రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
అంజినమ్రతా శిరోద్కర్
స్వప్నటిన్ను ఆనంద్
వీరేంద్ర భాటియానాగేంద్ర బాబు
శివన్నభూపీందర్ సింగ్
యంగ్ భాటియాఎంఎస్ నారాయణ
అక్షయ్ రెడ్డిమాస్టర్ అక్షయ్
భారత్మాస్టర్ భారత్
వంశీమాస్టర్ వంశీ
మేఘన గుమ్మిబేబీ మేఘన
కీర్తనబేబీ కీర్తన
నిత్యా శెట్టి
బేబీ నిత్యసరస్వతమ్మ
మధుసూధన్ రావు
భాటియా హెంచ్‌మన్ (పరువు పొందలేదు)రమ్య కృష్ణన్
చిక్‌బుక్ పోరీ అనే పాటలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించిందిరీమా సేన్
మానవ మానవా పాటలో రాజలక్ష్మి రాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు
సిబ్బంది
కోడి రామకృష్ణ
దర్శకుడుశ్యామ్ ప్రసాద్ రెడ్డి
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుఛోటా కె. నాయుడు
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Aay Movie Review: ఎన్టీఆర్ బావమరిది ఖాతాలో మరో హిట్ పడినట్లేనా?
నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు
దర్శకుడు: అంజి కె మణిపుత్ర
సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి
నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్’ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అమలాపురంకు చెందిన కార్తీక్ (నార్నే నితిన్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కార్తీక్ పాత్రలో నార్నే నితిన్ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అతనిలో పరిణతి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చమైన గోదావరి అమ్మాయిగా తెరపై సందడి చేసింది. ఫ్రెండ్స్ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా కసిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. అయితే రొటీన్ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్ చేయడం, లాజిక్ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకామెడీక్లైమాక్స్
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందేలా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 16 , 2024
Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్ ఫేమస్’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
నటీనటులు: సుమంత్ ప్రభాస్, సిరి రాశి, మురళిధర్ గౌడ్, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,
డైరెక్టర్: సుమంత్ ప్రభాస్
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, సూర్య చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్ పద్మభూషణ్` వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్ అయిన ‘మేమ్ ఫేమస్’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ
తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి తన మరదలు మౌనిక (సార్య లక్ష్మణ్)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.
అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్ సర్య్కూట్‌కి టెంట్ హౌజ్ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా సాగిందంటే..
ముగ్గరు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫస్టాఫ్ అంతా రిపీట్ మోడ్‌లో కనిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్ హౌజ్ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్ ఇష్యూస్, టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్ అంతా యూట్యూబ్ వీడియోస్ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి. అలాగే సుమంత్ ప్రభాస్, సార్య లక్ష్మణ్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. సుమంత్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక మణి, సార్య లక్ష్మణ్, మణి ఏగుర్ల, మురళీధర్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫర్వాలేదనిపించాడు. నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిలర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివనందన్ కామెడీ బాగుంది. అనవసర సన్నివేశాలు సినిమాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మేమ్ ఫేమస్ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్ ప్రభాస్ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బలం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వర్క్ బావుంది. కళ్యాణ్ నాయక్ పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్ ఎందుకని భావించినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్
కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
మే 26 , 2023
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024
Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?
