• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్

    సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యంగ్యంతో, హాస్యంతో స్టేజ్‌పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి దారి తీశాయి. తాజాగా ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.

    వివాదానికి కారణమైన వ్యాఖ్యలు

    ఒక ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి. వాడెవడో ఎర్ర చందనం దొంగ… వాడు హీరో!” అన్నారు. ఈ వ్యాఖ్యలు బన్నీని ఉద్దేశించి అన్నట్లుగా అనిపించడంతో, పుష్ప 2 ఫ్యాన్స్ బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను అవమానించారని ప్రచారం ఎక్కువైంది. దీనిపై పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు.

    అల్లు అర్జున్‌కి క్లారిటీ

    తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ, “ఇటీవల అల్లు అర్జున్‌తో మాట్లాడాను. ఆయనే నాకు సర్దిచెప్పాడు. ‘అంకుల్, మీరు అలా అనలేదని నాకు తెలుసు. పిచ్చోడా నేనే అన్నాను’ అని వివరణ ఇచ్చాను.  మీరు అన్నది ఆ ఉద్దేశ్యంతో అయ్యి ఉండదు అని బన్నీ అన్నాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు అని చెప్పాను. 

    అసలు ఉద్దేశం

    రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు కేవలం ప్రస్తుత సినీ కథా ప్రక్రియల మార్పులను ప్రతిబింబించడానికేనని తెలుస్తోంది. ఆయన పుష్ప సినిమా గురించి కాకుండా, జనరల్‌గా నేటి కథలపై వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కానీ అప్పట్లో పుష్ప 2 మేనియా నడుస్తుండటంతో ఆయన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి.

    తప్పుడు కథనాలపై ఫైర్

    రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో మనం చెప్పింది వేరే, వాళ్లు రాస్తోంది వేరే. ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నారు. ఒకసారి నాకు తెలిసిన వ్యక్తిని ప్రశ్నించాను. నేను చెప్పింది వేరే, ఆయన రాసింది వేరే. టైటిల్ నెగెటివ్‌గా పెడితేనే క్లిక్స్ వస్తాయని వాళ్లు చెబుతున్నారు. దాంతో అసలు కంటెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు,” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

    ఫ్యాన్స్‌కు పిలుపు

    రాజేంద్ర ప్రసాద్ పుష్ప ఫ్యాన్స్‌ను ఉద్దేశించి, “నేను ఎప్పుడూ ఎవ్వరిని అవమానించను. నా వ్యాఖ్యల ఉద్దేశం కేవలం కథల దిశ మార్పుల గురించే. దయచేసి నాపై వచ్చిన తప్పుడు వార్తల్ని నమ్మకండి,” అంటూ స్పష్టం చేశారు.

    తాజా సినిమా ‘షష్ఠిపూర్తి’

    ఇదిలా ఉంటే, రాజేంద్ర ప్రసాద్ నటించిన కొత్త సినిమా షష్ఠిపూర్తి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఈ వివాదంపై మాట్లాడిన ఆయన, తన వైఖరిని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.

    రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అనాలోచితమైనవిగా అభిప్రాయపడినా, ఆయన ఉద్దేశ్యం పూర్తిగా అపార్థం అయ్యిందని స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv