• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు హిట్ కొట్టాడా?

  విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం దక్కిందా ? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.  కథ మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు … Read more

  సుధీర్ బాబు హంట్ రివ్యూ

  విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే సుధీర్‌ బాబు మరోసారి హంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముంబయి పోలీస్‌కు రీమేక్‌గా రూపొందించిన చిత్రం ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలో ట్విస్టులు కోరుకునే ప్రేక్షకులను దర్శకుడు నిరాశ పరుస్తాడు. కథనం పేలవంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సుధీర్‌ బాబు నటనతో మెప్పించాడు. రేటింగ్ 2.5/5

  షారుఖ్‌ పఠాన్ చిత్రం రివ్యూ

  నాలుగేళ్ల తర్వాత హీరోగా నటించి పఠాన్‌ సినిమాతో షారుఖ్‌ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ కల్నల్‌.. ఇండియాలో ఓ ప్రైవేట్ ఏజెంట్‌తో భారీ కుట్రకు చేసిన ప్లాన్‌ను షారుఖ్‌ ఎలా అడ్డుకుంటాడు అనేది కథ. చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌ ఆకట్టుకుంటాయి. సల్మాన్ ఎంట్రీ నచ్చుతుంది. దీపికా గ్లామర్ మరింత ప్లస్. స్క్రీన్‌ ప్లే, లాజిక్ లేని సీన్స్ మైనస్. రేటింగ్ 2.75/5

  18 పేజేస్ ట్విటర్ రివ్యూ

  నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన లవ్ ఎంటర్‌టైనర్ 18 పేజేస్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుకుమార్ కథను అందించగా బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అరవింద్ సమర్పణలో విడుదలయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రేమకథా చిత్రంతో పాటు ట్విస్టులు బాగున్నాయని టాక్. కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయని కొందరి అభిప్రాయం.

  ధమాకా ట్విటర్ రివ్యూ

  రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చాలాచోట్ల ప్రీమియర్‌షోలు పడ్డాయి. సినిమాపై మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొందరు సినిమా ఫర్వాలేదు అంటుంటే మరికొందరు ఎప్పటిలాగే రొటీన్‌ చిత్రమని చెబుతున్నారు. ఫస్టాఫ్ కామెడీతో నడిపించేశారని.. ఇంటర్వెల్ బాగుందని చెబుతున్నారు.సెకాండాఫ్‌లో యాక్షన్‌ సీన్స్ అలరిస్తాయట. పాటలకు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. రొటీన్ కథతో రవితేజ మరోసారి నిరాశపర్చాడని టాక్.

  అవతార్‌-2 ఫస్ట్‌ రివ్యూ

  ప్రపంచమంతా ఎదురుచూస్తున్న జేమ్స్‌ కేమెరూన్‌ విజువల్ వండర్‌ ‘అవతార్‌-2’ అద్భుతంగా ఉందని టాక్‌ వినిపిస్తోంది. మంగళవారం లండన్‌లో ప్రీమియర్‌ షో చూసిన వారంతా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో విజువల్స్‌, ఏమోషన్స్‌ తొలి భాగం కన్నా బాగున్నాయని చెబుతున్నారు. సాంకేతికంగా ఇంత అద్భుతమైన సినిమా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ఇలాంటి సినిమా వచ్చి యుగాలు గడిచిపోయిందని చాలా మంది కామెంట్‌ చేశారు. డిసెంబర్‌ 16న అవతార్‌ విడుదల కాబోతోంది.

  ‘Like Share and Subscribe’ Movie Review: యూట్యూబర్ల చిత్రాన్ని ప్రేక్షకుడు లైక్ చేశాడా..?

  ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ జంటగా నటించిన ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్‌‌ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. పైగా కామెడీ సినిమాల దర్శకుడిగా పేరున్న మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయడంతో కొంత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి? విప్లవ్(సంతోష్ శోభన్) ఓ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం, అన్వేషించడం విప్లవ్ అలవాటు. తన ఛానల్‌ని మెరుగు … Read more

  ‘ఊర్వశివో రాక్షసీవో’ ట్విట్టర్ రివ్యూ

  అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసీవో నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘శిరీష్ ఈ సినిమాలో నటన పరంగా మెరుగయ్యాడు. ఫస్టాఫ్ స్లోగా ఉంది. వెన్నెల కిశోర్ కామెడీ బాగా నవ్వు తెప్పిస్తుంది. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రోమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అను గ్లామర్ డోస్‌తోనే కాకుండా నటనతోనూ అదరగొట్టింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే బంధాలు సులువుగా తెంచుకుంటారనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. … Read more

  REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

  స్పై థ్రిల్లర్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 80’s నుంచి చూస్తూనే ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో కథ కన్నా కథనం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లాంటి థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు PS మిత్రన్‌ మరోసారి ఆకట్టుకున్నాడా? కార్తీ మరోసారి తన నటనతో అలరించాడా? చూద్దాం. కథ: కథ అంత కొత్తదేం కాదు. ‘సర్దార్‌’( కార్తీ) ఓ పేరుమోసిన గూఢచారి. అతడికి అసాధ్యమైన మిషన్ అంటూ ఏదీ ఉండదు. అలాంటి ఓ గూఢచారిపై ఓ సంఘటన కారణంగా … Read more

  REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

  తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్‌, మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.  తొలుత సినిమాకు “హే భగవాన్‌” అనే టైటిల్‌ అనుకున్నా, విశ్వక్‌ సేన్‌ గత సినిమాలు పాగల్‌, హిట్‌ ఇలా ఇంగ్లీష్‌ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్‌ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” … Read more