• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సలార్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రైలర్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈమేరకు ప్రభాస్ యాక్షన్ లుక్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ప్రభాస్ సరసన మినాక్షి చౌదరి, శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు.

    రోహిత్ శర్మ అరుదైన ఘనత

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 87(107) పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 18వేల పరుగుల మార్కును క్రాస్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు సచిన్(34,357), కోహ్లీ(26,421), ద్రవిడ్(24,208), గంగూలీ(18,575) ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. 40 పరుగులకు 4 వికెట్లు తీశారు.

    ఎస్‌బీఐ అంబాసిడర్‌గా ధోని

    దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్లిష్టపరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకోవడంలో ధోనీ ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఈ లక్షణాలు తమ మార్కెటింగ్‌కు, కస్టమర్లకు మరింత కనెక్ట్ చేస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. నైతికతకు పరిపూర్ణ రూపంగా ధోనితో భాగస్వామ్యం నిలుస్తుందని వెల్లడించింది.

    కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

    ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

    ఇంట్లో ఉన్న మహిళపై డెలివరీ బాయ్ రేప్

    గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిత్యవసర సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. ఆ ఇంట్లోని మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని పట్టుకునేందుకు వెళ్లారు. తారసపడిన నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అతన్ని పట్టుకున్నారు.

    మంచు విష్ణుకు ప్రమాదం

    మంచు విష్ణు కన్నప్ప మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని తెలిసింది. కాగా ఈ పాన్‌ఇండియా సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    జైలర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం టెలివిజన్ హక్కులను సన్‌టీవీ దక్కించుకుంది. తమిళ్‌లో సన్‌టీవీ, తెలుగులో జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఇందులో గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ తెరకెక్కించాడు. రజినీకాంత్ కెరీర్‌లోనే ఓ మాసివ్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచింది.

    కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం రాజీనామా

    కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కేటీఆర్ సమక్షంలో ఈరోజు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ స్వయంగా నాగం ఇంటికి వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నాగంకు నిరాశ ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

    ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి: కేసీఆర్

    కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలి. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తం. పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుంది. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారు. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చాం.. నాగార్జున సాగర్‌ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్‌ చేసి దిగువన … Read more

    బస్సు రెడీగా ఉంది కేటీఆర్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

    కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ‘కర్ణాటకలో హామీలన్నీ అమలు అవుతున్నాయి. వాటిపై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్ తోక ముడిచారు. బస్సు రెడీగా ఉంది, ప్రగతి భవన్ రావాలా, ఫాం హౌస్‌కు రమ్మంటావా.. బస్సులో నేరుగా కాళేశ్వరం వెళ్లి చూద్దాం.. అక్కడి నుండి కర్ణాటకకు వెళ్దాం, సిద్ధమా? అని ప్రశ్నించారు.