• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి ‘రూల్స్‌ రంజన్‌’

    కిరణ్‌ అబ్బవరం హీరోగా, నేహాశెట్టి హారోయిన్‌గా తెరకెక్కిన ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఆహాలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఆహాలో నవంబరు 30 సాయంత్రం 6గంటల నుంచి ‘రూల్స్‌ రంజన్‌’ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సదరు ఓటీటీ తెలిపింది.

    సజ్జలకు ఏపీ హైకోర్టు నోటీసులు

    ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంపై జర్నలిస్ట్‌ వెంకటయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

    ఓటర్లకు రామ్‌గోపాల్‌ వర్మ సూచనలు

    హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.

    టీడీపీ-జనసేన గెలుపు ఖాయం: లోకేష్

    2024లో టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్‌ అన్నారు. 212వరోజు ముమ్మిడివరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు. తాను చేస్తున్నపాదయాత్ర అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిల్ల సైకోలు తాననేమి చేయలేవని విమర్శించారు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా దిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

    ‘వార్ 2’ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది

    టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ల కాంబినేషన్ లో ‘వార్ 2’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ బాలీవుడ్ నుంచి వచ్చేసింది. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు 14 సినిమా రిలీజ్ కాబోతుంది చిత్రం బృదం ఫిక్స్ చేసింది.

    “దేవర” గ్లింప్స్ పై క్రేజీ బజ్.!

    ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనించనున్నాడు. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనితో 2024 ఏడాది ఆరంభంతోనే ఏ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ట్రీట్ ని ఆశించవచ్చు. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

    చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

    IRR కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ డిసెంబర్‌ 1కి వాయిదా వేసింది.

    గ్యాస్‌ లీక్‌ ఘటన.. ముగ్గురి మృతి

    విశాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడి వారిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. ఇంట్లో వంటగ్యాస్‌ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అనుకోలేదు: విశాల్

    సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌పై విశాల్ ఇటీవల చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో సీబీఎఫ్‌సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు.ఈ సందర్భంగా విశాలో ట్వీట్ చేశారు. ‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే దానిపై కూడా వాళ్లు కొన్ని సూచనలు తీసుకున్నారు. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు … Read more

    హెల్మెట్‌లో దూరిన పాము.. వీడియో

    ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము దూరడం కలకలం రేపింది. హెల్మెట్‌లో నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. https://www.instagram.com/reel/CzGQXf0Np5P/?utm_source=ig_embed&ig_rid=1cdbf287-c1c7-4d5f-bb83-1d16db43b19d