• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Meenakshi Chaudhary: గోల్డెన్ ఛాన్స్‌ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్‌ అంటే ఈ భామదే!

  హరియాణా బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam)లో హీరోయిన్‌గా ఈ భామ ఛాన్స్‌ కొట్టేసింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.  మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (Ichata Vahanamulu Niluparadu)తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ ఈ భామ అందానికి మంచి మార్కులే పడ్డాయి. … Read more

  టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల

  మాస్ మహారాజ్‌ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో రవితేజ లుక్స్‌ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించారు. మాస్ లుక్‌లో రవితేజ అదరగొట్టాడు. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించింది. వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

  ప్రభాస్ చెంప మీద కొట్టిన యువతి

  ప్రభాస్‌ను ఓ యువతి చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ను గుర్తించిన యువతి సెల్ఫీ కోసం డార్లింగ్ దగ్గరకు వెళ్తుంది. ప్రభాస్‌తో ఫొటో దిగిన ఆనందంలో ఆ యువతి డార్లింగ్ చెంపపై చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. ఈవీడియో సాహో టైంలో జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

  ‘మ్యాడ్’ ట్రైలర్ విడుదల చేసిన జూ.ఎన్టీఆర్

  జూ.ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం మ్యాడ్. ఈ ట్రైలర్‌ను జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల జీవితాల మధ్య జరిగే సరదా సంఘటనలు సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. బీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

  అందుకే పూజాను తీసేశాం: నాగవంశీ

  ‘గుంటూరు కారం’ సినిమా నుంచి హీరోయిన్‌ పూజా హెగ్డేను తొలగించడంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ‘ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టులో విడుదల చేద్దామనుకున్నాం. తర్వాత 2024 జనవరి 12కు మార్చాం. దాంతో కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్‌ చేయాలనుకున్నాం. కానీ, అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చింది. డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఆమెను రీప్లేస్‌ చేశాం. దానికే కొందరు హంగామా చేశారు. పండగకు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి’ అని తెలిపారు.

  ‘కొత్త బంగారు లోకం’ రిజెక్ట్‌ చేసిన హీరోలు!

  2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా కథను నాగచైతన్య కోసం నాగార్జునకు చెప్పినట్లు డైరెక్టర్‌ తెలిపారు. ఆయన రిజెక్ట్‌ చేయడంతో రామ్‌ పోతినేనికి వినిపించినట్లు తెలిపారు. రామ్‌ కూడా ఇంట్రెస్ట్‌ చూపకపోవడంతో చివరికి వరణ్‌ సందేశ్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించారు.

  This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!

  దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.. రూల్స్ రంజన్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. … Read more

  రీ రిలీజ్‌కు సిద్ధమైన అదుర్స్

  యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, వి.వి. వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్. ఈచిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. జూ. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, షీలాలు హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ సంగీతం అందించారు. కోడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

  హరిహరవీరమల్లు ఇప్పట్లో లేనట్లేనా?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ నవంబర్‌లో కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ వరకు డేట్స్ కుదరకపోవచ్చని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో AM రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

  భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ట్రైలర్ అక్టోబర్ 8న రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.