నటీనటులు : భాను ప్రకాష్, సృజన్, మణి ఏగుర్ల, మోహన్ భగత్, రవీందర్ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ, తదితరులు
రచన, దర్శకత్వం : అనంత్ వర్ధన్
సంగీతం : సంజీత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ : ముత్యాల సునీల్
ఎడిటర్: వెంకట్ రెడ్డి
నిర్మాత : వినోద్ అనంతోజు
ఓటీటీ : ఈటీవీ విన్
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఇటీవల వరుసగా ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘సోపతులు’ అనే ఫిల్మ్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల స్నేహ బంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రధానంగా ఇద్దరు బాలలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ స్నేహితుల మధ్య అనుబంధం ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చింటు (మాస్టర్ భానుప్రకాశ్), గుడ్డు (సృజన్) బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అనుకోకుండా వచ్చిన కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో గుడ్డూ కుటుంబం మహబూబాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డూ సైతం ఎలాగైనా మిత్రుడిని చూడాలని అనేక ప్రయాసలు పడుతుంటాడు. మరి వారిద్దరు కలిశారా? ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే చింటు అన్నయ్య కల నెరవేరిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇందులో పాత్రలు తక్కువే అయినా తెరపైన కనిపించిన ప్రతీ ఒక్కరి నటన సంతృప్తి ఇస్తుంది. చింటుగా మాస్టర్ భాను ప్రకాశ్ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. గుడ్డూగా సృజన్ సైతం మెప్పించాడు. వారిద్దరు ఎంతో సహజంగా నటించారు. కథ మెుత్తం వారిద్దరి చుట్టే తిరిగింది. అటు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ కూడా ఓ కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. చింటు అన్నయ్యగా మణి ఏగుర్ల, అనూష రమేశ్, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కొవిడ్/లాక్‌డౌన్‌ను కథా వస్తువుగా తీసుకొని ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనంత్ వర్ధన్. కొవిడ్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి ఇబ్బిందులు పడ్డాయో కళ్లకు కట్టాడు. చింటు, గుడ్డు, వారి ఫ్యామిలీ నేపథ్యంతో కథను నెమ్మదిగా ప్రారంభించిన డైరెక్టర్ కథలో ముందుకెళ్లెకొద్ది ఆసక్తి రగిలించాడు. ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేక గుడ్డూ పడే ఇబ్బందులు హృదయాన్ని హత్తుకుంటాయి. చింటూ అన్నయ్య పాత్రను నేటి యువతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తి ఇస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, మలుపు కొరవడటం, ఊహకందేలా కథనం సాగడం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని పాత్రల ముగింపు అంసపూర్ణంగా ఉండటం వంటివి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
బాలల నటనభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంఊహాకందేలా కథనం సాగటం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 20 , 2024
Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్’ సరసన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్ కాదు భయ్యా!
2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్ - కలెక్షన్స్ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
ఆయ్ (Aay)
నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ కూడా కలుపుకుంటే ‘ఆయ్’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ & ఫ్యూచరిక్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటివారు స్పెషల్ క్యామియోలతో అలరించారు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
హనుమాన్ (Hanuman)
తేజసజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్ క్రేజ్‌తో ప్రశాంత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టనున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
This Week Movies: ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
ఆగస్టు 12 , 2024
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్‌గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్‌గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024
Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం.
నటీనటులు
నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్
కథ
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు. కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు. ఎక్కడ ఎమోషన్స్ మిస్ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.
సినిమా ఎలా ఉందంటే?
నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది. దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి.
ఎవరెలా చేశారంటే?
నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్ అదిరిపోయింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు.
టెక్నికల్ విషయాలు…
సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్ చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.
బలాలు
నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్
బలహీనతలు
ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు
చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు.
రేటింగ్: 3/5
జనవరి 14 , 2024
Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సగం రీమేక్‌లే..
సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దిగజారిన స్థాయి?
తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది.
తేడాకొడుతున్న రీమేక్?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే
.
సక్సెస్ ఫార్ములా?
చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.
రీమేక్స్ వద్దు..
చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
ఆగస్టు 11 , 2023
Adipurush Memes: ఆదిపురుష్ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..!
ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద మిక్స్‌డ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తోంది. అయితే, రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. ఇందులోని పాత్రల చిత్రీకరణ, గెటప్, తదితర విషయాల్లో మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సినిమా విడుదలయ్యాక కూడా ఈ విమర్శలు ఆగట్లేదు. కొందరైతే పాత్రలను ఇంతకు ముందు సినిమాలతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరీ, ముఖ్యంగా ఇందులో ఓ పాత్ర అయితే అచ్చం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని పోలి ఉందని పిక్స్ షేర్ చేస్తున్నారు.
ఆదిపురుష్‌లో ఏక్‌నాథ్ షిండే..
ఆదిపురుష్‌లో వేసిన ఓ వానర పాత్ర గెటప్‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాత్ షిండే ముఖ కవలికలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ముఖాన్ని చూస్తే డిట్టో షిండేనే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రెండింటికీ తేడా..
