• TFIDB EN
 • అప్పట్లో ఒకడుండేవాడు
  U/ATelugu2h 5m
  క్రికెట్‌ కావాలని కలలు కన్న రైల్వే రాజు (శ్రీ విష్ణు) అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుంటాడు. పోలీసు అధికారి ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) అతడ్ని బాగా ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
  Watch
  Free
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  నారా రోహిత్
  ఇంతియాజ్ అలీ
  శ్రీ విష్ణు
  రైల్వే రాజు
  తాన్యా హోప్
  నిత్య
  సాషా సింగ్రియా
  బ్రహ్మాజీ
  విట్టల్ సేథ్
  రాజీవ్ కనకాల
  అశోక్ రెడ్డి
  అజయ్
  నడయార్
  ప్రభాస్ శ్రీను
  సోలమన్
  రాజ్యలక్ష్మి
  రాజు తల్లి
  అప్పాజీ అంబరీష దర్భరియ తండ్రి
  మానస హిమవర్షఅహల్య
  జివి సుధాకర్ నాయుడు
  భగవాన్ సాస్
  రవి వర్మ
  సవ్యసాచి
  రవి ప్రకాష్
  రైల్వే రాజు క్రికెట్ కోచ్
  సమీర్
  చీఫ్ క్రికెట్ సెలక్షన్ సభ్యుడు
  సత్య ప్రకాష్
  పురుషోత్తం
  జీవా
  IPS అధికారి
  రాజ్ మాదిరాజు
  ఒక IPS అధికారి
  కాళీచరణ్ సంజయ్
  జబరదస్త్ నవీన్
  TNR
  సత్యదేవ్ కంచరణా
  ప్రణీత్ కుమార్ / టెస్టర్ (అతి అతిధి పాత్ర)
  మాస్టర్ సాయి నీరజ్టెస్టర్ (బాల)
  సిబ్బంది
  సాగర్ కె చంద్ర
  దర్శకుడు
  ప్రశాంతి నిర్మాత
  కృష్ణ విజయ్నిర్మాత
  సాయి కార్తీక్
  సంగీతకారుడు
  కోటగిరి వెంకటేశ్వరరావు
  ఎడిటర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
  Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
  ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.  కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.  మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.  మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.  కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.  మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
  మే 04 , 2024
  Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
  Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
  సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
  మార్చి 22 , 2024
  రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
  రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
  టాలివుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, బాలయ్య, మహేశ్‌ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన రామ్‌ చరణ్ ‘ఆరెంజ్‌’ కూడా ఇటీవల  విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  దేశముదురు అల్లు అర్జున్‌ను మాస్‌ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా  ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్‌ స్టార్‌ మేనియాను క్యాష్‌ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.   ఆది RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్‌ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వివి వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సింహాద్రి రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.  మోసగాళ్లకు మోసగాడు భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్‌ ఫిల్మ్‌ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్‌ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా  మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్‌ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్‌ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్‌ ఉండదు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం సోషల్‌ మీడియాలో నిత్యం తరుణ్‌ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్‌ భాస్కర్‌ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే  రీ రిలీజ్‌ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. రజినీకాంత్‌ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని  మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో  ఫ్లాప్‌ అయినా టీవీలో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్‌ చేస్తున్నారు. మీరు ఏ సినిమా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్‌ చేయండి.
