1టీబీ వరకు గూగుల్ డ్రైవ్ స్టోరేజీ పొడిగింపు
గూగుల్ డ్రైవ్ వాడేవారికి శుభవార్త. ఉచిత స్టోరేజీ లిమిట్‌ని గణనీయంగా పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం 15జీబీ వరకు గూగుల్‌లో ఉచితంగా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇకనుంచి ఈ స్టోరేజీ లిమిట్ 1టీబీ(1024జీబీ) వరకు పొడిగించనుంది. పీడీఎఫ్, ఇమేజ్, క్యాడ్ వంటి వంద రకాలైన ఫైళ్లను స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది. వీటికి ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. 15జీబీ నుంచి 1టీబీకి వాటంతటవే అప్‌గ్రేడ్ అవుతాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం చాలామంది ఈ గూగుల్ వర్క్‌స్పేస్‌ని వినియోగిస్తున్నారు. దీంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.