• TFIDB TE
  • Sonakshi Varma
    Sonakshi Varma is known for Insecure, Insecure (2022) and Kalasa: The Symbol of Abundance (2023).
    <strong>హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? వరంగల్‌కు చెందిన ఆనంది(Anandi).. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ తెలుగింటి అందం మెయిన్‌ హీరోయిన్‌గా చేసింది. మరి ఆనంది గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆనంది అసలు పేరు? రక్షిత ఆనంది ముద్దు పేరు? హసిక ఆనంది ఎప్పుడు పుట్టింది? 1993, జులై&nbsp; 30న జన్మించింది ఆనంది ఎక్కడ పుట్టింది? ఆనంది వరంగల్‌లో జన్మించింది. ఆనంది నటించిన తొలి సినిమా? ఈరోజుల్లో(2012)&nbsp; ఆనంది తమిళ్‌లో నటించిన తొలి సినిమా పోఱియాళన్ ఆనంది ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; ఆనంది అభిరుచులు? డ్యాన్సింగ్ ఆనందికి&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ ఆనందికి ఇష్టమైన కలర్?&nbsp; &nbsp;బ్లాక్ ఆనందికి ఇష్టమైన హీరో? మహేష్ బాబు ఆనంది&nbsp; ఏం చదివింది? డిగ్రీ ఆనంది పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 50లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఆనంది సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది ఆనంది వివాహం ఎప్పుడు జరిగింది? 2021 జనవరి 7న తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆనంది పెళ్లి జరిగింది. https://www.youtube.com/watch?v=LzEupj3YxAc ఆనంది&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kayal_anandhi/
    October 22 , 2024
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు!  సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్‌ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్ర. అల్లుఅర్జున్‌ ఇల్లు ఎక్కడ? గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను. ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు? గూ: 8th ఏప్రిల్‌ 1983 ప్ర. అల్లుఅర్జున్ ఫోన్‌ నెంబర్‌? గూ: ... 98480 ..... అర్థమైందా? ప్ర: అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ కజిన్స్‌ అవుతారా? గూ: అవును.. అల్లు అర్జున్‌ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్‌. కాబట్టి అల్లుఅర్జున్‌ రామ్‌చరణ్‌ కజిన్స్ అవుతారు.&nbsp; ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు? గూ. అల్లుఅర్జున్‌ కేరళలో చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు. ప్ర: అల్లుఅర్జున్‌ బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు తీయట్లేదు? గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్‌ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు. ప్ర: నార్త్‌ ఇండియాలో అల్లుఅర్జున్‌ ఎందుకు ఫేమస్‌? గూ: నార్త్‌ ప్రజలు అతని డ్యాన్స్‌, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్‌ నెంబర్‌? గూ. 666 ప్ర: అల్లుఅర్జున్‌ హిందీలో మాట్లాడగలడా? గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.  ఇటీవల ‘4 ఇడియట్స్‌ రియాక్ట్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.&nbsp; ప్ర: మీరు బ్రాహ్మణులా? బన్నీ: నో (నవ్వుతూ) ప్ర: మీరు చిరంజీవికి బంధువా? బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు? బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు ప్ర. మీ ఫేవరేట్‌ రంగు? బన్నీ: బ్లాక్ ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు? బన్నీ: షూటింగ్‌ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా. అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్‌ వీడియోలో చూడండి. https://youtu.be/yoRVoy8hqmI
    April 07 , 2023
    Ram Charan: తండ్రిని స్క్రీన్‌పై చూసి క్లీంకార కేరింతలు.. వీడియో వైరల్ రామ్‌చరణ్‌ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గారాల పట్టి క్లీంకార (Klikara)కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇటీవల కాలంలో తరచూ వైరల్ అవుతున్నాయి. క్లీంకారతో దిగిన ఫొటోలను ఇప్పటికే చరణ్‌, ఉపాసన పలుమార్లు నెట్టింట పంచుకున్నారు. అయితే ఎక్కడా ముఖం రివీల్‌ కాకుండా జాగ్తత్త పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్లీంకారకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన తండ్రి రామ్‌చరణ్‌ను తొలిసారి టీవీ స్క్రీన్‌లో చూస్తూ ఆ బంగారు తల్లి మురిసిపోతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. నాన్నను స్క్రీన్‌పై చూస్తూ.. రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా తన కూతురు క్లీంకార (Klikara) వీడియోను పోస్టు చేసింది. ఇందులో క్లీంకార.. రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind &amp; Beyond) డాక్యుమెంటరీని వీక్షిస్తూ కనిపించింది. టీవీ స్క్రీన్‌పై తన తండ్రి చరణ్‌ కనిపించగానే క్లీంకార ఎంతో మురిసిపోయింది. ముద్దుముద్దుగా మాట్లాడుతూ మురిసిపోతూ అలానే చూస్తూ ఉండిపోయింది. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో సంతోషపడటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.  