• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dhanashree Verma: చాహల్‌ – ధనశ్రీ విడిపోతున్నారా? తప్పు ఎవరిదంటే?

    భారత స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. 

    అంతేకాదు క్రికెటర్‌ యూజ్వేంద్ర చాహల్‌ తన ఇన్‌స్టా ఖాతా నుంచి ధనశ్రీ వర్మ ఫొటోలను తొలగించడంతో వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది. 

    అయితే.. చాహల్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫొటోలను మాత్రం ధనశ్రీ (Dhanashree Verma) తొలగించకపోవడం గమనార్హం. 

    చాహల్‌ – ధనశ్రీ (Dhanashree Verma) విడాకులు తీసుకోవడం ఖాయమని సన్నిహుతులు సైతం చెబుతున్నారు. అయితే ఇంకాస్త సమయం పట్టే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. 

    వారు విడిపోవడానికి గల కచ్చితమైన కారణాన్ని మాత్రం తమకు తెలియదని సన్నిహిత  వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వారే క్లారిటీ ఇవ్వాలని పేర్కొంటున్నాయి.

    అయితే కొరియోగ్రాఫర్‌ ఫ్రెండ్‌ ప్రతీక్ ఉటేకర్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చాయి. ఆ కారణంగానే వారు విడిపోతున్నారని చర్చ జరుగుతోంది. 

    వాస్తవానికి గతేడాది మిడిల్‌ నుంచి చాహల్‌ – ధనశ్రీ విడాకులకు సంబంధించి బజ్‌ మెుదలైంది. అయితే చాహల్‌ దీనిని సోషల్‌ మీడియా వేదికగా ఖండించాడు. గాసిప్స్‌ను ఎవరూ నమ్మవద్దని ఫ్యాన్స్‌కు సూచించాడు.

    వారిద్దరి పరిచయం విషయానికి వస్తే.. ముంబయి చెందిన డెంటిస్ట్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వద్ద చాహల్‌ డ్యాన్స్‌ క్లాసులకు వెళ్లేవాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

    ఇద్దరూ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. డ్యాన్స్‌ రీల్స్‌ షేర్‌ చేస్తూ గతంలో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌లో నిలిచారు. 

    ఆ సమయంలోనే ఇండియన్‌ క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌తోనూ ధనశ్రీ డ్యాన్స్‌ వీడియోలు చేసింది. అందులో వారిద్దరు మరీ క్లోజ్‌గా ఉండటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చాహల్‌కు అన్యాయం చేస్తోందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. 

    అలాగే కొరియోగ్రాఫర్‌ ఫ్రెండ్‌ ప్రతీక్‌ ఉటేకర్‌తో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోలను సైతం ఆమె నెట్టింట షేర్‌ చేయడం వివాదస్పదమైంది. 

    ధనశ్రీ వర్మ త్వరలో తెలుగు తెరపై అడుగుపెట్టనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దిల్‌రాజు నిర్మించనున్న ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమాలో ఆమె నటించనున్నట్లు కథనాలు వచ్చాయి. 

    భరతనాట్యం నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ధనశ్రీ డ్యాన్సర్‌గా కనిపించనుందని స్ట్రాంగ్‌ బజ్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv