• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సజ్జలకు ఏపీ హైకోర్టు నోటీసులు

  ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంపై జర్నలిస్ట్‌ వెంకటయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

  ఓటర్లకు రామ్‌గోపాల్‌ వర్మ సూచనలు

  హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.

  టీడీపీ-జనసేన గెలుపు ఖాయం: లోకేష్

  2024లో టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్‌ అన్నారు. 212వరోజు ముమ్మిడివరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు. తాను చేస్తున్నపాదయాత్ర అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిల్ల సైకోలు తాననేమి చేయలేవని విమర్శించారు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా దిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

  చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

  IRR కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ డిసెంబర్‌ 1కి వాయిదా వేసింది.

  ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

  మానసిక ఒత్తిడికి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. వంశీకృష్ణ (22) డిగ్రీ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ద్వారా కారు తీసుకున్నాడు. దీని బకాయిలు చెల్లించాలని సంస్థ నుంచి అతడికి ఒత్తిడి పెరిగింది. మరోపక్క ప్రేమించిన యువతి నిర్లక్ష్యం చేసింది. దీంతో వంశీ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  హత్య కేసులో 9 మందికి యావజ్జీవ శిక్ష

  AP: హత్య కేసులో నిందితులకు తొమ్మిది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నందిగామ 16వ జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు తీర్పు చెప్పింది. ముళ్లపాడులో 2006 సెప్టెంబర్‌లో వినాయక విగ్రహ ఊరేగింపులో కాంగ్రెస్‌ వర్గీయుల రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన నలజాల నరసింహయ్య(80) మృతి చెందారు. ఆ ఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

  జగన్‌ పాలనకు ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలే: లోకేష్

  సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేందుకు జగన్‌ జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో సెక్రటేరియట్‌లో కూర్చుని జగన్‌ ఇదేం రాజధాని అంటున్నారని విమర్శించారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను జగన్ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే ఉందన్నారు.

  IRR కేసు.. చంద్రబాబుపై చర్యలొద్దు: హైకోర్టు

  అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

  కుటుంబసభ్యులు దారుణ హత్య

  AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం జరిగింది. ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్‌ (30)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

  చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

  అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ వాయిదా పడింది. నేడు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించగా శుక్రవారం సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.