• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Varun Sandesh: విలన్ అవతారం ఎత్తిన వరుణ్ సందేశ్.. అప్సర రాణితో మాములుగా చేయలేదుగా..!

    హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ లవర్‌ బాయ్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్‌లేక అతని కెరీర్ గ్రాఫ్ మందగించింది. దీంతో ఈసారి పూర్తి విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ‘రాచరికం’(Racharikam Movie) అనే గ్రామీణ రాజకీయ రివెంజ్ డ్రామాలో వరుణ్ సందేశ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు తాజాగా మారుతి విడుదల చేశారు. ఈ చిత్రంలో ఐటెం గర్ల్ అప్సర రాణి హీరోయిన్‌గా నటిస్తోంది.

    విలన్‌గా వరుణ్ సందేశ్

    ఇప్పటి వరకు హీరోగా రాణించిన వరుణ్ సందేశ్, ఈ సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాచరికం చిత్రంలో అతని విలన్ పాత్ర కొత్త కోణాన్ని చాటుతుంది. ఈ చిత్రానికి సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వం వహించారు. విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్నారు. అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తోంది, ఈ చిత్రంలో ఆమె పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.

    రాయలసీమ పగలు, ప్రేమ కథల మిశ్రమం

    ట్రైలర్ చూస్తే గ్రామీణ రాజకీయ ప్రతీకార కథతో పాటు ఒక అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ట్రైలర్‌లోని “రాచకొండ ఒక అడవి లాంటిది… పులులు, ఏనుగులు, గుంట నక్కలు, విష సర్పాలు” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

    ట్రైలర్ హైలైట్స్

    • అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ పాత్రలు ఎంతో డిఫరెంట్‌గా కనిపించాయి.
    • రాజకీయ రివెంజ్ కథాంశంతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
    • గ్రిప్పింగ్ డైలాగులు, డిఫరెంట్ లుక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ స్పెషల్ అట్రాక్షన్.

    అప్సరా రాణి కొత్త షేడ్స్

    ఫోర్ లెటర్స్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అప్సరా రాణి, గతంలో క్రాక్, సీటీమార్, హంట్ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది. ఈసారి రాచరికం సినిమాలో హీరోయిన్‌గా  ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. మరి ఈ క్యారెక్టర్‌లో ఎలాంటి పర్ఫామెన్స్ అందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

    ఇక ఈ సినిమాలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. వెంగీ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, ఈశ్వర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

    విడుదల తేదీ

    రాచరికం సినిమా 2025 ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ విడుదలతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.

    వరుణ్ సందేశ్ – కానిస్టేబుల్‌లో కూడా బిజీ

    మరోవైపు వరుణ్ సందేశ్ తెలుగులో ‘కానిస్టేబుల్’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన ‘నింద’ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. హీరోగా, విలన్‌గా వరుణ్ సందేశ్ కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

    రాచరికం ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ హిట్ అవుతుందా? లేదో చూడాలి మరి .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv