కియారా-సిద్దార్థ్ పెళ్లి కోసం ముస్తాబవుతున్న రాజకోట
బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, నటుడు సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు మొత్తం 150మంది వీవీఐపీలను మాత్రమే ఈ వెడ్డింగ్‌కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఫిబ్రవరి 5న జైసల్మేర్ చేరుకోనున్నట్లు సమాచారం. అటు వివాహ ఏర్పాట్లను ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ చూస్తోంది.