UATelugu2h 25m
ఆకాశ్(రవి తేజ) తనను ఇష్టపడే మహిళను ఇంప్రెస్ చేయడానికి సెలబ్రెటీగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయ నాయకుడిని రాయితో కొట్టి అతని దగ్గరే పనిచేస్తాడు. అయితే మొదట ఫేమస్ కావాలని ఇదంతా చేసినా... అతని లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇంతకు ఆకాశ్ లక్ష్యం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్SunNextఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Prime
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
ఆకాష్ నారాయణ్తమన్నా భాటియా
మీరారాశి ఖన్నా
శ్రద్ధబొమన్ ఇరానీ
ముఖ్యమంత్రి అశోక్ గజపతినాసర్
పార్టీ అధ్యక్షుడునాగినీడు
జయ నారాయణ్‌రావు రమేష్
హోంమంత్రి నాగప్పసాయాజీ షిండే
వ్యవసాయ మంత్రి సాంబబ్రహ్మానందం
అమలాపురం పాల్ / అమలా పాల్పోసాని కృష్ణ మురళి
సెలబ్రిటీ శాస్త్రిపృధ్వీ రాజ్
ఫ్యూచర్ స్టార్ సిద్దప్పతనికెళ్ల భరణి
RMP డాక్టర్ప్రభ
ఆకాష్ తల్లిసమీర్
ఆకాష్ అన్నయ్యసురేఖ వాణిఆకాష్ పెద్ద కోడలు
శ్యామలఆకాష్ చెల్లెలు
ప్రగతి మహావాది
గజపతి భార్యపవిత్ర లోకేష్
నాగప్ప భార్యశైలజ ప్రియ
సిద్దప్ప భార్యమాస్టర్ నిఖిల్సిద్దప్ప కొడుకు
రమాప్రభ
ఆకాష్ అమ్మమ్మబ్రహ్మాజీ
సాంబ సహాయకుడుప్రభాకర్
బండసత్యం రాజేష్
రాజేష్ఫిష్ వెంకటయ్య
ఫిష్ వెంకట్దువ్వాసి మోహన్
ప్రియదర్శిని రామ్
జాస్పర్
సుబ్బరాయ శర్మ
పూజారిల్యాబ్ శరత్డిజిపి
షకలక శంకర్
శంకర్ప్రభుసుబ్రమణ్యం
శ్రవణ్గని రెడ్డి
ఉమావేశ్య
హర్షవర్ధన్ రాణే
కరణ్ (అతిధి పాత్ర)అక్ష పార్దసాని
ఆకాష్‌ని తిరస్కరించిన అమ్మాయి (అతి పాత్ర)హంస నందిని
సిబ్బంది
సంపత్ నంది
దర్శకుడుకె. కె. రాధామోహన్
నిర్మాతభీమ్స్ సిసిరోలియో
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ... ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
తమన్నా భాటియా ఎవరు?
తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
తమన్నా దేనికి ఫేమస్?
తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
తమన్నా భాటియా వయస్సు ఎంత?
డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు 34 సంవత్సరాలు
తమన్నా భాటియా ముద్దు పేరు?
తమ్మి, మిల్క్ బ్యూటీ
తమన్నా భాటియా ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది?
ముంబై
తమన్నా భాటియాకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
తమన్నా భాటియా అభిరుచులు?
డ్యాన్సింగ్, కవితలు రాయడం
తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం?
హైదరాబాద్ బిర్యాని
తమన్నా భాటియా అభిమాన నటుడు?
మహేష్ బాబు, హృతిక్ రోషన్
తమన్నా భాటియా తొలి సినిమా?
చాంద్ సా రోషన్ చెహరా
తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా?
శ్రీ
తమన్నా భాటియా ఏం చదివింది?
BA చదివింది
తమన్నా భాటియా పారితోషికం ఎంత?
తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు?
సంతోష్ భాటియా, రజని భాటియా
తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా?
తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.
తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది?
4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.
తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/tamannaahspeaks/?hl=en
తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
తమన్నా భాటియా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది.
తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
సమంత, విజయ్ వర్మ
తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు?
తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు
తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది.
https://www.youtube.com/watch?v=4pZvW7izZDw
ఏప్రిల్ 16 , 2024
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి.
[toc]
Samantha Ruth Prabhu
సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.
Samantha bikini images
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.
Kajal Agarwal bikini video
https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250
Tamannaah Bhatia
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
Tamannaah Bhatia Bikini images
View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial)
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
Anushka Shetty
అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
Anushka shetty Bikini Images
Disha Patani
దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది.
Disha Patani Bikini images
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి.
Pragya Jaiswal bikini Images
ShwetaTiwari
శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి.
ShwetaTiwari Bikini Images
Deepika Padukone
దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది.
deepika padukone bikini Images
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి.
Pooja Hegde Bikini Images
Pooja Hegde Hot Videos
https://twitter.com/RakeshR86995549/status/978983052364808194
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
Raashii Khanna
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్. ఐఏఎస్ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి.
Raashii Khanna Bikini images
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్ బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్ వేయండి
https://twitter.com/PicShareLive/status/1525365506471231488
Ketika Sharma Bikini Images
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి
Ketika Sharma Bikini Images
Catherine Tresa
కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి.
Catherine Tresa Bikini images
Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి.
Mrunal Thakur Bikini images
Mrunal Thakur hot video
https://twitter.com/MassssVishnu/status/1786566946600988750
https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193
https://twitter.com/SastaJasoos/status/1788498532162236427
Anasuya Bharadwaj
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి.
Anasuya Bharadwaj Bikini images
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి.
Nidhhi Agerwal Bikini Images
Mehreen Kaur Pirzada
మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది.
Mehreen Kaur Pirzada Bikini Videos
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
Manushi Chillar
మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి.
Manushi Chillar Bikini Images
Manushi Chillar Bikini videos
View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)
https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి.
Sobhita Dhulipala bikini images
Hot videos
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
Tripti Dimri
తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి.
Tripti Dimri Bikini images
View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri)
Shirley Setia
షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shirley Setia Bikini Images
మే 11 , 2024
Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.
తొలి కలెక్షన్స్ ఎంతంటే?
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు ప్రదర్శించింది. యూఎస్ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు.
రవితేజ టాప్-10 కలెక్షన్స్! (Ravi Teja Top 10 Highest Grossing Movies)
‘ఈగల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
ధమాకా (Dhamaka)
రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వరకూ జరిగింది.
బడ్జెట్: 35 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు
క్రాక్ (Krack)
ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు
తీర్పు: బ్లాక్ బస్టర్
రాజా ది గ్రేట్ (Raja the Great)
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్ కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr
వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు
తీర్పు: హిట్
బలుపు (BALUPU)
రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)
రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.
బడ్జెట్: 55 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు
పవర్ (Power)
రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్ గణాంకాలను నమోదు చేసింది.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు
తీర్పు: సగటు కంటే ఎక్కువ
బెంగాల్ టైగర్ (Bengal Tiger)
ఈ సినిమా బడ్జెట్ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr
వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు
విక్రమార్కుడు (Vikramarkudu)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.
బడ్జెట్: 11 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు
కిక్ (Kick)
రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అంతకే జరగడం గమనార్హం.
బడ్జెట్: 14 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు
కిక్ (KICK 2)
అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్ బిజినెస్ రూ.36 కోట్లు. కిక్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
బడ్జెట్: 30Cr
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 43cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr
ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
ఫిబ్రవరి 10 , 2024
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.
నవంబర్ 06 , 2024
New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
లవ్‌రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా నగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వీక్షణం
రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్‌లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
రివైండ్
సాయి రోనక్ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు మనసుకు హత్తుకునే లవ్‌స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
‘ఖడ్గం’ రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
1000 బేబీస్
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ '1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు.
కలి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 'కలి' (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
TitleCategoryLanguagePlatformRelease DateThe Linkan LawyerMovieEnglishNetflixOct 17Fabulous Lives vs Bollywood Wives S3SeriesEnglishNetflixOct 19The Pradeeps Of PittsburghSeriesEnglishAmazonOct 17Citadel Honey BunnySeriesTelugu/HindiAmazonNov 7Kali MovieTeluguETV WinOct 17Reeta SanyalMovieHindiHotstarOct 14NemesisMovieEnglish/DutchHotstarOct 161000 BabiesSeriesTelugu/MalayalamHotstarOct 18RivalsMovieEnglishHotstarOct 18Crime Reels MovieTeluguAhaOct 13Janaka Aithe GanakaMovieMovieAhaNov 5Maa Nanna Super HeroMovieMovieZee 5Nov 8
అక్టోబర్ 14 , 2024
బాలివుడ్ డైరెక్టర్‌పై రేప్ ఆరోపణలు..సౌత్ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది. సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మూడో మీటింగ్‌లోనే
అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.
ఎవరీ పాయల్
17 సంవత్సరాల వయసులోనే నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్ పెరిల్ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది.
కశ్యపై కేసు
గతంలోనే అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.
తెలుగులోకి ఎంట్రీ
అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్ సినిమాలో చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.
రాజకీయ నాయకురాలు
ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు. అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది.
సినిమాలు
ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
మార్చి 19 , 2023
Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఇవే!
భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్ బాగుంటే మరో భాషలోకి రిమేక్ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)
టాలీవుడ్‌లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
ఒక్కడు (Okkadu)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. కన్నడలో 'అజయ్' పేరుతో పునీత్ రాజ్‌కుమార్ (Punit Raj Kumar) నటించాడు.
మర్యాద రామన్న (Maryada Ramanna)
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.
వర్షం (Varsham)
ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'వర్షం'. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్’ (2004), తమిళంలో ‘మజాయ్’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది.
పోకిరి (Pokiri)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో వచ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాషల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్' (2009), కన్నడలో దర్శన్ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.
డార్లింగ్ (Darling)
ప్రభాస్ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్ హీరోగా 'బుల్‌బుల్', హిందీలో 'సబ్సే బధాకర్ హమ్' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
విక్రమార్కుడు (Vikramarkudu)
రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్’ (2012), బంగ్లాదేశ్ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్', ఒడియాలో 'బిశ్వంత్' పేర్లతో రిలీజ్ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు.
ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే
వెంకటేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది. తమిళం, బెంగాలీ, భోజ్‌పురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది.
మార్చి 23 , 2024
Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్, కేశవ్ దీపక్, ఝాన్సీ, హర్షవర్ధన్, అభిజ్ఞ, రోషన్, సతీష్ సరిపల్లి, మహేష్ విట్టా తదితరులు
డైరెక్టర్: విశ్వక్ ఖండేరా
సినిమాటోగ్రాఫర్ : అదిత్య జవ్వాది
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
స్ట్రీమింగ్ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ
ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్
విడుదల తేదీ: 02 ఫిబ్రవరి, 2024
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
మిస్ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్ తడబడ్డారు. రైటింగ్ ఫెయిల్యూర్ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్
కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
ఫిబ్రవరి 02 , 2024
Game Changer Record: ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి భారతీయ పాటగా గుర్తింపు.. ఆ పాట ఏదంటే?
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) గురించి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా, దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రతి పాటను ఎంతో విశిష్టంగా రూపొందించడమే కాకుండా, వాటి విజువల్స్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయనున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో ఆ పాటల విశేషాలు, వాటి వెనుక ఆసక్తికర విషయాలను చూద్దాం.
1. ‘జరగండి..
ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘జరగండి.. జరగండి..’ గ్రాండ్ విజువల్స్‌తో అలరిస్తోంది. 70 అడుగుల ఎత్తయిన కొండ, గ్రామీణ వాతావరణంలో నిర్మించిన విలేజ్ సెట్‌లో ఈ పాటను షూట్ చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, సెట్‌లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ సహా, ఇతర వస్తువులు పూర్తిగా పర్యావరణహితమైన జనపనారతో తయారు చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 13 రోజుల పాటు జరిగిన చిత్రీకరణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=45vS1-xtnp8&pp=ygUYamFyYWdhbmRpIGphcmFnYW5kaSBzb25n
2. ‘రా మచ్చా
ఈ పాట యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ‘రా మచ్చా..’ పాటలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు. గుస్సాడీ (ఆదిలాబాద్), చావ్ (పశ్చిమ బెంగాల్), ఘూమ్రా (ఒడిశా), గోరవర (కర్ణాటక) వంటి ప్రాంతీయ నృత్యాలు ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. పాట విజువల్స్ గ్రాండ్‌గా ఉండేలా రూపొందించారు.
https://www.youtube.com/watch?v=QeMeM87O1ns&pp=ygUgcmEgbWFjaGEgbWFjaGEgZ2FtZSBjaGFuZ2VyIHNvbmc%3D
3. ‘నానా హైరానా..’
శంకర్ చిత్రాలకు తగినట్టు ఈ సినిమాకు కూడా సాంకేతికతలో కొత్తదనాన్ని చేర్చారు. ‘నానా హైరానా..’ పాటను తొలిసారి ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. న్యూజిలాండ్ అందమైన లొకేషన్లలో తీసిన ఈ మెలోడీ పాటకు మనీశ్ మల్హోత్ర కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పాట చిత్రీకరణ వేదికపై అద్భుతంగా కనిపించనుంది.
https://www.youtube.com/watch?v=EqDlrimnMCE&pp=ygUebmFuYSBoYXJ5YW5hIGdhbWUgY2hhbmdlciBzb25n
4. ‘దోప్’
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రష్యా నుంచి 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో రప్పించి ‘దోప్’ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో 8 రోజుల్లో చిత్రీకరించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు కూడా మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదలై సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది.
https://www.youtube.com/shorts/Y131i3ji8oE
5. థ్రిల్ పంచే ఐదో పాట
ప్రస్తుతం విడుదలైన నాలుగు పాటలు మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఐదో పాటను ప్రేక్షకులు సినిమాను చూస్తున్న సమయంలోనే అనుభవించనున్నారు. ఈ పాట సినిమా క్లైమాక్స్‌లో థ్రిల్ పంచుతుందని చిత్రబృందం వెల్లడించింది.
‘గేమ్ ఛేంజర్’ పాటలు సంగీతం, విజువల్స్, నృత్యాలతో ప్రత్యేకతను కలిగించి ప్రేక్షకుల మన్ననల్ని గెలుచుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి పాటకూ ఉన్న ప్రత్యేకత ఈ సినిమాను ప్రేక్షకుల్లో మరింత ఆసక్తికరంగా నిలపనుంది. జనవరి 10న ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాటలు వెండితెరపై ఎలా ఆకట్టుకుంటాయో చూడాల్సిందే!
జనవరి 02 , 2025
PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్ హీరో.. ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761
పోస్టర్‌లో ఇవి గమనించారా?
‘మహా కాళీ’ పోస్టర్ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాళికాదేవి శక్తితో..
మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ!
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అక్టోబర్ 10 , 2024
Celebrities In Politics: పవన్ కల్యాణ్ To కంగనా రనౌత్.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
పవన్ కల్యాణ్ (ఆంధ్రప్రదేశ్)
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్ కీలక పాత్ర పోషించనున్నారు.
https://twitter.com/i/status/1797987460137549943
నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్)
హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు.
https://twitter.com/i/status/1797996139146617307
కంగనా రనౌత్ (హిమాచల్ ప్రదేశ్)
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
హేమామాలిని (ఉత్తర్ ప్రదేశ్)
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముకేశ్ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.
రవి కిషన్ (ఉత్తర్ ప్రదేశ్)
‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్ నిషాద్ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.
శతృఘ్న సిన్హా (బెంగాల్)
సీనియర్ సినీ నటుడు, అసన్‌సోల్ సిట్టింగ్ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్.ఎస్ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సురేశ్ గోపి (కేరళ)
సినీయర్ మలయాళ నటుడు సురేశ్ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.
https://twitter.com/i/status/1797900510726676534
మనోజ్ తివారి (ఢిల్లీ)
నార్త్ ఈస్ట్ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
https://twitter.com/i/status/1798059260410318868
అరుణ్ గోవిల్ (ఉత్తర్ ప్రదేశ్)
బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.
విజయ్ వసంత్ (తమిళనాడు)
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, తమిళ నటుడు విజయ్ వసంత్ తన సమీప భాజపా అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
దీపక్ అధికారి (బెంగాల్)
బెంగాల్‌లోని ఘటల్ నుంచి తృణమూల్ సిట్టింగ్ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.
ఓడిపోయిన సెలబ్రిటీలు
నవనీత్ రాణా (మహారాష్ట్ర)
తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ బసవంత్ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
లాకెట్ ఛటర్జీ (బెంగాల్)
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
జూన్ 05 , 2024
Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బన్నీ.. సింప్లిసిటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్, అతని భార్య ఓ సాధారణ హోటల్‌లో టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్‌లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో చేస్తున్నారు.
.@alluarjun anna & sneha garu🤨😯❤️❤️Spotted at road side dhaba SIMPLICITY LEVEL. Man 🫡 pic.twitter.com/KoI7NOLfmF— Trend_AlluArjun_FC™ (@Trend_AA_FC) May 21, 2024
ఎక్కడ జరిగిందంటే?
ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం.
గతంలోనూ ఇలాగే..!
గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్‌కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్‌ను డబ్బులు అడిగి హోటల్ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి.
Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021
‘పుష్ప 2’తో బిజీ బిజీ..
ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
మే 21 , 2024
Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్ ట్రైన్‌లో ‘పుష్ప 2’ స్టెప్ వేసిన నైజీరియన్.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడిగా తీర్చిదిద్దింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సైతం అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ రూపొందుతోంది. ‘పుష్ప 2’లోని టైటిల్ సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. అందులోని హుక్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ స్టెప్‌పై రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నైజిరియన్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
పుష్ప 2 మేనియా!
నోయల్ రాబిన్‌సన్ (Noel Robinson) అనే నైజీరియన్.. జర్మన్‌లో ఉంటూ డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఉంటాడు. తద్వార మిలియన్లలో ఫాలోవర్లను సంపాదించాడు. రీసెంట్‌గా భారత్ పర్యటనకు వచ్చిన నోయల్.. ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ సందర్భంగా 'పుష్ప2' టైటిల్ సాంగ్‌లోని సింగిల్ లెగ్ స్టెప్ వేసి తోటి ప్రయాణికులను ఉర్రూతలూగించాడు. అటు స్థానికులు కూడా నోయల్‌ను ప్రోత్సహిస్తూ మూమెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Noel Robinson (@noelgoescrazy)
మెలోడి సాంగ్ వచ్చేస్తోంది!
'పుష్ప 2' టైటిల్ సాంగ్ ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ సారి సెకండ్ సాంగ్ కింద మెలోడీ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో పుష్ప మూవీలో చేసిన ‘శ్రీవల్లీ’ సాంగ్.. ఎంతటి ఆదరణ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అలాంటి మ్యాజిక్‌నే రిపీట్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. ఈ మెలోడీ పాటను త్వరలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సాంగ్ కోసం ఇప్పటి నుంచే బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూడటం మెుదలుపెట్టారు. కాగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మే 16 , 2024
Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వ్యూస్ సాధించి అదరగొడుతోంది.
హిందీలో తగ్గేదేలే!
గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆదరణ లభించింది. బన్నీ అద్భుతమైన నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘పుష్ప 2’ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ నార్త్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. తెలుగులో ఈ సాంగ్ 20 గంటల వ్యవధిలో 84 లక్షల వ్యూస్ సాధిస్తే.. హిందీలో ఏకంగా కోటి వ్యూస్ రాబట్టడం విశేషం. ఈ లిరికల్ సాంగ్‌ను తెలుగులో 4.8 లక్షల మంది లైక్ చేయగా.. హిందీలో 5.2 లక్షలుగా ఉంది. కాగా, విడుదలైన ఆరు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్ కూడా పుష్పగాడి హవా మెుదలైందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ సాంగ్ అదరహో..
బుధవారం సాయంత్రం పుష్ప 2 సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్ చాలా క్యాచీగా మారిపోయింది. ఇందులో అల్లుఅర్జున్ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్ లెగ్‌పై వేసే హుక్ స్టెప్ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్ స్టెప్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్ కూడా అదరహో అనిపిస్తున్నాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మే 02 , 2024
Pushpa Pushpa Song: అల్లు అర్జున్ చేతిలో పవన్ కల్యాణ్ పార్టీ సింబల్!
తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్ (Allu Arjun) ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవర్‌ఫుల్ టైటిల్ సాంగ్!
పుష్ప చిత్రం సూపర్ సక్సెక్ కావడంతో త్వరలో రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో ఈ సాంగ్‌ను రూపొందించారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్ చాలా క్యాచీగా మారిపోయింది.
https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr
గాజు గ్లాస్‌తో స్టెప్పులు
పుష్ప 2 నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లుఅర్జున్ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్ లెగ్‌పై వేసే హుక్ స్టెప్ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్ స్టెప్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్ కూడా అదరహో అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌తో కావాలనే ఈ స్టెప్స్ క్రియేట్ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలానే ఉంది.
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మే 01 , 2024
Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
1920
అవికా గోర్ లీడ్ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన '1920' సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.
ధూమం (Dhoomam)
పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
మనుచరిత్ర
మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి.
భారీ తారా గణం
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం 'భారీ తారాగణం'. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇంటింటి రామాయణం
ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన 'ఇంటింటి రామాయణం' చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు.
టీకూ వెడ్స్ షేరు
ఫస్ట్ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్ కౌర్ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files)
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్ మలయాళంలో 'కేరళ క్రైమ్ ఫైల్స్' అనే కొత్త వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్, అజు వర్గీస్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.
ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు
TitleCategoryLanguagePlatformRelease DateTake Care of MayaMovieEnglishNetflixJune 19GlamorousWeb SeriesEnglishNetflixJune 21Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22Social CurrencyWeb SeriesHindiNetflixJune 22Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23Class of 09 Web SeriesEnglishDisney + HotstarJune 19Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23World's Best MovieEnglishDisney + HotstarJune 23AgentMovieTeluguSony LivJune 23Lions Gate PlayMovieEnglishSony LivJune 23
జూన్ 19 , 2023
Rupali Barua: ఆశీష్ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593
ఆశిష్ - రూపాలి వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి ఆహ్వానించింది.
https://twitter.com/MilagroMovies/status/1661726388339216389
రూపాలి ఎవరు?
అసోంలోని గువాహటిలో ఏప్రిల్ 21, 1973న రూపాలి జన్మించారు. ప్రస్తుతం ఆమె కోలకత్తాలో స్థిరపడ్డారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా ఆమెకు పేరుంది. సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రూపాలీ గుర్తింపు పొందారు.
రూపాలీకి కోల్‌కత్తాలో ఫ్యాషన్ డిజైన్ స్టోర్స్ ఉన్నాయి. నటుడు ఆశీష్ తన వ్లాగ్స్‌లో భాగంగా ఓసారి కోల్‌కత్తాలో రూపాలీని కలిశారు. ఆ సందర్భంగా ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తొలి పరిచయంలోనే తాము మళ్లీ మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు రూపాలి తెలిపారు. మానవత్వం కలిగిన వ్యక్తి ఆశిష్ అని ప్రశంసించారు.
గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ బెంగాలి నటి శకుంతల బారువా కుమార్తె. రాజోషి.. థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా చాలా ఫేమస్. వీరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే మనస్పర్థల కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. దీంతో అప్పటినుంచి ఆశీష్ ఒంటరిగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రూపాలి పరిచయం తర్వాత వారు ఇరువురు డేటింగ్‌లో ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రూపాలి - ఆశీష్ పెళ్లి చేసుకున్నారు.
ఆశిష్ రెండో పెళ్లిపై బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ R. ఖాన్ ఘాటు విమర్శలు చేశారు. విషెస్ చెబుతూనే ’60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి బాయ్‌సాబ్!’ అంటూ ఆశిష్ పెళ్లి ఫొటోను షేర్ చేశాడు.
https://twitter.com/kamaalrkhan/status/1661716692970655744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1661716692970655744%7Ctwgr%5E01885b8d59f8e3fcd913f78a1914f6f43b653343%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkrk-viral-comments-on-ashish-vidyarthis-2nd-marriage-with-rupali-barua-at-60-964922.html
‘కాల్ సంధ్య’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆశీష్.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో ఆశీష్ మరింత పాపులారిటి సంపాదించుకున్నారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు 11 భాషల్లో సినిమాలు చేసిన ఆశీష్.. సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. రీసెంట్‌గా రైటర్ పద్మాభూషన్ సినిమాలోనూ హీరో తండ్రిగా నటించి మెప్పించాడు.
https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593
మే 26 , 2023
Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.
పూసింది పూసింది పున్నాగ
సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి.
https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s
యమహా నగరి కలకత్తా పురి
చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు.
https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE
యమునాతీరం
ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు.
https://www.youtube.com/watch?v=375j2vlMbxM
ఉప్పొంగెలే గోదావరి
గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.
https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ
తొలిసారి మిమ్మల్ని
శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.
https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE
చుక్కల్లారా చూపుల్లారా
ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.
https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE
పచ్చందనమే
సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.
https://www.youtube.com/watch?v=XruNLPI0yQc
జిలిబిలి పలుకుల
సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా..
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో.
https://www.youtube.com/watch?v=yJNSkGafGJw
మౌనమేళనోయి
సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.
https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs
రెక్కలొచ్చిన ప్రేమ
బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి.
https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
జూన్ 21 , 2023
Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
ప్రియాంకా హాల్దర్(Priyanka Halder) బెంగాల్‌కి చెందిన నటి, టీవీ మరియు వెబ్ సిరీస్‌లలో సెన్సేషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘క్రైమ్ పాట్రోల్’, ‘గాందీ బాత్’, ‘ఉతా పటాక్’ వంటి ప్రసిద్ధ షోల్లో నటించి గుర్తింపు పొందింది. థియేటర్ నుండి టీవీ స్క్రీన్ వరకూ తన ప్రయాణంలో ఆమె వివిధ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
తాజా వివాదం
తాజాగా, ఆమె ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే కామెడీ షోలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. షోలో ఆమె 'కాస్ట్యూమ్ కట్టర్', ఆమె స్నేహితుడు మోహమ్మద్ ఆదిల్ తో కలసి చేసిన ‘డ్రెస్ కట్టింగ్ స్టంట్’ నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. మోహమ్మద్ ఆదిల్ ఆమెను అసభ్యంగా తాకుతూ ఆమె డ్రెస్ కట్ చేసిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ప్రియాంక హల్దర్ డ్రెస్ కట్టర్‌ను ఏమి(Priyanka Halder) అనకుండా ప్రొత్సహించడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ డ్రెస్ కట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక హాల్దర్‌కు పెళ్లై.. 15 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ వయసులో ఇలాంటివి చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
View this post on Instagram A post shared by India’s Got Latent (@indiasgotlatent)
ప్రస్తుతం ప్రియాంక హల్దర్ పేరు సోషల్ మీడియాతో పాటు… ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌గా మారడంతో ఆమె పర్సనల్ లైఫ్, సినిమా కెరీర్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ప్రియాంక హల్దర్ కోల్‌కతాలో పుట్టి పెరిగింది. అక్కడే ఆమె 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేసింది.
View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial)
సాదాసీదా జీవితంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, చాలా చిన్న వయస్సులో (Priyanka Halder Viral Video)పెళ్లి కావడంతో ఒక్కసారిగా మారిపోయింది. 18 సంవత్సరాల వయస్సులోనే ప్రియాంక గర్భవతి అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2024 నాటికి ఆమె కుమారుడు 15 సంవత్సరాలు.
ప్రియాంక హల్దర్ భర్త భారతీయ రైల్వేలో నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మీడియాకు దూరంగా ఉంటున్నారు.
ఆమె బెంగాళీ కాగా, హిందూ ధార్మిక విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
తాను సినిమా రంగంలో ఉన్న విషయం మొదట తన భర్తకు తెలియకుండా ఉన్నట్లు సమాచారం. ప్రియాంక ప్రధానంగా బి-గ్రేడ్ సినిమాల‌్లో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య సమస్యలు ఎదురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక ఆమె భర్త వెర్వేరుగా జీవిస్తున్నారు.
View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial)
ప్రియాంక తన కుడి చేతిపై "A" అనే అక్షరంతో ఉన్న టాటూ వేయించుకుంది. అయితే దాని అర్థం మాత్రం తెలియదు. త్రికాల జ్ఞానుడైన శివుని భక్తురాలిగా, ఆమె తరచుగా ఆలయాలకు వెళ్తుంటుంది.
నట ప్రస్థానం
ప్రియాంక హల్దర్ తన నటనా జీవితాన్ని బి-గ్రేడ్ సినిమాలతో ప్రారంభించింది. ఆమె పాత్రలు(Priyanka Halder) బోల్డ్, సెన్సువల్‌గా ఉండటంతో ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచేది. హిందీ వెబ్‌సిరీస్ రంగంలో, ముఖ్యంగా ALT బాలాజీ నిర్మించిన "గందీ బాత్" అనే వెబ్‌సిరీస్‌తో ఆమె మంచి గుర్తింపు పొందింది.
ప్రియాంక హల్దర్ నటించిన రీసెంట్ వెబ్ సిరీస్‌లు
సెకండ్ హనీమూన్.సాజిష్ ప్యాస్ మాంటీ బెలాగం
టీవీ కెరీర్
ప్రియాంకా హాల్దర్ తన కెరీర్‌ను ‘క్రైమ్ పాట్రోల్ డయల్ 100’ ద్వారా ప్రారంభించింది. ఈ షోలో ఆమె పలు కథలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షోలో న్యాయపరమైన కేసులు, బాధితుల కథలు ప్రధానంగా టెలీకాస్ట్ అవుతుంటాయి. ఈ షోతో పాటు ఆమె ‘క్రైమ్ వరల్డ్’, ‘షీమారూ టీవీ’ షోల్లో కూడా కనిపించింది.
అనంతరం ఆమె ALT బాలాజీ వెబ్ సిరీస్ ‘గాందీ బాత్’ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రధాన ప్రాజెక్టులలో ‘ఉతా పటాక్’, ‘ప్యాస్’, ‘సజిష్’ లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఉతా పటాక్ 4 ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
ప్రియాంకా హాల్దర్ ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కామెడీ షోలో ‘కాస్ట్యూమ్ కట్టర్ స్టంట్’ కి సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఆమె రెడ్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించి, షోలో ఆమె గౌనును కత్తిరిస్తూ కట్-అవుట్ డ్రెస్ గా మార్చడం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. పబ్లిక్‌లో అనైతిక ప్రవర్తన అని కొందరు విమర్శించగా, ప్రమోషనల్ స్టంట్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా లింకులు
ఇన్‌స్టాగ్రామ్: Priyanka Halder Officialఫేస్‌బుక్: Priyanka Halder Facebookయూట్యూబ్: Priyanka Halder YouTube
డిసెంబర్ 10 , 2024
BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
అలా తెరమీదకి..
ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.
https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20
స్టోరీ ఇదే..
పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.
తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.
https://youtu.be/stcCZWCBegk
త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా?
మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది. వాస్తవాలకు, భ్రమలకు మధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.
https://www.youtube.com/watch?v=yNnJ9de339k
12 భాషల్లో చిత్రీకరణ
డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.
https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
జూలై 26 , 2023