• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Street Food Centers: కుమారి ఆంటీ కంటే చీప్‌కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ (Kumari Aunty Street Food) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె దగ్గర తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుండటంతో భారీ సంఖ్యలో ఫుడ్ లవర్స్‌ ఆమె వద్దకు క్యూ కట్టారు. అటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ సైతం ఆమెపై ఫోకస్‌ పెట్టడంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అయితే నగరంలో కుమారి ఆంటీ తరహాలోనే చాలా స్ట్రీట్‌ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అద్భుతమైన రుచితో తక్కువ ధరకే నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తున్నాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లలో  అత్యుత్తమమైన వాటిని YouSay ఎక్స్‌క్లూజివ్‌గా మీ ముందుకు తెచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    అనురాధ ఆంటీ, మాధాపూర్‌

    హైదరాబాద్‌లో కుమారీ ఆంటీ తర్వాత ఆ స్థాయిలో ఫేమస్‌లో అయిన మరో మహిళ అనురాధ ఆంటీ. ఆమె వద్ద మంచి రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటుంది. వెజ్‌, నాన్‌ వెజ్‌ ఐటెమ్స్‌ను తక్కువ ధరకే కడుపు నిండా ఆరగించవచ్చు. మాధాపూర్‌ కోహీనూర్‌ హోటల్‌ ఎదురుగా ఈమె ఫుడ్‌ స్టాల్‌ ఉంది. సగటున రోజుకు 1000 మంది వరకూ ఇక్కడ తింటూ ఉంటారు. వెజ్‌ 80/-, నాన్‌ వెజ్‌ రూ.120/-. 

    లక్ష్మమ్మ స్ట్రీట్‌ఫుడ్స్‌, బంజారాహిల్స్‌

    హైదరాబాద్‌లో బాగా ఫేమస్‌ అయిన స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లలో లక్ష్మమ్మది ఒకటి. ఆమె ఎప్పటినుంచే ఈ వ్యాపారం చేస్తోంది. రాహుల్ సిప్లిగంజ్‌ వంటి సినీ ప్రముఖులు సైతం తన వద్దకు వచ్చినట్లు లక్ష్మమ్మ తెలిపారు. వెజ్‌కు రూ.80, నాన్‌వెజ్‌కు రూ.120 తీసుకుంటున్నట్లు చెప్పారు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, బోటీలలో ఏదీ తీసుకున్న ప్లేటు రూ.120 మాత్రమే. 

    గోదావరి హోమ్లీ మీల్స్‌, హైటెక్‌ సిటీ

    నగరంలో మంచి ఆదరణ అందుకుంటున్న స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లలో ఇది కూడా ఉంది. ఇక్కడ కూడా తక్కువ ధరకే వెజ్‌, నాన్‌వెజ్‌ ఐటెమ్స్‌ను పొందవచ్చు. గోదావరి జిల్లాల స్టైల్లో ఫుడ్‌ రుచి చూడాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌. 

    శ్రీను అంకుల్‌, జూబ్లీ హిల్స్‌

    రాయలసీమ స్టైల్‌లో కోడి కూర రాగి సంగటి తినాలనుకునేవారికి ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఘుమ ఘుమలాడే చికెన్‌ బిర్యానీ కూడా లభిస్తుంది. 

    శ్రీ లక్ష్మీ మీల్స్‌ పాయింట్‌, మూసారాంబాగ్‌

    రూ.120లకే అన్‌ లిమిటెడ్‌ ఫ్రై పీస్‌ బిర్యానీ కావాల్సిన వారు మూసారాంబాగ్‌లోని శ్రీ లక్ష్మీ మీల్స్‌ పాయింట్‌కు వెళ్లాల్సిందే. పీవీఆర్‌ మాల్‌కు ముందే ఈ ఫుడ్‌ స్టాల్ ఉంటుంది. బిర్యానీతో పాటు బోటీ రైస్‌, తలకాయ రైస్‌, దాల్‌ రైస్‌, చికెన్ ధమ్‌ బిర్యానీ ఇక్కడ లభిస్తుంది. 

    సాయి లలిత మీల్స్‌, మూసారాంబాగ్‌

    ఈ ఫుడ్‌ స్టాల్‌ మూసారాంబాగ్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉంది. ఇక్కడ రూ.100లకే బిర్యానీ పొందవచ్చు. వెజ్ మీల్స్‌ కూడా ఇక్కడ లభిస్తుంది. 

    నాయుడు గారి స్పెషల్‌ బిర్యాని, మాధాపూర్‌

    ఇక్కడ రూ.150 రూపాయలకే అన్‌లిమిటెడ్‌ బిర్యానీ తినవచ్చు. ఈ బిర్యానీ కోసం ఎక్కడెక్కడి నుంచే ఫుడ్‌ లవర్స్‌ వస్తుంటారు. ఐటీసీ కోహినూర్‌ హోటల్‌కు ఎదురుగా ఈ ఫుడ్‌ స్టాల్‌ ఉంది.  

    ఏ.ఆర్ బిర్యానీ సెంటర్, బంజారాహిల్స్‌

    బంజారాహిల్స్‌లోని ఈ ఫుడ్‌ స్టాల్‌ వద్ద రూ.120లకే చికెన్ రైస్‌, బోటి రైస్‌, మటన్‌ లివర్‌ రైస్‌, చికెన్ బిర్యాని, తలకాయ రైస్, మటన్‌ లివర్‌ రైస్‌, పాయ రైస్‌ పొందవచ్చు. రూ.80లకు అన్‌లిమిటెడ్‌ వెజ్‌ తినొచ్చు. 

    బాస్మతీ రైస్‌ బిర్యాని, మాధాపూర్‌

    మాధాపూర్‌లో తక్కువ ధరకే  మంచి స్పైసీ బిర్యానీ తినాలని భావించే వారు ఈ ఫుడ్‌ స్టాల్‌ వద్ద ట్రై చేయవచ్చు. ఇక్కడ ప్లేట్‌ బిర్యానీ రూ.70 మాత్రమే. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎదురుగా ఈ ఫుడ్‌ స్టాల్ ఉంది. 

    చికెన్‌ చపాతీ, గచ్చిబౌలి

    చికెన్‌ చపాతీ తినాలని కోరుకునే వారు ఈ స్ట్రీట్‌ఫుడ్‌ను పలకరించవచ్చు. ఇక్కడ చపాతీతో చికెన్‌ రూ.80. చికెన్‌ రైస్‌ కావాలంటే రూ.100. అన్‌లిమిటెడ్ వెజ్‌ కావాలంటే కేవలం రూ.70 మాత్రమే. గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌కు ఎదురుగా ఈ స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ ఉంది.

    రాజ్యలక్ష్మీ స్ట్రీట్‌ ఫుడ్‌, దుర్గం చెరువు

    దుర్గం చెరువు ప్రాంతంలో ఈ ఫుడ్‌ స్టాల్‌ ఉంది. ఇక్కడ వెజ్‌ రూ.80 (అన్‌లిమిటెడ్‌), నాన్‌ వెజ్‌ రూ.120. చికెన్‌, మటన్‌, ఫిష్‌, బోటీ, తలకాయ ఇలా నాన్‌వెజ్‌లో ఏదైన ఎంచుకోవచ్చు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌కు ఎడమ వైపు ఈ ఫుడ్‌ స్టాల్‌ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv