• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Benefits of Hugs: కౌగిలింత వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

  మనిషి జీవితంలో కౌగిలంత (Hug)కు ప్రత్యేక స్థానం ఉంది. సంతోషం, బాధ, భయం, దుఃఖం ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యక్తి తన భావాన్ని ఈ కౌగిలంత ద్వారానే తెలియజేస్తాడు. ఆలింగనం అనేది హృదయానికి, మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది గొప్ప మార్గం. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, ప్రేమికుడు లేదా స్నేహితుడిని కౌగిలించుకున్న ప్రతీసారి ప్రేమ భావన చాలా రెట్లు పెరగడం గమనించే ఉంటారు. అయితే కౌగిలింత వల్ల ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 

  మూడ్ ఛేంజర్‌

  సరైన మూడ్‌లో లేని వారికి కౌగిలంత అనేది మంచి ఔషదంగా పనిచేస్తుంది. ఒక్క హగ్‌ ద్వారా వారిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకొనిరావొచ్చు. మీ మిత్రులు, సన్నిహితులు మూడీగా ఉన్నట్లు కనిపిస్తే ఒక్క హగ్‌తో వారిలో స్థైర్యాన్ని నింపండి. 

  టెన్షన్‌ మటుమాయం

  జీవితం అన్నాక ప్రతీ ఒక్కరికీ ఏదోక టెన్షన్స్‌ ఉంటూనే ఉంటాయి. అంతమాత్రన సమస్యల గురించి ఆలోచిస్తూ టెన్షన్‌ పడిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎలాంటి టెన్షన్స్‌ ఒక్క ఆలింగనంతో చిటికెలో మాయమైపోతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. 

  అలసట దూరం

  హగ్‌ వల్ల శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మీ అలసటను దూరం చేస్తుంది. దీంతో పాటు శరీర పనితీరు మెరుగవుతుంది. 

  బ్రెయిన్‌ షార్ప్‌

  తరచుగా కౌగిలించుకునే వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. హగ్‌  అనేది వ్యక్తికి సంతోషాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇది మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా బ్రెయిన్‌ మునుపటి కంటే షార్ప్‌గా మారుతుంది.

  గుండె ఆరోగ్యానికి మంచిది

  ప్రేమించే వ్యక్తులను కౌగిలించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. తమ ప్రియమైన భాగస్వామిని 10 నిమిషాల పాటు హగ్ చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తున్నట్లు తేలింది. తద్వారా హృదయ స్పందనలు సాధారణ స్థితిలోకి చేరుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

  సంతోషం రెట్టింపు

  ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు వారిలో ఆక్సిటోసిన్ విడుదలవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. ఈ రసాయనం మనలోని ఒత్తిడి, బాధలను ఒక్కసారిగా తీసివేసి మనల్ని సంతోషంగా ఉంచుతుంది. 

  రోగాలు నయం

  కౌగిలింతలకు రోగాలను నయం చేసే గుణం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న 400 మంది.. ప్రతీరోజు కౌగిలించుకోవడం ద్వారా త్వరగా రికవరీ ‌అయినట్లు పరిశోధకులు గుర్తించారు. 

  రోజుకి ఎన్ని హగ్స్ అవసరం?

  మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కనీసం నాలుగు కౌగిలింతలు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రోజుకి 8, మెరుగైన జీవితం కోసం రోజుకు 12 కౌగిలింతలు అవసరం అవుతాయి. 

  చిరు ఎప్పుడో చెప్పాడు..!

  2004లో వచ్చిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రంలోనే మెగాస్టార్‌ చిరంజీవి కౌగిలింత గొప్పతనం గురించి తెలియజేశాడు. ఒక్క హగ్‌ ద్వారా ఎంతటి బాధ నుంచైన క్షణాల్లో బయటపడవచ్చని పేర్కొన్నాడు. కౌగిలింతల ప్రయోజనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చిత్రం శంకర్‌ దాదా MBBS. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv