• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెరిగిన fb యూజర్లు.. అత్యధికంగా భారత్‌లోనే

  ఫేస్‌బుక్ యూజర్ల పెరుగుదలలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని మెటా సంస్థ వెల్లడించింది. డెయిలీ, మంథ్లీ యాక్టివ్ యూజర్స్ పెరుగుదల జాబితాలో టాప్‌లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. 2021 నుంచి 2022 డిసెంబరు 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2బిలియన్లకు చేరుకుందని తెలిపింది. అదేవిధంగా మంథ్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2శాతం పెరిగి 2.96 బిలియన్లుగా నమోదైందని మెటా పేర్కొంది. రోజుకు లేదా నెలకు ఒకసారైనా యాప్‌ని ఓపెన్ చేయడం, లాగిన్ కావడం వంటి వాటితో … Read more

  వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే

  వాట్సాప్ సరికొత్త ఫీచర్లు తీసుకురానుంది. టెక్ట్స్ ఎడిటర్, న్యూ ఫాంట్స్, గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ లిమిట్, ఇమేజ్ క్వాలిటీ తదితర ఫీచర్లపై వర్క్ చేస్తోంది. యూజర్లకు కొత్త అనుభూతిని కలిగించేలా వీటిని తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా ఫొటో క్వాలిటీ తగ్గకుండా, ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే వీలుండేలా ఫీచర్‌ని తీసుకొస్తోంది. గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ లిమిట్‌ని 24 నుంచి 100కు పెంచనుంది. టెక్ట్స్ ఎడిటర్ ద్వారా యూజర్‌కి మరిన్ని కస్టమైజేషన్ సదుపాయాలు కల్పించనుంది. నచ్చిన ఫాంట్ సెలక్ట్ చేసుకోవడంతో పాటు టెక్ట్స్ … Read more

  ఇకపై ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్

  నేటి నుంచి కొన్ని పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఓల్డ్ వెర్షన్స్‌లో నడుస్తున్న ఆండ్రాయిన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎల్జీ ఆప్టీమస్ ఎఫ్3, సోనీ ఎక్స్‌పీరియా ఎం, లెనోవా ఏ820, వికో సింక్ 5 ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, శాంసంగ్ గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్2, గెలాక్సీ ఎస్2 మినీ, గెలాక్సీ ఎస్2 మినీ, విన్కో డార్క్ నైట్, ఆర్కోస్ 53 ప్లాటినం, హ్యూవే అసెండ్, జడ్‌టీఈ గ్రాండ్ మెమో, ఎల్జీ ఆప్టిమస్ ఎల్5 LI, తదితర ఫోన్లలో వాట్సాస్ … Read more

  వాట్సాప్‌లో కొత్త ఫీచర్; చెక్ చేశారా?

  ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘వీడియో మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు వాట్సాప్‌లో వీడియో రికార్డు చేసేందుకు కెమెరా బటన్ నొక్కి పట్టుకుంటేనే వీడియో రికార్డ్ అయ్యేది. వీడియో పూర్తయ్యేవరకు కెమెరా బటన్‌పై వేలు నొక్కి పట్టుకునే ఉండాలి. కానీ ‘వీడియో మోడ్’ ఫీచర్‌‌తో ఆ శ్రమ అక్కర్లేదు. ఈ ఫీచర్‌లో వీడియో మోడ్ ఆన్ చేస్తే చాలు రికార్డింగ్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మందికే అందుబాటులో ఉంది.

  త్వరలో వాట్పాప్ బిగ్ అప్డేట్!

  ప్రముఖ మెసెంజెర్ యాప్ వాట్సాప్ బిగ్ అప్డేట్ ఇవ్వనుంది. త్వరలో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. తన వినియోగదారుల కోసం ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసుకునేందుకు సరి కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్‌లో ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేయాలంటే క్వాలిటీ సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ మొబైల్ డేటాను కొంచెం ఎక్కువగా తీసుకుంటుందని సమాచారం. కొన్ని వారాల్లో ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు అందనుంది.

  వాట్సాప్‌లో 65,536 నంబర్ అర్థం ఇదే..!

  వాట్సాప్‌లో 65,536 నంబరు ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. ఈ నంబర్ ఏంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే, ఇది క్యారెక్టర్స్ లిమిట్. యూజర్లు ఇన్ని క్యారెక్టర్లకు మించి ఇతరులకు మెసేజ్‌ని పంపించలేరు. ఒకవేళ 65,537 అక్షరాలు టైప్ చేసి పంపించాలని ప్రయత్నిస్తే.. వాట్సాప్ ఒక పాప్ అప్ మెసేజ్‌ని చూపిస్తుంది. కేవలం ‘తొలి 65,536 అక్షరాలు మాత్రమే సెండ్ అవుతాయ్’ అంటూ ఇంగ్లిషులో పాప్ అప్ వస్తుంది. దీన్ని ఒకే చేస్తేనే ఆ మెసేజ్ సెండ్ అవుతుంది. అయితే, 30కు మించి … Read more

  వాట్సాప్‌లో ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్..!

  వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ని తీసుకొస్తోంది. ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్ ద్వారా ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్‌కి చాట్ హిస్టరీని బదిలీ చేసుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే.. చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ అవుతుందని పేర్కొంది. దీనికి క్లౌడ్ సేవలు వినియోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం యూజర్లు తమ డేటాని నిక్షిప్తం చేసుకోవడానికి బ్యాకప్‌ సేవలని ఉపయోగిస్తున్నారు. కొత్త డివైజ్‌లోకి సైన్ ఇన్ అయినప్పుడు వాటిని రీట్రీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ … Read more

  ట్విటర్ హ్యాక్.. 23.5 కోట్ల యూజర్ల డేటా లీక్?

  ట్విటర్ హ్యాకింగుకి గురైనట్లు తెలుస్తోంది. సుమారు 23.5 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్లు ఇజ్రాయెల్ సైబర్ ఇంటిలెజిన్స్ సంస్థ ‘హడ్సన్ రాక్’ వెల్లడించింది. దీనివల్ల ఫిషింగ్, డాక్సింగ్ వంటి సైబర్ దాడులు జరిగే ప్రమాదముందని హడ్సన్ రాక్ కో ఫౌండర్ అలన్ గార్ వెల్లడించాడు. అయితే, ఈ విషయమై ట్విటర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తొలుత 40కోట్ల యూజర్ల డేటా లీకైనట్లు ప్రచారం జరిగినా.. తాజాగా 23.5 కోట్లు అంటూ హడ్సన్ రాక్ పేర్కొంది. డిసెంబరు … Read more

  మళ్లీ ఫీచర్‌తో రానున్న వాట్సాప్

  డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ ఓ ఫీచర్‌ని మళ్లీ తీసుకురానుంది. ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను ఒకేసారి సెలక్ట్ చేసి పంపించేలా మళ్లీ ఫీచర్‌ని ఎనేబుల్ చేయనుంది. గతేడాది మల్టిపుల్ చాట్ సెలక్షన్ ఫీచర్‌ని వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు డిలీట్ చేసింది. వెబ్, మొబైల్ వర్షన్ యూజర్లకు మాత్రం అలాగే ఉంచింది. అయితే, తాజాగా దీన్ని మళ్లీ తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. సెలెక్ట్ చాట్స్ ఫీచర్‌తో ఇది రానుందట. దీంతో డెస్క్‌టాప్ యూజర్లకు కూడా వెసులుబాటు కలగనుందని వాట్సాప్ అభిప్రాయపడుతోంది.

  నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్

  నేటి నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లలో తమ సేవలు నిలిపివేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది. మొత్తం 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతా లోపాల వల్లే ఈ ఫోన్లలో సేవలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఐఫోన్5, శాంసంగ్ ఎస్2, ఎస్3, హెచ్‌టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్సెల్, ఎల్జీ ఎనాక్ట్, సోనీ ఆర్క్ ఎస్, వికో సింక్ ఫైవ్, ఆర్కోస్ 53 ప్లాటినమ్ వంటి ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు పేర్కొంది.