• TFIDB EN
  • బంగార్రాజు
    UATelugu2h 40m
    మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజు (నాగార్జున)ని కిందికి పంపిస్తాడు యమధర్మరాజు. మరి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య), నాగలక్ష్మీ (కృతిశెట్టి)ని ఎలా కలిపాడు? ఊరి గుడిలో ఉన్న నిధులను ఎలా కాపాడాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగార్జున
    బంగార్రాజు
    రమ్య కృష్ణన్
    సత్యభామ
    నాగ చైతన్య
    చిన్న బంగార్రాజు
    కృతి శెట్టి
    నాగ లక్ష్మి
    సంపత్ రాజ్
    సంపత్
    రావు రమేష్
    రమేష్
    గోవింద్ పద్మసూర్య
    ఆది (S/O సంపత్)
    బ్రహ్మాజీ
    చిన్న బంగార్రాజు మామ
    వెన్నెల కిషోర్
    చిన్న బంగార్రాజు మామ
    ఝాన్సీ లక్ష్మి
    చిన్న బంగార్రాజు అత్త
    అనిత చౌదరిచిన్న బంగార్రాజు అత్త
    నాగేంద్ర బాబు
    యమ ధర్మ రాజా
    రవి ప్రకాష్
    ఇంద్ర
    దువ్వాసి మోహన్
    చిత్రగుప్తుడు
    గుండు సుదర్శన్
    నారదుడు
    చలపతి రావు
    చలపతి
    రాజశ్రీ నాయర్నాగలక్ష్మి తల్లి
    రోహిణి రెడ్డినాగలక్ష్మి స్నేహితురాలు
    సురేఖ వాణిసంపత్ భార్య
    ప్రవీణ్
    రాంబాబు
    రంజిత్ వేలాయుధన్ హరీష్
    నాగ మహేష్సిద్ధాంతి
    ఫణీంద్ర గొల్లపల్లిస్కూల్ టీచర్
    సిబ్బంది
    కళ్యాణ్ కృష్ణ
    దర్శకుడు
    నాగార్జున
    నిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    కృతి శెట్టి ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించింది. ఉప్పెన చిత్రంలో ఆమె చేసిన బేబమ్మ పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఐడియా యాడ్ షూటింగ్‌లో పాల్గొంది.  ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Krithi Shetty) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృతి శెట్టి దేనికి ఫేమస్? కృతి శెట్టి  ఉప్పెన చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కృతి శెట్టి వయస్సు ఎంత? 2003, సెప్టెంబర్ 21న జన్మించింది. ఆమె వయస్సు 20 సంవత్సరాలు   కృతి శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు  కృతి శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక  కృతి శెట్టి అభిరుచులు? మోడలింగ్ కృతి శెట్టి ఇష్టమైన ఆహారం? పీతల పులుసు కృతి శెట్టి  తల్లిదండ్రుల పేర్లు? కృష్ణ శెట్టి(వ్యాపారవేత్త), నీతి శెట్టి( ఫ్యాషన్ డిజైనర్) కృతి శెట్టి ఫెవరెట్ హీరో? రామ్‌ చరణ్  కృతి శెట్టికి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్ కృతి శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? ఉప్పెన కృతి శెట్టి ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది కృతి శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, అనేక టీవీ యాడ్స్‌లో నటించింది కృతి శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/krithi.shetty_official/?hl=en https://www.youtube.com/watch?v=WPzI197ph4c కృతి శెట్టి గురించి మరికొన్ని విషయాలు కృతి శెట్టి ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందికృతి శెట్టి ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది( హిందీ, తెలుగు, కన్నడ, తుళు, ఇంగ్లీష్)
    ఏప్రిల్ 13 , 2024
    2022లో మార్మోగిన పాటలు
    2022లో మార్మోగిన పాటలు
    ]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్‌ స్టార్‌ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. &nbsp; దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .&nbsp; సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.&nbsp; రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.&nbsp;
    ఆగస్టు 11 , 2023

    @2021 KTree