• TFIDB EN
  • భగవంత్ కేసరి
    U/ATelugu
    కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఏం చేశాడు? ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు ఏలాంటి పనులు చేశాడన్నది మిగతా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు

    నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగంత్ కేసరి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్...read more

    How was the movie?

    తారాగణం
    నందమూరి బాలకృష్ణ
    నేలకొండ భగవంత కేసరి
    కాజల్ అగర్వాల్
    కాత్యాయని
    శ్రీలీల
    విజయలక్ష్మి
    అర్జున్ రాంపాల్
    రాహుల్ సంఘ్వీ
    పి. రవిశంకర్
    ఆర్. శరత్‌కుమార్
    రఘు బాబు
    జాన్ విజయ్
    శుక్లా
    వీటీవీ గణేష్
    రాహుల్ రవి
    సిబ్బంది
    అనిల్ రావిపూడి
    దర్శకుడు
    సాహు గారపాటినిర్మాత
    హరీష్ పెద్దినిర్మాత
    అనిల్ రావిపూడి
    రచయిత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    రామ్ ప్రసాద్
    సినిమాటోగ్రాఫర్
    తమ్మిరాజుఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి  పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం. ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie) కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా  ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.  మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ (GHOST) కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది. ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal MoviePortuguese NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25  Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
    అక్టోబర్ 26 , 2023
    Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు
    Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు
    నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగంత్ కేసరి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ.. కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కిన భగవంత్ కేసరితో ముందుకొచ్చాడు. ట్రైలర్‌లో బాలయ్య- శ్రీలీల మధ్య వచ్చిన ఎమోషన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాతో తన పంథాను మార్చుకున్న అనిల్ రావుపూడి.. బాలకృష్ణతో కొత్త  ప్రయోగం చేయడంతో సినిమాపై హెప్ పెరిగింది. మరి ఇంతకు ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నేలకొండపల్లి భగంవత్ కేసరి మెప్పించాడా? లేదా? YouSay రివ్యూలో చూద్దాం. నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్, శరత్‌కుమార్ డెరెక్టర్: అనిల్ రావుపూడి నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది సినిమాటోగ్రఫి: సి. రామ్ ప్రసాద్ సంగీతం: తమన్  విడుదల తేదీ: అక్టోబర్ 19 కథ: కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు నిత్యం కష్టపడుతుంటాడు. అయితే విజ్జి పాప(శ్రీలీల) మాత్రం అవేమి పట్టనట్టుగా ఉంటుంది. తనను వదిలేయమని వేడుకుంటుంది. ఈక్రమంలో విజ్జును చంపడానికి వచ్చిన విలన్లతో బాలయ్య తలపడుతాడు. వాళ్లు ఊహించని ఓ ట్విస్ట్ ఇస్తారు. ఇంతకు ఆ ట్విస్ట్ ఏమిటి? జైలర్‌కు విలన్‌కు ఉన్న విరోధం ఏమిటి? భగవంత్ కేసరి.. జైలర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇక సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతాయి. శ్రీలీల- బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ అదిరిపోతుంది. బాలయ్య మాస్ స్టేప్పులతో ఇరగదీశాడు. అయితే సినిమాలో కాజల్‌తో పాటలు ఏమి లేవు. బాలకృష్ణతో శ్రీలీల బాండింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అయితే భగవంత్ కేసరి చిత్రం బాలయ్య గత సినిమాల మాదిరి ఉండదు. కొంత వినోదం, కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. కూతురు సెంటిమెంట్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలో మూడు పెద్ద ఫైట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపిస్తాయి. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. విలన్ అర్జున్ రామ్‌పాల్‌తో బాలయ్య సన్నివేశాలు గూస్‌బంప్స్. సినిమాకే హైలెట్‌గా బాలకృష్ణ ఇంకో గెటప్‌ ఉంటుంది. బాలయ్యకు జైలర్‌కు మధ్య ఉన్న సంబంధమే కథకు సెంట్రల్ పాయింట్. ఆ పాయింట్‌కు శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌ను ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలిస్తుంది, ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భగవంత్ కేసరి సినిమాకు మెయిన్ థీమ్. ఈ ఎపిసోడ్‌లో 15 నిమిషాల పాటు బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.  ఎవరెలా చేశారంటే.. భగవంత్ కేసరిలో బాలకృష్ణ పూర్తిగా కొత్తగా కనిపించారు. ఇప్పటివరకు యాక్షన్ సీన్లలోనే ఎక్కువ కనిపించిన బాలయ్య.. కామెడీ సీన్స్‌లోనూ అదరగొట్టారు. శ్రీలీలతో జరిగే ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య తన నటనతో కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో ఎప్పటిలాగే అదరగొట్టారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి. ఇక శ్రీలీల గురించి చెప్పాలంటే.. విజ్జు పాత్రలో సహాజమైన నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లో గుర్తిండి పోతుంది. ముఖ్యంగా శ్రీలీలకు కెరీర్ ఆరంభంలోనే ఇలా నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్లలో బాలయ్యతో పోటీపడి మరి నటించింది. ఇక బాలయ్య సరసన నటించిన కాజల్ తన పాత్ర పరిధిమేరకు నటించింది. పెద్దగా తన పాత్రకు స్కోప్ లేనప్పటికీ.. ఉన్నంతలో బాగా చేసింది. విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ మెప్పించాడు. కథకు తగ్గట్లు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో హిట్ అయిన అనిల్ రావిపూడి తన సినిమాలకు భిన్నంగా బాలయ్యతో ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తీసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. అనిల్ తీసుకొచ్చి స్టోరీ లైన్ బలమైనదే అయినప్పటికీ.. దానికి తగినవిధంగా ఇంకాస్త బలంగా కథ రాసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ తాను అనుకున్న స్టోరీని అమలు చేయడంలో మాత్రం విజయం సాధించాడు. బాలయ్య- శ్రీలీల మధ్య ఇంకొన్ని బలమైన ఎమోషన్ సీన్లు పడితే బాగుండేది అనిపించింది.  టెక్నికల్ పరంగా సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ మ్యూజిక్ మెప్పిస్తుంది. కానీ గత సినిమాలతో పోలిస్తే BGM రేంజ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. సినిమాలోని రెండు పాటలు అలరిస్తాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ప్రత్యేకంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో బాలయ్య రిచ్‌ లుక్‌లో కనిపించేందుకు బాగా కష్టపడినట్లు అర్థం అవుతోంది. ఇక వెంకట్ యాక్షన్ సిక్వెన్స్‌ హెలెట్. ఉన్న మూడు ఫైట్లు బాలయ్య మాస్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి. బలాలు బాలకృష్ణ- శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్లు యాక్షన్ సన్నివేశాలు ఇంటర్వెల్ బ్యాంగ్ బలహీనతలు అంచనాలకు తగ్గట్టుగా లేని ఫస్టాఫ్ కొన్ని చోట్ల లాగ్ సీన్లు చివరగా: తండ్రి- కూతుళ్ల మధ్య ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... ప్రేక్షకులకు అన్ని విధాల కనెక్ట్ అవుతుంది. రేటింగ్: 3/5
    అక్టోబర్ 26 , 2023
    OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!
    OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!
    ఈ దసరా పండగకు థియేటర్లు దద్దరిల్లనున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీలు సినిమా హాళ్లో మోత మోగించనున్నాయి. బాలయ్య, రవితేజ ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో ఈసారి దసరా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల హీరోలు ప్రమోషన్లలో తెగ బీజీగా ఉన్నారు. రెండు మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో కూడా దసరా బరిలో నిలుస్తోంది. మరి ఏ చిత్రం ప్రేక్షకులను రంజింప జేయనుందో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. అటు ఓటీటీ ఫ్లాట్‌ ఫారమ్స్‌లోనూ 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దామా... టైగర్ నాగేశ్వర రావు స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో రవితేజ మాస్ యాక్షన్‌తో ఇరగదీసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే దాదాపు 23 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ తిరిగి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తుండటంతో సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. రవితేజ అన్ని తానై మూవీ ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. భగవంత్ కేసరి బాలకృష్ణ మాస్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'భగవంత్ కేసరి ఈ పేరు సానా ఏళ్లు గుర్తుంటుంది' అని బాలయ్య డైలగ్ ప్రేక్షకుల్లో బాగా నానుతోంది. మహిళా సాధికారత కథాంశంగా ఈ సినిమా తెరకెక్కిందని బాలయ్య ఇప్పటికే తెలిపారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లియో స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం లియో. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు మ్యాన్షన్ 24 బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్ మ్యాన్షన్ 24. ఈ వెబ్ సిరీస్ హాట్‌ స్టార్‌లో అక్టోబర్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, అవికాగోర్, బిందు మాధవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్ రానుంది.  TitleCategoryLanguagePlatformRelease DateRick and Marty: Season 7WebseriesEnglishNetflixOctober 16I Walked Up A VampireWebseriesEnglishNetflixOctober 17The Devil on TrialWebseriesEnglishNetflixOctober 17Kaala PaaniWebseriesEnglishNetflixOctober 18Singapenne MovieTamil NetflixOctober 18Bodies Web SeriesEnglishNetflixOctober 19Captain Lazer Hawk: A Blood Dragon RemixWeb SeriesEnglish NetflixOctober 19Crypto BoyMovieDutch NetflixOctober 19NeonWeb SeriesEnglishNetflixOctober 19CreatureWeb SeriesTurkishNetflixOctober 20DoonaWeb SeriesKorean NetflixOctober 20Elite Season 7Web Series SpanishNetflixOctober 20Kandasams: The BabyMovie EnglishNetflixOctober 20Old DadsMovieEnglishNetflixOctober 20Once Upon A StudioMovieEnglishDisney Plus HotstarOctober 16Mansion 24Web SeriesTeluguDisney Plus HotstarOctober 17The Wandering Earth IIMovieMandarinAmazon PrimeOctober 18Permanent Roommates: Season 3Web SeriesHindiAmazon PrimeOctober 18Mama MashchindraMovieTeluguAmazon PrimeOctober 20Sayen: Desert RoadMovieEnglishAmazon PrimeOctober 20The Other JoyMovieEnglishAmazon PrimeOctober 20Transformers: The Rise of the BeastsMovieEnglishAmazon PrimeOctober 20Upload Season 3Web SeriesEnglishAmazon PrimeOctober 20Unstoppable Limited Edition Talk ShowTeluguahaOctober 17Red SandalwoodMovieTamilahaOctober 20Krishna RamaMovieTeluguE-WinOctober 22
    అక్టోబర్ 16 , 2023
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్  వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్  1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు  38 సంవత్సరాలు  కాజల్ అగర్వాల్  మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్  మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  కాజల్ అగర్వాల్  ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.  కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి! 
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి! 
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌! నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య - రాహుల్ సంకృత్యాన్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం! టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్‌-3 ఉంటుందని హింట్‌ ఇవ్వడంతో త్రివిక్రమ్‌ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు.  ఆ డైరెక్టర్లతోనూ చర్చలు! నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్‌ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  హ్యాట్రిక్‌ హిట్లతో ఫుల్ జోష్‌ టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌) పోలిస్తే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్లుగా నిలవడం విశేషం. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. బాలయ్య రెమ్యూనరేషన్‌ ఎంతంటే? సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్‌ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్‌ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్‌ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.  
    ఫిబ్రవరి 20 , 2024
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.  ముఖ్యంగా ఏమోషనల్‌ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్‌ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.  శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్‌, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్‌ కేసరి ద్వారా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.  ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.  కిస్‌ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'భరాతే' అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.  ఇక 2021లో వచ్చిన 'పెళ్లి సందD' చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్‌ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్‌ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.  ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    అక్టోబర్ 19 , 2023
    Kajal Aggarwal: కాజల్‌కు అరుదైన గుర్తింపు..  ఆ అవార్డుతో గట్టి కమ్‌బ్యాక్‌!
