UATelugu2h 59m
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ప్రభాస్
రాఘవకృతి సనన్
జానకిసైఫ్ అలీ ఖాన్
లంకేష్సన్నీ సింగ్
లక్ష్మణదేవదత్తా నాగే
హనుమాన్వత్సల్ శేత్
ఇంద్రజిత్సోనాల్ చౌహాన్
తృప్తి తోరద్మల్
సిబ్బంది
ఓం రౌత్
దర్శకుడుభూషణ్ కుమార్
నిర్మాతక్రిషన్ కుమార్
నిర్మాతఓం రౌత్
నిర్మాతప్రసాద్ సుతార్నిర్మాత
రాజేష్ నాయర్నిర్మాత
అజయ్-అతుల్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
ADIPURUSH: ఆదిపురుష్‌లో అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ రోల్... పసిగట్టిన ఫ్యాన్స్!
ఆదిపురుష్ మూవీ టాక్ తెలుగులో ఎలా ఉన్నప్పటికీ.. హిందీ బెల్ట్‌లో మాత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవనుందని సంబరపడిపోతున్నారు. ఆదిపురుష్ సినిమాలో ఏ సీన్‌కా ఆ సీన్ దేనికవే ప్రత్యేకంగా నిలిచాయని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆదిపురుష్ సినిమాలో అల్లు అర్జున్ కెమియో రోల్ చేశాడని నెట్టింట చర్చ మొదలైంది. ఎవరికీ చెప్పకుండా ఫ్యాన్స్‌ను బన్నీ సర్‌ప్రైజ్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓ ఫొటోను సోషల్ మీడియాలో పొస్ట్ చేసి.. ఆ క్యారెక్టర్ చేసింది అల్లు అర్జునే(ALLU ARJUN )నంటూ పెద్ద ఎత్తున చర్చకు తెర లేపారు. వానర సేనలో ఆ క్యారెక్టర్ చేసింది బన్నీనే అంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు.
మరికొంత మంది అతను అల్లు అర్జున్ కాదని వాదిస్తున్నారు. కానీ పొలికలు మాత్రం పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను పొలి ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. నుదుటిపై బొట్టు, క్రాఫ్ అచ్చం పుష్పరాజ్‌లా(PUSHPA RAJ) ఉన్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే కొంతమంది యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలనే బన్నీ(BUNNY) టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా పాపులారిటీని తట్టుకోలేకే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.
మరి ఓవర్ కాకపోతే… ఆదిపురుష్‌లో అల్లు అర్జున్ ఉండటం ఏంటీ విడ్డూరంగా అని మరికొంతమంది ట్రోలర్లను ఏకిపారేస్తున్నారు.
న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ వార్‌లో అల్లు అర్జున్‌ను లాగొద్దని సూచిస్తున్నారు. ప్రభాస్, బన్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి(ALLU ARJUN TROLLS) ట్రోల్స్‌తో వారి స్నేహాన్ని చెడగొట్టద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/dev66612/status/1668960061782368257?s=20
తన సొంత థియేటర్ AAA సినిమాస్‌లో తొలి చిత్రంగా ఆదిపురుష్ వేసి ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని అల్లు అర్జున్ చాటుకున్నారని పేర్కొన్నారు.
కృష్ణం రాజు చనిపోయిన రోజు అల్లు అర్జున్‌కు సైమా అవార్డు రావడంతో ఆయన తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. దీనిపై అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ టాలీవుడ్ శోకసంద్రంలో ఉంటే అల్లు అర్జున్ ఆనందంగా ట్వీట్ చేయడం ఏమిటని బన్నీని ట్రోల్ చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌కు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది.
జూన్ 17 , 2023
Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్?
ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.
బాహుబలి 2
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించింది.
కేజీఎఫ్ 2
కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.
సాహో
బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రోబో 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
జూన్ 16 , 2023
Adipurush Memes: ఆదిపురుష్ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..!
ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద మిక్స్‌డ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తోంది. అయితే, రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. ఇందులోని పాత్రల చిత్రీకరణ, గెటప్, తదితర విషయాల్లో మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సినిమా విడుదలయ్యాక కూడా ఈ విమర్శలు ఆగట్లేదు. కొందరైతే పాత్రలను ఇంతకు ముందు సినిమాలతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరీ, ముఖ్యంగా ఇందులో ఓ పాత్ర అయితే అచ్చం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని పోలి ఉందని పిక్స్ షేర్ చేస్తున్నారు.
ఆదిపురుష్‌లో ఏక్‌నాథ్ షిండే..
ఆదిపురుష్‌లో వేసిన ఓ వానర పాత్ర గెటప్‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాత్ షిండే ముఖ కవలికలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ముఖాన్ని చూస్తే డిట్టో షిండేనే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రెండింటికీ తేడా..
నెటిజన్లు మరొక అడుగు ముందుకేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు. సినిమాలో ప్రభాస్ తెల్లటి వస్త్రాలు ధరించి కనిపిస్తాడు. ఈ ఫొటోను గుర్తు చేస్తూ ఎక్కడో చూసినట్లుందే అంటూ కమెడియన్ రఘు బాబు ఫొటో షేర్ చేస్తున్నారు. దరువు సినిమాలోని పండిట్‌జీ గెటప్‌కి, ప్రభాస్ గెటప్‌కి ఏమైనా తేడా ఉందా చెప్పండంటూ కామెంట్లు పెడుతున్నారు.
రావణ క్యారెక్టర్‌పై..
ఆదిపురుష్‌లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అయితే, లంకేశుడి పాత్రను చూపించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకీ రామాయణంలో లేని రావణుడిని సృష్టించారంటూ గుణ గణాలను పోలుస్తున్నారు. ఇప్పటివరకు చూసిన రావణుడు, ఆదిపురుష్ రావణుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
వీఎఫ్ఎక్స్‌పై..
గతేడాది ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక కూడా ఇవి ఆగట్లేదు. సినిమా కోసం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా, విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇతర సినిమాల గ్రాఫిక్స్‌తో పోల్చుతూ కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/Lordofbattles8/status/1669609782595170305
మరికొందరు, ఇతర లోకల్ వీడియోలను షేర్ చేస్తూ ఆదిపురుష్ కన్నా ఇదే నయం అంటున్నారు.
https://twitter.com/DoctorrSays/status/1669622038544400384
ఇప్పుడొచ్చిన ఆదిపురుష్ కన్నా 20 ఏళ్ల కిందట విడుదలైన అంజి సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.
https://twitter.com/superking1816/status/1669611748188622848
2010లోనే షారూక్ ఖాన్ సినిమాలో ఇంత చక్కని గ్రాఫిక్స్ ఉపయోగించడం గొప్ప విషయం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కర్మ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు.
https://twitter.com/KaranAr37362920/status/1669563764017086464
జూన్ 16 , 2023
AI IMAGES OF ADIPURUSH: విస్మయానికి గురి చేస్తున్న ఆదిపురుష్ పాత్రల పునఃసృష్టి
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూన్ 13 , 2023
Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
ట్రైలర్ యాంగిల్
ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు.
https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc
ట్రైలర్‌లో ఏముంది?
ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు. లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది.
నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.
బలహీనతలు:
ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.
తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది.
డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు.
ఫైనల్‌గా
భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
మే 09 , 2023
Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెళ్లిపై ప్రకటన..
ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20
ఇక సినిమాల జాతరే..
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.
https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20
ఆదిపురుష్ సినిమా..
ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.
చిరంజీవి కామెంట్స్..
ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc
కృతి సనన్..
ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.
ప్రభాస్‌పై కృతి సనన్..
ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది. ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది.
https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA
ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.
https://www.youtube.com/watch?v=JopeURxPZmE
హైలెట్స్..
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ముఖ్య అతిథులు..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
జూన్ 07 , 2023
Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్ ఒక్కడేనా.. దంగల్ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
దేశంలో ‘ఆదిపురుష్’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్ నిజంగానే దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆదిపురుష్ బడ్జెట్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్ బడ్జెట్ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్’ నిలిచింది.
పెట్టుబడికి ఢోకా లేదు
ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్ టీమ్ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
దంగల్ VS ఆదిపురుష్
దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేయాలంటే ఆదిపురుష్ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్.. చైనా, హాంకాంగ్, మలేషియా, UAE, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్ కథ యూనివర్సల్ సబ్జెట్ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్ టాక్ తోడైతే ఆదిపురుష్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ జూన్ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, వంశీ, ప్రమోద్, ఓంరౌత్ నిర్మించారు.
మే 11 , 2023
SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.
‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీం సభ్యుల ప్రచారం..
సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.
కెమెరా..
సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.
సరికొత్తగా ప్రభాస్..
సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సెన్సేషనల్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.
https://twitter.com/Attitudist/status/1671201399584227328
మ్యూజిక్
కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ
https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
జూన్ 21 , 2023
Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
1920
అవికా గోర్ లీడ్ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన '1920' సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.
ధూమం (Dhoomam)
పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
మనుచరిత్ర
మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి.
భారీ తారా గణం
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం 'భారీ తారాగణం'. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇంటింటి రామాయణం
ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన 'ఇంటింటి రామాయణం' చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు.