  ఏప్రిల్ 01 , 2023
  Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
  Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
  నందమూరి నటసింహం బాలకృష్ణ- సిమ్రాన్‌కు తెలుగులో సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వీరి జోడికి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉండేది. బాలయ్య- సిమ్రాన్ కాంబోలో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. సమరసింహారెడ్డి సిమ్రాన్- బాలకృష్ణ(Balakrishna - Simran) కాంబోలో వచ్చిన మొదటి చిత్రం సమర సింహా రెడ్డి(1999).  సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బి.గోపాల్ తెరకెక్కించారు. గొప్పింటి అల్లుడు సమరసింహారెడ్డి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి జోడి కుదరింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన 'గొప్పింటి అల్లుడు'(2000) చిత్రంలో బాలయ్య- సిమ్రాన్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. నరసింహ నాయుడు బాలకృష్ణ- సిమ్రాన్(Balakrishna - Simran) జోడిగా వచ్చిన హ్యాట్రిక్ చిత్రం నరసింహనాయుడు(2001). ఈ చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని  బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. సీమసింహం బాలకృష్ణ- సిమ్రాన్ కాంబోలో వచ్చిన నాల్గోవ చిత్రం సీమసింహం(2002). సీమసింహం చిత్రాన్ని జి.రామ్‌ప్రసాద్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది. ఒక్క మగాడు  'సీమ సింహం' సినిమా తర్వాత బాలకృష్ణతో సిమ్రాన్ చివరిసారిగా  'ఒక్క మగాడు' చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలయ్య కేరిర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్ మూవీగా నిలిచింది. మొత్తంగా  బాలయ్య, సిమ్రాన్  కలిసి ఐదు సినిమాల్లో జంటగా నటించారు. వీటిలో ఒక్కమగాడు మినహా మిగతా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. . 
  నవంబర్ 08 , 2023
  Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
  Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
  అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్‌ సైడ్‌ లవ్‌ అనే ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్‌ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం. దిల్‌ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్‌ నితీన్‌ హీరోగా చేసిన ‘దిల్‌’ చిత్రానికి డైరెక్టర్‌ సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్‌ రాజుకు సుకుమార్‌ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్‌ అయిన అతడు..  ‘దిల్‌’ సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్‌’.. బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్‌ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ పడింది.  మిస్‌ చేసుకున్న అల్లరి నరేష్‌ ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్‌ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్‌ అన్నారు.  https://twitter.com/i/status/1787548147520061468 బన్నీని అలా ఫైనల్‌ చేశారు! ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్‌ మూవీ స్పెషల్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్‌ చలాకీ తనం, కామెడీ టైమింగ్‌ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్‌ రాజుతో సుకుమార్‌ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్‌ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్‌ కావడంతో సినిమా పట్టాలెక్కింది.  అసిస్టెంట్‌గా చేసిన స్టార్‌ డైరెక్టర్‌ కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్‌ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్‌ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్‌ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.  https://twitter.com/i/status/1787674074585714980 120 రోజుల్లో షూటింగ్‌ పూర్తి ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే  పూర్తి చేశారు. అటు సుకుమార్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.  ఆర్యతో వారికి స్టార్‌డమ్‌ ఆర్య సినిమా సక్సెస్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్‌, డ్యాన్స్‌, గ్రేస్‌, యాక్షన్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
  మే 07 , 2024
  EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
  EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
  సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.  https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.  https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.  https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)  కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.  https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.  https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.  https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.  https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
  మే 06 , 2024
  Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
  Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