    Kajal Aggarwal: కాజల్‌కు అరుదైన గుర్తింపు..  ఆ అవార్డుతో గట్టి కమ్‌బ్యాక్‌!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal).. ఇటీవల బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు.. కాజల్‌ నటనపై కూడా ప్రశంసలు కురిశాయి. తాజాగా ఈ చిత్రానికి గాను ‘జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ - JIFF’ (Jaipur International Film Festival)లో కాజల్‌ను ఓ అవార్డు వరించింది. కాజల్‌తో (Kajal Agarwal) పాటు ప్రకాష్‌ (బింబిసారా), అనుపమ్‌ ఖేర్‌ (కార్తికేయ 2), అర్జున్‌ రాంపాల్‌ (భగవంత్‌ కేసరి) సైతం JIFF అవార్డులకు ఎంపికయ్యారు.  గత కొంతకాలంగా అవకాశాలు లేక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్‌ ‘భగవంత్‌ కేసరి’ ద్వారా గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. తాజా అవార్డుతో కాజల్‌ మరోమారు ఇండస్ట్రీలో పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజల్‌.. 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే కాజల్‌కు తిరుగుండదు. అందుకే కాజల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాగే హిందీలో 'ఉమా', తెలుగులో సత్యభామ అనే రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.  ఇదిలా ఉంటే మూడు పదుల వయసులోనూ కాజల్‌ (#KajalAggarwal) యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆమె ఫిట్‌నెస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.  అయితే తన అందం, ఫిట్‌నెస్‌ వెనకున్న రహాస్యాలను కాజల్‌ పంచుకున్నారు. కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌కు తెలియజేశారు.  ప్రతీ రోజు సూర్య నమస్కారాలు  చేస్తానని కాజల్‌ అగర్వాల్‌ (#KajalAggarwal) తెలిపింది. వారంలో కనీసం మూడు రోజుల యోగా తప్పనిసరి అని పేర్కొంది. అయితే ప్రతీరోజూ రొటీన్‌గా ఒకే రకమైన వ్యాయమం కాకుండా విభిన్నంగా ట్రై చేస్తుంటానని కాజల్‌ తెలిపింది. మధ్య మధ్యలో స్విమ్మింగ్‌ కూడా చేస్తుంటానని చెప్పుకొచ్చింది. ఇక డైట్‌ విషయంలోనూ కాజల్‌ చాలా జాగ్రత్తగా ఉంటుందట. వ్యాయామానికి తగిన ఫుడ్‌ తీసుకుంటూ ఉంటానని గతంలో తెలిపింది.  నాన్‌ వెజ్‌ కంటే ఎక్కువగా వెజ్‌కే ఈ బ్యూటీ ప్రాధాన్యం ఇస్తుందట. ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకోవడమే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని కాజల్‌ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.  
    జనవరి 27 , 2024
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.  అసలేం జరిగిందంటే? దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్‌ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్‌ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.  https://twitter.com/i/status/1785936991726743773 మండిపడుతున్న ఫ్యాన్స్ అనిల్‌ రావిపూడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగానే బదులిస్తున్నారు.  అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్‌ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్‌ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు.  ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్‌ డేట్‌ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్‌ డే? జానర్‌? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1785935511531511969
    మే 02 , 2024
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.  సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది. 
    డిసెంబర్ 19 , 2023
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), మాస్‌ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.  బాలయ్య vs రవితేజ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్‌ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్‌ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్‌ త్వరగా షూట్‌ చేసి సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ - దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్‌ బచ్చన్‌' మూవీ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఫుల్‌ ఫోకస్‌ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని హరీష్‌ శంకర్‌ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్‌ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.  గతంలో బాలయ్యదే పైచేయి బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్‌ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  దేవర నుంచి గట్టిపోటీ తప్పదా? తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని కొరటాల టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.  'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్‌  గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.  https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 13 , 2024
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సలార్‌ (Salaar) పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్‌’, క్రిస్మస్‌ కానుకగా విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  యానిమల్‌ (Animal) అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.  వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.  ఆదిపురుష్ (Adipurush) ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది.  ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.  వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.  భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'భగవంత్‌ కేసరి'. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. బ్రో (Bro) పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.  దసర (Dasara) నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల మార్క్‌ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బేబీ (Baby) చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్‌వైడ్‌గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం. 
    డిసెంబర్ 27 , 2023
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.  రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.  శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.  తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.  అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.  కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.  కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.  కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది. 
    డిసెంబర్ 14 , 2023
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,  ఇమ్రాన్ హష్మీ,  సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,  అనీష్ కురువిల్లా,  కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే. డైరెక్టర్: ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా మ్యూజిక్: తనూజ్ టికు ఎడిటర్: రామేశ్వర్ S. భగత్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున) సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.  కథ:  అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ ఎలా ఉందంటే? టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.  భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి  న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్. టెక్నికల్ పరంగా సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది. బలాలు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్ బలహీనతలు స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం చివరగా: హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.5/5
    నవంబర్ 12 , 2023
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు దర్శకుడు: రాహుల్ సదాశివన్ సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్ ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్ విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024 మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్‌ సదాశివన్ రూపొందించిన డార్క్‌ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ 'భ్రమయుగం'. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని రిలీజ్‌ చేసింది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తేవన్ (అర్జున్ అశోకన్) (Bramayugam Review In Telugu) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కుడుమోన్‌ బాగా ఆదరిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు? కుడుమోన్ పొట్టి ఎవరు ? అడవిలో పాడుబడ్డ భవంతిలో ఏం చేస్తున్నాడు? తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి (Bramayugam Review In Telugu).. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. కుడుమోన్ పొట్టి మిస్టీరియస్ పాత్రలో అద్బుత నటన కనబరిచాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను చాటుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భ్రమయుగం మూవీ ప్రారంభం నుంచే చాలా ఇంటెన్స్‌తో, హై ఎనర్జీతో మెుదలవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్‌ తెరకెక్కించారు. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, భయానకంగా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది. అయితే స్లోగా ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు. టెక్నికల్‌గా  ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలంగా మారింది. యాక్టర్ల నటనకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సన్నివేశాలు హై రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్‌ షెహనాద్ జలాల్ సినిమా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సాయపడ్డాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేనటీనటులుసంగీతంకెమెరా పనితనం మైనస్‌ పాయింట్స్‌ స్లోగా సాగే కథనంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.  వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.  ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది. ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్‌ వివాహ ఫొటోలను షేర్‌ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్‌ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్‌ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు. 
