నటీనటులు : కృష్ణ తేజ, కృతిక రాయ్, మోయిన్, హర్షిణి, శ్రుతి రాయ్, ఇంద్రజ, రమణ భార్గవ్, వెంకటేష్ కాకుమాను తదితరులు
డైరెక్టర్స్: గౌతమ్, కార్తిక్
సంగీతం: ఆర్. ఆర్. ధ్రువన్
నిర్మాత: చిన వాసుదేవ రెడ్డి
నిర్మాణ సంస్థలు: ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్
ఓటీటీ వేదిక: ఆహా
ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేష్ కాకుమాను, కృష్ణ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథా కమావీషు’ (Katha Kamamishu). ఈ చిత్రానికి గౌతమ్ – కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించింది. కథను గౌతమ్ అందించారు. ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్ బ్యానర్లపై చిన వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి R.R. ధృవన్ సంగీతం సమకూర్చారు. చాలా సినిమాల్లో పెళ్లితో కథలకు శుభం కార్డు పడుతుంది. కానీ తమ సినిమా పెళ్లితో మెుదలవుతుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. మరి ఆహాలో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
కొత్తగా పెళ్లిచేసుతున్న నాలుగు జంటల చుట్టూ కథ తిరుగుతుంది. సత్య (వెంకటేశ్ కాకుమాను) ఉష (హర్షిణి) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. నిరుద్యోగులైన ఇద్దరు తమ్ముళ్లు సత్యతోనే ఉండటంతో ఉషకు ప్రైవసీ లేకుండా పోతుంది. మరోవైపు దివ్య – బాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. బాలు పెట్టే కండీషన్స్‌కు దివ్య విసిగిపోతుంటుంది. ఇక శ్రీధర్ – కల్పన (కరుణ కుమార్ – ఇంద్రజ) రెండో పెళ్లి చేసుకుంటారు. కల్పన పోలీసు ఆఫీసర్ కాగా అప్పటికే వారిద్దరికి పిల్లలు ఉంటారు. ఓ కారణంతో చేత కల్పనతో సాన్నిహిత్యంగా శ్రీధర్ ఉండలేకపోతాడు. అటు కిరణ్ – స్రవంతి పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకొని కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇలా నాలుగు జంటలు పెళ్లి తర్వాత అసంతృప్తితో రోజులు గడుపుతుంటారు. మరి వారు తమ జీవితాలను సంతోషంగా మార్చుకున్నారా? లేదా? అన్నది మెయిన్ స్టోరీ.
ఎవరెలా చేశారంటే
భార్య భర్తలుగా చేసిన ఎనిమిది మంది నటీ నటులు మంచి యాక్టింగ్ కనబరిచారు. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ముఖ్యంగా కరుణ కుమార్, ఇంద్రజ తమ మెచ్యూర్ నటనతో ఆకట్టుకున్నారు. అయితే వారి ట్రాక్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. వెంకటేష్ కాకుమాను, హర్షిణి జంట కూడా తమ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రధానంగా సినిమా మెుత్తం ఈ ఎనిమిది మంది ఆర్టిస్టుల చుట్టే తిరగడంతో మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం తగ్గలేదు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకులు గౌతమ్ – కార్తీక్.. పెళ్లి తర్వాత నాలుగు జంటలు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాయన్న కోణంలో సినిమాను తీర్చిదిద్దారు. పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి, పెద్దలను ఎదిరించి జరిగిన పెళ్లి, రెండో పెళ్లి, అవసరాలతో ముడిపడిన పెళ్లి.. ఇలా నాలుగు డైమన్షన్స్‌లో నాలుగు విభిన్న కథలను చూపించే ప్రయత్నం చేశారు. అసంతృప్తులతో నిండిన వారి జీవితాలు ఎలా సాగాయన్న కోణాన్ని ఫన్నీగా చూపించారు. ఈ నాలుగు కథలను ఆసక్తికరంగా రాసుకున్నప్పటికీ, తెరకెక్కించడంలో మాత్రం డైరెక్టర్లు విఫలమయ్యారు. మూడు ట్రాకులను ఫన్‌గా నడిపి ఇంద్రజ – కరుణకుమార్ ఎపిసోడ్‌ను సీరియస్‌గా చూపించడం ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. పైగా నాలుగు కథల్లోనూ పెద్దగా ట్విస్టులు లేకుండా సాదాసీదాగా కథను నడిపించారు. హృదయాలకు హత్తుకునే డైలాగ్స్, సన్నివేశాలు లేకపోవడం మరో మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ధ్రువన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- నాలుగు విభిన్నమైన కథలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- కథనం
- ట్విస్టులు లేకపోవడం
- కొరవడిన భావోద్వేగాలు
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?