• TFIDB EN
  • వధువుWeb Series1 Episodes
    UATelugu
    ఓ వధువు పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తుంది. ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగు పెట్టిన ఆమెకు ఆ ఫ్యామిలీ గురించి షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. ఇంతకి ఏమిటా సీక్రెట్స్? తెలిసాక ఆమె ఏం చేసింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @Raju2022

    good movie

    avika gore acting superb

    7 months ago

    తారాగణం
    నల్లా శ్రీధర్ రెడ్డి గబ్బర్
    అవికా గోర్
    మౌనిక
    కంచన్ బమనే
    నందు విజయ్ కృష్ణ
    సురభి పద్మజ
    రూప లక్ష్మి
    సుభాశ్రీ రాయ్
    అమ్మ రమేష్
    శ్రీదేవి ఆరోజు
    సురభి దీప్తి
    అలీ రెజా
    సిబ్బంది
    శ్రీకాంత్ మోహతాదర్శకుడు
    పోలూరు కృష్ణనిర్మాత
    మహేంద్ర సోనినిర్మాత
    కథనాలు
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. న‌వంబ‌ర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘ‌నంగా జ‌రిగిన సంగతి తెలిసిందే.  పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్‌ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.  వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు. వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.  వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్‌-పవన్‌ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్‌ మార్‌ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  https://twitter.com/vamsikaka/status/1719756960852263315 కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి.  కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
    నవంబర్ 03 , 2023
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం. అవికా గోర్ పూర్తి పేరు? అవికా సమీర్ గోర్ అవికా గోర్ ఎందుకు ఫేమస్ అవికా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అవికా గోర్ వయస్సు ఎంత? 1997,  జూన్ 30న జన్మించింది అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా? ఉయ్యాల జంపాల(2013) అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా? కేర్‌ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009) అవికా గోర్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు  అవికా గోర్ ఎక్కడ పుట్టింది? ముంబై అవికా గోర్ అభిరుచులు? ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్ అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం? పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్ అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా? మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అవికా గోర్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అవికా గోర్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. అవికా గోర్ తల్లిదండ్రుల పేరు? సమీర్ గోర్, చేతన గోర్ అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/avikagor/?hl=en అవికా గోర్ పెట్  పేరు? షీరో https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
    ఏప్రిల్ 02 , 2024
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్‌ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్‌, కామెడీ, అడ్వెంచర్‌ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్‌ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్‌ సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  వివాహభోజనంబు ‘మాయాబజార్‌’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్‌ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.  https://www.youtube.com/watch?v=dZejdBmYC3k ‘సుందరి నీవంటి’ సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్‌ చేస్తారు. కానీ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్‌ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్‌ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్‌ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.  https://www.youtube.com/watch?v=ScasolQHzxs 'నిలువరా వాలు కనులవాడా' జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్‌ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్‌ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.  https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA 'చెప్పమ్మా.. చెప్పమ్మా..' ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్‌.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్‌ కనిపిస్తూ డిస్టర్బ్‌ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్‌ అవుతుందో ఈ సాంగ్‌ కళ్లకు కడుతుంది.  https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI 'బుగ్గే బంగారమా..' ‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక ‌అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు. https://www.youtube.com/watch?v=WABcMeOf0oM ‘అసలేం గుర్తుకు రాదు’ ‘అంతపురం’లోని ఈ సాంగ్‌.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.  https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss ‘ఇంకి పింకి పాంకీ’ సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్‌ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి. https://www.youtube.com/watch?v=FusD0RVkKAk ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మాస్‌ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్‌ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్‌ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.  https://www.youtube.com/watch?v=u_wB6byrl5k ‘ఐతే’ ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్‌ కళ్లకు కడుతుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.  https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4 ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్‌ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.  https://www.youtube.com/watch?v=2a34XyiZO14 ‘చెలియా చెలియా’ ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి  పక్కన ఉంటే  ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.  https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
    మార్చి 02 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే  పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.  ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.   మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్  ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 
    అక్టోబర్ 31 , 2023
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పాత్రలో గ్లామర్‌ డోస్‌ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్‌ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. భోళా శంకర్‌ (Bhola Shankar) చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్‌. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేస్తోంది. అయితే కీర్తి సురేష్‌ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్‌ చేశానని స్పష్టం చేసింది. రీమేక్‌ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తోంది.  2. లియో (Leo) తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడు ‌అంటే ఏ హీరోయిన్‌ ‌అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్‌ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.  3. ఛత్రపతి (Chatrapathi) యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్‌ వినిపించింది. గ్లామర్‌ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్‌ కానుంది.  4. వారసుడు (Varasudu) విజయ్‌ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్‌ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.  5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మహేష్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్‌ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.  6. డియర్ కామ్రేడ్ (Dear Comrade) విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్‌ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఆఫర్‌ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్‌ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్‌ ఉండటంతో నో చెప్పింది.  7. చెలియా (Cheliya) లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్‌ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్‌ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు. 