    సెప్టెంబర్ 25 , 2023
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.  ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5  
    మే 10 , 2024
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్‌ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్‌ ఇచ్చేలా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మరో గ్లింప్స్‌ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’ భగత్‌ బ్లేజ్‌(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్‌ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్‌ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్‌ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 అధికార వైసీపీకి గట్టి కౌంటర్! ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్‌’ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1770055005283688593 పొలిటికల్‌ హీట్‌ పెంచిన డైలాగ్స్‌! మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్‌ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
    మార్చి 19 , 2024
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.  మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/sunny4u007/status/1633901586413154304 ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.  https://twitter.com/i/status/1633886352583565313 ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు  ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.  https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20 వరుస పెట్టి సినిమాలు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్‌ శంకర్‌ షూటింగ్‌ను మార్చి 28నుంచి  పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.  https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025 https://twitter.com/SupremePSPK/status/1630933852058423302 ఫటా ఫట్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి.   పవన్ క్యూ జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు వేళాయే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
    మార్చి 10 , 2023
    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో చాలా తక్కవ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన క్యూట్ లుక్, యాక్టింగ్‌తో విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరోయిన్‌ స్కంద, ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో శ్రీలీల గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Sreeleela) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  శ్రీలీల దేనికి ఫేమస్? శ్రీలీల కన్నడ, తెలుగు భాషాల్లో స్టార్ హీరోయిన్‌గా ఉంది. ధమాకా, పెళ్లిసందD, గుంటూరు కారం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.   శ్రీలీల వయస్సు ఎంత? 2001, జూన్ 14న జన్మించింది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు  శ్రీలీల ముద్దు పేరు? లీల  శ్రీలీల ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు   శ్రీలీల ఎక్కడ పుట్టింది? డెట్రాయిట్, అమెరికా  శ్రీలీల అభిరుచులు? సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ చేయడం  శ్రీలీలకు ఇష్టమైన ఆహారం? వెజిటేరియన్  శ్రీలీల తల్లిదండ్రుల పేర్లు? తల్లిపేరు స్వర్ణలత( బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్)  శ్రీలీల ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ శ్రీలీలకు ఇష్టమైన కలర్ ? రెడ్ శ్రీలీలకు ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, రేఖ  శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? పెళ్లిసందD  శ్రీలీల ఏం చదివింది? MBBS  శ్రీలీల పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2కోట్ల నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. శ్రీలీల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శ్రీలీల సినిమాల్లోకి రాకముందు భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసింది  శ్రీలీల ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sreeleela14/?hl=en శ్రీలీలకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ధమాకా చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది శ్రీలీలకు ఎంత మంది పిల్లలు? శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. అబ్బాయి పేరు గురు, అమ్మాయి పేరు శోభిత https://www.youtube.com/watch?v=N4Zdl7slKZc శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.శ్రీలీల తన మూడేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుందిసినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత డాక్టర్‌గా పనిచేస్తానని శ్రీలీల చెప్పింది.శ్రీలీలకు పెంపుడు జంతువులంటే ఇష్టంశ్రీలీల తండ్రి పారిశ్రామిక వేత్త సూరపనేని శుభాకర్‌రావు అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అతను కొట్టి పారేశాడు. శ్రీలీల తల్లితో తాను విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జన్మించినట్లు పేర్కొన్నాడు.
    ఏప్రిల్ 08 , 2024

    @2021 KTree