• TFIDB EN
  • భీమా
    UATelugu
    బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరుశురామ క్షేత్రం దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Malayalam, Tamil )
    Watch
    2024 Apr 227 months ago
    డిస్నీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 25 నుంచి భీమా(తెలుగు) స్ట్రీమింగ్ కానుంది
    2024 Mar 288 months ago
    భీమా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+Hotstar) దక్కించుకుంది. ఏప్రిల్‌ 5న ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. త్వరలో అధికార ప్రకటన రానుంది.
    రివ్యూస్
    YouSay Review

    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?

    మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామ...read more

    How was the movie?

    తారాగణం
    గోపీచంద్
    ప్రియా భవానీ శంకర్
    మాళవిక శర్మ
    వెన్నెల కిషోర్
    రఘు బాబు
    నాసర్
    నరేష్
    ముఖేష్ తివారీ
    చమ్మక్ చంద్ర
    షమ్నా కాసిం
    రోహిణి
    సిబ్బంది
    హర్షదర్శకుడు
    కె. కె. రాధామోహన్
    నిర్మాత
    రవి బస్రూర్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గోపిచంద్‌ విశ్వరూపం చూపించాడని కథనాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత గోపిచంద్‌కు సాలిడ్‌ హిట్‌ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీమా తొలిరోజు కలెక్షన్స్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? ప్రీ బిజినెస్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.  భీమా తొలి రోజు కలెక్షన్స్‌.. భీమా చిత్రాన్ని మేకర్స్‌ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా కలిపి 600 స్కీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి తగ్గట్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించినట్లు తెలుస్తోంది. ట్రెడ్‌ లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35కోట్లు, ఓవర్‌సీస్‌ ఇతర ప్రాంతాలు కలిపి రూ.1.25 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్‌ టాక్‌ రావడం భీమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. లేదంటే ఈజీగానే రూ.5 కోట్ల మార్క్‌ను సాధించేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గోపిచంద్‌ గత చిత్రం ‘రామబాణం’.. తొలిరోజున రూ. 2.5 కోట్ల గ్రాస్‌ సాధిస్తే.. ‘భీమా’ అంతకు రెట్టింపు వసూలు చేయడం విశేషం.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ సినిమా వెబ్‌సైట్ సాక్నిక్‌ (Sacnilk) లెక్కల ప్రకారం.. భీమా చిత్రం తొలిరోజు రూ.3.50 కోట్ల నెట్‌ కలెక్షన్లను (Bhimaa Day1 Net Collections) వసూలు చేసింది. ఓవర్సీస్‌ లెక్కలను మాత్రం ఈ సైట్‌ ప్రస్తావించలేదు. ఇక తొలిరోజు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్‌ షోస్‌ 27.58%, మధ్యాహ్నం 33.55%, సాయంత్రం 27.70%, సెకండ్‌ షో 49.49% నమోదైంది. నేడు, రేపు వీకెండ్‌ కావడంతో ఆక్యుపెన్సీ శాతం మరింత పెరిగే అవకాశముంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయితే తనకు అచ్చొచ్చిన యాక్షన్‌ జానర్‌లో 'భీమా' చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ (Bhimaa Movie Pre Release Business)ను మంచిగానే చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థ్రియేటికల్‌ హక్కులు రూ.11.30 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలంగాణ (నైజాం) రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 4.50 కోట్లకు బిజినెస్‌ జరిగింది. మెుత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కాగా.. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.1.8 కోట్లు జరిగింది. 'భీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ.12 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  'భీమా'లో అదరగొట్టిన గోపిచంద్‌! భీమా చిత్రంలో గోపిచంద్‌.. రెండు కోణాల్లో క‌నిపించే పాత్ర‌ల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించేశాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  https://telugu.yousay.tv/gopichand-bheema-review-gopichand-sivathandavam-in-action-sequences-bheema-movie-hit-free.html
    మార్చి 09 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు  దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..  డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.  భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    <strong>Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్‌ పరువపు పొంగులు.. నెక్స్ట్‌ లెవెల్ గ్లామర్‌ అంతే!</strong>
    Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్‌ పరువపు పొంగులు.. నెక్స్ట్‌ లెవెల్ గ్లామర్‌ అంతే!
    కోలీవుడ్‌ హాట్‌ బ్యూటీ యషికా ఆనంద్‌ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది.&nbsp; తాజాగా హాట్‌ ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది.&nbsp; సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది.&nbsp; యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు.&nbsp; యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు 9న ఢిల్లీ జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్ పలు తమిళ సినిమాల్లో నటించింది. తమిళ చిత్రం ‘కావలై వెండం’ (2016) చిత్రంలో స్విమ్మింగ్‌ ఇన్‌స్ట్రక్టర్ అనే చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.&nbsp; 2018లో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమా యాషికాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో కావ్య అనే బోల్డ్‌ పాత్రలో నటించి యూత్‌ను ఆకట్టుకుంది. తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.&nbsp; 98 రోజుల పాటు హౌస్‌లో ఉన్న యషిక తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది.&nbsp; దీంతో తమిళంలో ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘కఝుగు 2’, ‘జోంబీ’, ‘మూకుతి అమ్మన్’&nbsp; ‘ఆర్23 క్రిమినల్స్ డైరీ‘ వంటి చిత్రాల్లో యాషిక నటించింది.&nbsp; అలాగే ‘బెస్టీ’, ‘శిరుతై శివ’, ‘భగీర’, ‘సల్ఫర్’, ‘పంబట్టం’, ‘కదమైయై సెయ్' తదితర చిత్రాలతో తమిళంలో మరింత పాపులర్ అయ్యింది.&nbsp; ప్రస్తుతం తమిళంలో ‘ఇవన్‌ థన్‌ ఉత్తమన్‌’, ‘రాజా భీమా’ తదితర చిత్రాల్లో నటిస్తూ యషికా ఆనంద్ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యషికా చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.&nbsp; ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది. సినిమాలకు అతీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.&nbsp; ప్రస్తుతం యషికా అనంద్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.1 మిలియన్ల అనుసరిస్తుండటం గమనార్హం.
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;</strong>
    Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హవా నడుస్తోంది. డార్లింగ్‌ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ పేరు దేశంలో మారుమోగుతోంది. ఇండియన్‌ ఫిల్మ్‌ లవర్స్‌ ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ నుంచి సౌత్‌ వరకూ ప్రభాస్‌ నామస్మరణలతో ఇండస్ట్రీలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తన మిత్రుడు గోపిచంద్‌ కోసం ప్రభాస్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రభాస్‌తో ఎలివేషన్స్‌! మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ (Gopichand) హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ (Prabhas) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ ఈ సినిమా భాగస్వామ్యం అవ్వడం నిజమేనని తెలుస్తోంది. అయితే వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం ద్వారా ప్రభాస్‌ ఈ మూవీలో పాలుపంచుకుంటాడని టాక్‌ వినిపిస్తోంది. గోపిచంద్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌కు ప్రభాస్‌ తన వాయిస్‌తో ఎలివేషన్‌ ఇస్తాడని అంటున్నారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఓ సినిమాలో ఇలా వాయిస్‌ ఓవర్‌ ఇవ్వలేదు. స్నేహితుడైన గోపిచంద్‌ కోసమే ప్రభాస్‌ ఇందుకు ఓకే చెప్పినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌, గోపిచంద్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా! హీరో గోపిచంద్‌ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన గత చిత్రాలు ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు భీమా, రామబాణం, పక్కా కమర్షియల్‌, ఆరడుగుల బుల్లెట్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో గోపిచంద్‌కు సక్సెస్‌ తప్పనిసరిగా మారింది. అటు దర్శకుడు శ్రీను వైట్ల సైతం ఒకప్పటిలా బ్లాక్‌బాస్టర్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకూ శ్రీను వైట్లకు రాలేదు. దీంతో అతడు కూడా 'విశ్వం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌ను సినిమాలో భాగం చేయడం ద్వారా 'విశ్వం'పై హైప్‌ తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను సంప్రదించి అతడి ద్వారా హీరోకు ఎలివేషన్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందో? లేదో? చూడాలి.&nbsp; ఆఫ్‌ స్క్రీన్‌ ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ గోపిచంద్‌ ఎంత మంచి మిత్రులో ఇండస్ట్రీ మెుత్తం తెలుసు. ‘వర్షం’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు తొలిసారి కలిసి నటించారు. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపిచంద్‌ విలన్‌గా అలరించారు. అప్పటి నుంచి వీరి స్నేహం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆహా వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్‌ షోలో వీరిద్దరు పాల్గొని హోస్ట్‌ బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరిద్దరిని తొలిసారి ఒక షోలో చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అయ్యారు. ప్రభాస్‌, గోపిచంద్‌ మంచి ఫ్రెండ్స్‌ అని తెలుసుగానీ, మరి ఈ స్థాయి బెస్ట్ ఫ్రెండ్స్‌ అని ఈ ఎపిసోడ్‌ తర్వాతనే తెలిసిందని చాలా మంది నెటిజన్లు పోస్టులు సైతం పెట్టారు.&nbsp; https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA ‘విశ్వం’ రిలీజ్ ఎప్పుడంటే? గోపిచంద్‌, శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న 'విశ్వం' చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్‌ (Kavya Thapar) నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా పూర్తైనట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. గతంలో రంజాన్‌ కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=1LoKTtrxjmM
