గోపిచంద్ (Gopichand) లేటెస్ట్ మూవీ ‘భీమా’ (Bhimaa). కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించిన ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మించారు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సెమీ ఫాంటసీ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. శివరాత్రి కానుకగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీమా’ తొలి రోజే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది. దీంతో త్వరగానే ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్, రిలీజ్ తేదీ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ లాక్?
‘భీమా’ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ.. డిస్నీ+హాట్‌స్టార్ (Disney+Hotstar) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 5న ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. కాబట్టి విడుదలైన నెల రోజుల లోపే ‘భీమా’ ఓటీటీలోకి రానుండటం విశేషం. నిజానికి ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఒప్పందం చేసుకున్నారు. అయితే భీమాకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
భీమా కథేంటి?
పరశురామ క్షేత్రం కొలువైన మహేంద్రగిరిలో భవానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచకాలు చేస్తుంటుంది. అడ్డొచ్చిన పోలీసుల్ని సైతం అంతం చేస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా (గోపిచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతోనే భవానీ ముఠా ఆట కట్టించేందుకు నడుం బిగిస్తాడు. అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళ్తున్న ట్యాంకర్లకు అడ్డుతగులుతాడు. అప్పుడు భవనీ ఏం చేశాడు? ఆ ట్యాంకర్లలో దాగిన రహస్యమేమిటి? భవానీని ముందు పెట్టి వెనక కథ నడిపిస్తున్న ఓ పెద్ద మనిషి ఎవరు? పరశురామ క్షేత్రం మూతపడటానికీ, ఈ ముఠాకీ సంబంధం ఏమైనా ఉందా? అన్నది కథ.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం