Abdullapurmet Murder: నేరం చేసేలా సినిమాలు ప్రోత్సహిస్తున్నాయా.. ఎందుకు ఇలా జరుగుతోంది?
YouSay Short News App
సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేర ప్రవృతిని పెంచుతున్నాయా? యూట్యూబ్ వీడియోలు నేరం ఎలా చేయాలో నేర్పిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి బీటెక్ విద్యార్థి హత్య ఘటనే సాక్ష్యం.
ప్రియురాలి కోసం స్నేహితుడినే బీటెక్ విద్యార్థి హత్య చేయడం షాక్‌కి గురి చేసింది. నల్గొండలో బీటెక్ చదువుతున్న నవీన్, హరిహర కృష్ణ ఒకే అమ్మాయిని ప్రేమించడం హత్యకు దారితీసింది.
ప్రియురాలి కోసం..
తను ప్రేమించిన అమ్మాయి నవీన్‌తో సాన్నిహిత్యంగా మెలగడంతో హరి క్రమంగా పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నవీన్ హత్యకు పక్కా ప్లాన్ చేశాడు.
చూసి ఓర్వలేకే..
ఫిబ్రవరి 17న నవీన్‌ని పార్టీ పేరుతో హరి అబ్దుల్లాపూర్‌మెట్‌కి రప్పించాడు. ఈ క్రమంలో నవీన్‌ని అతి కిరాతకంగా హత్య చేసి గుట్టల్లో పడేశాడు.
కిరాతకం..
హరిహరికృష్ణ మర్డర్ చేయడంలో అతి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. క్రైం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు చూసే ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీటిని చూశాకే నేరం?
సైకో త్రిల్లర్, క్రైం జానర్‌లో వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు భారీ విజయాలు అందుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంలలో అడల్ట్, క్రైం రిలేటెడ్ కంటెంట్‌కి వ్యూయర్‌షిప్ అధికంగా ఉంటోంది.
వీటికే అధిక వ్యూయర్‌షిప్
వ్యక్తి చనిపోయాక కూడా వారి శరీర భాగాలను కత్తిరించడం అతి కిరాతకం. నవీన్‌ని హత్య చేశాక హరిహరి కృష్ణ దారుణంగా ప్రవర్తించాడు. నవీన్ పెదవులు, చేతులు, మర్మాంగం కోసేశాడు. అనంతరం గుండెని బయటికి తీశాడు.
బాడీ పార్ట్‌లు కత్తిరించడం..
ఈ అవయవాల ఫొటోలను తీసి ప్రియురాలికి పంపించాడు. ఈ పెదాలే కదా నిన్ను ముద్దు పెట్టుకుంది, ఈ చేతులే కదా నిన్ను తాకింది,
ఈ గుండెనే కదా నువ్వు ప్రేమించింది.. అంటూ పైశాచిక ఆనందాన్ని పొందాడు.
ఇవేనా అంటూ..
తనకు దక్కనిది ఇంకొకరికి దక్కకూడదనే ధోరణి ఇలాంటి ఘటనలకు పాల్పడేలా ప్రోద్బలిస్తోంది. యాసిడ్ దాడి ఘటనలు ఇందుకు ఉదాహరణ. కానీ, ఇప్పుడు నేరం తీవ్రత పెచ్చుమీరింది.
పెరిగిన నేర తీవ్రత..
‘ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయొచ్చు.. ఎంతకైనా తెగించవచ్చు’ అని సినిమాల్లో చెప్పిన మాటని వక్రీకరించుకుని ఇలా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ సినిమాలను నిందించడం సరైంది కాదు. కానీ, క్రిమినల్ మైండ్‌సెట్‌ని మరింత బలోపేతం చేసేలా కొన్ని సీన్లు, డైలాగులు ఉంటున్నాయి.
స్ఫూర్తిగా సినిమా డైలాగులు
వాస్తవానికి నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకునే చాలా సినిమాలు తెరకెక్కుతాయి. కొన్ని కల్పిత గాథలు ఉంటాయి. కానీ, అవి ఎక్కడో ఒక చోట జరుగుతాయి. సినిమా పరిధి ఎక్కువ కాబట్టి అలాంటి మైండ్‌సెట్ ఉన్నవారు త్వరగా స్ఫూర్తి పొందుతున్నారు.
నేరం అనంతర పరిణామాల గురించి సరైన అవగాహన కల్పించకపోవడమూ ఒకింత సమస్యగా మారుతోంది. ‘మనల్ని ఎవరేం చేస్తారులే’ అన్న ధోరణి పెరిగిపోయి నేరస్థులుగా మారేలా చేస్తోంది.
ఇదే సమస్య..
సినిమాల్లో నేరం చేసే తీరును చూపించినంత తీవ్రంగా, అనంతర పరిణామాలపై చూపించకపోవడమూ చేటు చేస్తోంది. పైగా, నేరం చేసేందుకు, చేసిన తర్వాత వ్యవస్థలో ఉన్న వెసులుబాట్లను చక్కగా ఉపయోగించుంటున్నారు.
చిన్న చిన్న తప్పులే పెద్ద ఘోరానికి దారితీస్తాయి. కాబట్టి, తప్పు చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి తల్లిదండ్రులు, పోషకులు పిల్లలకు వివరించాలి. అవసరమైతే ఒకట్రెండు సార్లు మందలించాలి. లేదంటే తప్పు చేయడం తప్పు కాదేమోనన్న భావన ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
తప్పును చెప్పాలి..
ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన నేరాలకు ఆజ్యం పోసింది సినిమాలే. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూసే స్ఫూర్తి పొందినట్లు దోషులు విచారణలో వెల్లడించారు. మరి, ఆ సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఈ వెబ్‌స్టోరీ ద్వారా తెలుసుకోండి.