    జూలై 16 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు. రత్నం విశాల్‌ (Vishal) హీరోగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రం ‘రత్నం’ (Rathnam movie). ప్రియా భవానీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రుస్లాన్ ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా జంటగా కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’ (Ruslaan). జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు టిల్లు స్క్వేర్‌ టాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 26 నుంచి టిల్లు స్క్వేర్ ప్రసారం కానుంది.&nbsp; భీమా మ్యాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘భీమా’ (Bhimaa). మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా, ఈ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 25 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateFight for paradiseSeriesEnglishNetflixApril 23BrigantiSeriesEnglishNetflixApril 23Deliver meMovieEnglishNetflixApril 24City HunterMovieJapanese/EnglishNetflixApril 25Dead Boy DetectivesSeriesEnglishNetflixApril 25Tillu SquareMovieTeluguNetflixApril 26GoodBye EarthSeriesEnglish/KoreanNetflixApril 26Dil Dosti DilemmaMovieHindiAmazon PrimeApril 25BhimaaMovieTeluguDisney + HotstarApril 25CrackMovieHindiDisney + HotstarApril 26The ZenecksMovieEnglishJio CinemaApril 22We Are Hear S4SeriesEnglishJio CinemaApril 27Kung Fu Panda 4MovieEnglishBook My ShowApril 26
    ఏప్రిల్ 22 , 2024
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.&nbsp; ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.&nbsp; భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.&nbsp; గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.&nbsp; వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.&nbsp; అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.&nbsp;
    జనవరి 17 , 2024
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ అయేషా ఖాన్‌.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్‌ బుష్‌' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్‌ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయేషా ఖాన్‌ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయేషా ఖాన్‌‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది. అయేషా ఖాన్‌‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది. అయేషా ఖాన్‌‌ పుట్టిన తేదీ? 13 సెప్టెంబర్‌, 1992 అయేషా ఖాన్‌‌ తల్లిదండ్రులు ఎవరు? అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్‌ ఖాన్‌ &amp; Mrs ఖాన్‌&nbsp; అయేషా ఖాన్‌‌కు సోదరులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్‌ ఖాన్‌ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్‌ ఖాన్‌ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయేషా ఖాన్‌ ఎత్తు ఎంత? 162 సెం.మీ అయేషా ఖాన్‌‌ ఏం చదివారు? ఈ భామ ఇంటర్‌ వరకూ చదువుకుంది.&nbsp; అయేషా ఖాన్‌‌ ఎక్కడ చదివారు? ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? కెరీర్‌ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన? హిందీలో 'బిగ్‌ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.&nbsp; అయేషా ఖాన్‌ నటనా ప్రవేశం ఎలా జరిగింది? హిందీలో స్టార్‌ప్లస్‌ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్‌ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్‌ రిటర్న్స్‌' అనే సీరియల్‌లోనూ కనిపించింది.&nbsp; అయేషా ఖాన్‌ తొలి చిత్రం? తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.&nbsp; అయేషా ఖాన్‌ లేటెస్ట్‌ చిత్రం? అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్‌ షో చేసింది.&nbsp; అయేషా ఖాన్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.&nbsp; అయేషా ఖాన్‌ ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్‌ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్‌, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.&nbsp; అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ నటుడు? ఈ భామకు అక్షయ్‌ కుమార్‌ నటన అంటే చాలా ఇష్టమట. అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌? ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.&nbsp; అయేషా ఖాన్‌ ఇష్టమైన కలర్‌? నలుపు, తెలుపు అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ రియాలిటీ షో? బిగ్‌బాస్‌ అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మునావర్‌ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; అయేషా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ? https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
