• TFIDB EN
  • Editorial List
    Tollywood Box office collections in May: మే నెలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్
    Dislike
    200+ views
    6 months ago

    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. మరి ఆ చిత్రాల్లో ఏవి బాక్సాఫీస్ వద్ద రాణించాయో కింది లిస్ట్‌లో సవివరంగా అందించాం. వాటిపై ఓ లుక్ వేయండి

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ప్రసన్న వదనం(మే 03 , 2024)
    UA|డ్రామా
    రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.

    సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి.

    2 . ఆ ఒక్కటీ అడక్కు(మే 03 , 2024)
    UA|డ్రామా
    గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.

    అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.

    3 . కృష్ణమ్మ(మే 10 , 2024)
    UA|డ్రామా
    భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో రివేంజ్‌ తీర్చుకుంటాడు.

    సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.

    4 . ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా(మే 24 , 2024)
    UA|148 minutes|యాక్షన్,అడ్వెంచర్
    ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ.

    ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది.

    5 . లవ్ మీ(మే 25 , 2024)
    UA|హారర్,రొమాన్స్,థ్రిల్లర్
    అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు? అన్నది కథ.

    యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది.

    6 . గం గం గణేశ(మే 31 , 2024)
    UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    దొంగతనాలు చేసే ఓ కుర్రాడి జీవితంలోకి ఓ పొలిటీషియన్, విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ తర్వాత అతడికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.

    స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    7 . భజే వాయు వేగం(మే 31 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పుడే అనాథగా మారిన వెంకట్‌ను... రాజన్న దత్తత తీసుకుంటాడు. కొడుకు రాజుతో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వెంకట్‌.. విలన్ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేస్తాడు. వారు మోసం చేయడంతో పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.

    యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.

    8 . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(మే 31 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం అనే కుర్రాడు.. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

    విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.


    @2021 KTree