గత వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 10వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హాయ్ నాన్న నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ (Hi ...
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు/ బైక్స్ తక్కువ ధరలో ఉండటం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈవీ స్కూటర్లపై వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈవీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని EV స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ...
బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. రోజుకో అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. హిందీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోవాలని ఉబలాటపడిన అందాల తార ఊర్వశి రౌటేలా.. అక్కడ విఫలమవడంతో తెలుగులో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతోంది. బ్రో, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌ల్లో నర్తించి తెలుగు ఫ్యాన్స్‌కు దగ్గరైంది. ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మొత్తం 3 నిమిషాల 46 సెకన్ల నిడివితో ట్రైలర్ సాగింది. స్నేహం ఇతివృత్తంగా కథ సాగినట్లు తెలుస్తోంది. సినిమా BGM, స్క్రీన్‌ప్లే కేజీఎఫ్‌ను పోలి ఉంది. ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి. యాక్షన్ సిక్వెన్స్ పర్వాలేదు. కన్సార్ నగరంపై ఆధిపత్యం నేపథ్యంగా కథ రూపొందినట్లు కనిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ కోరుకున్నంత రేంజ్‌లో ట్రైలర్ లేదని చెప్పాలి.
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్ ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023 సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. ’13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ’24’ వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం ...
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023 రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ ...
నాయిస్ (Noise) కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌వాచ్‌లకు భారత్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్ వాచ్‌లను రిలీజ్ చేస్తుందని నాయిస్‌కు పేరుంది. ఈ క్రమంలోనే నాయిస్ తాజాగా కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘Noise ColorFit Pro 5’ పేరుతో వాచ్‌ను లాంచ్ చేసింది. టెక్ ప్రియులు కోరుకున్న అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వాచ్ ఫీచర్లపై ఓ లుకేద్దాం. రెండు వేరియంట్లలో.. Noise ColorFit Pro 5 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ ...
భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతుంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలోనూ పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కాబోతున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. మరి డిసెంబర్‌లో రానున్న బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏమిటీ? ఈ కథనంలో తెలుసుకుందాం. Yezdi Roadking ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ డిసెంబర్‌లో ...
కిరణ్ అబ్బవరం హీరోగా, నేహాశెట్టి హారోయిన్‌గా తెరకెక్కిన ‘రూల్స్ రంజన్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆహాలో నవంబరు 30 సాయంత్రం 6గంటల నుంచి ‘రూల్స్ రంజన్’ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ తెలిపింది.
‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ వెంకటయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్ ఫర్ డెమోక్రసీ కార్టూన్ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.
2024లో టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. 212వరోజు ముమ్మిడివరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు. తాను చేస్తున్నపాదయాత్ర అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిల్ల సైకోలు తాననేమి చేయలేవని విమర్శించారు. ఏ అధికారులైతే జగన్ మాట విన్నారో.. వాళ్లంతా దిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ల కాంబినేషన్ లో ‘వార్ 2’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ బాలీవుడ్ నుంచి వచ్చేసింది. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు 14 సినిమా రిలీజ్ కాబోతుంది చిత్రం బృదం ఫిక్స్ చేసింది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనించనున్నాడు. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనితో 2024 ఏడాది ఆరంభంతోనే ఏ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ట్రీట్ ని ఆశించవచ్చు. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
IRR కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
విశాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడి వారిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌పై విశాల్ ఇటీవల చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో సీబీఎఫ్‌సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు.ఈ సందర్భంగా విశాలో ట్వీట్ చేశారు. ‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే దానిపై కూడా వాళ్లు కొన్ని సూచనలు తీసుకున్నారు. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు ...
ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము దూరడం కలకలం రేపింది. హెల్మెట్‌లో నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. https://www.instagram.com/reel/CzGQXf0Np5P/?utm_source=ig_embed&ig_rid=1cdbf287-c1c7-4d5f-bb83-1d16db43b19d
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు,వర్షాపాతం నమోదైంది
టీమిండియా బౌలర్ బుమ్రా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పోస్ట్ పెట్టాడు. దీంతో అతడు ముంబై వదిలి ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ కెరీర్ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు.
మానసిక ఒత్తిడికి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. వంశీకృష్ణ (22) డిగ్రీ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ ఆర్థిక సంస్థ ద్వారా కారు తీసుకున్నాడు. దీని బకాయిలు చెల్లించాలని సంస్థ నుంచి అతడికి ఒత్తిడి పెరిగింది. మరోపక్క ప్రేమించిన యువతి నిర్లక్ష్యం చేసింది. దీంతో వంశీ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: హత్య కేసులో నిందితులకు తొమ్మిది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నందిగామ 16వ జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు తీర్పు చెప్పింది. ముళ్లపాడులో 2006 సెప్టెంబర్‌లో వినాయక విగ్రహ ఊరేగింపులో కాంగ్రెస్ వర్గీయుల రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన నలజాల నరసింహయ్య(80) మృతి చెందారు. ఆ ఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్ల వివరాలు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ప్రముఖ బైక్ తయారీ కంపెనీ KTM సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ‘2024 KTM 790 Adventure’ పేరుతో అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అతి త్వరలోనే ఈ బైక్ భారత్ సహా మిగిలిన దేశాల్లో అందుబాటులోకి రానుంది. KTM బైక్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ నయా బైక్‌పై పడింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వంటి విషయాలను బైక్ ప్రియులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న KTM ...
దేశంలో ఎన్నో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి కోటలు, పురాతన ఆలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్యాలెస్‌లు ఇలా వివిధ రకాల ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే శీతాకాలంలో తప్పక సందర్శించాలని మంచు ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వింటర్ మెుదలవడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరభారతంలో అందమైన మంచు ప్రదేశాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. గుల్‌మార్గ్, జమ్ముకశ్మీర్ ఉత్తర భారతదేశంలో ...
ప్రతీ నెలా టాప్ కంపెనీల మెుబైల్స్ రిలీజ్ అవుతూ టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌లోనూ ప్రముఖ సంస్థల ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెుబైల్ ప్రియుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ లాంచ్ కాబోతున్నాయి. దిమ్మతిరిగే ఫీచర్లతో దేశీయ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ మెుబైల్స్ ఏవి? వాటి ధర, ఫీచర్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Redmi Note 13 Pro Plus రెడ్‌మీ మరో అద్భుతమైన మెుబైల్‌ను డిసెంబర్‌లో రిలీజ్ చేయబోతోంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో రెడ్‌మీ నోట్ 13 ...
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 – డిసెంబర్ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ ...
దేశంలో మంచి బ్రాండ్ కలిగిన మెుబైల్ కంపెనీల్లో రెడ్‌మీ ఒకటి. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్లతో పాటు అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్‌లకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. త్వరలో ఈ కంపెనీ Redmi Watch 4 పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనుంది. నవంబర్ 29న Redmi K70 స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ వాచ్‌ను చైనాలో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాచ్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వాచ్ స్క్రీన్ ఈ స్మార్ట్‌వాచ్ 1.97 అంగుళాల ...
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ ...
చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రెడ్‌మీ (Redmi) నుంచి ఏ మెుబైల్ రిలీజైన అది టెక్ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన ఫోన్లను రెడ్‌మీ లాంచ్ చేస్తుండటమే దీనికి కారణం. ఇదిలా ఉంటే మెుబైల్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘Redmi K70 Series’ విడుదలకు సిద్ధమైంది. ‘Redmi K60 Series’కు కొనసాగింపుగా వస్తున్న ఈ నయా మెుబైల్ నవంబర్ 29న చైనాలో విడుదల కానుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా ‘Redmi K70 Series’ కు ...