రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
శోభన్ బాబు
శోభన్ బాబులక్ష్మి
రంగనాథ్
మాడా వెంకటేశ్వరరావు
మాడాసిబ్బంది
హెచ్ ఆర్ భార్గవ
దర్శకుడువి.సి. గణేశన్నిర్మాత
కేవీ మహదేవన్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
పుష్ప (Pushpa)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్ చేశాడు.
గుంటూరు కారం (Guntur Karam)
మహేష్ బాబు (Mahesh Babu) రీసెంట్ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.
బలగం (Balagam)
ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది
రంగస్థలం (Rangasthalam)
రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.
దసరా (Dasara)
హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.
కలర్‌ఫొటో (Colour Photo)
కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.
ఉప్పెన (Uppena)
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.
కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam)
వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు.
విరాట పర్వం (Virata parvam)
హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్.. వరంగల్ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం.
కేర్ ఆఫ్ కంచరపాలెం (C/o కంచరపాలెం)
మహా వెంకటేష్ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.
రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు
టాలీవుడ్ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్ టైలర్’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.
.
అక్టోబర్ 22 , 2024
Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా విలేజ్ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
రంగస్థలం
రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.
దసరా
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేసింది.
బలగం
అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.
విరూపాక్ష
పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.
పుష్ప
సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.
కేరాఫ్ కంచరపాలెం
కంచరపాలెం, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక్కడి ప్రజల జీవనశైలిని నిశితంగా పరిశీలించి చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ వెంకటేశ్ మహా భావించాడు. అలా ఓ కథను ఎంచుకుని గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా సినిమాను తీశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
శ్రీకారం
వ్యవసాయానికి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన చిత్రం ఇది. గ్రామాల్లోని రైతుల మధ్య ఉండే అనుబంధాలను ఇందులో చక్కగా చూపించాడు డైరెక్టర్ కిశోర్. శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
కాంతార
చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార. ఓ మారుమూల అటవీ గ్రామంలోని ఆచారాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. అడవి, గ్రామస్థులు, వారి అలవాట్లు, జీవన విధానం.. ఇలా ప్రతి కోణంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు.
జూన్ 13 , 2023
చిరంజీవితో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే!
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అత్యున్నత గౌరవాన్ని పొందారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మిగతా ప్రముఖులేవరో ఇప్పుడు చూద్దాం.
రామోజీరావు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు గారు, గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈనాడు పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా ఎంతో సేవ చేశారు.
దాసరి నారాయణ రావు
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, దాసరి నారాయణరావు గారు రికార్డు సృష్టించారు. ఈ ఘనతతో అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలు అని ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠి, మలయాళం భాషల్లో సుమారు 40,000కి పైగా పాటలు పాడారు. ఈ విషయంలో కూడా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. బాలు సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ప్రసిద్ధి పొందారు.
దగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రామానాయుడు, మూవీ మోఘల్‌గా ప్రసిద్ధి చెందారు. 100 చిత్రాలకు పైగా నిర్మాతగా నిలిచిపోయి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం పథ్మ భూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.
విజయనిర్మల
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల, 44 చిత్రాలను దర్శకురాలిగా తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 2002లో గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2019లో ఆమె మరణించారు.
పి. సుశీల
భారతీయ సినీ పరిశ్రమలో 60 సంవత్సరాల పైగా ప్రసిద్ధి పొందిన గానకోకిల పి. సుశీల, 12 భాషల్లో దాదాపు 30,000 పాటలు పాడారు. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. భారత ప్రభుత్వం ఆమెకు పథ్మభూషణ్ అవార్డు అందించింది.
బ్రహ్మానందం
కన్నెగంటి బ్రహ్మానందం, ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు, ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించారు. ఆయన పూర్తి సమర్థవంతంగా 1250 సినిమాలకు పైగా నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించారు.
సెప్టెంబర్ 25 , 2024
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
డ్యాన్స్‌కు కేరాఫ్!
‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్-15 సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రగులుతోంది మొగలిపొద (ఖైదీ)
చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్ ఓసారి మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q
చక్కని చుక్క (పసివాడి ప్రాణం)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్ ద్వారానే చిరు బ్రేక్ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.
https://www.youtube.com/watch?v=q5aetbezCqM
నవ్వింది మల్లె చెండు (అభిలాష)
‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది.
https://www.youtube.com/watch?v=82hUDmPYazk
హే పాప (త్రినేత్రుడు)
‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్ చేసింది.
https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y
పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)
‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ క్లాప్ అంటూ సాంగ్‌ను స్టార్ట్ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=fsnOGypjHI0
గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k
స్టార్ స్టార్ మెగాస్టార్ (కొదమ సింహం)
కొదమ సింహం సినిమాలోని 'స్టార్ స్టార్ మెగాస్టార్' సాంగ్ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్ వేయలేదు.
https://www.youtube.com/watch?v=cFKyIHvudzI
బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk
రూపుతేరా మస్తానా (రిక్షావోడు)
రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్ బీట్‌ను మ్యాచ్ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=mugdo_VO9pY
నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=j2HY4G63qaE
ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)
ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్ చేసి భుజాలు ఎగరేసే స్టెప్ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్ చుట్టుకొని మాస్ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.
https://www.youtube.com/watch?v=oppz5I9KeQA
దాయి దాయి దామ్మ (ఇంద్ర)
‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=39W78Hp4E8A
ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)
‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.
https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY
మన్మథ మన్మథ (ఠాగూర్)
వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్ మెస్మరైజ్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)
‘ఖైదీ నెంబర్ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
సెప్టెంబర్ 23 , 2024
OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
LGM
భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్ గెట్ మ్యారీడ్’ అన్నది ఉపశీర్షిక. హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్ తెలిపారు.
రాజుగారి కోడిపులావ్
‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
విక్రమ్ రాథోడ్
విజయ్ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathode). ఎస్.కౌశల్య రాణి నిర్మాత. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.
మిస్టేక్
అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్’ (Mistake). భరత్ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్ అని చిత్ర బృందం చెబుతోంది.
మెగ్ 2
హాలీవుడ్ మూవీ 'మెగ్ 2' (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్ 2 థియేటర్స్‌లోకి రానుంది.
మరికొన్ని చిత్రాలు
అభివన్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘దిల్ సే’ కూడా ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డబ్బింగ్ సినిమాలు బ్లడ్ అంట్ చాకోలెట్, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
రంగబలి
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు.
TitleCategoryLanguagePlatformRelease DateChoonaWeb SeriesHindiNetflixAugust 3The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5PareshanMovieTeluguSonyLIVAugust 4DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
జూలై 31 , 2023
This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్ మూవీస్ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
మనమే
స్టార్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.
సత్యభామ
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.
రక్షణ
స్టార్ నటి పాయల్ రాజ్‌పుత్ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
లవ్ మౌళి
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వెపన్
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్’ చిత్రానికి గుహన్ సెన్నియ్యప్పన్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
జూన్ 03 , 2024
Aadikeshava Review: యాక్షన్ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
సినిమాటోగ్రఫీ: డడ్లీ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్ లుక్‌లో వైష్ణవ్ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
బాలు (వైష్ణవ్ తేజ్) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్ కలవగానే ఓ పాట, విలన్ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్ అన్నట్లు సినిమా సాగిపోతుంది.
ఎవరెలా చేశారంటే
వైష్ణవ్‌తేజ్ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్ అక్కడక్కడా నవ్వించాడు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లాగే డైరెక్టర్ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్ మాత్రం బాగుంది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వైష్ణవ్‌తేజ్ నటనమలుపులునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనంపండని భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
నవంబర్ 24 , 2023
Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.
ఊరు పల్లెటూరు
ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=KpBksxKsrIU
బతుకమ్మ
సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.
https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I
చమ్కీల అంగీలేసి
దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు.
https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY
దండికడియాల్
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.
https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY
దిల్ కుష్
తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు.
https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE
సౌ శర(పరేషాన్)
పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని చెబుతున్నాయి.
https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI
గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్)
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.
https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
జూన్ 07 , 2023
Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది.
రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది
ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది
సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది
యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది
ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది
తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట.
యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది
తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది.
అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.
ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
జూలై 04 , 2023
Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి పనులు షురూ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది.
‘పెళ్లి గురించి కలలు కనలేదు’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
అక్టోబర్ 21 , 2024
Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున స్పెషల్ పోస్టు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంత కంటే చాలా బోల్డ్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 08 , 2024
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ తారల్లా తారల ధగధగ
]
నలుపు చీరను బంగారు వర్ణంతో కమ్మేస్తూ దీపావళికి అసలైన నిర్వచనాన్నిచ్చే చీరలో మెరిసింది మన ఈషా రెబ్బా.ఈషా రెబ్బా
ఫిబ్రవరి 11 , 2023
Varun Tej Marriage: నెట్టింట వరుణ్-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు.
భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్-పవన్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://twitter.com/vamsikaka/status/1719756960852263315
కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
నవంబర్ 03 , 2023
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
అక్టోబర్ 30 , 2024
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్!
మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్ బాయ్స్' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.
మార్చి 29న తెలుగులోకి..!
శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.
కలెక్షన్స్‌లో టాప్- 5 ఇవే
'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.
ఈ సినిమా కథేంటి?
2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
మార్చి 19 , 2024
Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్, గుండె, డయాలసిస్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.
కుటుంబ నేపథ్యం
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.
సినిమా నేపథ్యం
చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.
చంద్రమోహన్ మెచ్చిన చిత్రాలు
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.
లక్కీ హీరోగా గుర్తింపు
ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్ అయినా నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్-సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. అటు చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్.
సంపాదనలో శూన్యమే!
చంద్రమోహన్ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లపైనే. శంషాబాద్ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.
చెయ్యి చాలా మంచిదట!
చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
నవంబర్ 11 , 2023
Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.
వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్ చద్దా వివాహం జరగడం గమనార్హం.
ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది.
ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు.
తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్ వివాహ ఫొటోలను షేర్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు.
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు.
సెప్టెంబర్ 25 , 2023
Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: రాం అబ్బరాజు
నిర్మాత: రాజేష్ దండ
సంగీతం: గోపి సుందర్
ఎడిటర్: చోట కె ప్రసాద్
ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.
టెక్నికల్‌గా..
కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కామెడీ సన్నివేశాలు
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
మ్యూజిక్
సాగతీత సన్నివేశాలు
రేటింగ్: 2.75/5
జూన్ 30 , 2023
KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చమైన తెలుగమ్మాయి
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య.
హీరోయిన్ ఛాన్స్
గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు.
ఫాలోయింగ్ ఎక్కువే
సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్ ఉన్నారు. అటు ఫిట్నెస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్ చేస్తోంది.
దశ మారుతుందా?
వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్‌గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్చి 17 , 2023