నెటిజన్లు మరొక అడుగు ముందుకేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు. సినిమాలో ప్రభాస్ తెల్లటి వస్త్రాలు ధరించి కనిపిస్తాడు. ఈ ఫొటోను గుర్తు చేస్తూ ఎక్కడో చూసినట్లుందే అంటూ కమెడియన్ రఘు బాబు ఫొటో షేర్ చేస్తున్నారు. దరువు సినిమాలోని పండిట్‌జీ గెటప్‌కి, ప్రభాస్ గెటప్‌కి ఏమైనా తేడా ఉందా చెప్పండంటూ కామెంట్లు పెడుతున్నారు.
రావణ క్యారెక్టర్‌పై..
ఆదిపురుష్‌లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అయితే, లంకేశుడి పాత్రను చూపించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకీ రామాయణంలో లేని రావణుడిని సృష్టించారంటూ గుణ గణాలను పోలుస్తున్నారు. ఇప్పటివరకు చూసిన రావణుడు, ఆదిపురుష్ రావణుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
వీఎఫ్ఎక్స్‌పై..
గతేడాది ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక కూడా ఇవి ఆగట్లేదు. సినిమా కోసం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా, విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇతర సినిమాల గ్రాఫిక్స్‌తో పోల్చుతూ కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/Lordofbattles8/status/1669609782595170305
మరికొందరు, ఇతర లోకల్ వీడియోలను షేర్ చేస్తూ ఆదిపురుష్ కన్నా ఇదే నయం అంటున్నారు.
https://twitter.com/DoctorrSays/status/1669622038544400384
ఇప్పుడొచ్చిన ఆదిపురుష్ కన్నా 20 ఏళ్ల కిందట విడుదలైన అంజి సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.
https://twitter.com/superking1816/status/1669611748188622848
2010లోనే షారూక్ ఖాన్ సినిమాలో ఇంత చక్కని గ్రాఫిక్స్ ఉపయోగించడం గొప్ప విషయం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కర్మ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు.
https://twitter.com/KaranAr37362920/status/1669563764017086464
జూన్ 16 , 2023
HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !
టాలీవుడ్ టాప్ హీరోల భార్యలు చాలామంది సుపరిచితమే. కథానాయికల భార్యలుగా కాకుండా వారికంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వాళ్లు ఉన్నారు. వ్యాపారంతో సహా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. వాళ్లేవరూ? ఏ పనులు చేస్తున్నారో తెలుసుకోండి.
అల్లు స్నేహా రెడ్డి
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తండ్రి కళాశాలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. SIT ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్‌గా ఉంది స్నేహా. అంతేకాదు, యువతను ప్రోత్సహించే దిశగా తీసుకువచ్చిన కాలేజీ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గాను సేవలందిస్తోంది. కళాశాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లో ఉత్సాహంగా పాల్గొంటుంది స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలోనూ మెళకువలు సాధించింది. ఓ మళయాలం చిత్రంలోనూ నటిస్తుందని టాక్.
ఉపాసన కొణిదెల
మెగాస్టార్ కోడలిగా మెగా పవర్ స్టార్‌కు రామ్ చరణ్‌కు భార్య అయినప్పటికీ ఉపాసన తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. URLIFE అనే వెల్‌నెస్ సంస్థను స్థాపించడంతో పాటు అపోలో ఆస్పత్రికి వైస్ ఛైర్‌పర్సన్‌గాను కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఉప్సీ. జంతు సంరక్షురాలిగానూ ఆమె సేవలందిస్తున్నారు.
ప్రణతి
జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వ్యాపారవేత్త కుమార్తె. వివాహం చేసుకున్న తర్వాత గృహిణిగానే ఉంటున్నారు. అయితే.. కొన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు.
నమ్రతా షిరోద్కర్
మహేశ్ బాబు భార్య నమ్రతా షిరోద్కర్ ఓ బాలీవుడ్ నటి. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గాను గుర్తింపు పొందారు. తెలుగులో వంశీ, అంజి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ తర్వాత మహేశ్ బాబు చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నమ్రతా. మహేశ్ దత్తత తీసుకున్న ఊర్లను దగ్గరుండి బాగు చేయించారు. వివిధ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు.
అంజనా
నాని భార్య అంజనా గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అంజనాని నాని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి దాదాపు 5 ఏళ్లు ఆగారు. పెళ్లి తర్వాత ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని వ్యాపారాలను చూసుకుంటున్నారని తెలుస్తోంది.
జ్యోతిక
జ్యోతిక సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొన్నిరోజులు దూరమైనప్పటికీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు జ్యోతిక.
