• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oscar 2025: ఆస్కార్‌ రేసులోకి డిజాస్టర్‌ ‘కంగువా’.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

    తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) నటించిన రీసెంట్ చిత్రం ‘కంగువా’ (Kanguva) ఎంత పెద్ద డిజాస్టార్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. శివ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. మెుదటి షో నుంచే ఫ్లాప్‌ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్‌ తీవ్ర నష్టాలను చవి చూసింది. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ నటన పరంగా సూర్య మంచి మార్కులు కొట్టేశాడన్న కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆస్కార్‌ రేసులో నిలిచి కంగువా ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. డిజాస్టర్ ఫిల్మ్‌ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

    ఆస్కార్‌ బరిలో ఐదు చిత్రాలు..

    97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌ మరో రెండు నెలల్లో జరగనుంది. కాబట్టి తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌‌‌‌కు అర్హత సాధించిన 323 చిత్రాల జాబితాను ప్రకటించింది. వీటిలో ఉత్తమ సినిమా కేటగిరీలో 207 సినిమాలు అర్హత సాధించగా అందులో కంగువాకు చోటు దక్కింది. ‘కంగువా’తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ‘ది గోట్ లైఫ్’ ‘సంతోష్‌’ (హిందీ), ‘స్వతంత్య్ర వీర్‌ సావర్కర్‌’ (హిందీ), ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ (మలయాళం) చిత్రాలు భారత్‌ నుంచి ఆస్కార్‌ రేసులో నిలిచేందుకు అర్హత సాధించాయి. ఈ 5 సినిమాల్లో ఇండియా నుంచి ఆస్కార్ ఒక్కటైనా కొడుతే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.

    కంగువాపై ట్రోల్స్‌..

    భారత్‌ నుంచి ఆస్కార్‌ బరిలో నిలిచిన ఐదు చిత్రాల్లో కంగువా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత నష్టాలు తెచ్చి పెట్టిన సినిమాలో కచ్చితంగా చోటు సంపాదించగల ‘కంగువా’.. ఆస్కార్‌కు ఎంపిక కావడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు ‘కంగువా’ బరిలో నిలవడాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అస్కార్‌ జ్యూరీ సభ్యులు.. ‘కంగువా’ను చూస్తే కచ్చితంగా బెంబెలెత్తిపోతారని పోస్టులు పెడుతున్నారు. ‘కంగువా’ మూవీ బాలేదని ప్రతీ ఒక్కరికీ తెలుసని, అది ఎలాగో పోటీ నుంచి తప్పుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికంటే బెటర్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలు చాలా వచ్చాయని వాటిని గనక ఆస్కార్‌కు పంపి ఉంటే అవార్డ్‌కు అవకాశం ఉండేదని అంటున్నారు. 

    సెలక్ట్ కావడానికి కారణమిదే?

    ఆస్కార్‌కు కంగువా మూవీ షార్ట్‌ లిస్ట్‌ కావడానికి గల కారణాలను సినీ వర్గాలు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నాయి. సినిమా కథ, కథనం ఎలా ఉన్న అందులోని అటవీ ప్రపంచం, నివసించే తెగ నేపథ్యం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను పరిశీలించి జ్యూరీ సభ్యులు ఈ సినిమాను షార్ట్ లిస్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. సినిమాటోగ్రఫీ పరంగా కూడా ‘కంగువా’ చాలా కొత్తగా అనిపించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. కాగా, రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అతికష్టం మీద రూ.100 కోట్లు రాబట్టింది. రూ.2000 కలెక్షన్స్ టార్గెట్‌గా బాక్సాఫీస్‌ వద్దకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

    ‘కంగువా’ కథ ఇదే

    ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక బాలుడు కలుస్తాడు. ఆ బాలుడికి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ బాబుతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv