ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
2024 June 216 months ago
బాక్ మూవీ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నేటి(జూన్ 21) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది
రివ్యూస్
How was the movie?
తారాగణం
సుందర్ సి.
లాయర్ శివశంకర్తమన్నా భాటియా
శివానిరాశి ఖన్నా
మాయసంతోష్ ప్రతాప్
రామచంద్రరాజు
కోవై సరళ
ఆంటీవెన్నెల కిషోర్
పులిశ్రీనివాస రెడ్డి
గణేష్కెఎస్ రవికుమార్
జయప్రకాష్
ఢిల్లీ గణేష్
రాజేంద్రన్
సింగంపులి
దేవా నంద
సంజయ్
విచ్చు విశ్వనాథ్
యతిన్ కార్యేకర్
ఖుష్బు సుందర్
ప్రత్యేక ప్రదర్శనసిమ్రాన్
ప్రత్యేక ప్రదర్శనసిబ్బంది
సుందర్ సి.
దర్శకుడుA. C. S. అరుణ్ కుమార్నిర్మాత
హిప్హాప్ తమిజా
సంగీతకారుడుసుందర్ సి.
కథఇ.కృష్ణసామిసినిమాటోగ్రాఫర్
ఫెన్నీ ఆలివర్ఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.
బాలయ్య vs రవితేజ
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్ త్వరగా షూట్ చేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.
గతంలో బాలయ్యదే పైచేయి
బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవర నుంచి గట్టిపోటీ తప్పదా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని కొరటాల టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 13 , 2024
Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్ విన్నర్ ఏది?
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్, శర్వానంద్ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
మనమే
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్
నటుడు శర్వానంద్.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
సత్యభామ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాజల్ నటనపై ప్రశంసలు
కమర్షియల్ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ అగర్వాల్.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.
కథేంటి
ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.
https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html
https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
జూన్ 08 , 2024
Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో విడుదలైన తాజా చిత్రం ‘గామి’ (Gaami). శివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'గామి' సినిమా బాక్సాఫీస్ విజృంభిస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం శ్రమించగా వాటి తాలూకా ఫలితాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. వీకెండ్ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టిందన్న వార్తల్లో నిజమెంత? ఈ కథనంలో పరిశీలిద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఇవే!
ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. మేకర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక రెండో రోజు నుంచే చాలా ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇకపై వచ్చేదంతా లాభాలే అని అంటున్నారు. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.
గామి లాభాల్లోకి వచ్చినట్లేనా?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. సాక్నిక్ లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ.8.91 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మిగతా రూ.1.31 కోట్ల నెట్ వసూళ్లను నాల్గో రోజు కలెక్ట్ చేసి అధికారికంగా ఈ మూవీ నేటి నుంచి లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
మార్చి 11 , 2024
Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సలార్ (Salaar)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’, క్రిస్మస్ కానుకగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
యానిమల్ (Animal)
అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)
ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.
ఆదిపురుష్ (Adipurush)
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.
వీరసింహా రెడ్డి (Veera Simha Reddy)
బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.
భగవంత్ కేసరి (Bhagavanth Kesari)
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది.
బ్రో (Bro)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.
దసర (Dasara)
నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.
బేబీ (Baby)
చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్‌వైడ్‌గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం.
డిసెంబర్ 27 , 2023
2022లో తెలుగు బాక్సాఫీస్ హిట్లు
]మయోసైటిస్‌తో బాధపడుతూ డబ్బింగ్ చెప్పిన సమంత ‘యశోద’ హిట్ సాధించింది. బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ నటించిన గాలోడు బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసింది. మసూద, లవ్ టుడే వంటి చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.చివర్లో చిన్నసినిమాలు
ఫిబ్రవరి 13 , 2023
సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్ కలెక్షన్లు ఎవరు విన్నర్?
]ఇంకా రెండు మూడు రోజులు బాక్సాఫీస్ వార్ కొనసాగే అవకాశముంది. జనవరి 16న కూడా సంక్రాంతి సెలవు కావడంతో కలెక్షన్ల సునామీ కొనసాగే అవకాశముంది.
ఫిబ్రవరి 13 , 2023
2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్ హిట్లు ఇవే
]కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. రూ.5.5 కోట్ల తెలుగు హక్కులతో రూ.10.5 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సర్దార్
ఫిబ్రవరి 11 , 2023
Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్’ డే 1 కలెక్షన్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
రజనీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పటికీ తలైవా ఒక్కరే..
‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించారు. వేట్టయన్ కంటెంట్‌కు తలైవా మాస్ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334
‘వేట్టయన్’లో ఇవే హైలెట్స్!
'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్ అయ్యింది. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. రజనీకాంత్ ఇంట్రడక్షన్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్, శరణ్య రేప్ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్ బచ్చన్ - రజనీ మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
కథేంటి
పోలీసు ఆఫీసర్ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అక్టోబర్ 11 , 2024
Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడ మిక్స్‌డ్ టాక్ మినహా ఓవరాల్‌గా పాటిజివ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్‌తో దేవర ప్రదర్శితమవుతోంది. ఎన్టీఆర్ నటన, అనిరుధ్ మ్యూజిక్, కొరటాల శివ డైలాగ్స్ అదిరిపోయాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేవర రూ.172 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎన్ని కోట్లకు చేరాయో ఇప్పుడు చూద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో మూడు రోజులు పూర్తైనా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ చిత్రం వీకెండ్‌లో ఏకంగా రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద దేవర ఊచకోత కొనసాగుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరిన ‘దేవర’ ఈ వారంలోనే ఈజీగా రూ.500 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1840623014981075232
ప్రాంతాల వారీగా..
దేవర మేకర్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రమే ప్రకటించారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ప్రాంతాల వారీగా దేవర వసూళ్లను అంచనావేసే ప్రయత్నం చేశాయి. వాటి ప్రకారం దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వ్యవధిలో రూ.126.5 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క నైజాంలోనే రూ.38.77 కోట్లు రాబట్టింది. సీడెడ్ ఏరియాల్లో రూ.17.90 కోట్లు దేవరకు వచ్చి చేరాయి. కర్ణాటకలో రూ. 20.9 కోట్లు, తమిళనాడులో రూ.5.9 కోట్లు, కేరళలో రూ.1.4 కోట్లు, రెస్ ఆఫ్ ఇండియాలో రూ.35.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. అటు ఓవర్సీస్‌లో రూ.65 కోట్లకు పైగా దేవర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మెుత్తంగా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ తారక్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు.
డే 1 కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు!
ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దేవర నిలిచింది. దేవర చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ‘RRR’ తర్వాత తారక్ కెరీర్‌లో ఇదే అత్యధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.83.71 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క నైజాంలోనే 19.32 కోట్ల వసూళ్లు అందుకొని 'RRR' తర్వాత ఆల్‌టైమ్ టాప్- 2లో నిలిచిందని పేర్కొన్నాయి.
దేవర సక్సెస్‌కు కారణాలు ఇవే!
దేవరలో ఎర్ర సముద్రం అనే సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కొరటాల శివ సృష్టించారు. ఈ సినిమాలో తారక్ వన్ మ్యాన్ షో చేశారు. దేవర, వర అనే తండ్రి కొడుకుల పాత్రలో అద్వితీయమైన నటన కనబరిచాడు. మరోవైపు విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుధ్ బీజీఎం గూస్‌బంప్స్ తెప్పించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తనదైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించిన తీరు అభినందనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఆడియన్స్‌కు మంచి మజాను అందించాయి. అయితే సాగదీత సన్నివేశాలు, పేలవమైన లవ్‌ట్రాక్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
దేవర స్టోరీ
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సెప్టెంబర్ 30 , 2024
Devara Collections Analysis: బాక్సాఫీస్ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
‘దేవర’ (Devara: Part 1) రాకకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేయడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500లకు పైగా ప్రీమియర్స్‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక వరల్డ్ వైడ్‌గా దేవర అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే తొలి రోజు ఈజీగానే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం.
తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
తారక్ నటించిన ‘దేవర’ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లకొడుతూ భారీ హైప్ సంపాదించుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి సైతం ఇచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీసేల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర తొలి రోజున రూ.125 కోట్లకు పైగా గ్రాస్ పక్కాగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రూ.10-15 కోట్లు ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు దేవర రాబట్టొచ్చని సమాచారం. హిందీలో రూ.8-10 కోట్లు దేవర ఖాతాలో పడొచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మెుత్తం కలిపి రూ.10-15 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం దేవర దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు ఈజీగానే రూ.30-35 కోట్లు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న తొలిరోజు దేవర ఖాతాలో రూ.125 కోట్లు + పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని సమాచారం. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
’దేవర’పై అనిరుధ్ ఫస్ట్ రివ్యూ
'దేవర' చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్ 'దేవర'పై హైప్ వచ్చే కామెంట్స్ చేశారు. ‘బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. దేవర చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్, బ్యాట్‌మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎమోషన్, డ్రామా, యాక్షన్, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనుకుంటున్నా' అని అనిరుద్ అన్నారు.