అమల
హీరోయిన్ అమల ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు పోషిస్తూనే NGOకి కో- ఫౌండర్‌గా ఉన్నారు. ది బ్లూ క్రాస్ హైదరాబాద్ ఎన్జీవోకి సేవలందిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు అమల.
ఏప్రిల్ 18 , 2023
అజిత్ “తెగింపు” సమీక్ష.. ప్రేక్షకులకు నచ్చిందా?
]రేటింగ్: 2.75/5అజిత్ నటన
యాక్షన్ ఎపిసోడ్స్
సందేశంప్లస్ పాయింట్స్‌కథలో బలం లేకపోవడం
రొటీన్ స్క్రీన్ ప్లే
లాజిక్‌లేని సీన్స్
ఫ్లాష్ బ్యాక్మైనస్ పాయింట్స్
ఫిబ్రవరి 13 , 2023
Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, శ్రీతేజ్, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు
దర్శకత్వం : ముఖేష్ ప్రజాపతి
సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్. కుమార్
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటింగ్ : రవితేజ గిరిజల
నిర్మాత : ప్రశాంత్ మలిశెట్టి
ఓటీటీ వేదిక : జీ 5
విడుదల తేదీ : 19-07-2024
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్ స్టోరీ. ‘
ఎవరెలా చేశారంటే
వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్‌తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్ చూపించింది. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్‌గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ సెటిల్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. తన డైలాగ్స్, లుక్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్ చేసి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను రూపొందించారు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అణిచివేయబడ్డారన్నది రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారు. డ్రామా, ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మలుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్‌టైన్ చేస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ప్రసన్న ఎస్. కుమార్ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ రెంజ్‌లో ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అంజలి నటనపిరియాడికల్ రివేంజ్ డ్రామానేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ట్విస్టులు లేకపోవడంకొన్ని బోరింగ్ సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 19 , 2024
Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్ హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్ వెనక్కి తగ్గలేదు. అజిత్ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్ స్టంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పల్టీ కొట్టిన అజిత్ కారు!
ప్రస్తుతం అజిత్ (Ajith) తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’ (Vida Muyarchi)లో నటిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్ ఫాస్ట్‌గా కారు డ్రైవ్ చేయాలి. డూప్ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.
https://twitter.com/Fukkard/status/1775813515233878447
‘ధైర్యానికి హద్దులు ఉండవు’
ఈ వీడియోను షేర్ చేసిన లైకా ప్రొడక్షన్స్.. దీనికి అదిరిపోయే క్యాప్షన్ సైతం ఇచ్చింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ‘విదా ముయార్చి’ చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఏప్రిల్ 04 , 2024
KGF 3: ‘కేజీఎఫ్ 3’లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ డీల్!
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ నటుడు యష్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. యష్ నటన, ప్రశాంత్ నీల్ పనితనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వీరి కాంబోలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ‘కేజీఎఫ్ 3’లో కోలివుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మెుదలయ్యాయి.
‘కేజీఎఫ్ 3’లో అజిత్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'విదా ముయార్చి' (Vidaamuyarchi) మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్న అజిత్ మరో స్టార్ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్. లేటెస్ట్ బజ్ ప్రకారం అజిత్‌తో కలిసి ప్రశాంత్ నీల్ రెండు చిత్రాలు తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి విభిన్నమైన కథాంశం కలిగిన స్టాండలోన్ మూవీ కాగా, మరొకటి కేజీఎఫ్ యూనివర్స్‌కు లింకప్ చేసే కథ అని ప్రచారం జరుగుతోంది. దీంతో 'కేజీఎఫ్ 3' చిత్రంలో యష్‌తో పాటు అజిత్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ మెుదలైంది. దీంతో కేజీఎఫ్ సిరీస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 'కేజీఎఫ్ 3' అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేయడం ఖాయమని ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/nitishyadav1801/status/1816002560731287619
టైమ్ పట్టనుందా?
అజిత్, ప్రశాంత్ నీల్ చేతిలో ఇప్పటికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘విదా ముయార్చి’ తర్వాత అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మంచనుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఇప్పటికే 'సలార్ 2' ప్రాజెక్ట్ ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో 'NTR 31' అనే సినిమాను సైతం అనౌన్స్ చేశారు. ఆ రెండు చిత్రాల తర్వాత అజిత్‌తో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అటు కేజీఎఫ్ హీరో యష్ సైతం ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెుదలైంది. ‘కేజీఎఫ్ 3’కి కీలకమైన ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు.