  ప్రస్తుతం టాలీవుడ్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘హనుమాన్‌’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమాలకు ముందు టాలీవుడ్‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. బాలీవుడ్‌ వర్గాలకు తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చిన్నచూపు ఉండేదని అప్పట్లో టాక్‌ వినిపించింది. ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన పాన్‌ ఇండియా చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి డైరెక్టర్ల ప్రతిభ హిందీ స్టార్లను ఆకర్షిస్తోంది. దీంతో వారు టాలీవుడ్‌ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు టాలీవుడ్‌ డైరెక్టర్లతో బాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాలు కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్లు ఎవరు? ఏ బాలీవుడ్‌ స్టార్‌తో వారు సినిమా చేయబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం.  రణ్‌వీర్‌ - ప్రశాంత్‌ వర్మ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma).. 'హనుమాన్‌' (Hanu Man) చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రశాంత్‌ అంటే బాలీవుడ్‌ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడికి బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో సినిమా చేసే అవకాశం దక్కింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్‌వీర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.  సన్నీ డియోల్‌ - గోపిచంద్‌ మలినేని దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni)కి టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. కొత్త తరహా కథతో అద్భుతమైన యాక్షన్‌ చిత్రాలను ఆయన రూపొందిస్తుంటారు. ఇలా వచ్చి సూపర్‌ హిట్ సాధించినవే ‘క్రాక్‌’ (Krack), ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు. ఇదిలా ఉంటే అతడికి బాలీవుడ్‌ నుంచి సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గదర్‌ 2’ (Gadar 2)సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ అందుకున్న సన్నీ డియోల్ (Sunny Deol)తో గోపిచంద్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఆయన శైలీలోని యాక్షన్‌ డ్రామాగా రానున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ వచ్చేనెలలో మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.  షాహిద్‌ కపూర్‌ - వంశీ పైడిపల్లి టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally).. గత కొంతకాలంగా తెలుగు హీరోలకంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌తో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత చిత్రం ‘వారసుడు’లో విజయ్‌ హీరోగా చేశాడు. ఇక తన అప్‌కమింగ్‌ చిత్రం కోసం బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor)ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షాహిద్‌ కపూర్‌కు కథ చెప్పి ఒప్పించినట్లు కూడా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్రాలను డబ్‌ చేసి విడుదల చేసే గోల్డ్‌మైన్‌ సంస్థ.. ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.  సాయి రాజేశ్‌ గతేడాది జులైలో రిలీజైన ‘బేబీ’ (Baby) చిత్రం టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు సాయి రాజేశ్‌.. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకర్షిస్తాడో చూడాలి.  సందీప్‌ రెడ్డి వంగా - రణ్‌బీర్‌ కపూర్‌ టాలీవుడ్‌ అగ్రెసివ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన రీసెంట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal).. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. బాలీవుడ్‌ లవర్‌ బాయ్ రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)ను గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్‌గా ఈ సినిమాలో చూపించాడు. అయితే యానిమల్‌కు సీక్వెల్‌ కూడా భవిష్యత్‌లో రానుంది. రణ్‌బీర్‌ను మరింత వైలెంట్‌గా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చూపించనున్నారు. ప్రస్తుతం సందీప్‌.. ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత ‘యానిమల్‌ 2’ పట్టాలెక్కనుంది. 
  మే 06 , 2024
  EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
  EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.  శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.   రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.  బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.  లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌  రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.  సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి. 
  మే 04 , 2024
  Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
  Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
  స్టార్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాట.. వెలువడే ట్వీట్‌ ప్రతీది హాట్‌ టాపిక్‌గా మారిపోతుంటాయి. ఇక వ్యక్తులను టార్గెట్‌ చేసి ఆయన చేసే సెటైరికల్‌ కామెంట్స్‌ కూడా ఓ రేంజ్‌లో చర్చకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా ఆర్జీవీ పెట్టిన పోస్టు ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఎంతో అభిమానించే దివంగత నటి శ్రీదేవికి సంబంధించి ఈ పోస్టు పెట్టడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.  ‘స్వర్గంలో శ్రీదేవిని కలిశా..’ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi)ని.. రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతగానో ఆరాధించేవాడు. ఆమెను ఆర్జీవీ మనస్పూర్తిగా ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్‌ ఉండేది. ఇందుకు అనుగుణంగానే చాలా ఇంటర్యూల్లో శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని ఆర్జీవీ బహిరంగంగానే తెలియజేశాడు. అయితే చనిపోయిన శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆర్జీవీ పెట్టిన AI ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను' అంటూ ఆర్జీవీ ఆ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. పైగా ఈ ఫొటోలో ఆర్జీవీ సిగరేట్ తాగుతూ కెమెరాకు ఫోజు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ‘చనిపోయినా వదలవా’ ఆర్జీవీ తాజా పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ పోస్టును సమర్థిస్తుంటే ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఇలా ఎడిటింగ్‌ చేసి పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. శ్రీదేవిపై ఇష్టం ఉంటే ఉండొచ్చు గానీ, ఇలా మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టి సోషల్‌ మీడియాలో వైరల్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చనిపోయినా కూడా శ్రీదేవిని వదలవా అంటూ నిలదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీదేవిని ఆర్జీవి మర్చిపోలేకపోతున్నాడని అంటున్నారు. ఇలా ఆమెకు సంబంధించిన పోస్టులు పెట్టి శ్రీదేవి జ్ఞాపకాలను ఆర్జీవీ గుర్తు చేసుకుంటున్నాడని పేర్కొంటున్నారు.  ఆర్జీవీ ఫస్ట్‌ లవ్‌ ఈమే! ఆర్జీవీ మనసుకు నచ్చిన మహిళ శ్రీదేవి కంటే ముందు ఒకరున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆర్జీవీనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు ఆమె బికినీలో ఉన్న ఫొటోలను సైతం షేర్‌ చేసి తన ఫ్యాన్స్‌కు పరిచయం చేశాడు. ‘బ్లూకలర్ స్విమ్‌ సూట్‌లో ఉన్న సత్య అనే మహిళ.. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు తన ఫస్ట్ లవ్‌ అని ఆర్జీవీ చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో వైద్యురాలిగా స్థిర పడినట్లు తెలిపాడు. తాను తీసిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పేరు కూడా సత్య అని ఆర్జీవీ గుర్తుచేశాడు. అలాగే తనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'సత్య' మూవీ కూడా ఉందని అన్నాడు.  https://twitter.com/RGVzoomin/status/1430379804382023680 రంగీలా స్టోరీ అలా వచ్చిందే! డా. సత్యతో తనకున్న ఓ క్యూట్ మూమెంట్‌ను కూడా అప్పట్లో ఆర్జీవీ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తాను చదివే రోజుల్లో సిద్ధార్థ కాలేజీలో మెడికల్‌ & ఇంజనీరింగ్‌ విభాగాలు ఒకే కాంపౌండ్‌లో ఉండేవని ఆర్జీవీ తెలిపాడు. కొన్ని సంఘటనల తర్వాత సత్యను వన్‌సైడెడ్‌గా లవ్‌ చేయడం మెుదలు పెట్టానని పేర్కొన్నాడు. కానీ ఆమె తనను పట్టించుకోలేదని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆమె డబ్బున్న యువకుడితో సన్నిహితంగా ఉండేదని ఆర్జీవీ తెలిపాడు. ఈ అనుభవం నుంచే రంగీలా స్టోరీ పుట్టిందని గతంలో స్పష్టత ఇచ్చాడు. 
  మే 02 , 2024
  Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
  Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
  ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాడు. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్‌, సాంగ్స్‌కు రీల్స్‌ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తరపున ఆడుతున్న సమయంలో ఎక్కువగా సినిమా రీల్స్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్‌ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్‌ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్‌ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌ షూట్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.  రాజమౌళిని ఫేవర్‌ కోరిన వార్నర్‌! ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం.. రాజమౌళి, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు.  https://twitter.com/CRED_club/status/1778703889715646779? వార్నర్‌ రాక్స్.. రాజమౌళి షాక్స్‌! ఒక వేళ తన సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో అతడు నటిస్తే షూటింగ్‌ సెట్‌ ఎలా ఉంటుందోనని ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. సెట్స్‌లో వార్నర్‌ చేసే అల్లరి, డ్యాన్స్‌ స్టెప్పులు, డైలాగ్స్‌.. ఇవన్నీ ఊహించుకొని దర్శకధీరుడు ఒక్కసారిగా భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’, ‘నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి’ అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్‌లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు ఫేవర్స్‌ కూడా మార్కెట్‌ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ వీడియోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్‌ లవర్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. 
  ఏప్రిల్ 13 , 2024
  OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
  OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
  ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్‌ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్‌ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.  ఆ సినిమా ఏదంటే? 2023లో 95వ ఆస్కార్స్‌ అవార్డ్స్‌ కోసం అత్య‌ధిక నామినేష‌న్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేష‌న్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుని యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్‌ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్‌ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్‌ చూసేయండి.  https://twitter.com/i/status/1634197587438731264 ఊహకందని కాన్సెప్ట్‌తో.. హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్‌’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్‌ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్‌’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్‌ విన్నింగ్‌ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మ‌నిషిని పోలిన మ‌నుషులు మిగిలిన ప్యార‌లాల్ యూనివ‌ర్స్‌ల‌లో ఉంటార‌నే పాయింట్‌తో దర్శకులు డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షైనెర్ట్‌ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద డాలర్ల వర్షం కురిపించింది.  కథ కోసం 8 ఏళ్ల శ్రమ కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్‌, షైనెర్ట్‌.. 2010లోనే ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్‌ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కథేంటి ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. మిషెల్‌ యో, కి హుయ్‌ క్వాన్‌, జామీ లీ కర్టిస్‌ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్‌ క్వాడ్‌ అనే చైనీస్‌ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.  Telugu.yousay.tv Rating : 3.5/5 
  ఏప్రిల్ 13 , 2024
  Kajal Karthika OTT:  ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
  Kajal Karthika OTT:  ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
  కాజల్‌ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’ (Karungaapiyam). ‘కాజల్‌ కార్తీక’ (Kajal Karthika) పేరుతో ఈ సినిమా గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.  నలుగురు హీరోయిన్లు ‘కాజల్‌ కార్తీక’ సినిమాలో మెుత్తం నలుగురు హీరోయిన్లు నటించారు. కాజల్‌, రెజీనాతో పాటు రైజా విల్సన్, జనని కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు హీరోయిన్లు ఒకే తెరపై కనిపించనుండటం, అది కూడా హార్రర్‌ సినిమా కావడంతో తమిళంలో ‘కరుంగాపియం’పై అప్పట్లో మంచి హైప్‌ ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. దీంతో థియేటర్లలో సినిమా వచ్చినా కూడా ఆడియన్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.  ఆహాలో సక్సెస్ అయ్యేనా? ఆహా (Aha)లో విడుదలయిన తర్వాత ‘కాజల్‌ కార్తిక’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు.  తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో కమెడియన్‌ యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది. https://twitter.com/Telugu70mmweb/status/1675141362306646016 కథేంటంటే ఈ సినిమాను లాక్‌డౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్‌). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక.. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. ఆమె పగ ఎలా తీరింది? ఆమె మరణానికి కారణం ఏంటి? కార్తీక (రెజీనా), కార్తీక (కాజల్‌)కు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన నాలుగు కథలు ఏవి? అన్నది కథ. 
  ఏప్రిల్ 02 , 2024
  Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!  
  Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!  
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్‌ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.  జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba) తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్‌ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్‌.  ఆదిత్య 369 (Aditya 369) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్‌ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.  నాని (Nani) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్‌ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్‌ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.  దశావతరం (Dasavatharam) ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.  దొంగల ముఠా (Dongala Mutha) రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.   ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్‌ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్‌ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ను అందించారు.  మిథునం (Mithunam) పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.  అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju) 2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.  అ! (Awe!) టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్‌ (Hanu Man) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.  మనం (Manam) అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.  ఒక్కడున్నాడు (Okkadunnadu) గోపిచంద్‌ హీరోగా  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.  గగనం (Gaganam) నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్‌ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. 
  మార్చి 20 , 2024
  Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
  Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
  నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి!  ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్‌ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్‌ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది. https://twitter.com/GetsCinema/status/1759893440500846829 15 ఏళ్ల తర్వాత.. ప్రభాస్‌-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్‌నిరంజన్‌’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.  కన్నప్పపై విష్ణు ఫోకస్‌ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరిగింది. టీమ్‌లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్‌ టైమ్‌లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.  https://twitter.com/i/status/1730567740325535838 ఆకట్టుకున్న ఫస్ట్‌లుక్‌ గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి  అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.  ‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా! కన్నప్ప సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ఫినిష్‌ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్‌ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్‌ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్‌ భావిస్తోందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్‌ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్‌. 
  ఫిబ్రవరి 21 , 2024
  Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
  Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
  నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు రచన, దర్శకత్వం: అభిమన్యు సంగీతం: ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా విడుదల తేదీ: 16-02-2024 ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.  కథ అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్‌ పనితీరు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5
  ఫిబ్రవరి 16 , 2024
  Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
  Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
  పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.  థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.  హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.  https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
  ఫిబ్రవరి 07 , 2024
  Poonam Pandey Dies: సంచలనాలకు కేరాఫ్‌ ‘పూనం పాండే’ ఇకలేరు.. ఆమె ఎంత ఫేమస్సో తెలుసా?
  Poonam Pandey Dies: సంచలనాలకు కేరాఫ్‌ ‘పూనం పాండే’ ఇకలేరు.. ఆమె ఎంత ఫేమస్సో తెలుసా?
