రహానేకు ద్రావిడ్ కీలక సూచన
టీమ్‌ఇండియా బ్యాటర్ అజింక్యా రహానేపై కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. WTC ఫైనల్లో రహానే కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు. ‘రహానే తన అనుభవాన్ని సహచరులకు అందించాలి. ఓవర్సీస్ పరిస్థితుల్లో అద్భుతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై రహానే మంచి ప్రదర్శనే చేశాడు. చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫీల్డర్‌గానూ రహానే అదరగొడతాడు. స్లిప్స్‌లో మంచి క్యాచ్‌లను అందుకోగలడు. రహానేకు నాదో సూచన. అతడు తన వ్యక్తిగత ప్రదర్శనను సహచరులకూ అందించాలి’ అని ద్రావిడ్ విజ్ఞప్తి చేశాడు.