సైఫ్ భార్యగా తెలుగు నటి
దేవరలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్యగా తెలుగు సీనియర్ నటి చైత్ర రాయ్ నటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దొరకడం తన అద్భుష్టమని చైత్ర అంటోంది. సెట్‌లో తొలిసారి తారక్, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది. కాగా, 'అష్టా చమ్మా' సీరియల్‌తో చైత్ర బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌లో నటిస్తోంది. దేవరతో మంచి గుర్తింపు లభిస్తే సినిమాల్లోనూ బిజీ కావచొచ్చని చైత్ర భావిస్తోంది.
ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
సెప్టెంబర్ 26 , 2024
Mathu Vadalara 2: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొంది. ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు సాలిడ్ వసూళ్లు సాధించి ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వసూళ్ల జాతర
'మత్తు వదలరా 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజుల్లో (శుక్ర, శని) రూ.11 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా సాలిడ్ వసూళ్లనే రాబట్టింది. ఫస్ట్ త్రీ డేస్‌లో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.16.2 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 'పదహారేళ్ల వయసు.. పదహారు కోట్ల గ్రాసూ’ అంటూ ఈ పోస్టర్‌కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అటు ఓవర్సీస్‌లో 600K డాలర్లకు పైగా రాబట్టినట్లు మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని, ఈ వీకెండ్ నాటికిి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1835560518255255726
https://twitter.com/MythriOfficial/status/1835533814803894507
తొలి రోజు ఎంతంటే
కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 13) ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేశాయి.
https://twitter.com/MythriOfficial/status/1834823161281757529
వారందరికీ బూస్టప్!
‘మత్తు వదలరా’ (పార్ట్ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.
కథేంటి
డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.
https://telugu.yousay.tv/mathu-vadalara-2-day-1-collections-mathu-vadalara-2-has-a-great-opening-what-are-the-collections.html
సెప్టెంబర్ 16 , 2024
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!
గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్న సినీ అభిమానులకు ఈ వారం గ్రాండ్ ట్రీట్ లభించబోతోంది. ఎప్పుడెప్పుడా అని యావత్ దేశం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. అయితే కల్కికి పోటీగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం. కాబట్టి ఈ వారం థియేటర్లో ప్రభాస్ ఒక్కరే సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్‌హాసన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 27న (Kalki 2898 AD Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా అలరించనుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పౌరాణిక పాత్రలను జత చేసి నాగ్ అశ్విన్ ఈ మూవీని తీర్చిదిద్దారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
లవ్ మౌళి
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ రొమాంటిక్ మూవీ ‘లవ్ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) హీరోయిన్‌గా చేసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించేందుకు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha).. ఈ సినిమాను జూన్ 27 నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateWorst Roommates Ever 2SeriesEnglishNetflixJune 26SupacellSeriesEnglishNetflixJune 27That Nineties 2 SeriesEnglishNetflixJune 27A Family AffairMovieEnglishNetflixJune 28Owning Maan HattenSeriesEnglishNetflixJune 28Civil WarMovieTelugu DubAmazon June 28Sharma Ji Ki BetiMovieHindiAmazon June 28Rautu Ka Raaz MovieHindiZee 5June 28The BearSeriesEnglishHotstarJune 27Land Of WomenMovieEnglishApple TV PlusJune 27Fancy Dance MovieEnglishApple TV PlusJune 28
జూన్ 24 , 2024
5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్ చేశారో ఓ సారీ చూద్దాం.
ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.
భరత్ అనే నేను
పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్ బాబు.. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
లీడర్
దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
నేనే రాజు నేనే మంత్రి
విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు.
నోటా
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.
యాత్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.
ఏప్రిల్ 20 , 2023
Rajanikanth vs Suriya: స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. బాక్సాఫీస్ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
రజనీకాంత్ vs సూర్య
తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్ ఫిల్మ్ వేట్టయాన్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.
భారీ తారాగణం
సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్ డాల్ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతిబాబు, డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.
గిరిజన యోధుడిగా 'సూర్య'
కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
రజనీకాంత్- అమితాబ్
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన 'వేట్టయాన్' సినిమాకి 'జై భీమ్' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, రావు రమేష్ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్ అయిన పోలీసు ఆఫీసర్.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్ యాక్షన్ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అటు టాలీవుడ్‌లోనూ..
టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ vs రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్ మెుదటి వారంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు.
జూన్ 28 , 2024
NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్!
టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ చిత్రం 'అఖండ 2' కాదా?
బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్ సంగీతం అందింబోతున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాతే షూట్!
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.
నాని డైరెక్టర్‌తో సినిమా!
ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
మార్చి 14 , 2024
Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమేనా!
బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్ చిత్రాల సిరీస్‌లో 'ధూమ్' (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అవన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
సూర్య పాత్ర అదే?
హిందీలో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్, పార్ట్ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
రోలెక్స్‌గా మార్క్!
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్‌ప్రైజ్ చేశారు. రోలెక్స్ పాత్రలో అతడి లుక్ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్ రోల్.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
12 వేల థియేటర్లలో ‘కంగువా’!
సూర్య ప్రస్తుతం 'కంగువా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్‌లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్ 15న కంగువాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
సెప్టెంబర్ 16 , 2024
Pushpa 2 vs NBK 109: అల్లు అర్జున్‌తో బాలకృష్ణ ‘ఢీ’.. బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్ షురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). ప్రస్తుతం స్పీడ్‌గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అల్లు ఆర్మీ ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా డిసెంబర్ ఫస్ట్ వీక్ బరిలో ఇప్పటివరకూ ఏ సినిమా లేకపోడవంతో ఇక బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’కి తిరుగుండదని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే బన్నీ చిత్రానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపంలో గట్టి పోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో బాలయ్య - బన్నీ ఒకరికొకరు తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 వర్సెస్ NBK 109..!
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'NBK 109' వర్కింగ్ టైటిల్‌తో చాలా స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని సంక్రాతి కానుకగా బరిలోకి దింపాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం నెల రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న 'NBK 109'ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వర్సెస్ నందమూరి బాలయ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
అఖండ సెంటిమెంట్!
డిసెంబర్ మెుదటి వీక్‌లోనే బాలయ్య తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ సెంటిమెంట్ కూడా దోహదం చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda Movie) చిత్రం సరిగ్గా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2న విడుదలైంది. ఆ చిత్రం ఏ స్థాయి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘NBK 109’ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తే ఆ మూవీ సైతం సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నిలిచింది. జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రం, అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'శతమానం భవతి 2' మూవీస్ సైతం సంక్రాంతి పోటీలో ఉన్నాయి. దీంతో జనవరి నుంచి ‘NBK 109’ వెనక్కి తగ్గాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ.. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులను టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ తదితరులను వేడుకలకు ఆహ్వానించారు. అలాగే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌లను కూడా ఆహ్వానాలు అందాయి.
బాలయ్య.. అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం 109 సినిమాల్లో ఆయన నటించారు. అయితే బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌తో బాలయ్య నటించారు. ఇక ఆయన నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. సోషల్, పౌరాణిక, జానపద, బయోపిక్స్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ డ్రామాలు, యాక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో బాలకృష్ణ సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా బాలయ్య సొంతం. 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు.
ఆగస్టు 29 , 2024
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్ హిట్ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్లకు పైగా మార్కెట్!
దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.
రూ.700-1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్ ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ తారక్ (NTR31), ప్రభాస్ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
రూ. 500-700 కోట్ల మార్కెట్
ఈ మార్కెట్ రేంజ్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సరైన హిట్ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్ కూడా డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.
రూ.200-500 కోట్ల మార్కెట్
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్ రూ.200 పైనే ఉండనుంది.
సెప్టెంబర్ 28 , 2024
Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 11 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో 'కల్కి' మేనియా కొనసాగుతోంది. అక్కడి ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.
11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 11 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/VyjayanthiFilms/status/1810220707357565060
నార్త్ అమెరికాలో రికార్డు
కల్కి సినిమాకు నార్త్ అమెరికాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అక్కడి సినీ లవర్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మెుదటి 9 రోజుల్లోనే ఈ చిత్రం 14.82 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.123.76 కోట్లకు సమానమని పేర్కొన్నాయి. ఈ వీకెండ్‌కు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగినట్లు చెబుతున్నారు.
https://twitter.com/PrathyangiraUS/status/1809472342265065863
రూ.1000 కోట్లకు అడుగు దూరంలో!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇంకో రూ.100 కోట్లు సాధిస్తే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. తద్వారా రిలీజ్‌కు ముందు పెట్టుకున్న టార్గెట్‌ను అందుకుంటుంది. బుధవారం నాటికి రూ.1000 కోట్ల మార్క్‌ను కల్కి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకూ ఏ కొత్త సినిమా లేకపోవడం కల్కికి కలిసిరానుంది. కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
https://twitter.com/i/status/1808841062838063340
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/Kalki2898AD/status/1806617136690839769
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 08 , 2024