    మార్చి 23 , 2024
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్‌ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్‌ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఎవరు? టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం ప్రీతి ముకుందన్‌ పుట్టిన తేదీ? జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఎవరు? తన పేరెంట్స్‌ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఏం చదివారు? ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ప్రీతి ముకుందన్‌ ఎక్కడ చదివారు? నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T) ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా? ఈ భామకు డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు? ప్రీతి తొలుత క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆ తర్వాత హిప్‌హాప్‌, సినీ ఫోక్‌, వెస్టర్న్‌ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఏవి? మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్‌ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రీతి ముకుందన్‌ తొలి చిత్రం ఏది? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఫ్యూజర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం తమిళంలో స్టార్‌ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కెవిన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్‌ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్‌, ఫుడ్‌ ఏవి? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్లు, ఫుడ్‌ గురించి ప్రీతి ముకుందన్‌ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ? https://www.instagram.com/preity_mukhundhan
    మార్చి 22 , 2024
    Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
    Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
    శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). శ్రీ హర్ష కొనుగంటి (Sri Harsha Konuganti) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ (UV Creations), వి సెల్యులాయిడ్స్ (V Celluloids) సంయుక్తంగా నిర్మించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో గణనీయమైన వసూళ్లను రాబట్టింది. అటు యూఎస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నాలుగు రోజుల కలెక్షన్స్&nbsp; ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం.. హిట్‌ టాక్‌ సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.21.75 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ నాలుగు రోజుల గ్రాస్‌ వసూళ్లు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించగా.. నాల్గో రోజు హోలీ సందర్భంగా మరిన్ని కలెక్షన్స్‌ను రాబట్టింది. నిన్న ఒక్కరోజే రూ.4.75 కోట్ల గ్రాస్‌ను సంపాదించింది. తొలి రోజు వసూళ్లతో (రూ.4.60 కోట్ల గ్రాస్‌) పోలిస్తే అధికంగా రాబట్టడం విశేషం.&nbsp; https://twitter.com/Box_Office_BO/status/1772492175797813683 నెట్‌ వసూళ్లు ఎంతంటే? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా నెట్‌ కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో భారత్‌లో రూ.8.10 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. తొలి రోజున రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.2.5 కోట్లు, మూడో రోజు రూ,2.35 కోట్లు, నాల్గో రోజు రూ.1.50 + కోట్లు రాబట్టింది. మున్ముందు ఈ నెట్‌ వసూళ్లు మరింత పెరగనున్నట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం భారత్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా 'ఓం భీమ్ బుష్'కు మంచి ఆదరణ లభిస్తోంది.&nbsp; ఓవర్సీస్‌లో తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌ లోపూ ఓవర్సీస్‌లో 6 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం కనిపిస్తోంది.&nbsp;
    మార్చి 26 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్&nbsp; పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ&nbsp; కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా &nbsp; టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ&nbsp; న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.&nbsp; ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.&nbsp; https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు రచన, దర్శకత్వం: అభిమన్యు సంగీతం: ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా విడుదల తేదీ: 16-02-2024 ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్‌ పనితీరు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 16 , 2024
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush). ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (Sri Harsha konuganti) దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలిరోజే గణనీయమైన వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక డే1 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెుదటి రోజు రూ. 4.60 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రూ. 5.84 కోట్లు, ఆదివారం రూ. 6.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ.. 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో పాటు ఈ సినిమాకు పోటీగా శుక్రవారం వరకూ ఏ సినిమా లేనందున వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. అమెరికాలోనూ వసూళ్ల ప్రభంజనమే! ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా&nbsp; 'ఓం భీమ్ బుష్'కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకూ 3.15 లక్షల డాలర్లను వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌లోపూ ఓవర్సీస్‌లో 5 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం ఉంది.&nbsp; https://twitter.com/TeamVamsiShekar/status/1772133237508481183 నెట్‌ కలెక్షన్స్ ఎంతంటే? ట్రెడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘ఓం భీమ్‌ బుష్‌’ గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా 10.60 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక దేశవాప్తంగా ఈ సినిమా రూ.6.6 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది.&nbsp; తొలి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.&nbsp; ఇకపై అన్నీ లాభాలే..! యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 6.6 కోట్లుగా ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గత మూడు రోజుల్లోనే రూ.10.60 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి మూడో రోజునే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇకపై ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే అని చెప్పవచ్చు.&nbsp; నెల రోజుల్లోనే ఓటీటీలోకి..! ‘ఓం భీం బుష్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.&nbsp;
    మార్చి 25 , 2024
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    యంగ్‌ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు! శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.&nbsp; సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ ఫిల్మ్‌ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) సైతం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్‌ బుష్‌’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్‌ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్‌ షో 23.37%, సెకండ్‌ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.&nbsp; బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్‌ బుష్‌’ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.&nbsp; ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.&nbsp;
    మార్చి 23 , 2024
    <strong>Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!</strong>
    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం. డే 1 కలెక్షన్స్ ఎంతంటే? రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఎప్పటికీ తలైవా ఒక్కరే..&nbsp; ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334 ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సంయుక్త మీనన్.. తెలుగులో&nbsp; భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్ నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన సంయుక్త మీనన్(samyuktha menon) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. సంయుక్త మీనన్ పుట్టిన తేదీ? సెప్టెంబర్ 11, 1995 సంయుక్త మీనన్ ఎక్కడ పుట్టింది? పాలక్కాడ్, కేరళ సంయుక్త మీనన్ నటించిన తొలి సినిమా? పాప్ కార్న్ సంయుక్త మీనన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; సంయుక్త మీనన్‌కు తెలుగులో తొలి చిత్రం? భీమ్లా నాయక్(2022) సంయుక్త మీనన్ అభిరుచులు? సామాజిక సేవా కార్యక్రమాలు సంయుక్త మీనన్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన కలర్?&nbsp; వైట్, బ్లాక్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ సంయుక్త మీనన్&nbsp; ఏం చదివింది? ఎకానామిక్స్‌లో డిగ్రీ చేసింది సంయుక్త మీనన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సంయుక్త మీనన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamsamyuktha_/?hl=en https://www.youtube.com/watch?v=NtisrzL43Vs
    అక్టోబర్ 22 , 2024
    <strong>Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!</strong>
    Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!
    మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మట్కా' (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్‌ 14న) గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్‌ తేజ్‌ సైతం వినూత్న ప్రమోషన్స్‌ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని అతడు చేసిన ఓ వీడియో సినీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇదెక్కడి మాస్‌ ప్రమోషన్స్! మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2014లో వచ్చిన 'ముకుంద'తో తెలుగు ఆడియన్స్‌కు తొలిసారి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశాడు. అలాగే లోఫర్‌, మిస్టర్‌, ‘గాండీవధారి అర్జున’ వంటి ఫ్లాప్‌లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే 'మట్కా' ప్రమోషన్స్‌లో భాగంగా తన చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని వరుణ్ ఓ ఆసక్తికర వీడియోను చేశాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన హిట్‌, ఫ్లాప్‌ చిత్రాలు ఎదురుపడితే తన రియాక్షన్‌ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఒక్కో వ్యక్తిని ఒక్కో సినిమాగా భావిస్తూ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. చివర్లో 'మట్కా'గా వచ్చిన వ్యక్తికి బిగ్‌ హగ్‌ ఇచ్చి బాగా ప్రమోట్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. https://twitter.com/SivaKri54096510/status/1856617018276839798 తిరుమలలో ‘మట్కా’ టీమ్‌! తిరుమల శ్రీవారిని ‘మట్కా’ (Matka Promotions) చిత్రబృందం ఇవాళ (నవంబర్‌ 13) తెల్లవారుజామున దర్శించుకుంది. వీఐపీ దర్శన సమయంలో నటుడు వరుణ్‌ తేజ్‌, చిత్ర యూనిట్‌ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్‌ తెలిపారు. తిరుమలలో మట్కా టీమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/baraju_SuperHit/status/1856530909580677270 వరుణ్‌ మేకోవర్‌ చూశారా? మట్కా సినిమాలో వరుణ్‌ తేజ్ శివ అనే పాత్ర పోషించాడు. మట్కా జూదాన్ని ప్రారంభించిన రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. 1970-90 ప్రాంతంలో వైజాగ్‌ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఇదిలా ఉంటే వాసు పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన గెటప్‌ను మార్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను 1970వ దశకానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ పాత్రలకు వరుణ్‌ ఏ విధంగా మారాడో తెలియజేసే వీడియోను మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్‌లో ఏ ఏ థియేటర్లలో తమ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారో ఓ పోస్టర్‌ ద్వారా మట్కా టీమ్‌ తెలియజేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=b3CRE3IMdzA https://twitter.com/baraju_SuperHit/status/1856380138553802773 సెన్సార్‌ రివ్యూ వరుణ్‌ తేజ్‌ మట్కా (Matka Promotions) చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు. ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఆ నాలుగూ బాగా వచ్చాయని టాక్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు సెన్సార్‌ సభ్యులకు బాగా నచ్చిందట. డైలాగులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని వారు ఫీలయ్యారట. మట్కా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు వారు భావించారట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా 'మట్కా'&nbsp; అవుతుందని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 13 , 2024
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రాజీవ్‌ కనకాల, రవి కృష్ణ దర్శకత్వం : అరుణ్&nbsp; భీమవరపు సంగీతం : ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్‌ ఆర్ట్ డైరెక్టర్‌ : కొల్లా అవినాష్‌ నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది విడుదల తేదీ : 25 మే, 2024 ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్‌.. ఈ సినిమాలో డెవిల్స్‌ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్‌ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్‌ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్‌ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అరుణ్‌.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్‌ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్‌ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్‌ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్‌ చేసే రీసెర్చ్‌.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్‌ రివీల్‌ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్‌ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్‌ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్‌ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు. టెక్నికల్‌గా &nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఆస్కార్ విన్నర్‌ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ఆశిష్‌, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ సీన్స్‌ఏమోషన్స్‌ లేకపోవడం Telugu.youSay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
    మే 25 , 2024

    @2021 KTree