• TFIDB EN
  • భీష్మ
    UTelugu2h 18m
    భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflix
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నితిన్
    భీష్మ భీష్మ జూనియర్ ప్రసాద్
    రష్మిక మందన్న
    భీష్మ జూనియర్ ప్రేమ ఆసక్తి
    అనంత్ నాగ్
    భీష్మ ఆర్గానిక్స్ యొక్క CEO
    జిషు సేన్‌గుప్తా
    ఒక శాస్త్రవేత్త మరియు ఫీల్డ్ సైన్స్ CEO (వాయిస్ డబ్బింగ్ హేమచంద్ర)
    వెన్నెల కిషోర్
    భీష్మ ప్రసాద్ స్నేహితుడు బద్ధశత్రువుగా మారాడు
    సంపత్ రాజ్
    చైత్ర తండ్రి మరియు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్
    అజయ్
    వ్యవసాయ మంత్రి మరియు సారా ప్రియుడు
    నరేష్
    భీష్మ జూనియర్ తండ్రి మరియు దేవా స్నేహితుడు
    ప్రవీణ
    భీష్మ జూనియర్ తల్లి
    మైమ్ గోపి
    సింగన్నపాలెం సర్పంచ్
    కల్యాణి నటరాజన్
    దేవా భార్య మరియు చైత్ర తల్లి
    రఘు బాబు
    భీష్మ ఆర్గానిక్స్ ఉద్యోగి
    శుభలేఖ సుధాకర్
    భీష్మ సీనియర్ స్నేహితుడు
    సత్యన్
    పరిమళ్ బాస్ మరియు సారా భర్త
    సత్య అక్కల
    ఉబర్ డ్రైవర్
    శివకుమార్ రామచంద్రవరపుశివ
    అప్పాజీ అంబరీష దర్భSr భీష్మ PA
    రాజీవ్ కుమార్ అనేజాపాండే జీ
    నర్రా శ్రీనివాస్రాఘవన్ అన్నయ్య
    సుదర్శన్ ఉద్యోగి
    హెబ్బా పటేల్
    సారా
    అవంతిక మిశ్రా
    స్వయంగా
    కలాప్లత భీష్మ ఇంట్లో పనిమనిషి
    సిబ్బంది
    వెంకీ కుడుముల
    దర్శకుడు
    సూర్యదేవర నాగ వంశీనిర్మాత
    మహతి స్వర సాగర్సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
    రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
    నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.  డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్న ఎవరు? రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక మందన్న దేనికి ఫేమస్? రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రష్మిక మందన్న వయస్సు ఎంత? రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు  రష్మిక మందన్న ముద్దు పేరు? నేషనల్ క్రష్ రష్మిక రష్మిక మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు  రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది? విరాజ్ పేట, కర్ణాటక రష్మిక మందన్నకు వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు. రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు? బ్లాక్ రష్మిక మందన్న అభిరుచులు? ట్రావెలింగ్ రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం? చికెన్, చాక్లెట్ రష్మిక మందన్న అభిమాన నటుడు? అక్షయ్ కుమార్ రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి రష్మిక మందన్న తొలి సినిమా? కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు) రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు? గీతాగోవిందం, పుష్ప రష్మిక మందన్న ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత? రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు? సుమన్, మదన్ మందన్న రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది? రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది. రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. రష్మిక మందన్న సిస్టర్ పేరు? సిమ్రాన్ మందన్న రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా? లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rashmika_mandanna/?hl=en రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది. https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
    ఏప్రిల్ 16 , 2024
    Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్‌.. మూవీ హిట్టా? ఫట్టా?
    Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్‌.. మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు దర్శకుడు : వక్కంతం వంశీ నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంగీతం: హారిస్ జయరాజ్ సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023 'భీష్మ' సినిమా తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ చేసిన లేటెస్ట్‌ చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man). వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ మూవీని ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా... రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్‌ అని సినిమా విడుదలకు ముందు నితిన్‌ చెప్పాడు. మూవీ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ అభి (నితిన్) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఎక్స్ట్రా ఆర్టిస్ట్‌గా సాగిపోతున్న అభి లైఫ్‌లోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్‌వాల్వ్‌ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)కి సైతాన్‌ సంబంధం ఏంటి ? చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో నితిన్‌ చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా లుక్‌, స్టైలింగ్‌ బాగుంది. ఇక శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. పాటలకే ఆమె పరిమితమైంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు రాజశేఖర్‌ పూర్తి న్యాయం చేశారు. హీరోకి తండ్రిగా రావు రమేష్‌ చాలా బాగా నటించాడు. తనదైన పంచ్‌లతో ఫన్ క్రియేట్ చేశారు. ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వక్కంతం వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్‌ బలహీనంగా ఉన్నప్పటికీ కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను నవ్వించడంలో ఆయన కొంతమేర సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. అయితే తొలి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ సెకండ్‌హాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్‌ కంటే ఫస్టాఫ్‌ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను లాజిక్‌కు చాలా దూరంగా చూపించారు డైరెక్టర్‌. అటు హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ను కూడా బలంగా చూపలేక పోయారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి అందించిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. అయితే సాగదీత సీన్లు అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉండాల్సింది.  ప్లస్‌ పాయింట్స్‌ నితిన్‌ నటనహాస్య సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన స్టోరీలవ్‌ ట్రాక్‌ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 08 , 2023
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా  సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి  ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),  'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
    ఆగస్టు 03 , 2023
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా  తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.  ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.  ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా  నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.  విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.  బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.  ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.  భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.  పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.  ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.   లూసిఫర్‌  2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.  నెరు  గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.  ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.  కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.  కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది. 
    మార్చి 29 , 2024
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ అయేషా ఖాన్‌.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్‌ బుష్‌' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్‌ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయేషా ఖాన్‌ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయేషా ఖాన్‌‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది. అయేషా ఖాన్‌‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది. అయేషా ఖాన్‌‌ పుట్టిన తేదీ? 13 సెప్టెంబర్‌, 1992 అయేషా ఖాన్‌‌ తల్లిదండ్రులు ఎవరు? అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్‌ ఖాన్‌ & Mrs ఖాన్‌  అయేషా ఖాన్‌‌కు సోదరులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్‌ ఖాన్‌ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్‌ ఖాన్‌ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయేషా ఖాన్‌ ఎత్తు ఎంత? 162 సెం.మీ అయేషా ఖాన్‌‌ ఏం చదివారు? ఈ భామ ఇంటర్‌ వరకూ చదువుకుంది.  అయేషా ఖాన్‌‌ ఎక్కడ చదివారు? ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? కెరీర్‌ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన? హిందీలో 'బిగ్‌ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.  అయేషా ఖాన్‌ నటనా ప్రవేశం ఎలా జరిగింది? హిందీలో స్టార్‌ప్లస్‌ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్‌ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్‌ రిటర్న్స్‌' అనే సీరియల్‌లోనూ కనిపించింది.  అయేషా ఖాన్‌ తొలి చిత్రం? తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.  అయేషా ఖాన్‌ లేటెస్ట్‌ చిత్రం? అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్‌ షో చేసింది.  అయేషా ఖాన్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.  అయేషా ఖాన్‌ ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్‌ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్‌, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.  అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ నటుడు? ఈ భామకు అక్షయ్‌ కుమార్‌ నటన అంటే చాలా ఇష్టమట. అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌? ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.  అయేషా ఖాన్‌ ఇష్టమైన కలర్‌? నలుపు, తెలుపు అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ రియాలిటీ షో? బిగ్‌బాస్‌ అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మునావర్‌ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  అయేషా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ? https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
    మార్చి 23 , 2024
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్‌ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్‌ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.  ప్రీతి ముకుందన్‌ ఎవరు? టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం ప్రీతి ముకుందన్‌ పుట్టిన తేదీ? జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.  ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఎవరు? తన పేరెంట్స్‌ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.  ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.  ప్రీతి ముకుందన్‌ ఏం చదివారు? ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ప్రీతి ముకుందన్‌ ఎక్కడ చదివారు? నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T) ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా? ఈ భామకు డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్‌.   ప్రీతి ముకుందన్‌ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు? ప్రీతి తొలుత క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆ తర్వాత హిప్‌హాప్‌, సినీ ఫోక్‌, వెస్టర్న్‌ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.   ప్రీతి ముకుందన్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసింది.  ప్రీతి ముకుందన్‌ చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఏవి? మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్‌ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రీతి ముకుందన్‌ తొలి చిత్రం ఏది? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.  ప్రీతి ముకుందన్‌ ఫ్యూజర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం తమిళంలో స్టార్‌ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కెవిన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్‌ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్‌, ఫుడ్‌ ఏవి? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్లు, ఫుడ్‌ గురించి ప్రీతి ముకుందన్‌ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.  ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ? https://www.instagram.com/preity_mukhundhan
    మార్చి 22 , 2024
    Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
    Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
    శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). శ్రీ హర్ష కొనుగంటి (Sri Harsha Konuganti) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ (UV Creations), వి సెల్యులాయిడ్స్ (V Celluloids) సంయుక్తంగా నిర్మించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో గణనీయమైన వసూళ్లను రాబట్టింది. అటు యూఎస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నాలుగు రోజుల కలెక్షన్స్  ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం.. హిట్‌ టాక్‌ సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.21.75 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ నాలుగు రోజుల గ్రాస్‌ వసూళ్లు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించగా.. నాల్గో రోజు హోలీ సందర్భంగా మరిన్ని కలెక్షన్స్‌ను రాబట్టింది. నిన్న ఒక్కరోజే రూ.4.75 కోట్ల గ్రాస్‌ను సంపాదించింది. తొలి రోజు వసూళ్లతో (రూ.4.60 కోట్ల గ్రాస్‌) పోలిస్తే అధికంగా రాబట్టడం విశేషం.  https://twitter.com/Box_Office_BO/status/1772492175797813683 నెట్‌ వసూళ్లు ఎంతంటే? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా నెట్‌ కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో భారత్‌లో రూ.8.10 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. తొలి రోజున రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.2.5 కోట్లు, మూడో రోజు రూ,2.35 కోట్లు, నాల్గో రోజు రూ.1.50 + కోట్లు రాబట్టింది. మున్ముందు ఈ నెట్‌ వసూళ్లు మరింత పెరగనున్నట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం భారత్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా 'ఓం భీమ్ బుష్'కు మంచి ఆదరణ లభిస్తోంది.  ఓవర్సీస్‌లో తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌ లోపూ ఓవర్సీస్‌లో 6 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం కనిపిస్తోంది. 
    మార్చి 26 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్  పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా   టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.  ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.  శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.  https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush). ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (Sri Harsha konuganti) దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలిరోజే గణనీయమైన వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక డే1 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెుదటి రోజు రూ. 4.60 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రూ. 5.84 కోట్లు, ఆదివారం రూ. 6.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ.. 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో పాటు ఈ సినిమాకు పోటీగా శుక్రవారం వరకూ ఏ సినిమా లేనందున వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. అమెరికాలోనూ వసూళ్ల ప్రభంజనమే! ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా  'ఓం భీమ్ బుష్'కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకూ 3.15 లక్షల డాలర్లను వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌లోపూ ఓవర్సీస్‌లో 5 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం ఉంది.  https://twitter.com/TeamVamsiShekar/status/1772133237508481183 నెట్‌ కలెక్షన్స్ ఎంతంటే? ట్రెడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘ఓం భీమ్‌ బుష్‌’ గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా 10.60 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక దేశవాప్తంగా ఈ సినిమా రూ.6.6 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది.  తొలి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.  ఇకపై అన్నీ లాభాలే..! యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 6.6 కోట్లుగా ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గత మూడు రోజుల్లోనే రూ.10.60 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి మూడో రోజునే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇకపై ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే అని చెప్పవచ్చు.  నెల రోజుల్లోనే ఓటీటీలోకి..! ‘ఓం భీం బుష్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి. 
    మార్చి 25 , 2024
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    యంగ్‌ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు! శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ ఫిల్మ్‌ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) సైతం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్‌ బుష్‌’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్‌ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్‌ షో 23.37%, సెకండ్‌ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.  బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్‌ బుష్‌’ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.  ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి. 
    మార్చి 23 , 2024
    <strong>Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!</strong>
    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం. డే 1 కలెక్షన్స్ ఎంతంటే? రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఎప్పటికీ తలైవా ఒక్కరే..&nbsp; ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334 ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సంయుక్త మీనన్.. తెలుగులో&nbsp; భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్ నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన సంయుక్త మీనన్(samyuktha menon) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. సంయుక్త మీనన్ పుట్టిన తేదీ? సెప్టెంబర్ 11, 1995 సంయుక్త మీనన్ ఎక్కడ పుట్టింది? పాలక్కాడ్, కేరళ సంయుక్త మీనన్ నటించిన తొలి సినిమా? పాప్ కార్న్ సంయుక్త మీనన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; సంయుక్త మీనన్‌కు తెలుగులో తొలి చిత్రం? భీమ్లా నాయక్(2022) సంయుక్త మీనన్ అభిరుచులు? సామాజిక సేవా కార్యక్రమాలు సంయుక్త మీనన్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన కలర్?&nbsp; వైట్, బ్లాక్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ సంయుక్త మీనన్&nbsp; ఏం చదివింది? ఎకానామిక్స్‌లో డిగ్రీ చేసింది సంయుక్త మీనన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సంయుక్త మీనన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamsamyuktha_/?hl=en https://www.youtube.com/watch?v=NtisrzL43Vs
    అక్టోబర్ 22 , 2024
    దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ... సీతారామం సినిమా సూపర్ హిట్‌తో తెలుగులో దుల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటనపరంగా భేష్ అనింపించుకుంటున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం.. &nbsp;దుల్కర్ సల్మాన్‌ను అలా ఎందుకు పిలుస్తున్నారు? దుల్కర్ సల్మాన్ మలయాళం మెగాస్టార్ మమ్మూటి కొడుకు. తన ఇంటిపేరు లేకుండానే తన కొడుకు సొంతకాళ్లపై ఎదగాలని దుల్కర్ సల్మాన్ పేరు పెట్టినట్లు మమ్మూటి చెప్పారు. &nbsp;దుల్కర్ సల్మాన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు &nbsp;దుల్కర్ సల్మాన్ ఎక్కడ పుట్టారు? కొచ్చి, కేరళ &nbsp;దుల్కర్ సల్మాన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1986 జులై 28 &nbsp;దుల్కర్ సల్మాన్ భార్య పేరు? అమల్ సూఫియా &nbsp;దుల్కర్ సల్మాన్‌కు ఎంత మంది పిల్లలు?&nbsp; ఒక బాబు, పేరు మరియం అమీరా సల్మాన్&nbsp; &nbsp;దుల్కర్ సల్మాన్‌ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్ &nbsp;దుల్కర్ సల్మాన్‌&nbsp; హీరోగా నటించిన తొలిసినిమా? ABCD( అమెరికన్ బోర్న్.. కన్ఫ్యూజ్డ్ దేశీ &nbsp;దుల్కర్ సల్మాన్‌కు అభిమాన నటుడు? మమ్మూటి దుల్కర్ సల్మాన్ అభిమాన హీరోయిన్? అలియా భట్ దుల్కర్ సల్మాన్‌కు స్టార్ డం అందించిన చిత్రం? సీతారామం దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన కలర్? వైట్ దుల్కర్ సల్మాన్‌ తల్లిదండ్రుల పేర్లు? మమ్మూటి, సలాఫత్ కుట్టి దుల్కర్ ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ దుల్కర్ సల్మాన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=Ms2rrZ25ne0 దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యానీ దుల్కర్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.4కోట్లు- రూ.5కోట్లు తీసుకుంటాడు.
    మార్చి 19 , 2024
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు దర్శకుడు : కోనేటి శ్రీను నిర్మాత: ఎండీ పాషా సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి ఎడిటింగ్: వినయ్ రామస్వామి విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024 బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్‌ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’తో మెప్పించిన ఇతడు తాజాగా (ఫిబ్రవరి 2న) ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించగా సునీల్‌, ఇంద్రజ, అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ కోనేటి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సోహెల్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్ర‌జ‌) కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలరాజు - మహాలక్ష్మి ప్రేమించుకుంటారు. మరోవైపు బాలరాజును సిరి (సిరి హనుమంతు) కూడా ప్రేమిస్తుంటుంది. అయితే బాలరాజు - మహాలక్ష్మి ప్రేమ కథకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఇందులో సోహైల్‌.. హైపర్‌ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిలా (Bootcut Balaraju Review) మెప్పించాడు. చక్కటి భావోద్వేగాలను పలికించాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్‌ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. బాలరాజు ఫ్రెండ్స్‌గా అవినాష్‌, సద్దాం కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి అలరించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోనేటి శ్రీను తీసుకున్న కథ, సోహెల్ - ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించాడు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్‌ అవడానికి ఏం చేశాడనేది చూపించాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా సీన్స్ సినిమాకి బలహీనతగా మారాయి. దర్శకుడు కంటెంట్‌ను స్క్రీన్‌పై బాగా ఎలివేట్ చేసినా.. రొటిన్‌, బోరింగ్ సీన్స్ వల్ల అది ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bootcut Balaraju Review).. భీమ్స్‌ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్యం సంగీతం కూడా కీలక సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ వినయ్ రామస్వామి తన కత్తెరకు మరింత పని కల్పించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ సోహేల్‌, ఇంద్రజ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్లు రేటింగ్‌: 3/5
    ఫిబ్రవరి 03 , 2024
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌ తారలు సైతం ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్‌ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ స్క్రీన్‌ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; తారక్‌.. తనని తాను తగ్గించుకుంటున్నాడా? ఎన్టీఆర్ - హృతిక్‌ రోషన్‌ కలిసి చేయనున్న వార్‌ - 2 చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్‌ నెగిటివ్‌ రోల్‌లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్‌ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్‌చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్‌ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్‌ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల సినిమాలో హృతిక్‌ పాత్రే హైలైట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.&nbsp; రెమ్యూనరేషన్‌ తక్కువే! ఇక రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే&nbsp; RRR చిత్రానికే ఎన్‌టీఆర్‌ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్‌ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్‌-2 చిత్రంలో ఎన్టీఆర్‌ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్‌ను అభిమాన హీరోను నెగిటివ్‌ రోల్‌లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్‌ రెమ్యూనరేషన్‌ ఎక్కువనే చెప్పాలి.&nbsp; లాభాల్లో షేర్.. ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్‌ నేరుగా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా వార్‌-2 సినిమా లాభాల్లో షేర్‌ తీసుకునేలా డీల్‌ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్‌ 2 సినిమా కోసం తారక్‌ కంటే ముందు ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండను సంప్రదించారని ‌గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్‌ చేయడం వల్లే తారక్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను&nbsp; యాష్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్‌ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్‌ పెట్టినట్లైంది. ఇకపోతే వార్‌ 2 సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; శరవేగంగా NTR 30 షూటింగ్‌ ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్‌లో తారక్‌ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం ‌అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    మే 10 , 2023
    <strong>Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు</strong>
    Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; జనవరి&nbsp; ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.&nbsp; ఫిబ్రవరి ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్‌' (Bheemla Nayak) కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్‌ చేసింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు.&nbsp; ఏప్రిల్‌&nbsp; 2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్‌ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్‌ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.&nbsp; మే మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేసింది. జూన్‌ ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జులై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్‌ పాన్‌ ఇండియా స్థాయికి తెలిసింది. ఆగస్టు ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్‌ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా చేసింది.  సెప్టెంబర్ గత నెల సెప్టెంబర్‌ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపించారు.&nbsp; అక్టోబర్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.&nbsp; నవంబర్‌&nbsp; టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్‌ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్‌&nbsp;</strong>
    Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్‌&nbsp;
    కావ్య థాపర్‌ హీరోయిన్‌గా రూపొందిన 'విశ్వం' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్‌ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.&nbsp; గోపీచంద్‌ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. కానీ, గ్లామర్‌ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్‌ చేసిందని చెప్పవచ్చు.&nbsp; తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్‌ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్‌ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1844650013252825352 సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్‌ పాడిన ఈ పాటకు గోపీచంద్‌, కావ్యా థాపర్‌ మాస్‌ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.&nbsp; https://twitter.com/actressspecial/status/1844644160881426905 ఇటీవల వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్‌ గ్లామర్‌ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.&nbsp; మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్‌ 2013లో వచ్చిన ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా నటన కెరీర్‌ ప్రారంభించింది. 2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. 2019లో 'మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; 2021లో యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ పక్కన ‘ఏక్‌ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.&nbsp; 2022లో 'మిడిల్‌ క్లాస్‌ లవ్‌' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్‌ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.&nbsp; గతేడాది విజయ్‌ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి. ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్‌ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది. ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాలు హిట్‌ కాకపోవడంతో కావ్యా థాపర్‌ మళ్లీ ఢీలా పడిపోయింది. తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్‌ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.&nbsp; ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్‌ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.&nbsp; తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్‌ సమయంలో గోపిచంద్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.&nbsp; ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్‌ ఇస్తోంది.&nbsp; ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?</strong>
    Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?
    నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు దర్శకుడు : టీజీ జ్ఞానవేల్‌ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ : ఎస్‌. ఆర్‌. ఖదీర్‌ నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత: సుభాస్కరన్‌ అల్లిరాజా విడుదల తేదీ:&nbsp; అక్టోబర్‌ 10, 2024 సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సాధించిందా? ‘జైలర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీకి మరో సాలిడ్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజమ్స్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్‌ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్‌ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్‌ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్‌ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. ఎడిటిర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్‌ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రజనీకాంత్‌ నటనసోషల్‌ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 10 , 2024

    @2021 KTree