కలెక్షన్ల సునామీ
యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం 2018 డిసెంబర్ 21 విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల అనంతరం వాటిని అందుకుంటూ వసూళ్లు సునామీ సృష్టించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆపై దీనికి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ 2' అంతకుమించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,225–1,250 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో 'కేజీఎఫ్ 3'పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
జూలై 24 , 2024
The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్
ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.
భరతభూమికి అంకితం..
95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును జన్మభూమి భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రబృందానికి, కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్తికి గొన్సాల్వేస్ తల్లి ప్రిసిల్లా గొన్సాల్వేస్ ఈ సినిమాకు కథను అందించారు.
వీటితో పోటీ..
హాలౌట్(Haulout), హౌ డు యు మెజర్ ఎ ఇయర్(How Do You Measure a Year?), ద మార్తా మిచెల్ ఎఫెక్ట్(The Martha Mitchell Effect), స్ట్రేంజర్ ఎట్ ద గేట్(Stranger at the Gate) చిత్రాలతో పోటీ పడి ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రం 2022 డిసెంబర్ 8న విడుదలైంది.
కథేంటి..?
ఏనుగు, ఓ కుటుంబం మధ్య ఏర్పడే అనుబంధం గురించి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ వివరిస్తుంది. బొమ్మన్, బెల్లి దంపతులు ‘రఘు’ అనే అనాథ ఏనుగును చిన్నప్పుడే దత్తత తీసుకుని అపురూపంగా పెంచుకుంటారు. గాయపడిన ‘రఘు’కు ఎన్నో సపర్యలు చేసి పెంచుకునే క్రమంలో బంధుత్వం ఏర్పడుతుంది. ఈ షార్ట్‌ఫిలిం ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అదే సమయంలో గిరిజనుల జీవన విధానం, పచ్చని అడవి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ కార్తికి.
షార్ట్ ఫిలిం వెనక ఎంతో శ్రమ
షార్ట్ ఫిలిం అయినప్పటికీ ఈ లఘుచిత్రాన్ని తీయడానికి డైరెక్టర్ కార్తికి అండ్ టీం ఎంతో శ్రమ పడ్డారు. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కార్తికి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మూడు నెలలు వయసు ఉన్నప్పుడే పిల్ల ఏనుగు ‘రఘు’ను కలిసినట్లు కార్తికి చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ ఏనుగుతో గడిపారట. తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ‘ముదుమలై నేషనల్ పార్క్’లో ఈ సినిమాను చిత్రీకరించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
39 నిమిషాల నిడివితో కూడిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కింద ఈ సినిమా తెరకెక్కింది. గునీత్ మొంగా ప్రొడ్యూస్ చేశారు.
మూడో చిత్రం..
భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న మూడో సినిమా ఇది. గతంలో రెండు లఘు చిత్రాలు ఆస్కార్‌కు పోటీపడ్డాయి. 1969లో ద హౌజ్ దట్ ఆనంద బిల్ట్(The House That Ananda Built), 1979లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్(An Encounter With Faces) నామినేషన్లు దక్కించుకున్నాయి. కానీ, అవార్డును పొందలేకపోయాయి. ద ఎలిఫెంట్ విస్పరర్స్ ఈ లోటును తీర్చింది.
మార్చి 13 , 2023
Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్
అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ రెడ్డి' (Love Reddy). గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్ మీట్ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దాడి ఎందుకు జరిగిందంటే?
లవ్ రెడ్డి చిత్రానికి హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్ బాస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నిజాంపేటలోని జీపీఆర్ మాల్‌కు 'లవ్ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్ రన్ అవుతోంది. హీరోయిన్ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
https://twitter.com/telugu_insider/status/1849700707248767217
‘లవ్ రెడ్డి’ ఎలా ఉందంటే
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి.
కథ ఏంటంటే
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
అక్టోబర్ 25 , 2024
Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు
రచన, దర్శకత్వం : స్మరణ్ రెడ్డి
సంగీతం : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ, అస్కర్ అలీ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : హేమలతా రెడ్డి
విడుదల తేదీ: 18-10-2024
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా చేసిన ఎన్.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీ నటులుభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 18 , 2024