ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
నందమూరి బాలకృష్ణ
భార్గవ్విజయశాంతి
లతమందాకిని
రోజారావు గోపాల్ రావు
డిఐజి ప్రతాప్ రావుజగ్గయ్య
చీఫ్ ఇంజనీర్ భానోగి రావుగొల్లపూడి మారుతీ రావు
మంత్రి రాజ శేకరంపరుచూరి బ్రదర్స్
మంత్రి బ్రదర్చంద్ర మోహన్
శంకరంరంగనాథ్
ఠాగూర్కోట శ్రీనివాసరావు
సదానందంచలపతి రావు
కల్లు దాసుPJ శర్మ
సుతి వేలు
అంజినీలుమల్లికార్జునరావు
కస్టమ్స్ అధికారిMVS హరినాథ్ రావుDEO
హేమ సుందర్
భీమేశ్వర రావుజనార్దన్
జయ భాస్కర్ డాక్టర్
ఈశ్వర్ రావు Asst ఇంజనీర్
రమణా రెడ్డికల్లు దాసు కొడుకు
చిట్టి బాబు
అన్నపూర్ణ
పార్వతిముచ్చెర్ల అరుణ
పద్మమహిజటైపిస్ట్
రేఖ
సిబ్బంది
ఎ. కోదండరామి రెడ్డి
దర్శకుడుఎస్. జయ రామారావునిర్మాత
రావు గోపాల్ రావు (సమర్పకులు)నిర్మాత
కె. చక్రవర్తి
సంగీతకారుడుకోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు
నందమూరి బాలకృష్ణ ఎవరు?
బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం.
నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు?
చెన్నై
నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 జూన్ 10
నందమూరి బాలకృష్ణ భార్య పేరు?
వసుంధర దేవి
బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని)
నందమూరి బాలకృష్ణ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు?
తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ
బాలకృష్ణ అభిమాన నటుడు?
నందమూరి తారక రామారావు
బాలకృష్ణ అభిమాన హీరోయిన్?
సావిత్రి
బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు?
మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ.
బాలకృష్ణకు ఇష్టమైన కలర్?
వైట్
బాలకృష్ణ ఏం చదివాడు?
నిజాం కాలేజీలో డిగ్రీ
బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 108 సినిమాల్లో నటించాడు
బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం?
చికెన్ పలావు
బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.
బాలకృష్ణ 100వ సినిమా పేరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM
బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
హిందూపురం
బాలయ్య గెలుచుకున్న అవార్డులు?
బాలయ్య 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
మార్చి 19 , 2024
Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా?
రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.
తేజ సజ్జ:
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు హనుమాన్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.
https://youtu.be/AvjvZ7q2apE
దేవ్‌దత్తా నాగే:
అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.
చిరంజీవి:
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20
https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20
https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20
https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20
https://youtu.be/BfJRVxeIKD8
అర్జున్:
నితిన్ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్ హనుమాన్ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్ అయినా అలవోకగా చేయగలనని అర్జున్ ఈ సినిమా ద్వారా నిరూపించారు.
రాజేంద్ర ప్రసాద్:
నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్ అయ్యింది.
విందు దర సింగ్:
సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
ఏప్రిల్ 04 , 2023
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్ ఒక్కడేనా.. దంగల్ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
దేశంలో ‘ఆదిపురుష్’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్ నిజంగానే దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆదిపురుష్ బడ్జెట్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్ బడ్జెట్ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్’ నిలిచింది.
పెట్టుబడికి ఢోకా లేదు
ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్ టీమ్ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
దంగల్ VS ఆదిపురుష్
దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేయాలంటే ఆదిపురుష్ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్.. చైనా, హాంకాంగ్, మలేషియా, UAE, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్ కథ యూనివర్సల్ సబ్జెట్ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్ టాక్ తోడైతే ఆదిపురుష్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ జూన్ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, వంశీ, ప్రమోద్, ఓంరౌత్ నిర్మించారు.
మే 11 , 2023
Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
ట్రైలర్ యాంగిల్
ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు.
https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc
ట్రైలర్‌లో ఏముంది?
ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు. లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది.
నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.
బలహీనతలు:
ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.
తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది.
డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు.
ఫైనల్‌గా
భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
మే 09 , 2023
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Ramayana: ‘రామాయణం’ టీమ్ నుంచి డబుల్ ట్రీట్.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూట్ మెుదలవ్వగా సెట్ నుంచి కొన్ని ఫోటోలు సైతం లీకయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి కళ్లు చెదిరే అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ అధికారికంగా అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రెండు పార్ట్స్‌గా..
‘రామాయణ’ (Ramayana) చిత్రం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మెుదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. ఇది గమనించిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీని రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
హనుమంతుడిగా సన్నీ డియోల్!
‘రామయణ’ (Ramayana) చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడితో పాటు పలువురు స్టార్ నటులు ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సూర్పనక రోల్ చేస్తున్నట్లు తెలిసింది. హిందీ ‘రామాయణం’ సీరియల్‌లో రాముడిగా కనిపించి ఎంతో పాపులర్ అయిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, మందరగా షీబా చద్దా చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు రామయణ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.
https://twitter.com/seeuatthemovie/status/1854049562689740919
ఆస్కార్ విన్నర్లతో మ్యూజిక్
‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర‌్లు రంగంలోకి దిగారు. ఇందులో ఒకరు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కాగా ఇంకొకరు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్దరూ కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించనున్నారు. తొలుత ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్‌ను మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. అయితే అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో మ్యూజిక్ ఉండాలన్న ఉద్దేశ్యంతో హన్స్ జిమ్మెర్‌ను సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యుడ్ని చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పనిచేసిన హన్స్‌కు ‘రామాయణ’ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ కానుంది. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ వంటి హాలీవుడ్ చిత్రాలతో హన్స్ జిమ్మెర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
గ్రాఫిక్స్‌పై స్పెషల్ ఫోకస్
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణ’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 26 మంది ఎక్స్‌పర్ట్ గ్రాఫిక్స్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి వీఎఫ్‌ఎక్స్ విషయంలో మూవీ టీమ్ ఏమాత్రం రాజీ పడటం లేదని అర్థమవుతోంది.
తెలుగు బాధ్యత త్రివిక్రమ్‌దే!
రామాయణ (Ramayana) తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా త్రివిక్రమ్ ఎక్కడా ఖండించలేదు. దీంతో ‘రామాయణ’ టీమ్‌లో మాటల మాంత్రికుడు సైతం భాగస్వామి అయినట్లు తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు.
నవంబర్ 06 , 2024
Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
సంగీతం : కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్. బాల్‌రెడ్డి
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
సమర్పణ: తబితా సుకుమార్
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
విడుదల తేదీ : 23-08-2024
రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం 'ఆయ్'తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. అయితే గ్లామర్ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్ టైమింగ్, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్ లవ్ ట్రాక్, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రావు రమేష్ నటనకామెడీక్లైమాక్స్
మైనస్ పాయింట్
అంకిత్ లవ్ ట్రాక్‌ఊహాకు అందేలా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 23 , 2024
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.
‘హనుమాన్’గా తొలుత యష్
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
అక్టోబర్ 30 , 2024
Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్ హీరోల చిత్రాలు ఇవే!
2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్ రోల్ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది.
ఏజెంట్
యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.
ఆదిపురుష్
ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.
కస్టడీ
ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
రావాణాసుర
రవితేజ తొలిసారి విలన్ షేడెడ్ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.
గాండీవదారి అర్జున
వరణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.
రామబాణం
ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ హీరో గోపిచంద్.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.
భోళాశంకర్
మెగాస్టార్ హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
ఆదికేశవ
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 20 , 2023
Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ షూటింగ్ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది.
కారణం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్ షూట్ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’
రాత్రి ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) షూటింగ్ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.
దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్స్ చేశాడు. వాసు, శ్యామ్ సింగరాయ్ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 12 , 2024
పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది అందాల తారలు
సాధారణంగా హీరోయిన్స్ అంటే గ్లామర్ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం.
సమంత:
సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్ 14న శాంకుతులం రిలీజ్ కానుండగా ఫ్యాన్స్‌ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.
కృతి సనన్:
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అలియా భట్:
బాలీవుడ్ బ్యూటీ అలియభట్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న టక్త్ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది.
త్రిష:
నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్‌లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు.
ఐశ్వర్యరాయ్:
బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్ గ్లామర్ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్‌తో ‘జోదా అక్భర్’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా నటించారు.
అనుష్క:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.
కంగనా రనౌత్:
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు.
కాజల్:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం కాజల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో కాజల్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్‌తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.
రిచా పనాయ్:
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్‌ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు.
ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
రీమా సేన్:
2010లో టాలీవుడ్‌లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్‌ను రీమాసేన్ సంపాదించారు. అనితా పాండియన్ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.
మార్చి 29 , 2023
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
[toc]
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
అక్టోబర్ 22 , 2024
Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటంతో.. వసూళ్లు భారీగా రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్(Tillu Square Weekend Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్‌గా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఏ టాలీవుడ్ మూవీ రాబట్టలేదు. ఈ చిత్రం ఈవారంలో రూ.100కోట్ల మార్క్‌ను అవలీలగా దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.37 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.31కోట్లు గ్రాస్ రాబట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రాల్లో టిల్లు స్కేర్ కలెక్షన్లు ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.
నెట్ వసూళ్లు ఎంతంటే?
ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Weekend Net Collections) మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40-45 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిసింది.
లాభాల్లో టిల్లు స్కేర్
ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండటంతో... మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం 'డీజే టిల్లు చిత్రం' బ్లాక్ బాస్టర్ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్ బిజినెస్ బాగానే(Tillu Square 3days Collections) జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24కోట్లుగా ఉంది. ఇప్పటికే ఈ టార్గెట్‌ను దాటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు రూ.15కోట్ల లాభం కళ్లజూపింది.
టిల్లు స్కేర్ సక్సెస్ కారణం ఇదేనా?
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి.
ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్
టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకుంది. చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టిల్లు క్యూబ్
మరోవైపు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో ఈరోజు నుంచి ఈ ప్రకటన వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 01 , 2024
Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. మంచు మనోజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
‘విష్ణు గొడవ చేయలేదు’
మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవపై ఆయన భార్య నిర్మల (Manchu Nirmala) మెుదటిసారి రియాక్ట్ అయ్యారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ‘డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై విష్ణు మీద మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.
https://twitter.com/FilmyBowl/status/1868917278437482648
మనోజ్ ప్రెస్‌నోట్‌లో ఏముందంటే?
తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం (డిసెంబర్ 15) ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. ‘నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉంది. విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా’ అని మనోజ్ తన ప్రకటనలో తెలియజేశాడు. అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.
https://twitter.com/pakkatelugunewz/status/1868322391496999391
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
ఇదిలా ఉంటే సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారంటూ ప్రధాన మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మనోజ్ సోమవారం భార్య, పిల్లలతో ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామిని మనోజ్ దంపతులు సందర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దైవ దర్శనం అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తున్న ఆళ్లగడ్డ ప్రజలు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో జనసేనలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అయితే రాజకీయ ఎంట్రీని ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
https://twitter.com/abntelugutv/status/1868898831271968798
https://twitter.com/abntelugutv/status/1868886038598602791
డిసెంబర్ 17 , 2024
RC15: రామ్ చరణ్ CEO స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!
‘RRRకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.
కథ ఇదేనా?
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని సెట్ ఫొటోలు గతంలో లీక్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యానికి చెందిన వ్యక్తిగా ఒక రోల్, IAS అధికారిగా మరొక రోల్‌లో చెర్రీ నటించనున్నారట.
తండ్రీ, కొడుకుల చుట్టూ..
ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ అధినేత. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయని సమాచారం. వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి, వాటిని రూపుమాపే ప్రయత్నంలో CEO గా రామ్‌చరణ్ ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇందులో చూపించనున్నారట. సినిమా మొత్తం తండ్రీ, కొడుకుల చుట్టూనే తిరుగుతుందని టాక్
సామాజిక కోణం..
శంకర్ సినిమా అంటే అందులో ఓ సోషల్ మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలోని లోటుపాట్లను సినిమాల ద్వారా ప్రతిబింబించగలడు. దీంతో రామ్‌చరణ్ సినిమాలోనూ ఈ సోషల్ రిలవెన్స్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. చారిత్రక కట్టడమైన ‘చార్మినార్’ వద్ద ఇటీవల సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇందుకు ఊతమిస్తోంది.
శంకర్ మార్క్ ఎలిమెంట్స్..
సినిమా నాణ్యత విషయంలో డైరెక్టర్ శంకర్ అస్సలు రాజీ పడరు. కచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు అలసిపోడు. సాధారణంగా ఒక పాట షూటింగ్‌ని పూర్తి చేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ, శంకర్ మాత్రం దాదాపు 10 రోజులు కేటాయిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందం న్యూజిలాండ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఎమోషన్స్..
తన ప్రతి సినిమాలో శంకర్ ఎమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులోనూ బలమైన సీన్స్‌ని రాసుకున్నారట. ముఖ్యంగా తండ్రీకొడుకల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.
గ్రాండియర్ విజువల్స్..
రామ్‌చరణ్ సినిమాను శంకర్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాటల చిత్రీకరణలోనూ శంకర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాటల కోసం ప్రపంచంలోని ఏ లొకేషన్‌కైనా వెళ్లేందుకు శంకర్ వెనుకాడడు. ఇటీవల న్యూజిలాండ్‌లో చిత్రబృందం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
టైటిల్ ఫిక్స్?
శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు.C.E.O(Chief Electoral Officer) అనే టైటిల్ పెట్టారని టాక్. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రాజెక్టును టేకప్ చేయడంతో అంచనాలు బలపడ్డాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఫ్యాన్స్‌కి పూనకాలే..
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. దీంతో ఒకొక్క విషయం తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దిల్‌రాజు కూడా మూవీ అప్డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
మార్చి 18 , 2023
Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదాన్ని హైలేట్ చేస్తున్నాయి. అయితే చిన్న కోడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే చిన్న కోడలు మౌనికకు టీడీపీ (Telugu Desam Party) బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఆ పార్టీ నేతలు ఈ వ్యవహరంలో తలదూర్చబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పెద్ద కోడలు విరానిక రెడ్డి (Viranica Reddy)కి వైసీపీ (YSRCP Party) బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కారణంగా మంచు ఫ్యామిలీ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చిన్న కోడలికి టీడీపీతో సత్సంబంధాలు
మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) రెండో కుమారుడు మనోజ్.. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక (Bhuma Mounika)ను గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనికది ఆళ్లగడ్డలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఫ్యాక్షన్ ఫ్యామిలీగా చెబుతుంటారు. మౌనిక తల్లి భూమా శోభా నాగిరెడ్డి (Bhuma Shobha Nagi Reddy) నాలుగు పర్యాయాలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి (Bhuma Nagi Reddy) కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి మరణానంతరం సోదరి భూమా అఖిల ప్రియా (Bhuma Akhila Priya) టీడీపీ తరుపున రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తండ్రితో మంచు మనోజ్ వివాదం నేపథ్యంలో మరిదికి అండగా పలువురిని ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ పంపినట్లు కథనాలు వచ్చాయి.
పెద్ద కోడలికి జగన్‌తో బంధుత్వం
మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu)కి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)తో దగ్గరి బంధుత్వం ఉంది. జగన్, భారతీ దంపతులకు విష్ణు చాలా ఆత్మీయుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తె విరానిక రెడ్డి (Viranica Reddy)ని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. దీంతో వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి బలమైన బంధం ఏర్పడింది. వైయస్ కుటుంబంలో జరిగే ఫంక్షన్స్‌కు విష్ణు తప్పక హాజరవుతుంటారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వూలలో సైతం స్పష్టం చేశాడు. ఈ కారణం చేతనే విష్ణుతో పాటు అతడి తండ్రి మోహన్ బాబు వైసీపీతో చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనించవచ్చు.
టీడీపీ, వైకాపా జోక్యం తప్పదా!
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతుండటంతో రాజకీయ జోక్యం తప్పక జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని రెండు బలమైన పార్టీలకు చెందిన కోడళ్లు మంచు ఫ్యామిలో ఉండటంతో టీడీపీ, వైకాపా పార్టీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు మంచు మనోజ్ పక్కన అండగా నిలబడినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారంటూ మనోజ్‌తో పాటు మోహన్‌బాబు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ సమస్యను మోహన్‌బాబు ఫ్యామిలీ, పోలీసులు పరిష్కరించుకోలేక పోతే టీడీపీ, వైకాపా నేతల ప్రమేయం అనివార్యమవుతుందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఒక ఫ్యామిలీకి చెందిన సమస్య కాస్త రెండు పార్టీల మధ్య గొడవగా మారే అవకాశముంది.
డిసెంబర్ 11 , 2024
Pushpa 2 Film: ‘పుష్ప 2’ రికార్డుల మోత.. ‘కేజీఎఫ్ 2’, ‘RRR’ వెనక్కి.. ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ఆదరణ పొందుతోంది. ఆడియన్స్ పుష్పగాడి రూల్‌కు జై కొడుతున్నారు. దీంతో 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూళ్లు సాధించి ‘పుష్ప 2’ సత్తా చాటింది. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరి 12వ రోజున ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
12 రోజుల కలెక్షన్స్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతోంది. 12 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క ఇండియాలోనే ఇప్పటివరకూ రూ.933.92 కోట్లు వసూలు చేసినట్లు తెలిపాయి. అయితే గత 11 రోజులుగా రోజుకు రూ.100 కోట్లు తగ్గకుండా వసూలు చేసిన ‘పుష్ప 2’ 12వ రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించినట్లు పేర్కొన్నాయి. అధికారిక వసూళ్లను మేకర్స్ అనౌన్స్ చేస్తే ఈ విషయంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. అయితే రూ.1500 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’ ఈజీగానే చేరుతుందని స్పష్టం చేశాయి.
కలెక్షన్స్ పరంగా టాప్..
‘పుష్ప 2’ చిత్రం ఓ అరుదైన ఘనత సాధించింది. పోస్టు కోవిడ్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా తీసుకుంటే రూ.1914 - 2100 కోట్ల గ్రాస్‌తో ‘దంగల్’ చిత్రం తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 చిత్రం రూ.1747 కోట్లకు పైగా వసూళ్లతో సెకండ్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న RRR (రూ.1,387), కేజీఎఫ్ 2 (రూ. 1215) చిత్రాలను వెనక్కి నెట్టి ‘పుష్ప 2’ (రూ.1400+ కోట్లు) మూడో స్థానంలో నిలిచింది. అయితే ‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ను బీట్ చేయడానికి మరో రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే ‘బాహుబలి 2’ కలెక్షన్స్ కూడా దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నార్త్‌లో ఆల్‌టైమ్ రికార్డు
‘పుష్ప 2’ చిత్రానికి నార్త్‌లో విశేష స్పందన వస్తోంది. రోజు రోజుకు కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి. హిందీ రీజియన్‌లో 12 రోజుల వ్యవధిలో రూ.582 కోట్ల నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండో సోమవారం (డిసెంబర్ 16) హిందీలో రూ.20.50 కోట్ల నెట్ వసూలైనట్లు తెలిపింది. ఇప్పటివరకూ ఏ సినిమా ఇలాంటి వసూళ్లు రాబట్టలేదని తెలిపింది. హిందీలో ‘పుష్ప 2’ వచ్చిన కలెక్షన్స్ ఆల్‌టైమ్ రికార్డు అని వెల్లడించింది. ప్రస్తుతం హిందీలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'పుష్ప 2' ఓటీటీ డేట్ లాక్
థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ రోజునే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ పట్టుబడుతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్‌తోనే ‘పుష్ప 2’ స్ట్రీమింగ్‌లోకి రానుంది. థియేటర్లలో పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓటీటీలోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశముంది.
డిసెంబర్ 17 , 2024
Harikatha Web Series Review: మిస్టరీ హత్యలు చేసేది దేవుడా? నరుడా?
నటీనటులు: శ్రీరామ్, దివి, రాజేంద్రప్రసాద్, అర్జున్ అంబటి, పూజిత పొన్నాడ తదితరులు
డైరెక్టర్ : మ్యాగి
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : విజయ్ ఉలగనాథ్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
నిర్మాత : టి.జి. విశ్వప్రసాద్
ఓటీటీ వేదిక: హాట్‌స్టార్
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (Harikatha Web Series Review) పేరుతో రూపొందిన ఈ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మ్యాగీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని కచ్చితంగా ఫీలవుతారని నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రమోషన్స్ మాట్లాడి భారీగా అంచనాలు పెంచేశారు. ట్రైలర్, టీజర్ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లే మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1980 - 1990 మధ్య కథ సాగుతుంది. అరుకులోని ఓ గ్రామంలో తక్కువ కులానికి చెందిన హరి (సుమన్) ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మరోవైపు రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారలపై నాటకాలు వేస్తుంటాడు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా హత్యలు జరగడం మెుదలవుతాయి. దీంతో ఆ భగవంతుడే హత్యలు చేస్తున్నాడని గ్రామస్తులంతా నమ్ముతారు. ఈ హత్యల మిస్టరీని కనుగొనేందుకు పోలీసు అధికారి విరాట్ (శ్రీరామ్) రంగంలోకి దిగుతాడు. అతడి దర్యాప్తులో తేలిన నిజాలేంటి? ఆ హత్యలు నిజంగానే భగవంతుడు చేస్తున్నాడా? మరెవరైనా దాని వెనక ఉన్నారా? అసలు హత్యకు గురైన వారు చేసిన తప్పులు ఏంటి? జైలుకెళ్లిన హరి (సుమన్) స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Harikatha Web Series Review) ఈ సిరీస్‌లో మరోమారు తన నట విశ్వరూపం చూపించాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ పోషించని పాత్రలో అదరగొట్టారు. విష్ణుమూర్తి దశావతారాల్లో చక్కగా ఒదిగిపోయారు. తన హావభావాలతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించారు. పోలీసు ఆఫీసర్‌గా శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. మిస్టరీని ఛేదించాలని తపన పడే పోలీసు పాత్రలో చెరగని ముద్ర వేశారు. బిగ్‌బాస్ ఫేమ్ దివికి చాన్నాళ్ల తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్ర తగ్గింది. అడవి పిల్లగా ఆమె క్యారెక్టరైజేషన్ బాగుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఓ సర్‌ప్రైజ్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మరో నటి పూజిత పొన్నాడ నటన కంటే గ్లామర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మ్యాగీ 1980ల కాలం నాటి స్టోరీని తీసుకొని దశావతారలను రిలేట్ చేస్తూ రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ లైన్ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక టచ్‌తో సాగిన పలు సన్నివేశాలు మెప్పించాయి. అలాగే హత్యల చుట్టూ సస్పెన్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక్కో అవతరానికి తగ్గట్లు డిజైన్ చేసిన హత్యలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడు మంచి కాన్సెప్ట్‌నే ఎంచుకున్నప్పటికీ రొటీన్ రీవెంజ్ డ్రామాగా కథను నడిపించడం నిరాశ పరుస్తుంది. చాలా వరకూ సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్‌ను కలిగించాయి. అసందర్భమైన పాటలు సైతం సిరీస్ ఫ్లోను దెబ్బతీశాయి. సరైన కథనం లోపించడం, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సిరీస్ చాలా వరకూ బోరింగ్‌గా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన డైలాగ్, సీన్స్ లేకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కలిసొచ్చింది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Harikatha Web Series Review) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ పనితీరులో లోపాలున్నాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో నాణ్యత లోపించింది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ ఓకే. ఇంకొన్ని కత్తెరలు పెట్టినా నష్టం లేదు. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనడివోషనల్ టచ్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటిన్ రివేంజ్ డ్రామాబోరింగ్ సన్నివేశాలువీఎఫ్‌ఎక్స్ వర్క్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 14 , 2024