మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై నీలి నీడలు కమ్మాయి. అయితే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అభ్యర్థన మేరకు టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుతో పాటు ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు
తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని చిత్ర బృందం కోరగా, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
- సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను అదనంగా రూ.100 పెంచుకునే వీలును కల్పించారు.
- మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతించారు.
- జనవరి 11 నుంచి 19 వరకు, రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.
- సింగిల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.50,
- మల్టీ ప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
అయితే, విడుదల రోజున జనవరి 10 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చే సూచనను ప్రభుత్వం తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ముందుగానే అనుమతిని ఇచ్చింది.
- జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
- ఈ బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు.
- అదే విధంగా, ఆరు షోలకు జనవరి 10న ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
- జనవరి 11 నుంచి 23 వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చి,
- సింగిల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.135 (జీఎస్టీతో కలిపి),
- మల్టీ ప్లెక్స్‌లలో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి) వరకు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కల్పించారు.
ఫ్యాన్స్‌లో సంబరాలు
తెలంగాణ & ఏపీ ప్రభుత్వాల నిర్ణయాలతో రామ్ చరణ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మెగా ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రదర్శనలు ప్లాన్ చేస్తూ, ఈ సినిమా టికెట్ ధరలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం వల్ల మొదటి రోజున సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, టికెట్ ధరల పెంపు, అనుమతులు ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్