https://twitter.com/upasanakonidela/status/1875437813254291566 ‘చరణ్‌ను చూసి గర్విస్తున్నా’ క్లీంకార వీడియోను పోస్టు చేస్తూ ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోకు తనదైన శైలిలో క్యాప్షన్‌ ఇచ్చారు. ‘RRR చిత్రం మాకు ఎన్నోవిధాలుగా మధుర జ్ఞాపకాలు అందిస్తోంది. నాన్నను తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందించింది. రామ్‌చరణ్‌.. నీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. గేమ్‌ ఛేంజర్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఉపాసన రాసుకొచ్చింది. కాగా, రామ్‌చరణ్‌ దంపతులకు 2023లో క్లీంకార జన్మించింది. పాపకు ఇబ్బంది లేకుండా చరణ్‌ జంట ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నా అందులో పాప ముఖాన్ని చూపించడం లేదు. డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్‌.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘RRR’. భారీ వసూళ్లతోపాటు ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ డాక్యుమెంటరీని తీసుకొచ్చారు. మూవీ చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind &amp; Beyond) డాక్యుమెంటరీని చిత్రబృందం రిలీజ్‌ చేసింది. తొలుత ఎంపిక చేసిన థియేటర్లలో డిసెంబర్‌ 20న ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉంది. ఓటీటీలో ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు తెలిపాయి.  ఒకే వేదికపై బాబాయి - అబ్బాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్‌ బిజీ బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. అంజలి, శ్రీకాంత్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ విడుదల కానుంది. ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్‌ చేశారు. దీనికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 
    January 04 , 2025
    Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Pushpa 2 Full HD Movie Leaked)అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు తమ అద్భుత నటనతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటు సినీ విమర్శకులు, అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ఈక్రమంలో పుష్ప 2 చిత్రం  పైరసీ బారిన పడటంతో పరిశ్రమలో కలకలం రేగింది. పైరసీ బారిన పుష్ప 2 &nbsp;పుష్ప 2 చిత్రం థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మ, మూవీరూల్స్, తమిళ్ రాకర్స్, ఫిల్మిజిల్లా, తమిళ్ యోగి, బప్పమ్ టీవీ, మూవీస్‌డా వంటి పలు పైరసీ వెబ్‌సైట్లలో లీకైంది. ఇది 1080p నుంచి 240p వరకు అనేక ఫార్మాట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ లీక్ వల్ల సినిమాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి మరింత వీలైంది. "పుష్ప 2 డౌన్‌లోడ్" కోసం ఆన్‌లైన్‌లో హడావుడి సినిమా విడుదల తరువాత "Pushpa 2 The Rule Movie Download," "Pushpa 2 Tamilrockers," "Pushpa 2 Telegram Links", Pushpa 2 The Rule Movie Free Download &nbsp;వంటి పదాలు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ చిత్రాన్ని పైరసీలో చూసేందుకు వెతుకులాట ఎక్కువైంది. ఈ పెరుగుదల పైరసీని మరింతగా ప్రోత్సహించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై అభిమానుల స్పందన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చాలా రివ్యూ సంస్థలు మంచి రేటింగ్‌ అందించాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాకు ఏకంగా&nbsp; 5/5 రేటింగ్ ఇచ్చాయి. ప్రత్యేకంగా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, కథనం, పవర్ ఫుల్ డైలాగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పవచ్చు. చిత్తూరు నేపథ్యంలో పుష్పరాజ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు, అతని ఎర్రచందనం వ్యాపారాన్ని (Pushpa 2 Full HD Movie Leaked) అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాడన్నదే ఈ కథాంశం. అల్లు అర్జున్ నెమ్మదిగా నడిచే సన్నివేశాలు, ఆయన ప్రతిసారి స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకుల స్పందన సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఫహద్ ఫాజిల్- రష్మిక మందన్న పాత్రలు ఫహద్ ఫాజిల్ SP శేఖావత్ పాత్రలో తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పాత్ర కథానాయకుడి ప్రయాణానికి కొత్త కోణాన్ని అందించింది. రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో, ఈసారి మరింత బలమైన పాత్రతో కనిపించి, శక్తివంతమైన డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహమ్మారిలా పైరసీ పుష్ప 2 సినిమాపై సానుకూల రివ్యూలు ఉన్నప్పటికీ, పైరసీ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పైరసీ ఒకటి కాదు, రెండు కాదు, సినీ పరిశ్రమ మొత్తానికి ఒక మహమ్మారిలా మారింది. &nbsp;పుష్ప 2: ది రూల్ చిత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈ సినిమాను థియేటర్లకు వెళ్లకుండా పైరసీ ద్వారా చూసే వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మనం సినిమా ప్రదర్శనను థియేటర్లలో ఆనందించడం ద్వారా చిత్రబృందానికి మద్దతు అందించాలి. పుష్ప 2 సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    December 05 , 2024

    Discover everything about Sonakshi Varma, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Sonakshi Varma's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Sonakshi Varma on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.

    @2021 KTree