వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్ మెుబైల్‌ను రిలీజ్ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో డిస్‌ప్లే, చిప్‌సెట్, బ్యాటరీ సహా మరిన్ని వివరాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ నయా ఐకూ మెుబైల్.. 6.7 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, HDR, 1800 nits పీక్ బ్రైట్‌నెస్, 1220 x 2712 pixels రిజల్యూషన్, Dragontrail Star 2 Plus ప్రొటెక్షన్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ iQOO Z9 Turbo ఫోన్.. Android 14 ఆధారిత Funtouch 14 ఆపరేటింగ్ సిస్టమ్, Qualcomm Snapdragon 8s Gen 3 ప్రొసెసర్ వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ ఐకూ మెుబైల్.. మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశముందని లీకైన సమాచారం చెబుతోంది. 8GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB ROM, 12GB RAM / 256GB ROM స్టోరేజ్ ఆప్షన్స్ మెుబైల్‌ను పొందవచ్చని అంటున్నారు. ఇక microSD కార్డు సాయంతో స్టోరేజ్‌ను 1TB వరకూ పెంచుకోవచ్చట.
కెమెరా
ఈ iQOO Z9 Turbo మెుబైల్.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా + 2 MP OIS డెప్త్ సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను కూడా ఫిక్స్ చేశారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా 4K వీడియోలు, HDR ఫొటోలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నాయి.
బ్యాటరీ
ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. దీనికి ఏకంగా 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుందట. ఇదే నిజమైతే ఈ ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందించే అవకాశముంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉన్నందున మెుబైల్‌ను వేగంగా ఛార్జ్ చేసుకునేందుకు వీలు పడుతుంది.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ vivo iQOO Z9 Turbo మెుబైల్.. Wi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.3, A2DP, LE, GPS, GALILEO, GLONASS, QZSS, BDS వంటి కనెక్టివిటీ ఫీచర్లతో రానుందట. అలాగే అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కాంపస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉంటాయని సమాచారం.
కలర్ ఆప్షన్స్
లీకైన సమాచారాన్ని బట్టి ఈ నయా ఐకూ ఫోన్.. బ్లాక్ (Black) కలర్‌లో అందుబాటులోకి రానుంది. లాంచింగ్ రోజున మిగిలిన కలర్ ఆప్షన్స్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.
ధర ఎంతంటే?
iQOO Z9 Turbo ధర, లాంచింగ్ తేదీపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్.. ఏప్రిల్‌లో కచ్చితంగా భారత్‌లో అడుగుపెడుతుందని టెక్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉండొచ్చని సమాచారం.