  వివాదాస్పద నటి, ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే (Poonam Pandey) కన్నుమూశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.  గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.  32 ఏళ్లకే ఆమె చనిపోవడంతో కుటుంబసభ్యులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సినీ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పూనమ్ పాండే తన నటన కంటే.. వివాదాస్పద ప్రకటనలతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. తన స్టైల్, బోల్డ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకునేవారు.  2011 వరల్డ్ కప్ (2011 World Cup) ఫైనల్‌కు ముందు పాండే (Poonam Pandey Dies) చేసిన ఒక వీడియో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.  భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తాను బట్టలు విప్పుతానని పూనం పాండే చేసిన ప్రకటన యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ బోల్డ్‌ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం (Poonam Pandey Dies) సృష్టించాయి. ఆమె ధైర్యానికి, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇవి అద్దం పడతాయని ఆ సందర్భంలో కొందరు కామెంట్లు కూడా చేశారు.  పూనం పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ‘గ్లాడ్రాగ్స్‌ మన్‌హంట్‌ & మెగా మోడల్‌ కంటెస్టెంట్‌’ పోటీల్లో ఆమె టాప్‌-9లో నిలిచారు.  2013లో ‘నషా’ అనే బోల్డ్‌ చిత్రం ద్వారా పూనం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో 'లవ్‌ ఇజ్‌ పాయిజన్‌' అనే కన్నడ చిత్రంలోనూ ఆమె నటించింది..  తెలుగులోనూ పూనం పాండే (Poonam Pandey Dies) ఓ సినిమా చేసింది. 2015లో 'మాలిని & కో' అనే చిత్రంలో ఆమె నటించింది.  ఆ తర్వాత 'ఆ గయా హీరో' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన పూనం పాండే.. చివరిగా బాలీవుడ్‌లో 'ద జర్నీ ఆఫ్‌ కర్మా' (2018) చిత్రంలో ఆమె నటించింది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగాన రనౌత్‌ (Kangana Ranaut) హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొనడం గమనార్హం.  2020 కొవిడ్‌ సమయంలో పూనం పాండే తన బాయ్‌ ఫ్రెండ్‌ శ్యామ్‌ను పెళ్లి చేసుకుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది.  అయితే 11 రోజులకే భర్తపై ముంబాయి పోలీసులు కంప్లైంట్‌ ఇచ్చి ఈ భామ వార్తల్లో నిలిచింది. భర్త తనను మానసికంగా వేధిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
  ఫిబ్రవరి 02 , 2024
  Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
  Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
  టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.  ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.  మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.  పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.  ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.  మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.   https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
  ఆగస్టు 16 , 2023
  Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
  Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
  నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు రచన, దర్శకత్వం: అమిత్ రాయ్ విడుదల తేదీ: ఆగస్టు 11 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటంటే? కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్‌లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20 ఎలా ఉంది?  ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎవరెలా చేశారు? ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది. https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20   టెక్నికల్‌గా సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం. పాజిటివ్ పాయింట్స్ నటీనటులు కథ కామెడీ  రచన నెగెటివ్ పాయింట్స్ కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్ కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 3.25/5 https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
  ఆగస్టు 11 , 2023
  Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
  Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
  ప్రజా గాయకుడు గద్దర్‌ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్‌ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్‌. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్‌ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్‌ ఎందుకంత స్పెషల్‌. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.  బండెనక బండి కట్టి గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్‌ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.  https://www.youtube.com/watch?v=8T3F4IuYarM  మల్లెతీగకు పందిరివోలె 1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్‌ స్వయంగా రాశారు. ఈ సాంగ్‌ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI పొడుస్తున్న పొద్దుమీద గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ కేటగిరీలో గద్దర్‌ నంది ‌అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. https://www.youtube.com/watch?v=vywBbz6QL7g నా రక్తంతో నడుపుతా ఓరేయ్‌ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్‌. నారాయణమూర్తి రక్తి కట్టించారు.  https://www.youtube.com/watch?v=XhbiuSTugNc అమ్మ తెలంగాణా  తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం. https://www.youtube.com/watch?v=pXgjUMosLWY మరిన్ని పాటలు పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
  ఆగస్టు 07 , 2023

  @2021 KTree