• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Vani Jairam: వాణీ జయరామ్‌కు పేరు తెచ్చిన సూపర్ హిట్ పాటలు ఇవే..
  వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని
  Doppelganger: అమిగోస్‌ సినిమా మాదిరి తెలుగులో వచ్చిన 5 డోపుల్ గ్యాంగర్ చిత్రాలు
  Unstoppable: పవన్ కళ్యాణ్ టాప్ 8 ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్.. అన్నయ్య రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకున్నా
  See More

  SSMB 28 నుంచి తమన్‌ ఔట్.. క్లారిటీ

  మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’ నుంచి తమన్‌ని తీసేసినట్లు తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి. తమన్ ఇచ్చిన ట్యూన్ చిత్రబృందానికి నచ్చలేదని.. ఈ విషయం చెప్పడంతో తమన్ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే, ఇవన్నీ కట్టు కథలేనని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై తమన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నెగెటివిటీ’ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ఓ మ్యూజిక్ బిట్‌ని యాడ్ చేశారు. దీంతో చర్చ అక్కడితో ముగిసిపోయింది. Rest In … Read more

  మరోసారి వాయిదా పడిన ‘NTR30’ షూటింగ్?

  ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NTR30’ సినిమా వడివడిగా ప్రీ షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ మార్చి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. బహుశా ఇదే కారణంతో చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలో చిత్రీకరణను ప్రారంభిస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ, మరోమారు వాయిదా పడినట్లు సమాచారం.

  ప్రేక్షకాదరణ పొందుతున్న ‘రైటర్ పద్మభూషణ్’

  సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ప్రేక్షకాదరణ పొందుతోంది. తొలి రోజు మంచి మౌత్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. యువ రచయితగా సుహాస్ యాక్టింగ్, ఆశిష్ విద్యార్థి, రోహిణిల నటన సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. దీంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించగా.. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.

  జూన్‌లో మహేశ్, రాజమౌళి సినిమా ప్రారంభం?

  మహేశ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది జూన్‌లో సినిమా పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే రాజమౌలితో చేతులు కలపనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ వ్యయంతో నిర్మాణం కానుంది. ఈ మేరకు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనుంది. అయితే, దీనిపై అధికారిక … Read more

  గీతాగోవిందం సీక్వెల్‌ పనులు ప్రారంభం!

  టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘గీత గోవిందం’ సీక్వేల్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో చేయాల్సిన సినిమా రద్దు కావడంతో డైరెక్టర్‌ పరుశురామ్‌ సీక్వేల్‌పై దృష్టిసారించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా చకచకా రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న గీతాఆర్ట్స్‌కు, లైగర్‌తో ఫ్లాప్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండకు ఈ సినిమా కీలకం కానుంది. గీతా గోవిందం-2 నిర్మాణ వ్యయం 130కోట్లుగా ఉండొచ్చని చిత్ర బృందం అంచనా వేస్తోంది.

  AK62 సినిమా నుంచి విఘ్నేష్ ఔట్?

  అజిత్, విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. AK62 వర్కింగ్ టైటిల్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించనుంది. అయితే, ఈ మూవీ నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ట్విటర్ బయోలో AK62ని తొలగించడమే ఇందుకు కారణం. దీంతో సినిమా నుంచి విఘ్నేష్ వైదొలిగారన్న చర్చ ఊపందుకుంది. స్టోరీలో సూచించిన మార్పులను సవరించడం ఇష్టం లేకే విఘ్నేష్ వైదొలిగినట్లు సమాచారం. అయితే, నిర్మాణ సంస్థ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. © File Photo … Read more

  వాణి జయరాం మృతిలో ట్విస్ట్

  చెన్నైలోని తన నివాసంలో ప్రముఖ సింగర్ వాణి జయరాం కన్నుమూశారు. అయితే, ఆమె మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తమతున్నాయి. అనారోగ్యంతో ఆమె చనిపోలేదట. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వాణి జైరాం నుదుటిపై ఎవరో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె ఇంటిని అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు చూసి వాణి జయయరాం పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం.

  సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వద్ద బాంబు బ్లాస్ట్

  బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో చోటుచేసుకుంది. నగరంలో జరిగే ఓ ఫ్యాషన్ షోలో సన్నీ లియోనీ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలోనే బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఈ ఫ్యాషన్ షోను కొన్ని అతివాద సంఘాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో పేలుడు జరగడంతో వారిని పోలీసులు అనుమానిస్తున్నారు. Courtesy Twitter: Rocket … Read more

  ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం కన్నుమూత

  ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో 25కు పైగా చిత్రాలను నిర్మించారు. చిరంజీవి నటించిన పులి బెబ్బులితో పాటు వయ్యారి భామలు వగలమారి భర్తలు వంటి చిత్రాలను నిర్మించారు. హిందీలో శ్రీదేవి నటించిన అకాల్‌ మంద్ వంటి హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఆయన మరణంతో సినీలోకం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

  ట్రెండింగ్‌లో శింబు లేటెస్ట్ సాంగ్

  తమిళ్ స్టార్ హీరో శింబు నటించిన లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’ మూవీలోని ‘నమ్మి సత్తం’ సాంగ్ వైరల్‌గా మారింది. ఈ లిరికల్ వీడియోకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ పాటను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. కాగా శింబు తాజాగా తన 40 పుట్టినరోజును జరుపుకున్నారు. ‘పత్తు తల’ మార్చిలో విడుదల కానుంది. ఈ మూవీలో శింబు సరసన ప్రియా భవానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.