• TFIDB EN
  • ఆవేశం
    UATelugu2h 41m
    కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్‌ గుండా రంగా (ఫహద్‌ ఫాసిల్‌)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Malayalam )నాట్‌ అవైలబుల్‌ ఇన్‌ తెలుగు
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఫహద్ ఫాసిల్
    హిప్స్టర్
    మిథున్ జై శంకర్
    రోషన్ షానవాజ్
    మిధుట్టి
    మన్సూర్ అలీ ఖాన్
    కృష్ణ కుమార్
    నీరజా రాజేంద్రన్
    ప్రమోద్ వెలియనద్
    ఆశిష్ విద్యార్థి
    సిబ్బంది
    జిత్తు మాధవన్దర్శకుడు
    నజ్రియా నజీమ్
    నిర్మాత
    అన్వర్ రషీద్
    నిర్మాత
    జిత్తు మాధవన్రచయిత
    సుశీన్ శ్యామ్
    సంగీతకారుడు
    సమీర్ తాహిర్
    సినిమాటోగ్రాఫర్
    వివేక్ హర్షన్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;</strong>
    Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్‌’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్‌’, ‘మిరపకాయ్‌’, ‘పవర్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘రాజాది గ్రేట్‌’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్‌ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్‌. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్‌ వెంటాడుతుండటంతో ఈ మాస్‌ మహారాజ్‌ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ! మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్‌ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్‌ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.&nbsp; బాలయ్యను కాదని.. ‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్‌ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్‌ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్‌ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.&nbsp; ఫ్లాప్స్‌ బెడద తట్టుకోలేకనే! ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్‌) సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్‌) యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్‌’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్‌, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్‌ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్‌ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.&nbsp; మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా? ‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ అయిన రంగా (ఫహద్‌ ఫాజిల్‌)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్‌ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్‌ ఫాజిల్‌ క్యారెక్టరైజేషన్‌ ఈ కథలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తెలుగులో ఆ క్యారెక్టర్‌ సీనియర్‌ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్‌, అగ్రెషన్‌ ఇలా అన్ని షేడ్స్‌ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    <strong>Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్‌ ఫాజిల్‌ అందుకే పక్కకు పెట్టాడా?</strong>
    Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్‌ ఫాజిల్‌ అందుకే పక్కకు పెట్టాడా?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ వాంటెడ్‌ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 5 (Pushpa 2 Release Date)న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్‌ నిర్వహించింది. వీటికి ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న, ఐటెం సాంగ్‌ చేసిన శ్రీలీల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ఇలా మూవీలో కీ రోల్‌ పోషించిన అందరూ హాజరయ్యారు. కానీ, ‘పుష్ప 2’లో విలన్‌గా చేసిన మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మాత్రం ఒక్క ఈవెంట్‌కు హాజరుకాలేదు. మూవీ టీమ్‌పై ఫహాద్‌ చాలా కోపంగా ఉన్నాడని, అందుకే ఈవెంట్స్‌ రావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  హోమ్‌ టౌన్‌ ఈవెంట్‌లోనూ మిస్సింగ్‌! అల్లు అర్జున్‌, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా చేసిన ‘పుష్ప’ (Pushpa: Part 1) చిత్రం 2021లో విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్ షెకావత్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) కనిపించాడు. అతడి నటన నెక్స్ట్‌ లెవల్లో ఉందంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. వాస్తవానికి అతడి పాత్ర నిడివి తొలి భాగంలో తక్కువే అయినా ‘పుష్ప 2’లో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపిస్తాడని మేకర్స్‌ తెలిపారు. దీంతో ఫహాద్ ఏ స్థాయిలో మాయ చేస్తాడోనని అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో ఫహాద్‌ కనిపించకపోవడం ఓ పజిల్‌గా మారిపోయింది. స్వరాష్ట్రం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈవెంట్‌కు సైతం అతడు దూరంగా ఉన్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pushpa 2 Pre release Event)కు సైతం ఫహాద్‌ డుమ్మా కొట్టాడు. దీంతో మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఫహాద్‌ ఈవెంట్స్‌కు హాజరు కావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి.&nbsp; రెమ్యూనరేషన్‌ కారణమా? రెమ్యూనరేషన్‌ విషయంలో ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ షూటింగ్‌ సమయంలోనే ఫహాద్‌ పాత్రకు సంబంధించి రెండు పార్ట్స్‌ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ‘పుష్ప’ రిలీజ్‌కు ముందు వరకు ఫహాద్‌కు పెద్దగా మార్కెట్‌ లేదు. దీంతో అప్పటి డిమాండ్‌కు అనుగుణంగా మైత్రి మూవీ మేకర్స్‌ ఒక రేటు ఫిక్స్‌ చేసింది. అయితే ‘పుష్ప’ తర్వాత ఫహాద్‌ మార్కెట్ భారీగా పెరిగింది. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ స్టార్‌ హీరోలతో ‘విక్రమ్‌’, ‘వేట్టయాన్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌ చేశాడు. ఇటీవల ‘ఆవేశం’తో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ నటుడిగా మారిపోయాడు. దీంతో ‘పుష్ప 2’ చిత్రానికి 2021లో ఫిక్స్‌ చేసిన రెమ్యూనరేషన్ కాకుండా ఇప్పటి మార్కెట్‌ను బట్టి పారితోషికాన్ని ఫహాద్‌ కోరినట్లు సమాచారం. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారమే చెల్లిస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ తేల్చి చెప్పిందని కూడా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఓ వైపు అల్లు అర్జున్‌కు రూ.300 కోట్లు ఇచ్చి, తనకు మాత్రం తక్కువ ఇస్తున్నారన్న భావన ఫహాద్‌లో బలంగా పడిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ‘పుష్ప 2’ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నాడని అభిప్రాయపడుతున్నారు.&nbsp; షూటింగ్స్‌ విషయంలోనూ..&nbsp; ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) గత మూడేళ్లుగా చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘పుష్ప 2’ డేట్స్ ఇచ్చేశాడు. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ అనేక సార్లు వాయిదా పడటం కూడా ఫహాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. పదే పదే షూటింగ్‌ వాయిదా పడటం వల్ల ఫహాద్‌ ఇచ్చిన డేట్స్‌ పూర్తిగా నిర్విర్యం అయిపోయినట్లు సమాచారం. మళ్లీ కొత్త డేట్స్‌ ఇవ్వాల్సి వచ్చినప్పడల్లా అప్పటికే ఒప్పుకున్న మరో చిత్రం డేట్స్‌ క్లాష్‌ అయ్యేవని టాక్‌. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వద్దకు ఫహాద్‌ తీసుకెళ్లినప్పటికీ పెద్దగా రెస్పాన్స్‌ లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై బహిరంగంగానే సన్నిహితులతో చెప్పుకొని ఫహాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని ఫిల్మ్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.&nbsp; ‘పుష్ప వల్ల ఒరిగిందేం లేదు’ ఈ ఏడాది మేలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’పై ఫహాద్‌ ఫాజిల్ ఓపెన్‌ గానే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పట్లో ఆ కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్‌ చేశాయి. పుష్ప తర్వాత పాన్ ఇండియా యాక్టర్‌గా మారారని కాంప్లీమెంట్స్ వస్తున్నాయి.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా దానికి ఈ మలయాళ హీరో ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ‘పుష్ప సినిమా నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ విషయం సుకుమార్ సార్‌కి కూడా చెప్పాను. ఇందులో నేనేం దాచడం లేదు. అలా అని అబద్దం కూడా చెప్పట్లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. మలయాళం భాష తెలియని వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాకు ఆనందాన్ని కలిగించింది’ అని స్పష్టం చేశాడు. ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా సినిమా వల్ల తనకు ఎలాంటి లాభం చేకూరలేదని ఫహద్ ఫాజిల్ చెప్పడం&nbsp; అప్పట్లో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరిచింది.&nbsp;
    డిసెంబర్ 03 , 2024
    <strong>Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?</strong>
    Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2'&nbsp; (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. అలాగే మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఎప్పటికప్పుడు అటెన్షన్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఈ సినిమా నుంచి ‘పీలింగ్స్‌’ (Peelings) అనే ఫోర్త్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. పాట వినసొంపుగా లేకపోవడంతో పాటు చాలా బోల్డ్‌గా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; పీలింగ్స్ సాంగ్‌ (Peelings Song Trolls)లో రష్మిక మందన్న ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. బన్నీ, రష్మిక చేసిన స్టెప్స్‌ చాలా బోల్డ్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బి- గ్రేడ్ ఫిల్మ్స్‌ ప్రసారం చేసే ‘ఉల్లు’ (ULLU)కి ‘పుష్ప 2’ రైట్స్ ఇచ్చారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Janasena200/status/1863202776567918898 https://twitter.com/KettavaN6474/status/1863259521671700959 సాంగ్ బాగున్నప్పటికీ స్టెప్స్‌ మరీ దారుణంగా ఉన్నాయని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. భోజ్‌పూరి సినిమాల డ్యాన్స్‌ వైబ్‌ని తీసుకొస్తోందని అంటున్నారు.&nbsp; https://twitter.com/CricentVerse/status/1863491408193053028 https://twitter.com/ChekrishnaCk/status/1863263237527261384 అటు మహిళా నెటిజన్లు సైతం పీలింగ్స్‌ సాంగ్‌ (Peelings Song Trolls) ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు ఈ సాంగ్‌ను ఎవరు ఇంత దారుణంగా కొరియోగ్రాఫ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/WarriorrQueen/status/1863496938055958540 https://twitter.com/PriyuDvibes/status/1863440643613139035 ‘గంగోత్రి’ సినిమాలో లేడీ గెటప్‌లో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్స్‌ను కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. అలాంటి మాస్‌ డ్యాన్సర్‌ చేత ఇలాంటి క్రింజ్‌ స్టెప్పులు వేయించారేంట్రా అంటూ ఇంకా ట్రోల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/At_theatres/status/1863488826754175406 పీలింగ్స్‌ పాట (Peelings Song Trolls) లో రష్మిక చేసింది గ్లామర్ షో కాదని, వల్గర్‌ షో అని ఓ తమిళ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఈ సాంగ్‌లోని స్టెప్పులన్నింటిని ఒక దగ్గర చేర్చి ఈ కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/Tamiltoptrollz1/status/1863478959553609755 మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) భన్వర్‌ సింగ్ షెకావత్‌ అనే విలన్‌ పోలీసాఫీసర్‌గా చేశారు. ఫహాద్‌ రీసెంట్‌ చిత్రం ‘ఆవేశం’లో అతడు వేసిన స్టెప్స్‌ను పీలింగ్స్‌ పాటకు నెటిజన్లు జోడించారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/mrjohnnyjohnnny/status/1863468922697351641 రష్మిక డ్యాన్స్‌ మూమెంట్స్ ఏమాత్రం బాగోలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పీలింగ్స్‌లో ఆమె డ్యాన్స్‌ చేశాక తన ఎక్స్‌ప్రెషన్ ఏంటో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/Venkatsinivasan/status/1863444820305559839 సీనియర్‌ ఎన్టీఆర్‌ వేసిన 'ఆకుచాటు పిందె తడిసే' పాటకు 'పీలింగ్స్‌' స్టెప్స్‌ను జోడించి చేసిన ఎడిటింగ్‌ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/karna3102bc/status/1863441808585322790 పీలింగ్స్‌ పాట లిరిక్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా డామినేట్‌ చేసిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ‘అండర్‌స్టాండింగ్‌ 0 శాతం, వైబ్‌ 100 శాతం’ అంటూ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/the_wacko_/status/1863440487367270836 నిజానికి పీలింగ్స్‌ సాంగ్‌ చాలా బాగుందని, కానీ కొరియోగ్రఫీనే అసలు బాలేదని కొందరు స్పష్టం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌కు ఈ పాట ఇచ్చి తప్పుచేశారని మండిపడుతున్నారు.&nbsp; https://twitter.com/Mee_Rudra/status/1863439435393585482 పీలింగ్స్‌ పాటలో బన్నీ వేసిన స్టెప్పు ‘గేమ్‌ ఛేంజర్‌’లో 'రా మచ్చ మచ్చ' అంటు చరణ్‌ వేసిన స్టెప్పుతో కొందరు పోలుస్తున్నారు.&nbsp; https://twitter.com/Mallika40697388/status/1863439034795638940 https://twitter.com/lyf_a_zindagii/status/1863257627733426618
    డిసెంబర్ 02 , 2024
    Kantara Chapter 1 Teaser: టీజర్‌లోనే స్టోరీ చెప్పేసిన రిషబ్ శెట్టి.. ఈ డీటైల్స్ గమనించారా?
    Kantara Chapter 1 Teaser: టీజర్‌లోనే స్టోరీ చెప్పేసిన రిషబ్ శెట్టి.. ఈ డీటైల్స్ గమనించారా?
    కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1). 2022 విడుదలైన  కాంతారా సినిమాకు ఇది ప్రీక్వేల్. కాంతారా చిత్రం పాపాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్‌హిట్ చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార: చాప్టర్ 1’ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. 2022లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక కాంతారా చాప్టర్ 1 టీజర్‌ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. టీజర్‌లో ప్రతి డీటేయిల్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. "వెలుగులోకి వస్తే అంతా కంటికి కనపడుతుంది.. కానీ అది నిప్పు కాదు దర్శనం.. గతంలో జరిగింది, భవిష్యత్‌లో జరగబోయేది అంతా చూపిస్తుంది.. కనబడుతుందా.. ఆ వెలుగు  అంటూ" టీజర్ ముందుకు సాగింది. టీజర్‌లో రిషబ్ శెట్టి చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని భయంకరంగా కనిపించాడు. ఒంటిపై నెత్తురు కారుతుంటే.. చాలా ఆవేశంగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. కంటిలో అగ్ని గోలాలు కనిపించే లుక్ భయానంగా ఉంది. ఇక BGM టీజర్‌ను బాగా ఎలివేట్ చేసింది.(Kantara Chapter 1 Dialogue) వీణ మ్యూజిక్‌ను అంజనీష్ కుమార్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు.  టీజర్‌ ఏ ఇలా ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీజర్ అంచనాలకు మించి ఉందని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న (Kantara Chapter 1 Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వస్తున్న జై హనుమాన్ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా చాప్టర్ 1 పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. https://www.youtube.com/watch?v=MrzUp7_-YSE&amp;t=82s
    నవంబర్ 18 , 2024
    <strong>Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!</strong>
    Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
    ‘దేవర’ (Devara: Part 1) రాకకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించింది. ప్రముఖ హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేయడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500లకు పైగా ప్రీమియర్స్‌తో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక వరల్డ్‌ వైడ్‌గా దేవర అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్స్‌ చూస్తుంటే తొలి రోజు ఈజీగానే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; తొలి రోజు రూ.125 కోట్లు పక్కా! తారక్‌ నటించిన ‘దేవర’ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లకొడుతూ భారీ హైప్‌ సంపాదించుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి సైతం ఇచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీసేల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర తొలి రోజున రూ.125 కోట్లకు పైగా గ్రాస్‌ పక్కాగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రూ.10-15 కోట్లు ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు దేవర రాబట్టొచ్చని సమాచారం. హిందీలో రూ.8-10 కోట్లు దేవర ఖాతాలో పడొచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెస్ట్‌ ఆఫ్ ఇండియా మెుత్తం కలిపి రూ.10-15 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం దేవర దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు ఈజీగానే రూ.30-35 కోట్లు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న తొలిరోజు దేవర ఖాతాలో రూ.125 కోట్లు + పడటం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని సమాచారం. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ’దేవర’పై అనిరుధ్‌ ఫస్ట్ రివ్యూ 'దేవర' చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్‌ 'దేవర'పై హైప్‌ వచ్చే కామెంట్స్‌ చేశారు. ‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. దేవర చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నా' అని అనిరుద్‌ అన్నారు.&nbsp; సైఫ్‌ భార్యగా తెలుగు నటి దేవరలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్యగా తెలుగు సీనియర్‌ నటి చైత్ర రాయ్‌ నటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దొరకడం తన అద్భుష్టమని చైత్ర అంటోంది. సెట్‌లో తొలిసారి తారక్‌, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది. కాగా, 'అష్టా చమ్మా' సీరియల్‌తో చైత్ర బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌లో నటిస్తోంది. దేవరతో మంచి గుర్తింపు లభిస్తే సినిమాల్లోనూ బిజీ కావచొచ్చని చైత్ర భావిస్తోంది.&nbsp; ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?</strong>
    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.&nbsp; తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరులో కసి పెంచిన ఘటన ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్‌ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్‌ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్‌ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు. చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి 1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్‌ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు. చిరు మెస్మైరైజింగ్‌ డ్యాన్స్‌కు కారణం ఇదే! కెరీర్‌ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట.&nbsp; సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్‌ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.&nbsp; రివ్యూవర్‌ నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి.. మెగాస్టార్‌ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్‌ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్‌ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.&nbsp; కుర్ర హీరోలకు అండగా.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డగా.. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. సేవా కార్యక్రమాల్లో ముందజ.. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
    ఆగస్టు 22 , 2024
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
    ‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఫహాద్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్‌ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.&nbsp; ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే! మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్‌.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్‌ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.&nbsp; ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి? ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.&nbsp; ADHD వ్యాధి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.&nbsp; కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫహాద్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ఫహాద్‌.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్‌' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్‌' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.&nbsp;
    మే 28 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    టాలీవుడ్ ఖ్యాతిని పాన్‌ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్‌ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్‌. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్‌ ఫాజిల్‌ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; ‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’ తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్‌ ‌అడిగిన ప్రశ్నలకు షాకింగ్‌ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్‌.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్‌ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.&nbsp; ‘సుకుమార్‌ కోసమే ఒప్పుకున్నా’ ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్‌ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్‌.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్‌ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు. నా ఫేవరేట్‌ స్టార్స్‌ వారే: ఫహాద్‌ యాంకర్‌ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్‌ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్‌ కుమార్‌ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్‌ కపూర్‌ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్‌ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్‌ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.&nbsp;
    మే 07 , 2024
    This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్‌ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్‌ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు కృష్ణమ్మ టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రతినిధి 2 నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది.&nbsp; సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 25న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.&nbsp; జితేందర్‌ రెడ్డి ఉయ్యాల జంపాల ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.&nbsp; కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ హాలీవుడ్‌లో ‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్‌ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్‌ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు గీతాంజలి మళ్లీ వచ్చింది హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.  ఆవేశం&nbsp; పుష్ప ఫేమ్‌ విలన్‌ ఫహాద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBodkin&nbsp;SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
    మే 06 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?&nbsp; తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    ప్రజా గాయకుడు గద్దర్‌ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్‌ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్‌. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్‌ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్‌ ఎందుకంత స్పెషల్‌. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; బండెనక బండి కట్టి గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్‌ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.&nbsp; https://www.youtube.com/watch?v=8T3F4IuYarM &nbsp;మల్లెతీగకు పందిరివోలె 1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్‌ స్వయంగా రాశారు. ఈ సాంగ్‌ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI పొడుస్తున్న పొద్దుమీద గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ కేటగిరీలో గద్దర్‌ నంది ‌అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. https://www.youtube.com/watch?v=vywBbz6QL7g నా రక్తంతో నడుపుతా ఓరేయ్‌ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్‌. నారాయణమూర్తి రక్తి కట్టించారు.&nbsp; https://www.youtube.com/watch?v=XhbiuSTugNc అమ్మ తెలంగాణా&nbsp; తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం. https://www.youtube.com/watch?v=pXgjUMosLWY మరిన్ని పాటలు పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
    ఆగస్టు 07 , 2023
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,&nbsp; ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.&nbsp; పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.&nbsp; ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    <strong>Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!</strong>
    Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
    గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.&nbsp; Stree 2 అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే... చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ. Kalki 2898 AD రెండో స్థానంలో నిలిచిన ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ. 12th Fail మూడో స్థానంలో ‘12వ ఫెయిల్‌’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది.&nbsp; ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. Laapataa Ladies ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్‌’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్‌ సాధించింది. Hanu-Man తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, ‘హనుమాన్’ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. Maharaja ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ. Manjummel Boys మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్‌’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. The Greatest of All Time తమిళ్ సూపర్ విజయ్ నటించిన ‘గోట్‌’&nbsp; 8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ. Salaar ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది.&nbsp; ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ. Aavesham &nbsp;మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్‌ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
    డిసెంబర్ 12 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ దర్శకత్వం: గుణశేఖర్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌ నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్‌ ఇవాళ (ఏప్రిల్‌ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్‌ డైరెక్టర్‌ కావడం, దిల్‌ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్‌ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం. కథ: విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్‌ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి&nbsp; ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మైనస్‌ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్‌ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్‌ మోహన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్‌, అనన్య, మధుబాల, జిషు సేన్‌ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.&nbsp; టెక్నికల్‌గా: శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్‌ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ సమంత నటనమణిశర్మ సంగీతం&nbsp;విరామ, పతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 15 , 2023
    Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
    Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
    షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్‌’ (Raees) సినిమా ద్వారా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్‌ నటి మహిరా ఖాన్‌ (Mahira Khan), తొలి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ సక్సెస్‌ను తగిన విధంగా కెరీర్‌లో కొనసాగించలేకపోయారు. మహిరా కెరీర్‌కి బాలీవుడ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాలు అర్థాంతరంగా తన కెరీర్‌ను ముగించేలా చేశాయి. ముఖ్యంగా, 2017లో నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు మహిరా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపించాయి. నాటి ఫోటోలపై మహిరా స్పందన తాజాగా మహిరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు ఓ ప్రముఖ మీడియా ‘ది లిటిల్ వైట్ డ్రెస్’ అనే టైటిల్‌తో ఆర్టికల్ రాసింది. దానిలో నాకు సంబంధించి వచ్చిన వార్తలు చదివినప్పుడు మొదట ఆ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయా. ‘పాకిస్థాన్‌ నుంచి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటి ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గడం ఏమిటి?’ అనే వాక్యం చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నా కెరీర్‌ ముగిసిపోతుందా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు. వ్యక్తిగత జీవితంపై ప్రభావం ‘‘ఆ ఫోటోల కారణంగా నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో విడాకులు పొందాను, సింగిల్‌ పేరెంట్‌గా జీవించాను. రోజూ ఆత్మన్యూనతతో బాధపడుతూనే ఉండేదాన్ని. అయితే, ఆ కష్టసమయాల్లో నాకు అభిమానుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది’’ అని మహిరా పేర్కొన్నారు. రణ్‌బీర్‌తో లీకైన ఫొటోల వివాదం 2017లో న్యూయార్క్‌లో రణ్‌బీర్ కపూర్‌తో మహిరా దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా కనిపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని బాలీవుడ్‌లో గాసిప్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ సంఘటన తరువాత మహిరా బాలీవుడ్‌లో మరే సినిమాలోనూ కనిపించలేదు. వ్యక్తిగత జీవితం మహిరా ఖాన్ ఆమె స్నేహితుడు అలీ అస్కారీని వివాహమాడి, 2015లో విడిపోయారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మహిరా వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను 2023లో వివాహమాడారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా శాంతియుత జీవితం గడుపుతున్నారు. మహిరా ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ తన అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ తనతో ఉంటుందని అభిప్రాయపడింది.
    డిసెంబర్ 17 , 2024
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
    ]జగద్గురు ఆదిశంకరఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.Watch Now
    ఫిబ్రవరి 16 , 2023
    Allu Arjun: సీఎం రేవంత్‌ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!
    Allu Arjun: సీఎం రేవంత్‌ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!
    ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. ఈ మేరకు ప్రేస్‌ మీట్ పెట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు.. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి.. మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.. నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు. థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు.. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయాను.. రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది.. నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదు.. తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారు. Screengrab Instagram:alluarjun సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్.. ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాని చెప్పుకొచ్చారు.
    డిసెంబర్ 21 , 2024

    @2021 KTree