• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్‌కు రష్మిక ఫోన్ కాల్!

    ‘బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్‌షో ‘అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే’. షోలో తాజాగా ‘యానిమల్‌’ టీమ్ సందడి చేసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ రష్మికతో పాటు దర్శకుడు సందీప్‌వంగా హాజరయ్యారు. బాలకృష్ణ ఫేమస్‌ డైలాగు ‘ఫ్లూటు జింక ముందు ఊదు..’ను రణ్‌బీర్‌కపూర్‌ చెప్పి అలరించారు. అలాగే రష్మిక లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు ఫోన్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Screengrab Instagram: vijay devarakonda

    అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా?: విజయశాంతి

    మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని సినీనటి విజయశాంతి అన్నారు. గతంలో కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబితే బీజేపీలోకి వెళ్లానని చెప్పారు. కానీ కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించవద్దని కోరామని చెప్పారు. సంజయ్‌ను తొలగించడంతో బీజేపీ పరువు పోయిందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

    ఆర్య తొలి వెబ్‌సిరీస్.. ఉత్కంఠగా ట్రైలర్

    హీరో ఆర్మ వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యాడు. ఆయన నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’ ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అడవి సమీపంలో ఉన్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు? అన్నది ఈ సిరీస్‌ స్టోరిగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది

    ‘ఉయ్యాలో ఉయ్యాలా..’ ఫుల్‌ వీడియో రీలీజ్..!

    నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం సూపర్‌హిట్‌ సాధించిన విషయం తెలిసిందే.. ఈ మూవీకి అనిల్‌ రావిపూడి దర్శకుడిగా వ్యవహిరించాడు. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

    రాజకీయ నాయకుడి గెటప్‌లో హీరో నాని

    హీరో నాని తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశాడు. నాని నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పోస్ట్ పెట్టాడు. డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని క్యాప్షన్‌‌తో నానీ షేర్ చేశాడు.. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. ‘సినిమా ప్రమోషన్స్‌ను మీరు ప్రత్యేకంగా చేస్తారు’ అంటూ పొగిడేస్తున్నారు.

    Video: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌

    బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌-కత్రినా ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు. ‘టైగర్‌-3’ విడుదలైన సూపర్ హిట్‌ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్‌ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. Vibe 🔛#Tiger3InCinemas | #LekePrabhuKaNaam pic.twitter.com/o4UQwI0PXO — Yash Raj Films (@yrf) … Read more

    అమితాబ్‌.. ఫైనల్‌ మ్యాచ్ చూడొద్దు!

    ప్రపంచకప్‌ ఫైనల్లో రేపు ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాభ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కివీస్‌పై టీమిండియా విజయం తర్వాత ట్విట్టర్ వేదికగా ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘దయచేసి మీరు ఫైనల్‌ చూడొద్దంటూ’ అభిమానులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన అమితాబ్‌.. ‘‘ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’’ అని మరోసారి ట్వీట్ చేశారు. Screengrab Instagram: amitabh bachchan Screengrab Instagram: amitabh bachchan … Read more

    ఆ ప్రచారాన్ని నేను పట్టించుకోను: అలియా

    ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌షోలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, అలియా భట్‌ హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అలియా ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. గతంలో నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అలాగే నా వైవాహిక జీవితంలోనూ సమస్యలున్నాయంటూ రకరకాల రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. వాటిని నేను పట్టించుకోను’. అని అలియా చెప్పుకొచ్చింది.

    ఈ సారి వరల్డ్‌ కప్‌ మనదే: రజనీకాంత్‌

    వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా సెమీఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ బ్యాటింగ్ అప్పుడూ మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది’ అని రజనీ చెప్పుకొచ్చారు. అలాగే సెమీఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు.

    MBBS చదువుపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు

    ‘ఆదికేశవ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నటి శ్రీలీల తన ఎంబీబీఎస్‌ చదవు గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడింది. ‘డాక్టర్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని చెప్పింది. ‘ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకూ సిద్ధం అవుతున్నా. నటిగా ప్రేక్షకులను అలరించడాన్ని, వాళ్ల ప్రేమాభిమానాలు పొందడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ తప్పక ఉండాలి.’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.