UATelugu
అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
ఇన్ ( Telugu, Tamil )
Watch
రివ్యూస్
YouSay Review
Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) ‘మత్తు వదలరా‘, ‘సేనాపతి‘, ‘పంచతంత్రం‘ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటె...read more
How was the movie?
తారాగణం
నరేష్ అగస్త్య
రామకృష్ణమేఘా ఆకాష్
యువరాణి లక్ష్మిరాషా కిర్మాణి
షిజు మీనన్
తారక్ పొన్నప్ప
రఘు కుంచె
ముఖ్తార్ ఖాన్
షిజు
వజ్జ వెంకట గిరిధర్
అమిత్ తివారీ
అశోక్ కుమార్ కె.
సంతోష్ యాదవ్
రామారావు జాదవ్
నానిమళ్ల రవితేజ
Mukthar Khan
సిబ్బంది
ప్రదీప్ మద్దాలిదర్శకుడు
రామ్ తాళ్లూరి
నిర్మాతSaitej Desharajరచయిత
సాయితేజ్ దేశరాజ్రచయిత
Ajay Arasadaసంగీతకారుడు
అజయ్ అరసాడసంగీతకారుడు
Shoeb Siddiquiసినిమాటోగ్రాఫర్
షోబ్ సిద్ధిఖీసినిమాటోగ్రాఫర్
కథనాలు
Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్ తదితరులు
దర్శకుడు: ప్రదీప్ మద్దాలి
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడా
సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్దికీ
ఎడిటర్: సాయి బాబు తలారి
నిర్మాత : రజని తాళ్లూరి
ఓటీటీ వేదిక : జీ 5
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Vikkatakavi Web Series Review)
కథేంటి
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series Review) ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. మేఘా ఆకాష్ (Megha Akash) నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అతడి స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఏ దశలోనూ కథ నుంచి డివియేట్ కాకుండా మెప్పించాడు. కథలోని ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉండటం, ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కథకు సంబంధించి హింట్స్ ఇస్తూనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. ట్విస్టులు కాస్త ఊహించే విధంగానే ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించే అవకాశమున్నప్పటికీ దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎలివేషన్స్ షాట్స్ కూడా బెటర్‌గా తీసి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. ఊహాజనితంగా సాగడం కూడా ఇంకో మైసన్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
ఈ సిరీస్‌కు టెక్నికల్ విభాగాలు (Vikatakavi Web Series Review) అన్నీ మంచి పనితీరు కనబరిచాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి సెటప్, డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా తీర్చిదిద్దింది. సినిమాటోగ్రాఫీ కూడా వెనకటి కాలానికి తీసుకెళ్లేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంనరేష్ అగస్త్య నటనట్విస్టులు
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా ఉండటంకొన్ని సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 28 , 2024
This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
కాలింగ్ సహస్ర
సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. సుడిగాలి సుధీర్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా నటించింది.
హాయ్ నాన్న
నానీ లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్ థాకూర్ నటించింది.
కంజూరింగ్ కన్నప్పన్
గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్ కన్నప్పన్' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు.
#90s
హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
జనవరి 05 , 2024
Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 - డిసెంబర్ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
యానిమల్
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్ రెడ్డి’ తీసిన సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉండటంతో ‘యానిమల్’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.
అథర్వ
కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాలింగ్ సహస్ర
జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీ రూపొందింది.
ఉపేంద్ర గాడి అడ్డా
ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్రమ్ రాథోడ్
విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
దూత
యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
డిసెంబర్ 11 , 2023
Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!
యానిమల్ (Animal Movie) బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ప్రస్తుతం వెకేషన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బికినీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్న ఈ అమ్మడు.. అక్కడి అందమైన తీర ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తాజాగా బికినిలో ఫొటో షూట్ నిర్వహించి ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చింది.
ఎద, థైస్ అందాలతో త్రిప్తి దిమ్రి హోయలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆఫ్ స్క్రీన్‌లో ఈ స్థాయిలో అందాల జాతర చేయడం ఇదే తొలిసారని కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ గర్వాల్‌లో 23 ఫిబ్రవరి, 1994లో జన్మించిన త్రిప్తి.. 2017లో వచ్చిన ‘పోస్టర్ బాయ్స్’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.
ఇందులో రియా పాత్రలో అదరగొట్టినప్పటికీ త్రిప్తికి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్‌బుల్' 'ఖాలా' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ (2023) చిత్రం.. త్రిప్తి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
ఇందులో ‘జోయా’ పాత్రలో కనిపించిన త్రిప్తి.. తన అంద చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా రణ్‌బీర్‌తో ఆమె చేసిన బెడ్‌రూమ్ సన్నివేశాలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి.
‘యానిమల్’లో త్రిప్తి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆమె తన గ్లామర్‌తో రాత్రి రాత్రికే స్టార్ నటిగా మారిపోయింది.
యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే సందడి చేసింది. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్తి దిమ్రికి.. యానిమల్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడిని వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో త్రిప్తి దిమ్రి నటిస్తోంది.
‘బ్యాడ్ న్యూస్’, ‘విక్కి విద్య కా వోహ్ వాలా వీడియో’, ‘భూల్ భులయ్యా 3’, ‘ధడక్ 2’ చిత్రాల్లో ప్రస్తుతం త్రిప్తి దిమ్రి నటిస్తోంది.
ఇక పుష్ప 2 చిత్రంలోనూ త్రిప్తి దిమ్రి ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయమై చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది.
జూన్ 19 , 2024
కావ్య తాపర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
కావ్య తాపర్..ఈ మాయ పేరేమిటో(2018) అనే తెలుగు చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఏక్ మినీ కథ, బిచ్చగాడు2 మూవీల్లో నటించి గుర్తింపు పొందింది. రీసెంట్‌గా మస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ చిత్రంలోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈక్రమంలో కావ్య తాపర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts about Kavya Thapar) ఇప్పుడు చూద్దాం.
కావ్య తాపర్ చలన చిత్ర నటి. తెలుగుతో పాటు తమిళంలో ప్రధానంగా నటిస్తోంది. తాపర్.. తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్‌లో నటింటింది. ఈ ముద్దుగుమ్మ మొదట 2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఏక్ మినీ కథ, బిచ్చగాడు2 మూవీలో నటించింది. రీసెంట్‌గా మస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ చిత్రంలోనూ తళుక్కుమంది.
కావ్య తాపర్ ఎప్పుడు పుట్టింది?
1995, ఆగస్టు 20న జన్మించింది
కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?
ఈ మాయ పేరేమిటో(2018) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది.
కావ్య తాపర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
కావ్య తాపర్ ఎక్కడ పుట్టింది?
ముంబై
కావ్య తాపర్ అభిరుచులు?
ట్రావెలింగ్, డ్యాన్సింగ్
కావ్య తాపర్‌కు ఇష్టమైన ఆహారం?
నాన్‌వెజ్
కావ్య తాపర్‌కు ఇష్టమైన కలర్?
బ్లాక్
కావ్య తాపర్‌కు ఇష్టమైన హీరో?
రామ్‌చరణ్
కావ్య తాపర్ తల్లిదండ్రుల పేరు?
విక్కి తాపర్, ఆర్తి తాపర్
కావ్య తాపర్ ఏం చదివింది?
డిగ్రీ
కావ్య తాపర్ పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
కావ్య తాపర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
కావ్య తాపర్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా?
2022 ఫిబ్రవరి 18న మద్యం తాగి ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టిన కేసులో ఆమె అరెస్ట్ అయింది.
కావ్య తాపర్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/kavyathapar20/reels/
https://www.youtube.com/watch?v=s9UC0z_bV28
అక్టోబర్ 22 , 2024