్‌కు తొలిభాగం, అజనీష్‌కు సెకండ్‌ పార్ట్ బాధ్యతలు అప్పగిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పనిచేయనున్నారు. అయితే థమన్‌ ఒక్కరే నేపథ్యం సంగీతం అందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్‌గా చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.&nbsp; ‘పుష్ప 2’ అరుదైన ఘనత పుష్ప (Pushpa 2) కి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్‌ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్‌లోనూ పుష్ప’ (2021) సక్సెస్‌ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్‌ టికెట్స్‌ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్‌ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్‌ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1854036371146695000
    నవంబర్ 07 , 2024
    <strong>Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!</strong>
    Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!
    ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni), డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందిన సెకండ్‌ ఫిల్మ్‌ 'డబుల్ ఇస్మార్ట్‌' (Double Ismart). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌' (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవల సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న డైరెక్టర్‌ పూరికి, రామ్‌లకు ఈ మూవీ సక్సెస్‌ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘లైగర్‌’ (Liger) సినిమా ఆర్థిక కష్టాలు రామ్‌ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి.&nbsp; అసలేం జరిగిందంటే? ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'లైగర్‌' (Liger) ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయడంపై డిస్టిబ్యూటర్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌మెంట్ చేసేవరకూ ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని వారు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌లో మీటింగ్‌ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అన్న ఆందోళన మూవీ టీమ్‌లో నెలకొంది.&nbsp; సాంగ్‌ పైనా వివాదం! ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా నుంచి రెండో లిరికల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. 'మార్ ముంత చోడ్ చింత' పేరుతో సెకండ్‌ సింగిల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన 'ఏం జేద్దామంటవ్ మరీ' పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌ డైలాగ్‌ను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ టీమ్‌ స్పందించాల్సి ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE పోటీగా మూడు చిత్రాలు డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 'పుష్ప 2' ఆ రోజున రిలీజ్‌ కావాల్సి ఉంది. షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ సినిమాను డిసెంబర్‌ 6కు పోస్టు పోన్‌ చేశారు. దీంతో ఆ డేట్‌ను పూరి జగన్నాథ్‌ తన సినిమా కోసం లాక్‌ చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. రవితేజ నటించిన 'మిస్టర్‌ బచ్చన్‌' (Mr Bachchan), కోలీవుడ్‌ స్టార్‌ విక్రమ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన 'తంగలాన్‌' (Thangalaan) చిత్రాలు ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతున్నాయి. వీటితో పాటు 'ఆయ్‌' అనే మరో మూవీ కూడా డబుల్‌ ఇస్మార్ట్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. దీంతో ఆ మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద తలపడాల్సిన పరిస్థితి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు ఏర్పడింది.&nbsp;
    జూలై 31 , 2024
    <strong>Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?</strong>
    Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్‌ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబోలోని ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్‌ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఓ వైపు ప్రమోషన్స్‌.. మరోవైపు డిప్రెషన్‌! ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) టీమ్‌ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్‌ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్‌ &amp; కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్‌ మీట్‌ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్‌ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్‌ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్‌ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.&nbsp; వెనక్కి తగ్గని బచ్చన్‌ టీమ్‌! పంద్రాగస్టు రోజున ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్‌ కాకుండా ఉండేందుకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్‌ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్‌ టీమ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్‌’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.&nbsp; వ్యూహామా లేదా గందరగోళమా? పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్‌ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్‌ (ట్రైలర్‌, టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్‌ చేయాలని ఇస్మార్ట్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు&nbsp; తెలుస్తోంది. గతంలో ‘లైగర్‌’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ ఇచ్చి చేతులు కాల్చుకున్న ‌నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్‌ టీమ్‌ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్‌ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్‌ షురూ కాలేదని చెబుతున్నారు.&nbsp; ఆ ఇష్యూ వల్లే రిలీజ్‌ చేస్తున్నాం: హరీశ్‌ శంకర్‌ రీసెంట్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ప్రమోష‌న్స్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ హ‌రీశ్ శంక‌ర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుద‌ల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్ట‌ర్ అడుగ‌గా హరీశ్‌ శంకర్‌ సమాధానం ఇచ్చారు. 'పూరితో నేను పోల్చుకోలేను. ఆయ‌న ఒక దిగ్గజం. ఆయ‌న‌తో నా సినిమా వ‌స్తుండ‌టం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావ‌డం వెనుక ముఖ్య కార‌ణం ఓటీటీ ఇష్యూ ఉండ‌డం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి స‌ర్‌కి ఎలాంటి గొడ‌వ‌లు లేవు’ అంటూ హరీశ్ శంక‌ర్ చెప్పుకొచ్చారు.
    ఆగస్టు 01 , 2024
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 3 మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఖుషి విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 1న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించారు.&nbsp; నా... నీ ప్రేమకథ ఆముద శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా... నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి కథానాయిక. శ్రవణ్‌కుమార్‌ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబరు 2న (శనివారం) థియేటర్‌లో విడుదల కానుంది. ‘ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌, ప్రచార చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు డీడీ రిట‌ర్న్స్ తమిళ కమెడియన్‌ సంతానం హీరోగా న‌టించిన డీడీ రిట‌ర్న్స్ (DD Returns) మూవీ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబ‌ర్ 1న‌ (శుక్రవారం) జీ5 (Zee 5) వేదికగా ఈ హార‌ర్ కామెడీ మూవీ రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 2016లొ వచ్చిన ‘దిల్లుకు దుడ్డు’ సినిమాకు సీక్వెల్‌గా ‘డీడీ రిట‌ర్న్స్‌’ రూపొందింది. ప్రేమ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా జూలై 28న థియేట‌ర్ల‌లో రిలీజైంది. రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన మూవీ రూ.40 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి పెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా చేసింది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateThe Wheel of Time; season 2SeriesEnglishAmazon PrimeSep 01Scam 2023SeriesHindi/TeluguSonyLIVSep 01DD ReturnsMovieTelugu/TamilZee 5Sep 01AloneReality ShowEnglishNetflixAug 30Choose LoveMovieHindiNetflixAug 31One PieceSeriesEnglishNetflixAug 31Friday Night PlanMovieHindiNetflixSep 01Happy EndingMovieEnglishNetflixSep 01
    ఆగస్టు 28 , 2023

    @2021 KTree