ATelugu
నటి సరిత వైశాలితో మాట్లాడటానికి ఒక చిన్న పట్టణానికి వస్తుంది, ఎందుకంటే ఆమె తన జీవితం ఆధారంగా ఒక చిత్రంలో ఆమెతో నటించబోతోంది. వైశాలి హిస్టీరియాతో బాధపడుతూ, కోపంతో సరితను బయటకు పంపింది. ఈ కథ ఇప్పుడు ఫ్లాష్‌బ్యాక్ రూపంలో చెప్పబడింది, వైశాలి సోదరుడు సరితకు కుమార్‌తో తన వివాహం గురించి చెప్పినప్పుడు, అది కేవలం 47 రోజులు మాత్రమే.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
కుమార్జయ ప్రద నహత
వైశాలిరమాప్రభ
జయశ్రీ
ప్రమీల
వరలక్ష్మి
శరత్ బాబు
శంకర్నజీమ్
చక్రపాణి
జెవి రమణ మూర్తి
G. P. రామనాథ్
సరిత
హెర్సెల్ఫ్సిబ్బంది
కె. బాలచందర్
దర్శకుడుఆర్. వెంకటరమణనిర్మాత
MS విశ్వనాథన్
సంగీతకారుడుBS లోకనాథ్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్ ఆగ్రహం!
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం (జూన్ 27) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్‌లో టికెట్ ధరలు భారీగా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టికెట్ల అమ్మకాల్లో కొన్ని థియేటర్లు అనుసరిస్తున్న వైఖరి వివాదస్పదమవుతోంది. దీనిపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఫ్యాన్స్ అసంతృప్తి ఎందుకంటే?
కల్కి సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని థియేటర్లు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా.. బుక్ చేసుకునేందుకు వీలుపడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘బుక్‌మై షో’.. థియేటర్లలో టికెట్స్ ఉన్నట్లు గ్రీన్ కలర్‌లో షోవారిగా టికెట్స్‌ను చూపిస్తున్నాయి. అయితే వాటిని క్లిక్ చేస్తే అభిమానులకు ‘Sorry! Something is not right’ సందేశం వస్తోంది.దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతోనే థియేటర్ యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ అభిమాన హీరో అయినందువల్ల బుకింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. థియేటర్ యాజమన్యాల కక్కుర్తి చర్యలు.. అసహనానికి గురిచేస్తున్నాయని మండిపోతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో థియేటర్లకు రావాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రూ.1000 కోట్ల క్లబ్‌లో..
ఇదిలా ఉంటే.. కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా ఏదైనా స్టార్ హీరో సినిమా అంటే టైర్-1 సిటీస్‌లో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ, కల్కికి మాత్రం టైర్-2 సిటీస్‌లోనూ జోరుగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. నగరవాసులు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రేక్షకులు సైతం కల్కి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ‘కల్కి’ ఈజీగానే రూ.1000 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు.
ఫస్ట్‌డే టార్గెట్ ఎంతంటే?
గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సలార్’ కూడా తొలిరోజు రూ.200 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ డే టార్గెట్ రూ.200 కోట్లు పైనే అని తెలుస్తోంది. రాజమౌళి బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ సోలోగా రూ.200 కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభాస్ ఈ ఫీట్ సాధిస్తే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలవడం ఖాయమని చెప్పవచ్చు.
టికెట్ రెట్లు పెంపు
కల్కి టికెట్ ధరలు పెంపునకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్ 27 నుంచి జులై 4 వరకూ సింగిల్ స్క్రీన్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకూ పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి టీమ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లకి రూ.75, మల్టీప్లెక్స్‌లకి రూ.125 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సగటున ఒక్కో టికెట్‌కు రూ.500 (ట్యాక్స్‌లతో కలిపి) వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే సింగిల్ స్క్రీన్స్‌లో అయితే రూ.200-300 వరకూ పెట్టాల్సిందే. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఒక్కో టికెట్ రూ.3 వేలు..!
కల్కి సినిమా ప్రభావం నార్త్‌లోనూ గణనీయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ చిత్రాన్ని చూసేందుకు బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నాయి. దీన్ని గమనించిన థియేటర్ వర్గాలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో కల్కి అడ్వాన్స్ బుకింగ్ టికెట్.. భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లో అయితే ఏకంగా రూ. 3000 రూపాయలకు విక్రయిస్తున్నారట. ఢిల్లీ మల్టీప్లెక్స్‌లో రూ.1300 నుంచి రూ.2000 వరకు టికెట్ రేట్లు ఉన్నట్లు సమాచారం. అటు బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.1100-1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్‌లో బెనిఫిట్ షోకి రూ.3000 వరకూ టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నారని టాక్.
అక్కడ కల్కి రికార్డ్ షోస్..
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభం అయిన అపర్ణ మల్టీప్లెక్స్‌లో తొలిరోజున కల్కి కోసం ఏకంగా 47 షోలు ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా అన్ని షోలకు సంబంధించిన టికెట్స్ సైతం ఇప్పటికే అమ్ముడి పోయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను సైతం వారు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/gopaladusumalli/status/1805502440420303323
జూన్ 25 , 2024
IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్ చేసిన టాప్ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం.
టాప్-20లో బాలీవుడ్ తారలు
సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ టాప్ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్- 20లో చోటు దక్కించుకున్నారు.
దీపిక పదుకొనే (Deepika Padukone)షారుక్ ఖాన్ (Shah Rukh Khan)ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)అలియా భట్ (Alia Bhatt)ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan)అమీర్ ఖాన్ (Aamir Khan)సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)సల్మాన్ ఖాన్ (Salman Khan)హృతిక్ రోషన్ (Hrithik Roshan) అక్షయ్ కుమార్ (Akshay Kumar)కత్రినా కైఫ్ (Katrina Kaif)అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)కరీనా కపూర్ (Kareena Kapoor)త్రిప్తి దిమ్రి (Tripti Dimri)తమన్న భాటియా (Tamannaah Bhatia)రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)నయనతార (Nayanthara)రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)అజయ్ దేవగణ్ (Ajay Devgn)
View this post on Instagram A post shared by IMDb India (@imdb_in)
తెలుగులో టాప్ ఎవరంటే?
ఐఎండీబీ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత తెలుగు నుంచి రామ్ చరణ్ (31), అల్లు అర్జున్ (47), జూనియర్ ఎన్టీఆర్ (67), మహేశ్ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్-100లో నిలిచారు.
టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా?
ఐఎండీబీ రిలీజ్ చేసిన తాజా జాబితాలో టాప్-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్ (సలార్), అల్లు అర్జున్ (పుష్ప), రామ్‌చరణ్ - తారక్ (ఆర్‌ఆర్‌ఆర్) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్ స్టార్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు.
జూన్ 05 , 2024
Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్ బర్త్‌డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్.. తొలి సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్‌ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దూసుకెళ్తున్న సాంగ్
దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్ సాంగ్' (Fear Song) పేరుతో సాంగ్ లిరికల్ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.
https://www.youtube.com/watch?v=CKpbdCciELk&list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&index=3
‘అనిరుధ్ ఎలివేషన్స్ ఏంటి’
దేవర ఫస్ట్ సాంగ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చినా.. మిగతా మ్యూజిక్ లవర్స్, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ బర్త్‌డే సాంగ్‌లో అనిరుద్ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్ కంటే ఎక్కువగా అనిరుధ్ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్ సినిమా టైటిల్ ట్రాక్‌ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్ డామినేట్ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్ మధ్యలో లిరిక్స్ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా?
‘దేవర’లోని ఫియర్ సాంగ్‌ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్‌తో కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్ యాస్' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్ బాక్స్‌లో పోస్టులు చేస్తున్నారు.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.
మే 20 , 2024
Heroes as old men: ప్రభాస్, మహేష్ ముసలివారైతే ఇలా ఉంటారా? పాపం హృతిక్, షారుఖ్.. స్టార్లను వృద్ధులుగా మార్చేసిన AI..!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. అంతేగాక మనుషుల ఆకృతులను మార్చేస్తూ AI నవ్వులు పూయిస్తోంది. సెలబ్రిటీల జెండర్లు మారుస్తూ వారి ఫొటోలను ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కు స్టార్ హీరోలు వృద్దులైతే ఎలా ఉంటారో అన్న ఆలోచన వచ్చింది. వెంటనే AIకి పని చెప్పాడు. AI ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
1. అల్లుఅర్జున్:
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో పాటు బయట కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. నయా ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌కు అలరిస్తాడు. అటువంటి అల్లుఅర్జున్ వృద్దుడుగా ఎలా ఉంటాడో కృత్రిమ మేధ (AI) ఒక ఫొటో రూపంలో చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ముఖాన ముడతలు, మెరిసిన జట్టు-గడ్డంతో అల్లుఅర్జున్ ఇందులో కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
2. మహేష్ బాబు
టాలీవుడ్‌లోని మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. 47 ఏళ్ల వయసులోని పాతికేళ్ల కుర్రాడిగా మహేష్ కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్‌కు వయసు అయిపోతే ఎలా ఉంటాడో AI ఒక ఇమేజ్‌ను తయారు చేసి చూపించింది.
Image Courtesy: Instagram(SAHID)
3. ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌కు ఏ హీరోకి లేని యూనిక్ పర్సనాలిటీ ఉంది. అటువంటి ప్రభాస్‌ను కూడా AI తన ఊహాజనితమైన ఫొటోలో వృద్ధుడిగా మార్చేసింది. ఆ ఫొటోను మీరూ చూసేయండి.
Image Courtesy: Instagram(SAHID)
4. షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షాగా షారుఖ్ ఖాన్‌కు పేరుంది. ఎంతో హ్యాండ్సమ్‌గా ఉండో షారుఖ్ ఓ దశలో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి షారుఖ్ లుక్‌ను కూడా AI మార్చివేసింది. వయసైపోతే షారుఖ్ ఎలా ఉంటాడో ఫ్యాన్స్‌కు చూపించింది.
Image Courtesy: Instagram(SAHID)
5. హృతిక్ రోషన్
బాలీవుడ్ అగ్రహీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. కండల తిరిగిన దేహంతో హృతిక్ ఇప్పటికీ ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నాడు. అతడి ఫొటోను కూడా AI తన సాంకేతికతతో వృద్దుడిగా మార్చేసింది. ముఖంపై ముడతలు, తెల్లటి గడ్డంతో ఉన్న హృతిక్‌ను గుర్తు పట్టడం కష్టమే.
Image Courtesy: Instagram(SAHID)
6. అమీర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వయసును కూడా AI అమాంతం పెంచేసింది. వృద్దుడిగా మారిన అమీర్‌ఖాన్ ఊహాజనీత ఫొటోను రూపొందించింది. ఆ ఫొటో ఏంటో మీరు చూడండి.
Image Courtesy: Instagram(SAHID)
7. సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వయసైపోతే ఎలా ఉంటాడో AI ఫొటో రూపంలో చూపించింది. అయితే ఈ ఫొటోలో సల్మాన్ లుక్ ఓ సైంటిస్టును పోలి ఉంది.
Image Courtesy: Instagram(SAHID)
8. అక్షయ్ కుమార్
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను కూడా AI ఓల్డ్ మ్యాన్‌గా మార్చేసింది. ఈ లుక్‌లో అక్షయ్ హాలీవుడ్ నటుడిలాగా అనిపిస్తున్నాడు.
Image Courtesy: Instagram(SAHID)
9. షాహిద్ కపూర్
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను కూడా AI తన సాంకేతికతతో వయసు మళ్లిన వ్యక్తిగా మార్చేసింది. AI చేసిన ఫొటోలో షాహిద్ పూర్తి డిఫరెంట్‌గా కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
10. రణబీర్ కపూర్
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్‌ను AI కురువృద్దుడిగా మార్చేసింది. ముడతలు పడిన చర్మంతో రన్‌బీర్ కనిపించాడు.
Image Courtesy: Instagram(SAHID)
మే 15 , 2023