• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

  దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం … Read more

  ‘భారతీయుడు 2’ ఇంట్రో అదుర్స్‌..!

  సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ బయటకొచ్చింది. కమల్‌ హాసన్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అవినీతితో విసిగిపోయిన ప్రజలు భారతీయుడు తిరిగి రావాలంటూ నెట్టింట హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం టీజర్‌లో కనిపించింది. చివరకూ కమల్‌ ఎంట్రీతో టీజర్‌ ముగుస్తుంది. #Bharateeyudu2 💥pic.twitter.com/7KJH4JA9EM — OTT Gate (@OTTGate) November 3, 2023

  ‘మ్యాడ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

  నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించిన ‘మ్యాడ్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్‌ 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్‌.. థియేటర్లలో పెద్ద సక్సెస్ అయ్యింది. రూ.25 కోట్ల గ్రాస్‌, రూ.12 కోట్ల షేర్‌ను సంపాదించింది. యంగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

  This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

  గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, … Read more

  జైలర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్

  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం టెలివిజన్ హక్కులను సన్‌టీవీ దక్కించుకుంది. తమిళ్‌లో సన్‌టీవీ, తెలుగులో జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఇందులో గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ తెరకెక్కించాడు. రజినీకాంత్ కెరీర్‌లోనే ఓ మాసివ్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచింది.

  ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్‌’

  రాఘవ లారెన్స్ హీరోగా మరో స్టార్ డైరెక్టర్ ఎస్ జె సూర్యల కాంబోలో వస్తున్న గ్యాంగ్‌ వార్ చిత్రం ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’. ఈ సినిమా తొలి భాగాన్ని తెలుగులో గద్దలకొండ గణేష్‌గా రీమేక్ చేశారు. ఈ సీక్వేల్ సినిమా రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా సస్పెన్స్ నడుస్తోంది. ఇప్పుడు లారెన్స్ బర్త్ డే కానుకగా ఆఫిషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 10న దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

  భారతీయుడు-2లో బ్రహ్మానందం

  భారతీయుడు-2లో కామెడీ లెజెండ్ బహ్మానందం నటించడం కన్ఫామ్ అయింది. ప్రస్తుతం కీడా కోలాలో ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్న బ్రహ్మానందం.. ఇండియన్ 2లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు చిత్రబృందం ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పెట్టిన లేటెస్ట్ ట్వీట్‌లో బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయడంతో ఎలాంటి రోల్‌లో కనిపించనున్నారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

  స్టార్‌ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా!

  ‘భగవంత్‌ కేసరి’ సినిమా విజయంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే గాసిప్‌ ఒకటి బయట చక్కర్లు కొడుతోంది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ‘NBK100’గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పవచ్చు.

  Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!

  అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు … Read more

  తారక్‌ డూప్‌తో ‘వార్‌-2’ షూట్‌.. క్లారిటీ!

  తారక్‌, హృతిక్ రోషన్‌ కాంబోలో ‘వార్‌-2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా తారక్‌కు సంబంధించిన సీన్లను డూప్‌తో చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. షూటింగ్‌ జరిగింది కేవలం రెండ్రోజుల మాత్రమేనని, అది కూడా టెస్ట్‌ పర్పస్‌ షూట్‌ నిర్వహించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తారక్‌ డూప్‌తో షూట్ జరుగుతోందన్న వార్తలను కొట్టిపారేశాయి. కాగా, వార్‌-2 చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.