• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సితార మంచి మనసుకు ఫిదా!

  హీరో మహేష్‌బాబు కూతురు సితార మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా సితార హైదరాబాద్‌ ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్‌ పైకి ఎక్కడానికి ఇబ్బంది పడింది. ఇది సితార గమనించి వెంటనే స్టేజ్‌ పై నుంచి దిగొచ్చి ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటినజన్లు … Read more

  యాడ్ వివాదంలో ‘అమితాబ్’

  బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ యాడ్ వివాదాస్పదమైంది. దీనిపై వ్యాపార సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరితంగా ఉన్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని అమితాబ్‌కు లేఖ రాసింది. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేలా ప్రకటన ఉందని లేఖలో పేర్కొంది. దుకాణదారుల వద్ద డీల్‌లు, ఆఫర్లు అందుబాటులో లేవని చెప్పడం కస్టమర్లను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే అవుతుందని చెప్పింది. ఈ మాటలకు అమితాబ్ వివరణ ఇవ్వాలని కోరింది.

  Meenakshi Chaudhary: గోల్డెన్ ఛాన్స్‌ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్‌ అంటే ఈ భామదే!

  హరియాణా బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam)లో హీరోయిన్‌గా ఈ భామ ఛాన్స్‌ కొట్టేసింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.  మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (Ichata Vahanamulu Niluparadu)తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ ఈ భామ అందానికి మంచి మార్కులే పడ్డాయి. … Read more

  వేదికపై కన్నీటి పర్యంతమైన ‘సిద్దార్థ్’

  ‘చిన్నా’ మూమీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో హీరో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ‘చిన్నా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నిస్తే తన సినిమాలు ఎవరు చూస్తారని చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా సినిమాలు తెలుగులో ఎవరూ తీసుకోలేదు, చివరకు ఏషీయన్ సునీల్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రీబ్యూట్ చేశారు. వాళ్లకు చాలా థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అడిగే సమయం వచ్చింది. ‘నా పేరు సిద్ధార్థ్ నేను ‘చిన్నా’ అనే సినిమా తీశాను మీరు తప్పక చూడాలి’ అని సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు.

  ఎలిమినేషన్‌పై రతిక రియాక్షన్‌ ఇదే

  బిగ్‌బాస్7 నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రతిక తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ ఎవ్రీవన్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వి సా)’ అని చెప్పింది. అంటే.. ‘షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది’ అని దీనికి అర్థం. ఈ పోస్టును బట్టి చూస్తుంటే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు రతిక ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. … Read more

  అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్‌

  నటుడు సిద్ధార్థ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో సినిమా చూసి తాను వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పారు. ‘నేను కమల్‌ హాసన్‌ సర్‌కు వీరాభిమానిని. ఇటీవల ఆయన్ని కలిశా. ‘విచిత్ర సోదరులు’ చిత్రీకరణ నాటి అనుభవాలను కమల్‌ నాతో పంచుకున్నారు. ఆయన మాటలు విని నేను భావోద్వేగానికి గురయ్యా. తొమ్మిదేళ్ల వయసులో మా అమ్మతో కలిసి ఆ సినిమా చూశా. సినిమాలోని రిజిస్టర్‌ ఆఫీస్‌ సీన్‌ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చా. మీతో మాట్లాడుతుంటే ఆ సీన్‌ గుర్తుకువచ్చిందని కమల్‌తో … Read more

  ఎలిమినేషన్‌పై రతిక రియాక్షన్‌ ఇదే

  బిగ్‌బాస్7 నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రతిక తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ ఎవ్రీవన్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వి సా)’ అని చెప్పింది. అంటే.. ‘షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది’ అని దీనికి అర్థం. ఈ పోస్టును బట్టి చూస్తుంటే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు రతిక ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. … Read more

  శ్రుతి హాసన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

  స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ నటించిన ‘ది ఐ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్స్‌’కు బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ విభాగంలో నామినేట్‌ అయింది. కోర్ఫు దీవుల్లో పర్యావరణ హితంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. డాప్నే ష్మోన్‌ దర్శకత్వంలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

  Bigboss7: రతిక రోజ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

  బిగ్‌బాస్ సీజన్ 7 బ్యూటీ రతిక రోజ్ నాల్గో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్న రతిక గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. వారానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు పొందినట్లు టాక్. తొలుత బిగ్‌బాస్ టైటిల్ ఫెవరెట్‌లలో ఒకరిగా నిలిచిన రతిక ఆ తర్వాత.. పల్లవి ప్రశాంత్, యావర్‌తో నడిపిన ట్రాక్‌లు వర్కౌట్ కాలేదు. వారిని బ్యాక్ బిచింగ్ చేయడం ఆమెపై నెగిటివిటిని పెంచింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.

  వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది: సమంత

  హీరోయిన్ సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెనీస్ వెకెషన్‌లో ఉన్న సామ్.. అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈమేరకు.. ‘నిరీక్షించే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతుంటాయి’ అనే క్యాప్షన్‌ను కోట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇటీవల అమెరికాలో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత కొలుకున్నట్లు తెలిసింది. మానసికంగా బలంగా ఉండేందుకు.. టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.