    మే 09 , 2023
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది. రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్‌ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట. యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.  అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది. అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.  ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
    జూలై 04 , 2023
    Deepika padukone Bday Special: డిప్రెషన్‌ నుంచి ప్రపంచ వేదికకు ప్రయాణం
    Deepika padukone Bday Special: డిప్రెషన్‌ నుంచి ప్రపంచ వేదికకు ప్రయాణం
    ]తెలుగులో మరికొందరి పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తే వదులుకోనంటుంది.తెలుగు హీరోలంటే ఇష్టం
    ఫిబ్రవరి 13 , 2023
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఛలో సినిమా విజయంతో లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం నాగ శౌర్య అసలు పేరు? నాగశౌర్య ముల్పూరి నాగ శౌర్య ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నాగ శౌర్య తొలి సినిమా? క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నాగశౌర్యకు వివాహం అయిందా? 2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.  నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు? ఐశ్వర్య రాయ్ నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా? టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు. నాగ శౌర్య ఇష్టమైన హీరో? తమిళ్ హీరో సూర్య నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్? నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. నాగశౌర్యకు ఇష్టమైన కలర్? నీలం రంగు నాగ శౌర్య పుట్టిన తేదీ? 1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు. నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు? శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ నాగ శౌర్య ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom) https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి? చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు? నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.  నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం? పెరుగు వడ నాగశౌర్య ముద్దుపేరు? నాని నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్? అనుష్క శెట్టి
    మార్చి 21 , 2024
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ తెలుగులో పెళ్లి చూపులు (2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో రీతు వర్మ నటించింది. కణం, మార్క్ ఆంటోని వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతు వర్మ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About ritu varma)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  రీతు వర్మ దేనికి ఫేమస్? రీతు వర్మ.. పెళ్లిచూపులు, వరుడు కావలెను, కణం చిత్రాల్లో లీడ్ రోల్  చేసి గుర్తింపు పొందింది. రీతు వర్మ వయస్సు ఎంత? 1990, మార్చి 10న జన్మించింది. ఆమె వయస్సు  33 సంవత్సరాలు  రీతు వర్మ ముద్దు పేరు? రీతు రీతు వర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు రీతు వర్మ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ రీతు వర్మకు వివాహం అయిందా? ఇంకా కాలేదు రీతు వర్మ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, సినిమాలు చూడటం రీతు వర్మకు ఇష్టమైన ఆహారం? ఇటాలియన్ వంటకాలు రీతు వర్మ ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రణ్‌బీర్ కపూర్ రీతు వర్మకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్, శ్రీదేవి రీతు వర్మ ఫెవరెట్ సినిమాలు? క్వీన్, హేట్ లవ్ స్టోరీస్ రీతు వర్మ సిగరెట్ తాగుతుందా? తెలియదు రీతు వర్మ మద్యం తాగుతుందా? తెలియదు   రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? పెళ్లి చూపులు రీతు వర్మ ఏం చదివింది? మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది రీతు వర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. రీతు వర్మ తల్లిదండ్రుల పేర్లు? దిలిప్ కుమార్ వర్మ, సంగీత వర్మ రీతు వర్మకు అఫైర్స్ ఉన్నాయా? తెలియదు రీతు వర్మ ఎన్ని అవార్డులు గెలిచింది? పెళ్లి చూపులు చిత్రానికిగాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది రీతు వర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rituvarma/ రీతు వర్మ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు https://www.youtube.com/watch?v=m3ldXnuR8Po
    ఏప్రిల్ 08 , 2024
    Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
    Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
     బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. శ్రీ బూర‌ వినయ్ కుమార్ – పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయితే వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో బ్రహ్మీ చిన్న కోడలు ఎవరా? అన్న ఆసక్తి  ఫ్యాన్స్‌లో మొదలైంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి నెట్టింట్లో శోధించడం మొదలు పెట్టారు. ఇంతకు ఆమె ఎవరంటే? బ్రహ్మానందం ఇంట్లోకి చిన్న కోడలుగా  పెట్టిన అమ్మాయి బ్యాగ్రౌండ్ చాలా బలంగానే ఉంది. కరీంనగర్‌లో ప్రముఖ వైద్యులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పద్మజా వినయ్‌ల గారాల పట్టినే బ్రహ్మీ చిన్న కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు ఐశ్వర్వ. డాక్టర్ చదివింది. తను కూడా గైనకాలజిస్ట్. వీరికి స్థిరచరాస్తులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య పేరుతో ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు టాక్.  కరీంనగర్‌తో పాటు తెలంగాణలోని పలుచోట్ల వీరికి ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిసింది. ఇక అమ్మాయి కూడా చక్కని రూపంతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని లావణ్యంతో మెరిసిపోయింది. అందుకే కొత్త కోడలికి ఎంగేజ్‌మెంట్ సమయంలో బ్రహ్మీ గారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వజ్రాలు పొదిగిన నక్సెస్‌ను పెళ్లికానుకగా బహూకరించారు. దీని విలువ రూ.30 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. బ్రహ్మానందం ఆస్తి గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్లలో ఆయనది తొలి స్థానం. రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తన స్తోమతకు తగినట్లుగా ఉంటారని బ్రహ్మానందం భావించడంతో డాక్టర్ సంబంధానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  వీరి పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరయ్యారు. ఇక బ్రహ్మానందం పెద్ద కొడుకు  రాజా గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. తండ్రి బాటలో సినిమా రంగంలో నడుద్దామని ప్రయత్నించాడు. పల్లకిలో పెళ్లికూతురు – చారుశీల, బాసంతి వంటి సినిమాలలో నటించాడు. అయితే ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయితే మళ్లీ ఓ వెబ్‌సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్థ గురించి బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. సిద్ధార్థ విదేశాల్లో చదివాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఇక్కడే స్థిరపడి వ్యాపారం చేయాలని సిద్ధార్థ్ భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర నుంచి తెలిసింది. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం తన ఇద్దరు కుమారులను మాత్రం సినీరంగంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు.
    ఆగస్టు 19 , 2023
    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్ 
    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్ 
    టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్‌ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.  వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ కుమారుడితో వివాహం జరగనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు.  మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది. అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం. మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.  ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.  ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.  అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్‌ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో  ప్రచారం జరుగుతోంది.  వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్‌ తేజ్‌ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది. 
    నవంబర్ 01 , 2023
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్‌ట్యాగ్‌తో రిసెప్షన్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్‌ కలర్‌ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. టాలీవుడ్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వరణ్‌-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు. యంగ్‌ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్‌ లుక్‌లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు యంగ్‌ హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్‌లో హల్‌చల్‌ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ దంపతులు సైతం రిసెప్షన్‌కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు దంపతులు కూడా రిసెప్షన్‌ ఈవెంట్‌లో సందడి చేశారు.  యువ హీరో అల్లు శిరీష్‌ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్‌ అండ్‌ బ్లాక్‌ కోటులో వరుణ్‌, లావణ్య జంటతో ఫొటో దిగారు.  టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్‌ నంది కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.  బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, చిన్న కుమారుడు రిసెషన్షన్‌కు వెళ్లారు. యంగ్‌ హీరో కార్తికేయ, నటుడు నవదీప్‌ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.  టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్‌ కిషన్‌ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సీనియర్‌ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు. 
    నవంబర్ 06 , 2023
    వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవి చైతన్య  'బేబి' (2023) చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. లవ్‌మీ, SVCC37 వంటి అప్‌కమింగ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలవైకుంటపురములో, రంగ్‌దే, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బేబి చిత్రం ద్వారా యువత హృదయాలు గెలుచుకున్న  వైష్ణవి చైతన్య గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Vaishnavi chaitanya)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  వైష్ణవి చైతన్య దేనికి ఫేమస్? వైష్ణవి చైతన్య 'బేబి' చిత్రం హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. ఈ సినిమాకంటే ముందు చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. వైష్ణవి చైతన్య వయస్సు ఎంత? 1994, జనవరి 30న జన్మించింది. ఆమె వయస్సు  30 సంవత్సరాలు  వైష్ణవి చైతన్య ముద్దు పేరు? వైషు వైష్ణవి చైతన్య ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  వైష్ణవి చైతన్య ఎక్కడ పుట్టింది? విజయవాడ వైష్ణవి చైతన్యకు వివాహం అయిందా? ఇంకా కాలేదు వైష్ణవి చైతన్య అభిరుచులు? యాక్టింగ్, సినిమాలు చూడటం వైష్ణవి చైతన్యకు ఇష్టమైన ఆహారం? బిర్యాని, ఐస్‌క్రీం వైష్ణవి చైతన్య ఫెవరెట్ హీరో?  పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వైష్ణవి చైతన్య ఇష్టమైన హీరోయిన్? కాజల్ అగర్వాల్ వైష్ణవి చైతన్య ఇష్టమైన కలర్  రెడ్ అండ్ పింక్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? బేబీ(2023) వైష్ణవి చైతన్య ఏం చదివింది? ఇంజనీరింగ్ వైష్ణవి చైతన్య పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. వైష్ణవి చైతన్య తమ్ముడి పేరు? నితిష్ చైతన్య వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? వైష్ణవి సినిమాల్లోకి రాకముందు అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌ అనే యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు లభించింది. టిక్‌టాక్ వీడియోల ద్వారా కూడా ఫేమస్ అయింది. వైష్ణవి చైతన్య ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/vaishnavi_chaitanya_/?hl=en https://www.youtube.com/watch?v=VVwPCWIGFVs
    ఏప్రిల్ 08 , 2024
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు 
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు 
    ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్‌ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.  అల్లు అర్జున్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.  పీవీ సింధు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.  రష్మిక మందన్న పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.  రణ్‌వీర్ సింగ్  18.17 కోట్ల డాలర్లతో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్‌వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.   విరాట్ కోహ్లీ  కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.  అక్షయ్ కుమార్  బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.  అలియా భట్ లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.  దీపిక పదుకొణె 8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది. ఎం.ఎస్.ధోనీ  రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.  అమితాబ్ బచ్చన్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.  సచిన్ తెందుల్కర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. హృతిక్ రోషన్ 7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.  షారూక్ ఖాన్ కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.  సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.  రణ్‌బీర్ కపూర్ సల్మాన్ ఖాన్‌తో సమానంగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్‌తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్‌బీర్.  రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్. ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.  అనుష్క శర్మ  సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.  కియారా అడ్వాణీ  ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.  కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్  కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్‌ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.  హార్దిక్ పాండ్యా భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.  సారా, వరుణ్.. సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.  నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
    మార్చి 22 , 2023
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్‌, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.  ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్‌, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.  గౌతమ్ మీనన్‌ ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్‌ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు. భారతీ రాజా శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా. తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్‌ వచ్చినా తరుణ్ భాస్కర్‌ వదులుకోవట్లేదు.  రిషబ్‌ శెట్టి కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్‌ బాయ్‌, స్పాట్ బాయ్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్‌ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియాను షేక్‌ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. 
    ఏప్రిల్ 27 , 2023
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు 
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు 
    ‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.  డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.  కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.  బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్‌ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.  ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.  ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.  హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.  డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.  ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ. 
    మే 01 , 2023
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
    ఫిబ్రవరి 13 , 2024
    Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
    Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
    వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్‌’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్‌ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.  దసరా (Dasara) హీరో నాని రీసెంట్‌ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్‌ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్‌.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.  ఆర్ఆర్ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్‌ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్‌ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్‌ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.  వర్షం (Varsham) ప్రభాస్‌ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్‌ (గోపీచంద్‌) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్‌ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.  వరుడు (Varudu) 2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్‌ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కడు (Okkadu) గుణశేఖర్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్‌ (ప్రకాష్‌రాజ్‌) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.  రావణన్‌ (Raavanan) విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్‌' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్‌ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి  అడవులు తెలిసిన కానిస్టేబుల్‌ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్‌ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.  సైనికుడు (Sainikudu) మహేష్‌ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్‌ మంచోడని భావించిన హీరోయిన్‌ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్‌ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్‌ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.  రోబో (Robo) రజనీకాంత్‌ (Rajinikanth), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్‌ వశీకర్‌ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్‌ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.  ఆదిపురుష్‌ (Adipurush) గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.  సీతారాముల కల్యాణం లంకలో  నితిన్‌ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్‌ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్‌ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. 
    ఫిబ్రవరి 19 , 2024

    @2021 KTree