• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • త్వరగా నిద్ర పట్టడానికి చిట్కాలు

  అర్ధరాత్రి కొంతమందికి నిద్ర పట్టదు. ఇక చేసేది ఏమి లేక ఫోన్ పట్టుకొని టైంపాస్ చేస్తారు. అయితే, కొన్ని అలవాట్లు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే ముందు తప్పనిసరిగా ఒక గ్లాస్ పాలు తాగాలని చెబుతున్నారు. ఇది అలసటను పోగొట్టి బాగా నిద్రపట్టేలా చేస్తాయట. అరికాలిపై 2 నుంచి 5 నిమిషాలు లైట్‌గా మసాజ్ చేస్తే ఆక్యు ప్రెషర్ పాయింట్లపై రిలీఫ్ కలిగి నిద్ర వస్తుందన్నారు. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవటం కూడా ముఖ్యం. గోరువెచ్చిని నీటితో స్నానం చేయడం, ఫోన్ వంటివి … Read more

  మద్యం అతిగా తాగుతున్నారా?

  మద్యం అతిగా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ, దీనివల్ల వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వయసు మీద పడుతున్న కొద్ది అవయవాలను, మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఫలితంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్ది దాహం తక్కువై శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుందని చెబుతున్నారు.

  గుండె రక్తనాళాల్లో పూడికలు ఎలా వస్తాయి?

  గుండె రక్తనాళాల్లో పూడికలు మాసం ఎక్కువగా తినడం వల్ల వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది పేగుల్లోని సూక్ష్మక్రిముల ద్వారా పెరుగుతాయని వెల్లడించారు. మాంసంలో ఎల్- కార్నిటైన్‌ రసాయనం, కోలిన్ పోషకం ఎక్కువగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని మెటబాలైట్లు పుట్టుకొచ్చి పూడికలు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. మెటబాలైట్లు గ్రంథుల వలే పనిచేసి హర్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయి. ఇలా గుండె జబ్బులు పెరుగుతాయి.

  స్మార్ట్‌ఫోన్లతో ‘టెక్‌నెక్‌’ బారిన పడుతున్న పిల్లలు

  రోజులో చాలా సమయం స్మార్ట్‌ఫోన్లు వాడటం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయని తెలుసు. అయితే తాజాగా మరో కొత్త సమస్య వస్తోంది.నిరంతరం స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల టెక్‌నెక్‌ లేదా టెక్స్ట్‌నెక్‌ అనే వింత జబ్బు వస్తోంది. దీని కారణంగా మెడ, భుజాల నొప్పి, తలనొప్పి మాత్రమే గాక వేళ్లు వణకడం వంటి సమస్యలు కూడా వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోనూ టెక్‌నెక్‌ పెరుగుతోందని… ముఖ్యంగా చిన్నపిల్లల్లో అధికంగా ఉంటోందని పలువురు వైద్యులు అంటున్నారు.

  నిద్రలేకపోతే ఇన్ని తిప్పలు?

  సాధారణంగా మనిషికి రోజుకి 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మెదడు, శరీరం కోలుకోవటం కష్టమవుతుంది. అలసట, నీరసం తలెత్తుతాయి. హుషారు, ఉత్సాహం తగ్గుతాయి. ఏకాగ్రత కొరవడుతుంది. పోషక విలువలు లేని జంక్‌ఫుడ్, చిరుతిళ్లు తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. రాత్రి నిద్ర తగ్గినప్పుడు పగటిపూట అరగంట సేపు కునుకు తీస్తే కొంతవరకు ఉపయోగపడొచ్చు. అంతకన్నా ఎక్కువసేపు పడుకుంటే నిద్ర ఆవహిస్తోంది. అయితే పగటి కునుకుతో రాత్రి నిద్ర భర్తీ కాదు.

  దాహం వేసినప్పుడు ఇవి తాగితే అంతే!

  దాహం వేసినప్పుడు కూల్‌డ్రింక్‌లు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ, వాటితో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తెలిపారు. చక్కెరను కలిపి తయారు చేస్తారు కనుక బరువు పెరిగేందుకు దోహం చేస్తాయి. అందుకే దాహం వేసినప్పుడు మాములు నీళ్లు కలిపి తాగటం మంచిదని సూచిస్తున్నారు. ఇటీవల కొంతమందితో సర్వే నిర్వహించగా… నీళ్లు, ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకుంటున్నారట.

  ఉదయాన్నే తేనే తాగితే లాభాలు

  రోగ నిరోధక శక్తి పెంచుకోవటం చాలా ముఖ్యం. కరోనా సమయంలో ఇది బాగా తెలిసింది. దీనికోసం తేనే బాగా ఉపయోగపడుతుంది. విశృంఖల కణాలు, హానికారక బ్యాక్టీరియాలను అడ్డుకునే గుణాలు తేనేలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చెంచాడు తేనే, సగం చెక్క నిమ్మరసం కలిపి పరిగడుపున తాగితే మలబద్ధకం, ఛాతి మంట తగ్గుతాయి. ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనే, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితేే మంచిది.

  ఆకలి ఎక్కువగా అవుతుందా?

  ఆకలికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చాలామందిని వెంటాడుతుంటాయి. కొందరికి ఆకలి వేయదు. కొందరికి గడియ గడియకు వేస్తోంది. అర్ధరాత్రి లేచి తినేవాళ్లు కూడా ఉంటారు. దీని వల్ల భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు వస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఆకలి నుంచి తప్పించుకోవచ్చుంటున్నారు నిపుణులు. బాధం, కొబ్బరి, మజ్జిగ, మెులకలు, మజ్జిగ, కూరగాయలతో చేసే జ్యూస్‌లు తీసుకోవటం వల్ల తరచూ ఆకలి వేసే సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  లిమిట్‌లో తాగితే ఓకేనా!

  మద్యం సేవించే వారు చాలా మంది చెప్పే మాట లిమిట్‌లోనే తాగుతా! నాకేం కాదు! అని. కానీ పెగ్గు తాగినా ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. యూరప్‌లో 20 కోట్ల మందికి మద్యం సంబంధిత క్యాన్సర్‌ ముప్పు ఉన్నట్లు ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌ అధ్యయనం ప్రచురించింది. మద్యపానం కనీసం 7 రకాల క్యాన్సర్లకు కారణవుతోందని పేర్కొంది. మద్యంతో పాటు అస్బెస్టాస్‌, రేడియేషన్‌, పొగాకు క్యాన్సర్‌ కారకాలుగా అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధనా సంస్థ వర్గీకరణ చేసింది.

  చలికాలం ఉదయాన్నే లేవట్లేదా?

  చలికాలంలో ఉదయాన్నే నిద్రలేవడానికి బద్ధకం అడ్డు వస్తుంది. వ్యాయామం చేయటం మానేస్తాం. కానీ, చలికాలంలో రన్నింగ్, వాకింగ్ చేస్తే మంచిదట. దీనివల్ల శరీరానికి డి విటమిన్ సరిగా అందుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వెచ్చని బట్టలు, బూట్లు ధరించడం మంచిది. వేగంగా పరిగెత్తవద్దట. ఎందుకంటే, శరీరం చల్లగా ఉంటుంది కనుక ఇబ్బందులు రావచ్చు. నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది. నడుస్తున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే వైద్యులను సంప్రదించండి.