టీకూ వెడ్స్ షేరు
ఫస్ట్ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్ కౌర్ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files)
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్ మలయాళంలో 'కేరళ క్రైమ్ ఫైల్స్' అనే కొత్త వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్, అజు వర్గీస్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.
ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు
TitleCategoryLanguagePlatformRelease DateTake Care of MayaMovieEnglishNetflixJune 19GlamorousWeb SeriesEnglishNetflixJune 21Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22Social CurrencyWeb SeriesHindiNetflixJune 22Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23Class of 09 Web SeriesEnglishDisney + HotstarJune 19Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23World's Best MovieEnglishDisney + HotstarJune 23AgentMovieTeluguSony LivJune 23Lions Gate PlayMovieEnglishSony LivJune 23
జూన్ 19 , 2023
Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే స్క్రీన్స్‌పై చూసేవాళ్లకు రియల్‌గా అనిపిస్తుంటుంది. యాక్షన్ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరుశురాముడిగా ప్రభాస్!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్‌కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్‌ను కూడా కలిసినట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
విలన్స్‌గా స్టార్ కపుల్స్
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్’లో కరీనా కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్ లైఫ్‌లో కపుల్స్ అయిన కరీనా, సైఫ్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్స్‌గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్‌తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
సెప్టెంబర్ 28 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే!
హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్ (2023) ముందు వరకూ ప్రభాస్ ఒక్కో చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చూస్తూ దూసుకెళ్తున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ వ్యూహం!
ప్రభాస్ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్
బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
ఆగస్టు 31 , 2024
Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్ (Jai Shree Ram) నినాదాలతో యావత్ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆదిపురుష్
రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ (Aadipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.
శ్రీరామ రాజ్యం
బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి.
శ్రీ రామదాసు
శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు.
దేవుళ్లు
తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
బాల రామాయణం
చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం 'బాల రామాయణం' (Bala Ramayanam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.
శ్రీ సీతారామ జననం
1944లో విడుదలైన 'శ్రీ సీతా రామజననం' (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్ కూడా ఇచ్చారు.
సీతారామ కళ్యాణం
నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.
సంపూర్ణ రామాయణం
టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.
లవకుశ
నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.
జనవరి 23 , 2024
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్‌లో ప్రభాస్, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్, డంకీ, జవాన్, శ్యామ్ బహదూర్ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్', 'సలార్' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.
ప్రభాస్‌కు అన్యాయం!
బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas) క్రేజ్ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్ చేసిన ఆదిపురుష్ (Aadipurush), సలార్ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్ మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.
సలార్ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki)
షారుక్ ఖాన్ రీసెంట్ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది. అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.
సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
పాపం రష్మిక..!
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.
అప్పట్లోనే అవమానం
అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది.
https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20
‘యానిమల్’ సత్తా చాటేనా!
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్ కపూర్, ఉత్తమ సహాయ నటులుగా అనిల్ కపూర్, బాబీ దేబోల్, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా
ఉత్తమ చిత్రం (పాపులర్)
12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్ బహదూర్‌త్రీ ఆఫ్ అజ్‌జ్విగాటో
ఉత్తమ దర్శకుడు
అమిత్ రాయ్ (ఓఎంజీ2)అట్లీ (జవాన్)కరణ్ జోహార్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)సందీప్ వంగా (యానిమల్)సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు
రణ్‌బీర్ కపూర్ (యానిమల్)రణ్‌వీర్ సింగ్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)షారుక్‌ఖాన్ (డంకీ)షారుక్ ఖాన్(జవాన్)సన్నీ దేఓల్ (గదర్2)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)జయ్‌దీప్ అహల్వత్ (త్రీ ఆఫ్ అజ్)మనోజ్ బాజ్‌పాయ్ (జొరామ్)పంకజ్ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్ రావ్ (బీడ్)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి
అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)దీపిక పదుకొణె (పఠాన్)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
దీప్తి నవల్ (గోల్డ్ ఫిష్)ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్ (ఘూమర్)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు
ఆదిత్య రావల్ (ఫరాజ్)అనిల్ కపూర్ (యానిమల్)బాబీ దేఓల్ (యానిమల్)ఇమ్రాన్ హష్మి (టైగర్3)టోటా రాయ్ చౌదరి (రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి
జయా బచ్చన్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)రత్న పాఠక్ షా (ధక్ ధక్)షబానా అజ్మీ (ఘూమర్)షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్)యామి గౌతమ్ (ఓఎంజీ2)
జనవరి 17 , 2024
Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్ హీరోల చిత్రాలు ఇవే!
2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్ రోల్ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది.
ఏజెంట్
యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.
ఆదిపురుష్
ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.
కస్టడీ
ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
రావాణాసుర
రవితేజ తొలిసారి విలన్ షేడెడ్ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.
గాండీవదారి అర్జున
వరణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.
రామబాణం
ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ హీరో గోపిచంద్.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.
భోళాశంకర్
మెగాస్టార్ హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
ఆదికేశవ
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 20 , 2023
2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్-10 తెలుగు హీరోలు వీరే!
భారత్‌లో అతిపెద్ద వినోద రంగంగా సినిమాలను చెప్పుకోవచ్చు. దేశంలో సినీ హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2023గాను నెటిజన్లు విపరీతంగా శోధించిన పలువురు టాలీవుడ్ హీరోల జాబితా బయటకొచ్చింది. వారిలో టాప్-10 హీరోలు ఎవరు? వారు ఏ కారణం చేత ఎక్కువగా శోధించబడ్డారు? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
ప్రభాస్
సినీ ప్రేక్షకులు ఎక్కువగా శోధించిన టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కావడం, లేటెస్ట్ మూవీ సలార్ సైతం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రభాస్ ఆటోమేటిక్‌గా మోస్ట్ సెర్చ్‌డ్ హీరోగా నిలిచారు.
జూ.ఎన్టీఆర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో జూ.ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దేవర’ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తారక్, ఆయన నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ విపరీతంగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ జాబితాలో తారక్ రెండో స్థానంలో నిలిచాడు.
అల్లు అర్జున్
పుష్ప సినిమా ద్వారా దేశంలోని సగటు సినీ ప్రేక్షకుడికి అల్లు అర్జున్ దగ్గరయ్యాడు. ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా బన్నీ నిలిచాడు. అటు బన్నీ నటిస్తున్న పుష్ప-2 నుంచి పోస్టర్, టీజర్ వంటి అప్‌డేట్స్ రావడంతో బన్నీ మరింత పాపులర్ అయ్యాడు. అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.
మహేష్ బాబు
నెట్టింట ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు నాల్గో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు రిలీజ్ అవుతుండటంతో మహేష్ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది.
రామ్ చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో చెర్రీ నటిస్తున్నాడు.
పవన్ కల్యాణ్
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ పవన్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో పవన్ సినిమాల గురించే కాకుండా పొలిటికల్‌గానూ ఆయన సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువ మంచి సెర్చ్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
తెలుగులో మోస్ట్ పాపులర్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. అర్జున్ రెడ్డితో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఆయన నటించిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
నాని
నేచురల్ స్టార్ నాని గురించి కూడా 2023 ఏడాదిలో చాలా మంది సెర్చ్ చేశారు. ఆయన నటించిన దసరా చిత్రం ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల ‘హాయ్ నాన్న’ సినిమాతోనూ మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకున్నాడు.
చిరంజీవి
జయాపజాయలతో సంబంధం లేని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన గురించి కూడా ఈ ఏడాది చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్’ మాత్రం ఫ్యాన్స్‌ను అకట్టుకోవడంలో విఫలమైంది.
రవితేజ
మాస్ మహారాజు రవితేజ తెలుగు స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.
డిసెంబర్ 14 , 2023
ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్ సూపర్… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్ వచ్చినట్లేనా?
నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు.
డైరెక్టర్: ఓం రౌత్
నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్.
మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర
ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.
అదే కథ..
రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్ డిజైన్ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు.
ఎవరెలా చేశారు?
రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.
టెక్నికల్‌గా
రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
పోరాట సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
గ్రాఫిక్స్
సాగతీత సన్నివేశాలు
ఎడిటింగ్
చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు.
రేటింగ్: 2.75/5
జూన్ 16 , 2023
Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..!
రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు.
చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించాడు. సీతాపహరణం నుంచి రావణ సంహారం వరకు కథాంశంగా తీసుకుని ఆదిపురుష్‌ని తెరకెక్కించారు. అయితే, నితేశ్ తివారి తీయబోయే రామాయణం విజువల్ వండర్‌గా ఉండనుందట. స్టోరీ లైన్‌పై స్పష్టత లేనప్పటికీ రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించాలన్న సంకల్పంతో డైరెక్టర్ ఉన్నాడు. ఇందుకు అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు.
తారాగణం..
రామాయణం కథ అందరికీ తెలిసిందే. కానీ, దానిని చూపించడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే. అందుకే ప్రతి చిన్న విషయంలో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం ప్రధానంగా తారాగణంపై ఫోకస్ పెట్టింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీతగా అలియాను ఎంచుకున్నారు. దీపావళికి దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఉండనుంది.
రావణుడిగా యశ్..
కీలకమైన రావణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురితో డైరెక్టర్ చర్చించాడు. లేటెస్ట్‌గా కేజీఎఫ్ స్టార్ యశ్‌ని ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే, జనవరిలోనే మేకర్లు యశ్‌ని కలిశారట. అప్పటినుంచి స్క్రిప్ట్ చర్చల్లోనే వీరున్నారట. విలన్ రోల్ చేయడానికి యశ్ దాదాపుగా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో యశ్ రోల్‌ని కన్ఫర్మ్ చేయనుంది. వాస్తవానికి తొలుత హృతిక్ రోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి పరిశీలించి చూశారు. అయితే, విక్రమ్‌వేదలో నెగెటివ్ రోల్ దెబ్బకొట్టడంతో హృతిక్ రామాయణం ప్రాజెక్టుకు నో చెప్పాడు.
లుక్ టెస్ట్..
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లుక్ టెస్ట్ నడుస్తోంది. రాముడి పాత్రకు తగ్గట్టు రణ్‌బీర్ తనను తాను మలుచుకోనున్నాడు. పైగా, వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇటీవల వీరిద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర హిట్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్‌లో షూట్..
డిసెంబరు నుంచి ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. అన్నీ కుదిరితే 2025 దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను మధు మంతెన వర్మ, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీనిని తీసుకు రానున్నారు.
జూన్ 08 , 2023
Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా?
రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.
తేజ సజ్జ:
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు హనుమాన్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.
https://youtu.be/AvjvZ7q2apE
దేవ్‌దత్తా నాగే:
అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.
చిరంజీవి:
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20
https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20
https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20
https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20
https://youtu.be/BfJRVxeIKD8
అర్జున్:
నితిన్ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్ హనుమాన్ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్ అయినా అలవోకగా చేయగలనని అర్జున్ ఈ సినిమా ద్వారా నిరూపించారు.
రాజేంద్ర ప్రసాద్:
నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్ అయ్యింది.
విందు దర సింగ్:
సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
ఏప్రిల్ 04 , 2023
Ramayana: ‘రామాయణం’ టీమ్ నుంచి డబుల్ ట్రీట్.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూట్ మెుదలవ్వగా సెట్ నుంచి కొన్ని ఫోటోలు సైతం లీకయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి కళ్లు చెదిరే అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ అధికారికంగా అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రెండు పార్ట్స్‌గా..
‘రామాయణ’ (Ramayana) చిత్రం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మెుదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. ఇది గమనించిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీని రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
హనుమంతుడిగా సన్నీ డియోల్!
‘రామయణ’ (Ramayana) చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడితో పాటు పలువురు స్టార్ నటులు ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సూర్పనక రోల్ చేస్తున్నట్లు తెలిసింది. హిందీ ‘రామాయణం’ సీరియల్‌లో రాముడిగా కనిపించి ఎంతో పాపులర్ అయిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, మందరగా షీబా చద్దా చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు రామయణ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.
https://twitter.com/seeuatthemovie/status/1854049562689740919
ఆస్కార్ విన్నర్లతో మ్యూజిక్
‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర‌్లు రంగంలోకి దిగారు. ఇందులో ఒకరు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కాగా ఇంకొకరు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్దరూ కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించనున్నారు. తొలుత ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్‌ను మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. అయితే అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో మ్యూజిక్ ఉండాలన్న ఉద్దేశ్యంతో హన్స్ జిమ్మెర్‌ను సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యుడ్ని చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పనిచేసిన హన్స్‌కు ‘రామాయణ’ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ కానుంది. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ వంటి హాలీవుడ్ చిత్రాలతో హన్స్ జిమ్మెర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
గ్రాఫిక్స్‌పై స్పెషల్ ఫోకస్
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణ’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 26 మంది ఎక్స్‌పర్ట్ గ్రాఫిక్స్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి వీఎఫ్‌ఎక్స్ విషయంలో మూవీ టీమ్ ఏమాత్రం రాజీ పడటం లేదని అర్థమవుతోంది.
తెలుగు బాధ్యత త్రివిక్రమ్‌దే!
రామాయణ (Ramayana) తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా త్రివిక్రమ్ ఎక్కడా ఖండించలేదు. దీంతో ‘రామాయణ’ టీమ్‌లో మాటల మాంత్రికుడు సైతం భాగస్వామి అయినట్లు తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు.
నవంబర్ 06 , 2024